Thread Rating:
  • 1 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
#7
రుద్రం భజే! ఎపిసోడ్ - 2



ప్రకాష్, తులసి చనిపోవడంతో భార్య చేతిలో ఉన్న బిడ్డని తీసుకుని గుండెల మీద గద ఆకారంలో ఉన్న పుట్టుమచ్చని చూసి యోధుడు పుట్టాడు వీడి పేరు యోధ అని స్వామివారి పాదాల ముందు ఉంచాడు నారాయణ రావు.

**************

ఉదయం విషయం తెలుసుకుని గుడి దగ్గరికి ఊరు జనాలు చేరుకోవడంతో ఆ గ్రామ పెద్దయిన భూపతి వర్మ సెక్యూరిటీ ఆఫీసర్లకు కబురు పంపించాడు.

అక్కడికి వచ్చిన ఎస్ఐ చనిపోయిన ప్రకాష్ దగ్గరికి వెళ్లి చూసి బాడీ మీద బుల్లెట్ మార్క్ కనిపించడంతో  నారాయణ రావు గారి దగ్గర జరిగిన విషయం తెలుసుకొని

ప్రకాష్ చేతిలో ఉన్న ఫైల్ తీసుకుని చూస్తూ కార్  దగ్గరికి వెళ్లి లోపల డైరీ కనిపించడంతో తీసి చూస్తూ 'నెంబర్లు అన్నీ చాలా వింతగా ఉన్నాయి.' అనుకుని పేజీలు తిప్పుతూ "నాయక్ సార్  ఢిల్లీ అని ఒక నెంబర్ ఉంది ఆయనకి ఫోన్ చేస్తే అసలు వీళ్ళు ఎవరో తెలుస్తుంది." అని చెప్పాడు ఎస్ఐ.

"ఎస్సై గారు మా ఇంటి దగ్గర ఫోన్ ఉంది ఇక్కడికి దగ్గరే వెళ్ళండి." అని చెప్పాడు భూపతి వర్మ.

"సరే!" అని అక్కడ ఉన్న జనాలు వైపు చూసి "బాడీలను ఎవరు ముట్టుకోకండి కారు దగ్గర కూడా ఎవరు వెళ్ళకండి." అని చెప్పి భూపతి వర్మ ఇంటికి వెళ్లి డైరీలో ఉన్న నెంబర్ కి కాల్ చేశాడు ఎస్ఐ.

కాసేపటికి లిఫ్ట్ చేసి "నాయక్ స్పీకింగ్!" అని చెప్పాడు

"సార్! నేను ఆంధ్రప్రదేశ్ అరవకొండ ఎస్ఐని మాట్లాడుతున్నాను ఇక్కడ ఒక ఫ్యామిలీ చనిపోయారు ఆయన డైరీలో మీ నెంబర్ దొరికింది అందుకే కాల్ చేశాను." అని చెప్పాడు ఎస్ఐ.

"నా నెంబర్ ఉందా?" అని కాసేపు ఆలోచించి "ఇది ఇండియన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ నా పేరు కమల్ నాయక్ ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర ఇంకా ఏమైనా దొరికాయా?" అని అడిగాడు.

" జైహింద్ సర్! అతని దగ్గర ఒక ఫైల్ దొరికింది లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉంది చూస్తుంటే చైనీస్ అనిపిస్తుంది." అని చెప్పాడు ఎస్ఐ.

ఆ మాట విని "అతని పేరు ప్రకాష్ ఇండియన్ సోల్జర్! నేను వెంటనే బయలుదేరుతున్నాను ఆ ఫైల్ చాలా జాగ్రత్తగా ఉంచండి. కేస్ ఫైల్ చేయకండి మీ పై ఆఫీసర్ తో నేను మాట్లాడుతాను." అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్ జైహింద్!" అని ఫోన్ పెట్టేసి హడావిడిగా గుడి దగ్గరికి వచ్చి "భూపతివర్మ గారు! చనిపోయిన వ్యక్తి పేరు ప్రకాష్ సోల్జర్ అంట! ఢిల్లీ నుంచి మిలటరీ వాళ్ళు వస్తున్నారు." అని కానిస్టేబుల్స్ ని పిలిచి "చుట్టుపక్కల మొత్తం వెతకండి అనుమానంగా ఎవరైనా కనబడితే  అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకురండి." అని చెప్పాడు ఎస్ఐ.

