Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ట్రాప్ - తప్పు ఎవరిదీ?
#59
ఆ మరుసటి రోజు రోహన్ సరాసరి లార్జ్ బేస్ సొల్యూషన్స్ హెడ్ క్వార్టర్స్ కి బయలుదేరాడు. 39 % లార్జెస్ట్ షేర్ హోల్డర్ అయిన అతను ఎలాంటి అప్పోయింట్మెంట్, అనౌన్స్మెంట్ లేకుండా డైరెక్ట్ గా టాప్ ఫ్లోర్ లో ఉన్న చైర్మన్ ఆఫీస్ లోకి వెళ్ళిపోయాడు.

లోపలికి ఎంటర్ అవుతున్న రోహన్ ని చూసాడు ఆ చైర్మన్. వయసులో బాగా పెద్ద వాడైనా కూడా రోహన్ చూడగానే అతనెవరో గుర్తు పట్టాడు. వెంటనే పైకి లేచి నవ్వుతూ

"రోహన్ చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నిన్ను" అన్నాడు.

రోహన్ కూడా నవ్వుతూ అతన్ని పలకరించాడు. కుశల ప్రశ్నలు అయ్యాక చైర్మన్ ని చూస్తూ 

"అరవింద్ ని పిలవండి" అన్నాడు 

ఆ మరుక్షణమే చైర్మన్ తన ఇంటర్ కామ్ ఓపెన్ చేసి అరవింద్ ని రమ్మని పిలిచాడు. కొంతసేపటికి అరవింద్ లోపలికి వచ్చాడు. చైర్మన్ ముందు కూర్చున్న వ్యక్తి ఎవరో వెనుక నుండి సరిగ్గా అర్ధం కాలేదు. కాస్త ముందుకు వెళ్ళగానే రోహన్ అని అర్ధం అయింది. అతను నవ్వుతూ తనని చూసేసరికి అరవింద్ మొహం లో నెత్తురు చుక్క లేదు.

అంతలో చైర్మన్ తన గొంతు సరిచేసుకుని "అరవింద్, ఇతను రోహన్. మన కంపెనీ లార్జెస్ట్ షేర్ హోల్డర్" అన్నాడు.

అది విని అరవింద్ మొహం ఇంకా వాడిపోయింది. రోహన్ అలానే నవ్వుతూ "కూర్చో" అన్నాడు.

అరవింద్ మొహమాటపడుతూ కూర్చున్నాడు.

"నేను కొంచెం పర్సనల్ గా తనతో మాట్లాడాలి" అన్నాడు రోహన్ ఎదురుగా ఉన్న చైర్మన్ ని చూస్తూ.

"సరే రోహన్" అంటూ చైర్మన్ పైకి లేచి బయటకి వెళ్ళిపోయాడు.

అరవింద్ మెల్లగా నోరు తెరిచి "ఈ డ్రామా అంతా ఎందుకు సార్...?" అంటూ ఇంకేదో చెప్పబోతుంటే రోహన్ అతన్ని ఆపి 

"నేనెవరో అప్పుడే చెప్దామనుకున్నా కానీ నువ్వే ఆ అవకాశం ఇవ్వలేదు" అన్నాడు రోహన్. ఆ మాటలకి అరవింద్ గుటకలు మింగాడు. "అయితేనేం ఒక లెసన్ అయితే నేర్పించాను అనుకుంటున్నాను. ఇప్పుడు నీతో ఒక పని పడింది కాబట్టి నేనెవరో నీకు తెలిసేలా చేసాను" అన్నాడు రోహన్.

"ఏం పని సార్?" అన్నాడు అరవింద్ వినయంగా 

"అసలు ఆ నివిషా, ప్రేమ్, నీకు మధ్య గొడవలు ఏంటి? దానికి మన కంపెనీ నేమ్ ఎందుకు వాడావు?" అన్నాడు రోహన్ 

"అది నా పర్సనల్ సార్" అన్నాడు అరవింద్.

"ఈ రోజు నుండి నా పర్సనల్ కూడా, చెప్పు?" అన్నాడు రోహన్.

అరవింద్ ఆశ్చర్యంగా రోహన్ వైపు చూసాడు "ఏంటి సార్, నివిషా బాగా నచ్చినట్టు ఉంది?" అన్నాడు మెల్లగా నవ్వుతూ 

"దాంట్లో తప్పేముంది? తను బాగుంటుంది" అన్నాడు రోహన్.

