Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - పుణ్యం కోసం
అలేఖ్య మాటలు అశనిపాతంలా తోచాయి అంకిత్ కి. ప్రేమించి తన వెంట తిప్పుకొని చివరికి తనని మోసం చేసిందని ఆలస్యంగా గ్రహించాడు. అటు ఉద్యోగం పోయింది, ప్రేమ కూడా దక్కలేదు. మరో ఉద్యోగం కూడా అతనికి దొరకుండా తన పరపతిని ఉపయోగించాడు దామోదరరావు. ఫలితంగా అంకిత్ బతుకు నానాటికీ దుర్భరం అయింది. ఇల్లు కూడా దామోదరరావు నియమించిన గుండాల కబ్జాకి గురై, నిలువనీడ లేకుండా పోయింది. చేతిలో ఉన్న డబ్బు కాస్తా అయిపోయింది. ఎక్కడా అప్పు పుట్టే ప్రసక్తే లేదు. ఇంక, ఊరు వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళాలని సిద్ధమైయ్యాడు. 



అప్పుడు జరిగింది మరో సంఘటన. అతనిపై కసి తీరని దామోదరరావు అన్యాయంగా చోరీ కేసులో ఇరికించాడు. ఫలితంగా సెక్యూరిటీ ఆఫీసర్ల లాఠీ దెబ్బలు రుచి చూడవలసి వచ్చింది. ఎక్కడలేని కేసులు అతనిమీద బనాయించ బడ్డాయి. ఇవన్నీ అలేఖ్యని ప్రేమించడంవలన వచ్చిన దుష్పరిణామాలని తెలిసినా ఆమెమీద ఆగ్రహం కలగలేదు అంకిత్కి. అంతగా ఆమెని ప్రేమించాడు మరి! అతి కష్టం మీద బైయిల్ పై విడుదలైన అంకిత్ కి జీవితం మీద ఆశ నశించింది. ఇంక కష్టాలు భరించే ఓపిక లేదు. ఆత్మహత్యే శరణ్యమని నిర్ణయానికి వచ్చాడు. 



ఆలోచించుకుంటూ కొండపైకి చేరుకున్నాడు అంకిత్. అప్పటికి అక్కడ అంతటా చీకట్లు ముసురుకుంటున్నాయి. గుడి ఆవరణలో ఉన్న మర్రిచెట్టు గాలికి తలూపుతోంది. కొండమీదనున్న శివాలయం వరండాలో నిలబడ్డాడు. బయటనుండి దేవుణ్ణి క్షమించమని, వచ్చే జన్మంటూ ఉంటే ఇలాంటి జన్మ మాత్రం ప్రసాదించొద్దని మనసులోనే వేడుకున్నాడు. అలసటవల్ల కొద్దిసేపు అరుగుమీద కూర్చోవాలనుకున్నాడు. ఇంకొద్దిసేపట్లో చనిపోబోయే మనిషికి అలసటేమిటి అనుకొని నవ్వొచ్చింది అతనికి. అయినా కొద్దిసేపు అక్కడ కూర్చున్నాడు. ఇక తన నిర్ణయం అమలుపర్చడానికి కొండ అంచువరకూ వెళ్ళాడు. 



వంద అడుగులకు పైగా ఉన్న లోయ భయంకరంగా కనిపించింది. ఒక్కసారి అంకిత్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తల్లి గుర్తుకు వచ్చింది. తన జీవితం ఇలా అంతమవుతుందని అమెప్పుడూ భావించి ఉండదు. తను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన అలేఖ్య కూడా చివరి క్షణంలో గుర్తుకు వచ్చింది. 



తనకి స్థితి కల్పించిన భగవంతుణ్ణి చివరిసారిగా స్మరించి లోయలోకి దూకడానికి ఉద్యుక్తుడయ్యాడు అంకిత్. 
"హల్లో.. గురూ ఆత్మహత్యా ప్రయత్నమా! ప్రేమ ఫెయిలైయ్యిందా లేక అప్పులుపాలయ్యావా?" ఎవరిదో గొంతు వెనకనుండి వినిపించడంతో ఉలిక్కిపడి తన ప్రయత్నం ఆపి, మాట్లాడిందెవరా అని వెనుతిరిగి చూసాడు అంకిత్. 