ఆ మాట విని చనిపోయిన ప్రకాష్ వైపు చూస్తూ "జవాన్లు దేశం కోసమే చనిపోతారు ఈ మనిషి కూడా కచ్చితంగా దేశం కోసం ఈ ప్రాణం వదిలి ఉంటాడు, అందుకే  భగవంతుడు ఆ బిడ్డని అనాధ అవ్వకుండా దైవ సన్నిధికి రప్పించుకున్నాడు." అని చెప్పాడు నారాయణ రావు.

"ఎస్ఐ గారు మిలటరీ వాళ్ళు వస్తున్నారు సరే మరి అ పసిబిడ్డ పరిస్థితి ఏంటి?" అని అడిగాడు భూపతి వర్మ.

"సార్! ఈ కేస్ ఇప్పుడు మన కంట్రోల్ కాదు మిలట్రీ కంట్రోల్ మనం ఏ డెసిషన్ తీసుకోకూడదు వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయడమే అప్పటివరకు నారాయణ రావు గారి దగ్గరే ఉండనివ్వండి." అని చెప్పాడు ఎస్సై.

కాసేపటికి గుడి దగ్గరకి వచ్చి ఎస్ఐకి సెల్యూట్ చేసి "సార్! ఇక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఒక కారు లోయలో పడిపోయింది దాంట్లో ఆరుగురు చనిపోయారు వాళ్ల దగ్గర గన్స్ కూడా ఉన్నాయి." అని చెప్పాడు కానిస్టేబుల్.

"ఓ మై గాడ్! అయితే వాళ్లే  ఈ ఫ్యామిలీ ని అటాక్ చేసి ఉంటారు." అని కానిస్టేబుల్ తో పాటు వెళ్ళాడు ఎస్ఐ.

************

రెండు రోజుల తర్వాత మిలిటరీ ఆఫీసర్స్ తో పాటు అక్కడికి వచ్చి హాస్పిటల్లో ఉన్న ప్రకాష్, తులసి బాడీలను చనిపోయిన ఆరుగురుని వాళ్ళ దగ్గర దొరికిన గన్స్ చూసి ఎస్సై దగ్గర ఉన్న ఫైల్ తీసుకుని చూస్తూ "ఇంకా ఏమీ దొరకలేదా?" అని అడిగాడు నాయక్.

"నో సార్! ఆయన దగ్గర ఈ ఫైల్ మాత్రమే ఉంది కార్లో ఈ డైరీ దొరికింది." అని గుడి దగ్గరికి తీసుకు వెళ్ళాడు ఎస్ఐ.

అక్కడ ఉన్న కారుని చూసి "సోల్జర్స్ మొత్తం చెక్ చేయండి." అని చెప్పి నారాయణ రావు దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి "పంతులుగారు ఆ వ్యక్తి చనిపోయేటప్పుడు మీతో ఏమైనా చెప్పాడా?" అని అడిగాడు నాయక్.

"ఏమి చెప్పలేదు బాబు! ఆయన భార్య ప్రసవవేదనతో ఉంది ఆ బాధలో ఉన్నారు, ఆయనకి కూడా గాయాలయ్యాయి హాస్పిటల్ కి తీసుకువెళదామంటే అర్ధరాత్రి అయిపోయింది ఎవరినైనా పిలుద్దాము అనుకునే లోపు ఇద్దరు చనిపోయారు." అని చెప్పాడు నారాయణ రావు.

