Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - పుణ్యం కోసం
తర్వాత అంకిత్ వైపు ఛీత్కారంగా చూసి, "కేవలం ఆడదాని ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకుంటావా? నీకు జరిగిన అవమానానికి అమ్మాయికి తగిన బుద్ధి చెప్పవలసింది. నేనైతేనా.. " అంటూ ఏదో చెప్పబోయే బిల్లా మాటలకి అడ్డువచ్చాడు అంకిత్. 



"కేవలం ప్రేమ మాత్రమే కారణం కాదు. నేను భూమి మీద బతకడానికి అన్ని దార్లూ మూసివేసాడు దామోదరరావు. జీవితంలో చిత్తుగా ఓడిపోయాను. అందుకే నిర్ణయం తీసుకున్నాను. " అని చెప్పి అక్కణ్ణుంచి లేచాడు అంకిత్. 



"ఆగు! నీ కథ చెప్పావు, మరి నా కథ వినవా?" అన్నాడు బిల్లా. 



"నీకథ తెలియనిదెవరికి? పేపరు చూసినా నీ కథే, టివి ఛానెల్ చూసినా నీ గురించిన వార్తలే! ఇప్పుడు నువ్వు జైలు నుండి తప్పించుకున్నావని తెలిసే ఉంటుంది, నీ గురించిన చర్చా వేదిక ప్రతీ ఛానెల్లో వస్తూ ఉంటుంది ఈపాటికి!" చెప్పాడు అంకిత్. 



బిల్లా చరిత్ర పూర్తిగా తెలిసిన అంకిత్ కి అతనంటే భయం కన్నా అసహ్యం ఎక్కువ కలిగింది. 



బిగ్గరగా నవ్వాడు బిల్లా. "మొత్తానికి నిజం చెప్పావు! నేనెంత మందినో చంపాను. ఎన్నో అత్యాచారాలు చేసాను. దొంగతనాలు, దోపిడీలకు లెక్కేలేదు. ఇప్పుడు కూడా జైలు నుండి పారిపోయి వస్తూ జైలర్ని, నలుగురు సెక్యూరిటీ ఆఫీసర్ల్ని చంపాను. మరణశిక్ష పడిన నాకు కూడా బతుకు మీద తీపి ఉంది. నేను చావడానికి సిద్ధంగా లేను. కావాలంటే అందుకోసం ఇంకెంతమంది ప్రాణాలు తీయడానికైనా వెనుకాడను. 



అలాంటిది, తప్పు చెయ్యని నువ్వు కావాలని మృత్యవాత ఎందుకు పడాలని అనుకుంటున్నావో నాకు మాత్రం బోధపడటం లేదు. అసలు ఎలాంటి తప్పూ చేయని నీకు మరణశిక్ష ఎందుకు? అది నీకై నువ్వు విధించుకున్న శిక్ష కాక మరేమిటి? మరణశిక్ష పడిన నేనే నా జీవితం గురించి భయపడటంలేదు. నువ్వెందుకు జీవించడానికి భయపడుతున్నావు?" అని అంకిత్ని సూటిగా ప్రశ్నించాడు. 



బిల్లావైపు అసహ్యంగా చూసాడు అంకిత్. బిల్లాలాంటి నరరూప రాక్షసులకు సమాజంలో స్థానం లేదు. అలాంటివాళ్ళు బతకకూడదు. మరణ శిక్ష నుండి తప్పించుకున్న బిల్లా మున్ముందు ఇంకెంత మంది ప్రాణాలు తీస్తాడో?



"ఇప్పుడసలు ఇక్కడికెందుకొచ్చానో తెలుసా? శివాలయంలో గర్భగుడి కింద నిధి ఉందన్న రహస్యం మధ్యే నాకు తెలిసింది. నిధి గురించి ప్రయత్నించే లోపలే సెక్యూరిటీ ఆఫీసర్లకు పట్టుబడ్డాను. ఇప్పుడు నిధిని చేజిక్కించుకొని మారుపేరుతో సమాజంలో పెద్దమనిషిలా బతుకుతాను. " అన్నాడు. 



ఈసారి అంకిత్కి అసహ్యంతోపాటు బిల్లాపై కోపం కూడా కలిగింది. కొండ అంచుదాకా వెళ్ళిన అంకిత్ గిరుక్కున వెనుదిరిగాడు. తనెలాగూ కొద్ది క్షణాల్లో మరణించ బోతున్నాడు. మరణించేముందు మంచిపని చెయ్యాలన్న సంకల్పం అతని మదిలో ఒక్కసారి జనించింది. తలంపు కలగ్గానే ఊహించనంత వేగంగా కదిలి తన బలమంతా ఉపయోగించి బిల్లా చెయ్యపట్టిలాగి అతనితోపాటు లోయలోకి జారిపోయాడు అంకిత్. 



ఊహించని హఠాత్ పరిణామానికి అదుపు తప్పిన బిల్లా కూడా బిగ్గరగా కేకలు వేస్తూ అంకిత్ తో పాటు వంద అడుగుల అగాధంలోకి జారిపోయాడు. బిల్లాకి పడిన మరణ శిక్ష విధంగా అమలు చేసాడు అంకిత్. చనిపోబోయే ముందు మంచి పని చేసానన్న తృప్తితో తనువు చాలించాడు అంకిత్. 
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - ఒక యోచన - ఒక అవలోకన - by k3vv3 - 19-04-2026, 06:09 PM



Users browsing this thread: 1 Guest(s)