ఆ మాటలకి అరవింద్ లో ధైర్యం పెరిగింది. మెల్లగా సీట్ లో వెనక్కి వాలి "దాని అందానికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందేలేండి సార్. నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి, హెల్ప్ చేస్తాను. కాకపోతే మీ పని అయ్యాక ఒకసారి దానిని నాకు ఇవ్వండి. దాని అందాన్ని నేను రుచి చూడాలి" అన్నాడు అరవింద్.

దానికి అరవింద్ నవ్వుతూ "నీకు ఇక్కడ ఒక విషయం అర్ధం కావట్లేదు. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను భూమి మీద లేకుండా చేయగలను. కాకపోతే ఊరకనే నాకు ఎవరి దగ్గర నుండి హెల్ప్ తీసుకోవటం నచ్చదు. నువ్వు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఈ కంపెనీ కి CEO ని చేస్తాను. ఇప్పుడు చెప్పు CEO పోస్ట్ కావాలా? నివి కావాలా?" అన్నాడు రోహన్ అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ.

"ఇప్పుడు అర్ధం అవుతుంది సార్, మీరెంత పెద్ద బిజినెస్ మాన్ ఓహ్.... మ్మ్.... నివి ది ఏముంది అలాంటి వాళ్ళు బయట చాలా మందే ఉన్నారు. బట్ CEO పోస్ట్ అంత ఈజీగా రాదు కదా. చెప్పండి సార్ మీకేం ఇన్ఫర్మేషన్ కావాలో?" అన్నాడు అరవింద్ నవ్వుతూ 

"తన గురించి పూర్తి వివరాలు కావాలి, తన గతం ఏంటి? ప్రెసెంట్ వాళ్ళ లైఫ్ ఏంటి? అసలు తన వీక్నెస్ ఏంటి?" అన్నాడు రోహన్.

అరవింద్ గతంలో జరిగినవి మొత్తం చెప్పాడు. ఇద్దరి గురించి రూమర్స్ స్ప్రెడ్ చేయటం, ఇండోర్ రూమ్ లోకి తీసుకొని వెళ్లి నివి తో రొమాన్స్ చేయటం, ప్రేమ్ వచ్చి తనని కాపాడటం గురించి పొల్లు పోకుండా చెప్పాడు. 

వాటితో పాటు నివిషా డ్రీమ్స్ ఏంటి? ఆమె బిజినెస్ చేయాలని ఎంత ఆశ పడింది. ప్రేమ్ కోసం తన కలలు చంపుకుని ఇంట్లో నుండి వచ్చేయటం. ప్రేమ్ ఎలా థింక్ చేస్తాడు. నివి ని ఎలా కంట్రోల్ చేస్తాడు. అతని ఇన్సెక్యూరిటీస్ గురించి, మనుషలని ఎలా నమ్ముతాడు, ఒకసారి నమ్మిన ప్రకాష్ దాదాపు నివి ని దెంగినంత పని ఎలా చేసాడో మొత్తం వివరంగా చెప్పాడు.

"ఈ ప్రకాష్ గురించి నీకెలా తెలిసింది?" అన్నాడు రోహన్.

"అసలు ప్రేమ్ ఇక్కడికి రావటానికి కారణమే ప్రతాప్, అతను మన సబ్సిడీరీ స్టాక్ పోర్ట్ఫోలియో ని మెయింటైన్ చేస్తాడు. అలా అతనితో నాకు పరిచయం ఏర్పడింది. దాంతో ఒకరోజు ఇద్దరం తాగుతూ ఉంటే ఇలా జరిగిందని నాకు చెప్పాడు" అన్నాడు అరవింద్.

అంటే ఇతను చెప్పినదానినిబట్టి చూస్తే ముందు ప్రేమ్ కి నా మీద నమ్మకం కలగాలి. కానీ ఈ పాటికే నేనొక దేవుడు అన్నట్టుగా చూస్తున్నాడు ప్రేమ్. వాడితో ప్రాబ్లెమ్ లేదు. ఇక చేయాల్సింది నివి ని సెట్ చేయాలి అనుకున్నాడు మనసులో రోహన్.

"ఇప్పుడేం నేనేం చేయగలనో చెప్పండి?" అన్నాడు అరవింద్.

రోహన్ ఆలోచిస్తూ "లీగల్ నోటిస్ అలానే ఉంచు, దానిని యూస్ చేస్తూ వాళ్ళ మీద ఇంకా ప్రెజర్ పెంచు, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను" అన్నాడు రోహన్.