ఆ మాట విని చేతిలో ఉన్న బిడ్డని చూసి "ఆ వస్తువు ఎక్కడ పెట్టాడు.' అని మనసులో అనుకుని "ఆ బిడ్డని మా ఆఫీసర్స్ కి ఇవ్వండి మిలిటరీ హౌస్ కి పంపిస్తాను అక్కడ పెరుగుతాడు." అని చెప్పాడు నాయక్.

"అయ్యా! మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుని మేము పెంచుకుంటాము ఆ భగవంతుడు మాకు ప్రసాదించాడు అనుకుంటాము." అని చెప్పింది నారాయణ రావు భార్య అన్నపూర్ణ.

ఆ మాట విని 'దేశం కోసం ప్రాణాలు వదిలాడు తన బిడ్డ అనాధగా పెరగకూడదు.' అని మనసులో అనుకుని "సంతోషంగా పెంచుకోండి ఎటువంటి అభ్యంతరం లేదు మా ఆఫీసర్స్ ఒక అప్లికేషన్ ఇస్తారు దాని మీద సంతకం పెట్టండి." అని చెప్పాడు నాయక్.

అక్కడికి వచ్చి "సార్! బాడీస్ పోస్టుమార్టం కంప్లీట్ అయింది." అని చెప్పాడు ఎస్ఐ.

"ఆ ఆరుగురుని ఒక గొయ్యి తీసిపాతి పెట్టండి. ఆ ఇద్దరికి మిలటరీ గౌరవంతో దహన సంస్కారాలు జరుగుతాయి." అని చెప్పి తనతో పాటు వచ్చిన ఆఫీసర్స్ ని పిలిచి ప్రకాష్ దగ్గర ఫైల్ తో పాటు ఒక వస్తువు ఉండాలి అది ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు.

దానిని ఎక్కడో ఒక చోట సేఫ్ గా పెట్టి ఉంటాడు బ్లాస్టింగ్ తన ఇంటిని కారులో ప్రతి అంగుళం వెతకండి ఏదైనా వింతగా కనిపిస్తే హ్యాండ్ ఓవర్ చేసుకోండి." అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్!" అని సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్లారు ఆఫీసర్స్.

రెండు రోజుల తర్వాత గెస్ట్ హౌస్ లో ఉన్న నాయక్ దగ్గరికి వచ్చి "సార్! ఎక్కడ ఏమి దొరకలేదు." అని చెప్పారు ఆఫీసర్స్.

"ఓకే ఇట్స్ ఆల్ రైట్! కచ్చితంగా ప్రకాష్ దానిని వాళ్లకి దక్కనివ్వడు అది మన చేతికి అందే విధంగా ఎక్కడో ఒకచోట ఉంచుతాడు తప్పకుండా ఎప్పటికైనా దొరుకుతుంది." అని చెప్పి అక్కడి నుంచి గుడికి వెళ్లి

"నారాయణ రావు గారు ఇది నా నెంబర్ ఏ అవసరమైన సరే కాల్ చేయండి ఒక సోల్జర్ కొడుకుని సోల్జర్ లాగే పెంచండి. బాబుకి ఏం పేరు పెడుతున్నారు?" అని అడిగాడు నాయక్.

"బాబు పేరు యోధ సార్ ఒక యోధుడిలానే పెరుగుతాడు పెంచుతాను." అని చెప్పాడు నారాయణ రావు.

ఆ మాటకి నమస్కారం చేసి చిన్నగా నవి  అక్కడినుంచి తన స్టాప్ తో కలిసి వెళ్లిపోయాడు నాయక్.

*************

మూడు నెలలు తర్వాత హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం అవడంతో ధర్మ డిబ్బి తెరిచి లోపల ఉన్న డబ్బులు లెక్కపెడుతూ ప్రకాష్ వేసిన వస్తువుని కనిపించడంతో చేతిలోకి తీసుకుని చూస్తూ

"చాలా విచిత్రంగా ఉంది అసలు ఏంటిది బంగారం లాగా కూడా లేదు స్వామివారికి అర్పించాలి అనుకుంటే చేతికి ఇవ్వాలి కానీ దీంట్లో వేశారు ఎందుకో!" అనుకుని శుభ్రంగా కడిగి సింధూరం పూసి స్వామి వారి పాదాల దగ్గర పెట్టి  "అమ్మ గౌరీ" యోధని ఇక్కడికి తీసుకురా పూజ మొదలుపెడదాము. " అని పిలిచాడు నారాయణ రావు.

