24-04-2026, 08:27 AM
Part - 66
కాలేజీలో అప్పటికే గుసగుసలు మొదలవుతాయి. ఒకరిని ఒకరు చూసుకుంటూ ఎవో చెప్పుకుంటూఉంటారు. సూర్య అందరినీ అబ్సర్వ్చేస్తూ ఉంటాడు.
విశి ఏది చూసే పరిస్థితుల్లో ఉండదు. బ్యాగ్ ని నలుపుతూ తల కిందకి దించి నవ్వుకుంటూ క్లాస్ కి వెళుతుంది. సూర్య కూడా బైక్ పార్క్ చేసి చూసుకుంటూ స్టాఫ్ రూమ్ కి వెళతాడు.
శ్రీకర్.. వచ్చావా నీ కోసమే వెయిటింగ్.. నా కన్నా ముందే వచ్చావు.. నువ్వు విశిని తీసుకొస్తావు కదా అని వచ్చేసాను.
వచ్చేటప్పటికీ ఇక్కడ ఎంత హాట్ టాపిక్ జరుగుతుందో తెలుసా...ఓ మై గాడ్ అసలు అనుకోలేదు. విషయం ఏంటో చెప్పరా బాబు..
నిన్న నాన్న అలాగే చెప్పి చెప్పకుండా చెప్పారు. ఇప్పుడు నువ్వు అదే పని చేస్తున్నావు.. అంకుల్ చెప్పారా అని ఆశ్చర్యంగా అడిగితే.. హ అవును.
అయితే నువ్వు వచ్చి మీటింగ్ బోర్డు మీద ఉన్నది చూడాల్సిందే రా అని చెయ్యి పట్టుకుని లాక్కువెళతాడు. విశి క్లాసులోకి వెళ్ళేటప్పటికి భవ్య ఎదురవచ్చి విశి రా.. రా అని అరుస్తుంది.
ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు.. నీకు ఇంపార్టెంట్ విషయం చూపించాలి రా అని లాక్కు వెళుతుంది. అబ్బా వస్తున్నాను బాబు అని వెళుతుంది.
చూడు అని బోర్డు వైపు చూపిస్తుంది. శ్రీకర్ కూడా అలాగే చూపిస్తే.. విశి సూర్య ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఆ ఫోటోలు వైపు మార్చి మార్చి చూస్తారు..
విశి కళ్ళు నలుపుకొని చూస్తూ ఉంటే.. సూర్య కన్నింగ్ గా నవ్వుతాడు. ఏమిటే ఈ వైపరీత్యం అని అడిగితే.. నీ వల్ల వర్క్ అవుట్ అవ్వదేమో అనుకుని ఆ గౌతమ్ గాడు సరళ మేడం ని పట్టుకున్నట్టు ఉన్నాడు.
గౌతమ్ కి కావాల్సింది ఆర్కిటెక్చర్ కదా కంప్యూటర్ మేడంతో ఏం పని.. ఆ మాటకి సూర్య.. రావాల్సిన చోట్ల డౌట్స్ రావు కదా అనుకుంటూ ఉంటాడు.
ఏమో అవన్నీ మనకేలా తెలుస్తాయి. రెస్టారెంట్లో మీటింగ్ అంట.. నిన్న కాలేజీలో అబ్బో ఇద్దరి మధ్యన చాలా స్టోరీ నడుస్తుంది అంట..
నువ్వు చూసావా అని అడుగుతుంది. చూడడం ఎందుకు.. డైరెక్ట్ గా కనపడుతున్నాయి కదా. చూడు..
మన కళ్ళతో చూడనివి, చెవులుతో వినని ఏ విషయం అయినా సరే గుడ్డిగా ఫాలో అవ్వకూడదు.
ఒకవేళ అది నిజమైన అది పూర్తిగా వాళ్ళ పర్సనల్ మ్యాటర్. మనకి ఎటువంటి సంబంధం లేనిది. ఎదుటి మనిషిని జడ్జ్ చేయడానికి మనం ఎవరని చెప్పు...