"తప్పకుండా సార్, ఆ CEO టైటిల్ గురించి మర్చిపోవద్దు" అన్నాడు అరవింద్ వినయంగా 

"నేను చెప్పినట్టు పని పూర్తి చెయ్, తప్పకుండా అది నీకే వచ్చేలా చేస్తాను. ఏమో నువ్వు చేసే పని నాకు నచ్చితే ఈ కంపెనీ కి చైర్మన్ చేసే పవర్ కూడా నా దగ్గర ఉంది" అన్నాడు రోహన్ పైకి లేచి తన కోట్ బటన్ పెట్టుకుంటూ.

ఆ మాటలకి అరవింద్ గాల్లో తేలిపోయాడు.

రోహన్ అక్కడ నుండి బయటకు వచ్చాడు. లిఫ్ట్ లో వెళ్తూ ఉంటే అతని మనసులో తర్వాత ఎలాంటి స్టెప్ వేయాలని ప్రణాళిక సిద్ధం అవుతూ ఉంది.

ప్రేమ్ వీక్నెస్ ఏంటి అంటే ఓవర్ థింకింగ్, ఒక్కసారి నమ్మిన వాళ్ళ మీద గుడ్డి నమ్మకం. అటు నివి విషయానికి వస్తే ఫ్యామిలీ కోసం పాతి పెట్టేసిన తన డ్రీమ్స్. ముందు తనని నాతో పాటు కలిసి పని చేసేలా చేయాలి. నా మీద తనకి పూర్తి నమ్మకం రావాలి. ఒక మంచి మూమెంట్ చూసుకుని పూర్తిగా తనని సొంతం చేసుకోవాలి అనుకున్నాడు రోహన్.

**********************************

తన కొత్త ఆఫీస్ స్టాఫ్ తో కలకలాడుతూ ఉండటం చూసి మురిసిపోయాడు ప్రేమ్. కళ్ళ ముందే తన ఇలా నెరవేరేసరికి అతని కళ్ళలో ఆనందం కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. ఆ రోజు సాయంత్రం రోహన్ దగ్గర నుండి ప్రేమ్ కి కాల్ వచ్చింది.

"హాయ్ రోహన్" అన్నాడు ప్రేమ్ సంతోషం నిండిన గొంతుతో 

"హాయ్ ప్రేమ్, ఎలా జరుగుతుంది నీ బిజినెస్?" అన్నాడు నవ్వుతూ రోహన్ 

"మీ హెల్ప్ వల్ల అంతా బాగా జరుగుతుంది రోహన్" అన్నాడు ప్రేమ్.

"గుడ్ గుడ్, ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసానంటే రేపు 11 గంటలకు ఫస్ట్ క్లయింట్ ని తీసుకొని రాబోతున్నాను, రెడీ గా ఉండండి" అన్నాడు రోహన్ 

ఆ మాటలకి ప్రేమ్ కళ్ళు మెరిసాయి. "థాంక్యూ రోహన్, మేము ఎప్పుడు రెడీ యే" అన్నాడు చాలా కాన్ఫిడెంట్ గా 

"సరే అయితే రేపు కలుద్దాం" అంటూ కాల్ కట్ చేసాడు రోహన్.

ఆ మరుసటి రోజు తన బెంజ్ కార్ తో ప్రేమ్ ఆఫీస్ ముందు ఆగాడు రోహన్. ఎప్పటిలానే సింపుల్ షర్ట్, స్లీవ్స్ పైకి మడుచుకుని కార్ దిగాడు రోహన్. అతని వెనుక మొదటి క్లయింట్ అయిన రూబెన్ దిగాడు. అతనొక మిడ్ సైజ్ లాజిస్ట్క్స్ కంపెనీ ఓనర్. అసలు ప్రేమ్ కెపాసిటీ ఏంటో ముందు చూద్దామని ఇతన్ని తీసుకొని వచ్చాడు రోహన్.

ప్రేమ్ వాళ్ళకి ఎదురుగా వచ్చి ఇద్దరినీ నవ్వుతూ పలకరించాడు. తర్వాత తన ఆఫీస్ మొత్తం చూపించి, స్టాఫ్ ని పరిచయం చేసాడు. రోహన్ కళ్ళు మాత్రం నివి ఎక్కడ ఉందా అని వెతకాయి కానీ అతనికి నివి కనపడలేదు.

ముగ్గురు మెల్లగా కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్ళబోతుంటే "ఇంతకీ మీ వైఫ్ నివి ఎక్కడ ప్రేమ్?" అన్నాడు రోహన్.

