23-04-2026, 08:44 PM
కాసేపటికి ఫోటో రాగా గోపాల్ స్నేహ,ఫోటో వచ్చింది. నువ్వు చూడు. నచ్చకపోతే ముందుకి వద్దు అన్నాడు. కావ్య తండ్రి ఫోన్ తీసి వాట్సాప్ ఓపెన్ చేసి ఫోటో డౌన్‌లోడ్ చేసి స్నేహకి ఇచ్చింది. ఐశ్వర్య, దీప్తి, అనన్య అందరూ స్నేహ చుట్టూ కూర్చున్నారు. లక్ష్మి కూడా వంటింటి నుంచి వచ్చి నిలబడింది.
ఫోటోలో విశాల్ చాలా సరదాగా కనిపించాడు. 28 ఏళ్లు, ఎత్తైన బాడీ, స్మార్ట్ షర్ట్ ధరించి, చిరునవ్వుతో ఉన్నాడు. స్నేహ ఫోటో చూసి కొంచెం నవ్వింది. ఆమె ముఖం కొంచెం ఎర్రబడింది.
బావ బాగున్నాడు కదా అక్కా! ఐశ్వర్య ముందు అరిచింది. చూడు, ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఇంజినీర్ అని చెప్పక్కర్లేదు, ముఖం చూస్తేనే తెలుస్తుంది. నీకు నచ్చలేదా? నచ్చకపోతే చెప్పు, మేము చేసుకుంటాం! అంటూ నవ్వుతూ స్నేహ భుజం తట్టింది.
దీప్తి కూడా స్నేహని ఆటపట్టిస్తూ అవును అక్కా, బావ కత్తిలా ఉన్నాడు! ఆ చిరునవ్వు చూశావా? నీకు ఓకే కాకపోతే చెప్పు. మా ముగ్గురిలో ఎవరొకరు చేసుకుంటాం అని నవ్వుతూ అంది.
అనన్య స్నేహ చేతి పట్టుకుని అక్కా, నీకు నచ్చాడా? బావ చాలా బాగున్నాడు. నువ్వు ఒప్పుకోకపోతే నాకు చెప్పు, నేను పెద్దయ్యాక చేసుకుంటాను! అంటూ నవ్వేసింది.
కావ్య స్నేహ భుజం మీద చేయి వేసి గట్టిగా కౌగిలించుకుంది. స్నేహ, చూశావా చాలా బాగున్నాడు. నీకు నచ్చాడా? ఎటువంటి భయాలు మనస్సులో పెట్టుకోకు. నువ్వు హ్యాపీగా ఉండాలి. నీకు నచ్చకపోతే చెప్పు, మళ్లీ నాన్నతో మాట్లాడదాం. కానీ నీ ముఖం చూస్తే నచ్చినట్టు ఉంది! ఏంటనేది చెప్పు స్నేహ
స్నేహ కళ్లు తడి అయ్యాయి. ఆమె ఫోటోను మళ్లీ ఒకసారి చూసి తల ఊపింది. అక్కా నాకు నచ్చాడు కానీ ఇంకా కొంచెం భయం ఉంది. వీళ్లేమో ఇలా ఏడిపిస్తున్నారు అంటూ కళ్లు తుడుచుకుంది.
ఐశ్వర్య ఆమెను మరింత గట్టిగా కౌగిలించుకుని అక్కా ఏడవకు! నీకు బావ నచ్చాడు కదా అది చాలు ఎటువంటి భయం పెట్టుకోకు అని సముదాయించింది.
దీప్తి, అనన్య కూడా ఆమెని కౌగిలించుకుని నీకు నచ్చకపోతే చెప్పు మేము రెడీ అంటూ మళ్ళీ ఆమెని ఆటపట్టించారు
లక్ష్మి కూడా కళ్లు తుడుచుకుంటూ నా కూతురుకి ఆ దేవుడు మంచే చేస్తాడు. ఏడవకు అమ్మా నీకు నచ్చిందంటే చాలు అంది.
స్నేహ అందరినీ ఒక్కసారి చూసి నవ్వింది. కళ్ల నుంచి ఆనంద బాష్పాలు కారాయి. నాకు నచ్చాడు నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను కానీ నా షరతులు ఒకే అంటేనే అని చెప్పింది.
ఆమె అభిప్రాయానికి అందరూ సంతోషించారు.
గోపాల్ ఫోన్ తీసుకుని మళ్లీ రామారావు గారికి కాల్ చేశాడు. రామారావు, స్నేహ ఫోటో చూసి నచ్చాడు అని చెప్పింది. మీరు చెప్పినట్టు ఒక వారం రోజుల్లో వచ్చేస్తారా? మనం అందరం కలిసి మాట్లాడుకుందాం అన్నాడు.
రామారావు గారు సంతోషంగా అవును గోపాల్! మేమంతా వస్తాం. ఒక వారం తర్వాత వస్తాం. అక్కడే మనం అన్నీ ఫైనల్ చేద్దాం అని చెప్పాడు.
ఫోన్ పెట్టగానే ఇంట్లో అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టారు. స్నేహను అందరూ మళ్లీ కౌగిలించుకున్నారు. ఆమె ముఖం ఇప్పుడు పూర్తి ఆనందంతో నిండింది. కుటుంబం అంతా కలిసి నవ్వులు, జోకులు, భవిష్యత్ ప్లాన్స్ మాట్లాడుకుంటూ సాయంత్రం గడిపారు.
ఒక వారం తర్వాత విశాల్ కుటుంబం రావడానికి అన్నీ సిద్ధమయ్యాయి.
కొనసాగుతుంది....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)