విశి చెప్పిన సమాధానానికి సూర్య అబ్బురంగా చూస్తాడు. ఎంత మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నావు.నీకు హాని తల పెట్టాలి అనుకున్న వాళ్ల గురించి కూడా తప్పుగా అనుకోవడం లేదు.
నిజంగా నువ్వు చాలా గ్రేట్ క్యూటి.. రోజు రోజుకి నచ్చేస్తున్నావు. బావ మరీ అలా సొల్లు కార్చేలాగా చూడకు.. స్టూడెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు.
వెంటనే సూర్య తమాయించుకుని ఏం చేస్తున్నారు.. అందరు క్లాసులకు వెళ్ళండి అని ప్యూన్ ని పిలిచి ఆ ఫొటోస్ అన్నీ రిమూవ్ చేసేయ్ అని చెబుతాడు..
సూర్య శ్రీకర్ స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళేటప్పటికి సరళ ఏడుస్తూ ఉంటుంది. తెలిసిన లెక్చరర్స్ కొంతమంది ఊరుకో పెడుతూ ఉంటే.. కొంతమంది ఈవిడకి ఇలాగే అవ్వాలి.
ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడుతుంది. కొంతమంది లెక్చరర్స్ ని తినేసేలాగా చూస్తుంది అని గుసగుసలాడుకుంటూ ఉంటారు.
ఆ మాటలు వినిపిస్తూ ఉంటే సరళ తలకొట్టేసినట్టుగా ఉంటుంది. ఏం చేయాలి అనుకుంటే ఏం జరిగింది అని ఇంకా కుంగిపోతు ఉంటే.. సూర్య వాటర్ బాటిల్ తీసుకువెళ్లి సరళ టేబుల్ మీద పెట్టి తాగండి మేడం అని చెబుతాడు.
ఆ పిలుపుకి పైకి చూసి దేవా సార్ అని మళ్ళీ రాగం అందుకుంటుంది. ఎందుకు మేమ్ ఏడుస్తున్నారు.. ఇప్పుడు ఏమైందని...
ఆ ఫొటోస్ చూసి ఎవరైనా ఏమి అనుకుంటారు. మీరు.
మీ వుడ్ బి కలిసి దిగారు అనుకుంటారు. అంతే కదా అని కొంచెం మంట రాజేస్తాడు.
సార్.. అతను నాకు కాబోయే హస్బెండ్ ఏమిటి.
ఎవరు చెప్పారు అని రంకెలు వేస్తూ ఉంటే.. భలే వారే అంత క్లోజ్ గా ఉండేది ఎవరితోనో తెలియదా..
ఊరుకో పెడుతున్న బ్యాచ్ అంతా అవునా సరళ మేమ్.. మాకు ఎవరికీ చెప్పలేదు. పార్టీ అడుగుతామన.. అందుకే ఏడుస్తున్నారా..
గుసగుసలాడుతున్న బ్యాచ్ కూడా వచ్చి కంగ్రాట్స్ మామ్.. పార్టీ ఎక్కడ.. ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగింది.. మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..
ఒక్కసారే వెడ్డింగ్ కార్డ్ తో పాటు స్వీట్స్ ఇవ్వాలి అనుకున్నారా.. ఈ విషయం మీరు చెప్పకుండా తెలిసిపోయింది అని బాధపడుతున్నారా అని ఎవరికి తోచిన విధంగా వాళ్ళ మాట్లాడుతూ ఉంటే...
సూర్య, శ్రీకర్ వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి కూర్చుని ఈ డ్రామా అంతా చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు.
కాలేజీలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అని గౌతమ్ అప్పుడే సరళకి కాల్ చేస్తాడు. ఆ ఫోన్ చూసి సరళ తల పట్టుకుంటే.. మీ ఫియాన్సీ కాల్ చేసినట్టు ఉన్నాడు మేడం..
మాట్లాడండి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందులో కొంచెం యాక్టివ్గా ఉన్న లెక్చరర్ స్పీకర్లో పెట్టండి మేడం.. మేము కూడా వింటాము.
ఎంత రొమాంటిక్ పర్సన్ అన్నది మాకు తెలుస్తుంది.. ఏమంటారు.. అని మిగిలిన లెక్చరర్స్ ని అడిగితే పక్కనోళ్ళ విషయాలు వినడం అంటే జనానికి మహా సరదా కదా...