ఆ మాటకి ప్రేమ్ గట్టిగా నవ్వి "తనా? తనొక హోమ్ మేకర్ అంతే, ఇంట్లోనే ఉంటుంది. అదే తనకి కరెక్ట్ ప్లే. అయినా బిజినెస్ అనేది మనలాంటి అబ్బాయిలు చేసే పని, తను ఇవన్నీ ఎక్కడ చేయగలదు. నన్ను, ఆధ్య ని సరిగ్గా చూసుకుంటే చాలు" అన్నాడు నవ్వుతూనే 

ఆ మాటలకి రోహన్ ఒక్కసారిగా ఆగాడు. ఎందుకో ప్రేమ్ మీద పట్టరాని కోపం వచ్చింది. కానీ అది మొహంలో చూపించకుండా గట్టిగా ఊపిరి పీల్చుకుని వెంటనే రూబెన్ వైపు తిరిగి "సారీ రూబెన్, ఇప్పుడే సడెన్ గా ఒక విషయం గుర్తు వచ్చింది, అక్కడికి వెళ్ళాలి, మనం మళ్ళీ మీట్ అవుదాం" అన్నాడు.

రూబెన్ కి అర్ధం అయింది రోహన్ కి ఏ విషయం లోనో కోపం వచ్చిందని, వెంటనే తన గొంతు సరిచేసుకుని "దాంట్లో ఏముంది మీరు వెళ్ళండి రోహన్, మీరు ఫ్రీ గా ఉన్నప్పుడు మళ్ళీ ఇతన్ని కలుద్దాం" అన్నాడు రూబెన్.

ప్రేమ్ కి అసలు ఏం అర్ధం కాలేదు. కానీ రోహన్ కి ఇంపార్టెంట్ వర్క్ ఏదో ఉండబట్టే ఇలా వెళ్తున్నాడు అనుకున్నాడు. "పర్లేదు రోహన్, మీ ఫ్రీ టైం లోనే రండి" అన్నాడు మెల్లగా నవ్వుతూ 

ఆ మరుక్షణమే రోహన్ అక్కడ నుండి కిందకి వచ్చేసాడు. కార్ లో కూర్చున్న వెంటనే కార్ ముందుకు కదిలింది. ప్రేమ్ మాటలకి వచ్చిన కోపాన్ని తన హ్యాండ్ రెస్ట్ మీద చూపించాడు. ఆ క్షణం అర్ధం అయింది. ప్రేమ్, నివి ని ఒక పంజరంలో పెట్టలేదు. ఇల్లు, బాధ్యత అనే సమాధిలో పూర్తిగా కప్పేసాడని. 

**************************************

ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఈ రోజు ఆఫీస్ లో జరిగింది మొత్తం నివి కి చెప్పాడు ప్రేమ్.

"రోహన్ కి వేరే ఎదో పని ఉందని సడెన్ గా వెళ్లిపోయారు. క్లయింట్ మీటింగ్ పోస్ట్పోన్ అయింది. ఒకవేళ రేపు అది జరిగితే మన కంపెనీ కి అదే పెద్ద డీల్ అవుతుంది" అన్నాడు ప్రేమ్ సంతోషంగా 

ఆ క్షణం కిచెన్ లో వంట చేస్తూ ఉంది నివి, ప్రేమ్ చెప్పేది మొత్తం కిచెన్ లో నుండే వింటూ ఉంది. రోహన్ అన్నట్టే ఇంత త్వరగా క్లయింట్ ని తెస్తాడని తను అనుకోలేదు. తన జీవితంలో ఇప్పటి వరకు తన టాలెంట్ ని, అర్హత ని గుర్తించిన వారు ఎవరైనా ఉన్నారంటే అది రోహన్ ఒక్కడే. అంత చేసినా ప్రేమ్ ఒక్క మాటతో తనని చాలా తక్కువ చేసి మాట్లాడాడు. ఆ బాధ తనలో అలానే ఉండిపోయింది. ప్రేమ్ చెప్పిన మాటలకి తను ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. మనసులో మాత్రం ఈ మీటింగ్ మొత్తం ఫెయిల్ అయ్యి ఒక్కసారి, ఒకే ఒక్కసారి మళ్ళీ రోహన్ ని కలిసే అవకాశం వస్తే బాగుండు అనుకుంది.

ఆ రాత్రి తన బాల్కనీలో కూర్చున్నాడు రోహన్. అతని చేతిలో విస్కీ గ్లాస్. చెవుల్లో ఇంకా ప్రేమ్ అన్న మాటలే వినపడుతున్నాయి. 