"సరే నాన్నగారు!" అని యోధ అని ఎత్తుకుని నిదానంగా నడుచుకుంటూ వచ్చి స్వామివారి ముందు కూర్చుంది నారాయణ రావు కూతురు గౌరీ.

"అన్నపూర్ణ! ప్రసాదాలు అయితే తీసుకురా స్వామి వారికి నైవేద్యం పెడదాము, భక్తులు వచ్చే సమయం అయింది." అని చెప్పాడు నారాయణ రావు.

"కాస్త టైం పడుతుంది మన యోధ వచ్చిన తర్వాత మొదటి హనుమాన్ జయంతి కదా నాలుగు ప్రసాదాలు ఎక్కువ చేస్తున్నాను కాసేపు ఉండండి." అని చెప్పింది అన్నపూర్ణ.

ఆ మాట విని ఏమిటో బిడ్డ కోసం భగవంతుడిని కూడా వేచి ఉండమంటుంది. " అని నవ్వుకున్నాడు నారాయణ రావు

**************

బీజింగ్ ఒక ల్యాబ్ లో తలకి కట్టు కట్టుకుని కూర్చున్న వ్యక్తి వైపు చూసి "మిస్టర్ జింగ్! మనం ఆ వస్తువుని వెతకడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామో ఈ ప్రయోగం కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసామో తెలుసు కదా మీరు అంత నిర్లక్ష్యంగా ఉంటారు అనుకోలేదు." అని సీరియస్ గా చెప్పాడు మిలటరీ ఆఫీసర్.

"జనరల్! ఐ యాం ఎక్స్ట్రీమ్లీ సారి ఆ టైం కి అక్కడికి  వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ముగ్గురిలో ఇద్దరు చనిపోయారు ఒకడు ఆ వస్తువుని తీసుకుని పారిపోయాడు ఇండియాలో ఉన్న మనవాళ్లు అతని కోసం వెతుకుతున్నారు." అని చెప్పాడు జింగ్.

"నో! వాళ్లు కూడా యాక్సిడెంట్ లో చనిపోయారు ఆ వస్తువుని తీసుకెళ్లిన వ్యక్తి ఏమైపోయాడో తెలియదు, ఆల్రెడీ మిషన్ లో పెట్టి ఆక్టివేట్ అయింది కదా ప్రయోగం కంటిన్యూ చేయడం కుదరదా..?" అని అడిగాడు ఆఫీసర్.

"నో సార్! పూర్తిగా ఆక్టివేట్ అవ్వలేదు కచ్చితంగా ఆ వస్తువు ఉండవలసిందే!" అని చెప్పాడు జంగ్.

"ఈ ప్రయోగం కోసం పాకిస్తాన్ ప్లేస్ ని వాడుకుంటున్నామని వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు ఫండింగ్ చేసాము ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ మొత్తం తయారుచేసి నాకు త్రీ మంత్స్ లో హ్యాండ్ ఓవర్ చేయండి.

అలాంటి వస్తువు మరొకటి ఉంది అని తెలిసింది దానికోసం  వెతకడం ప్రారంభించండి. ఇండియా వెళ్లిపోయిన ఆ వస్తువు కోసం అక్కడ ఉన్న మన వాళ్ళతో కుడా మాట్లాడతను." అని చెప్పాడు ఆఫీసర్.

"ఓకే సార్!" అని అక్కడి నుంచి వెళ్ళాడు జింగ్....
[+] 10 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - Yesterday, 10:04 AM



Users browsing this thread: 1 Guest(s)