అందరూ అవును అవును అని అరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకులే అని సరళ వెంటనే ఫోన్ కట్ చేస్తోంది. మీరిద్దరే సీక్రెట్ గా మాట్లాడుకోవాలా..
ఇలాగంటే మేము డిస్టర్బ్ చేసేవాళ్ళం కాదు కదా... మీరు చేయండి మేము పక్కకి తప్పుకుంటాం అని లెక్చరర్స్ అందరు ఎవరు ప్లేస్ కి వాళ్ళు వెళ్లిపోతారు.
కట్ అయిన ఫోన్ చూస్తూ..గౌతమ్.. ఎందుకు కట్ చేసింది. అక్కడ మేటర్ ఏంటో నాకు తెలియాలి కదా అని మళ్ళీ కాల్ చేస్తాడు.
ఈసారి లిఫ్ట్ చేయకపోతే బాగోదు అని కొన్ని లిఫ్ట్ చేసి మళ్ళీ కాల్ చేస్తాను పెట్టేయ్ అని స్లోగా అంటుంది. ఏమయింది సరళగారు.. నాకు ఏ విషయం చెప్పలేదు..
ఇక్కడ నేను ఎంత కంగారు పడుతున్నాను తెలుసా అని ఇటు పక్కన సరళ పరిస్థితి అర్థం చేసుకోకుండా తన ఫ్లోలో అడుగుతూ ఉంటే తల పట్టుకుంటుంది.
సరళ తల పట్టుకోవడం చూసి పక్కన ఉన్న ఒక లెక్చరర్ ఏంటి మేడం.. మీ వారు ముద్దడుగుతున్నారా ఏమిటి.. సిగ్గుపడుతున్నారు.
ఈవీడికి ఇలా అర్థమయిందా అనుకొని పళ్ళు అన్ని బయటపెట్టి కొంచెం అలాంటిదే. జస్ట్ ఎ మినిట్ అని బయటికి వచ్చి నేను తర్వాత చేస్తాను అని చెబుతున్న..
మీ ఫ్లోలో మీరు మాట్లాడకుంటు వెళ్ళిపోతారేమిటి. అసలు ఏం జరిగిందో చెప్పండి. అ...అని అరుస్తూ మనం అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి...పెట్టేయండి అని ఫోన్ పెట్టేస్తుంది.
లోపలికి వస్తున్న సరళ కి సూర్య ఎదురు వెళ్తాడు. సూర్యని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిప్పేస్తూ సార్ ఆ అబ్బాయి ఎవరో నిజంగా నాకు తెలియదు.
ఆ అబ్బాయితో కలిసే కదా విశిష్ట ని ఆన్ పాపులర్ చేయాలి అనుకున్నారు...
ఆ మాటకి భయంగా చూస్తూ ఈ విషయం మీకు ఎలా తెలుసు. చెప్పాను కదా ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే నేనేమిటో చూపిస్తాను అని.
మేడం.. మిమ్మల్ని విశిష్ట ఏమి చేసింది. తను ఒక హార్డ్ వర్క్ ర్... సిన్సియర్ గా చదువుకుంటుంది. ఫాదర్ అర్ధాంతరంగా లోకాన్ని విడిచి వెళ్ళిపోతే పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ... తల్లిని చూసుకుంటుంది.
అలాంటి అమ్మాయి మీద పగ పెంచుకుంటారా.. ఇదేనా మీరు చదువుకున్న చదువుకి అర్థం..
కర్మ అనేది ఒకటుంటుంది మేడం. మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది. అది తెలుసుకోకుండా వెర్రి వేషాలు వేస్తే ఇదిగో ఇలాగే బొక్క బోర్లపడతాము.
ఇప్పుడైనా మనిషిగా మారండి అని సూర్య వెళ్ళిపోతాడు. సరళ సిగ్గుతో తలదించుకొని తన ప్లేస్ కి వెళ్లి కూర్చుంటుంది.
సరళ నిజంగా మారిందా.....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)