"తనా? తనొక హోమ్ మేకర్ అంతే" ఇదే మాటలు వినపడుతూనే ఉన్నాయి. 

ఒక్కసారి నివి ని కలవాలి, ఒకే ఒక్కసారి తనకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఆ క్షణమే ఆ ప్రేమ్ నోటికి తాళం పడుతుంది. వెంటనే తన ఫోన్ తీసుకొని నివి వాట్సాప్ చాట్ ఓపెన్ చేసాడు. ఎదురుగా కనపడుతున్న ఆమె ఫోటో ని ఒకసారి చూసాడు. మనసంతా ఎదో కల్లోలంలా ఉంది. 

"నివిషా నీకు కుదిరితే రేపు ఒకసారి క్లయింట్ కి బ్రీఫ్ ఇస్తావా?" అంటూ టైప్ చేసి మళ్ళీ వద్దు, తను ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుని డిలీట్ చేసాడు.

అటు నివి పరిస్థితి కూడా అలానే ఉంది. మనసంతా ఎదో అలజడి. పక్కన ప్రేమ్ గాఢ నిద్రలో ఉన్నాడు. బయట సగం ప్రపంచం నిద్రలో ఉంది. ఆ చీకట్లు తన జీవితం లో కూడా కమ్ముకున్నాయా అనిపించింది నివి కి ఆ క్షణం.

ఆమె కళ్ళలో ఒక్కసారిగా గత వారం రోహన్ తో జరిగిన లంచ్ మీటింగ్ మెదిలింది. అతని ముందు తను కాంఫిడెన్స్ గా మాట్లాడటం, తన మాటలు అతనికి నచ్చటం. అతను మనస్ఫూర్తిగా తనని మెచ్చుకునేలా చూడటం. ప్రేమ్ కి తన టాలెంట్ గురించి చెప్పటం ఇలా అంతా ఫ్లాష్ అయింది. ఆ తర్వాత వర్షం లో తడిసినది గుర్తు వచ్చింది. తను తడుస్తున్న విషయం తెలిసి అతను కార్ లో నుండి దిగి రావటం, అతని బ్లేజర్ ని తన చుట్టూ కప్పటం. ఆ క్షణం అతని కళ్ళతో కలిసిన తన చూపులు గుర్తుకు వచ్చాయి. అతని కళ్ళలో ఎదో ఆరాధనా భావం. ఇప్పటి వరకు ప్రేమ్ కూడా అలా తనని చూడలేదు అనుకుంది.

మరుక్షణమే తన ఫోన్ తీసుకుంది. వాట్సాప్ లో రోహన్ చాట్ ఓపెన్ చేసింది. 

"థాంక్యూ రోహన్, క్లయింట్ ని తీసుకొని వచ్చారని తెలిసింది" అంటూ టైప్ చేసింది. కానీ మళ్ళీ ఎదో సంకోచం. వెంటనే టైప్ చేసింది మొత్తం డిలీట్ చేసింది.

కాసేపు అలానే అతని ప్రొఫైల్ చూస్తూ ఉండిపోయింది. మళ్ళీ ధైర్యం తెచ్చుకుని 

"ప్రేమ్ మీటింగ్ పోస్ట్పోన్ అయిందని చెప్పాడు. ఏమైనా మిస్టేక్ జరిగిందా?" అంటూ టైప్ చేసింది కానీ సెండ్ బటన్ నొక్కటానికి మాత్రం ధైర్యం సరిపోలేదు. వెంటనే మొత్తం డిలీట్ చేసి ఫోన్ పక్కన పెట్టింది. గట్టిగా ఊపిరి పీల్చుకుని పైన తిరుగుతున్న ఫ్యాన్ ని చూస్తూ ఉండిపోయింది.

అటు రోహన్ కూడా అలానే తన సీలింగ్ చూస్తూ ఉన్నాడు. ఇద్దరి మనసులు ఒకరితో మరొకరు మాట్లాడుకోవాలి అనుకుంటున్న విషయం ఇద్దరికీ అర్ధం కావట్లేదు. భయం ఇద్దరి ధైర్యాన్ని కప్పేస్తుంది. ఇద్దరు అలానే ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు.
[+] 8 users Like iHellBoy69's post
Like Reply


Messages In This Thread
RE: ట్రాప్ - తప్పు ఎవరిదీ? - by iHellBoy69 - 19-04-2026, 07:54 PM



Users browsing this thread: 2 Guest(s)