చీకట్లో ఎవరో మనిషి తను ఇంతకుముందు కూర్చున్న అరుగు మీద కూర్చొని ఉండటం కనిపించింది. ఎత్తుగా బలిష్టంగా ఉన్నాడా వ్యక్తి. కోరమీసాలు, మాసిన గడ్డంతో భయంకరంగా ఉన్నాడు. కండలు తిరిగిన శరీరం. చీక్కట్లో నల్లగా మెరుస్తున్నాడు. చేతిలో సిగరెట్, మరో చేతిలో మందుసీసాతో భయం గొల్పుతూ ఉన్నాడు. అతన్ని చూడగానే తనపై ఇంతకుముందు దాడిచేసిన కిరాయి గుండాలు గుర్తుకు వచ్చారు అంకిత్కి. 



నవ్వు వచ్చింది. ఇంకొద్ది క్షణాల్లో యమపురికి చేరబోతున్న తనని చంపడానికి ఇతన్ని నియమించాడా దామోదరరావు? క్షణంలో మాత్రం భయం కలగలేదు అతనికి. 
అంకిత్ ఏమీ మాట్లాడకపోగా అతని పెదవులపైన విరిసిన నవ్వుని చూసి విస్మయం చెందాడు మనిషి. 



"ఏం, ఆగిపోయావు, ఆత్మహత్య చేసుకోకుండా?" అన్నాడు నవ్వుతూ అంకిత్ వైపు తిరిగి. నవ్వితే మరింత భయంకరంగా కనిపించాడా వ్యక్తి. 



"హేయ్! ఎవరు నువ్వు? దామోదరరావు నియమించిన గుండావా?" అడిగాడు అంకిత్. 
"దామోదరరావా? అతనెవరు?" ఆశ్చర్యంగా అడిగాడు వ్యక్తి. 



"మరి నువ్వెవరు? ఎవరు పంపించారు నిన్ను? ఎందుకిక్కడికి వచ్చావు?" అడిగాడు అంకిత్. 



ఎక్కడో చూసినట్లుంది కానీ, అతనెవరో చప్పున గుర్తుకు రాలేదు. 



"బిల్లా.. పేరెప్పుడైనా విన్నావా?" అన్న మనిషి మాటలకి ఉలిక్కిపడ్డాడు అంకిత్. 



అప్పుడు గుర్తొచ్చింది అతన్ని ఎక్కడ చూసాడో అన్న సంగతి. టివిలో చూసాడు. 



'బిల్లా!' అన్న పేరు వినగానే ఎవరికైనా గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం ఖాయం. అంత భయంకరమైన వ్యక్తి బిల్లా! కరుడు కట్టిన నేరస్థుడు! నేర సామ్రాజ్యంలో మకుటంలేని మహారాజు బిల్లా! ఎంత మందిని కడతెర్చాడో లెక్కలేదు. ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీసాడో అతనికే తెలియదు. కబ్జాలకి కేర్ ఆఫ్ అడ్రెస్ అతను. చాలా మంది మహిళలను వేధించాడు కూడా! చాలాసార్లు సెక్యూరిటీ ఆఫీసర్లకు చిక్కినట్లే చిక్కి పారిపోయేవాడు. బిల్లా ఎవరికైనా ఎదురుపడ్డాడంటే, వాడికి మూడినట్లే! 



అలాంటి బిల్లా కొన్నాళ్ళ కిందట సెక్యూరిటీ ఆఫీసర్లకు చిక్కి జైల్లో ఉన్నాడని విన్నాడు అంకిత్. అతను చేసిన నేరాలకుగాను కోర్టు మరణ శిక్ష విధించిందని, త్వరలో శిక్ష అమలు జరుగుతుందని కూడా వార్తల్లో చూసాడు. జైలు నుండి ఎలా బయటపడ్డాడు బిల్లా? ఎక్కడికెందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు? అంకిత్ మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. అలాంటి బిల్లా పేరెవరికి తెలియదు? అప్రయత్నంగా తెలుసునని తలూపాడు అంకిత్. 



బిగ్గరగా నవ్వాడా వ్యక్తి. "నిజమే! నేను తెలియనిదెవరికి? అది సరే! నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోబోతున్నావు చెప్పు, వింటాను. " అన్నాడు బిల్లా. బిల్లా ఎదుట నిలబడటానికి భయపడలేదు అంకిత్. చావబోతున్న వాడికి భయమెందుకు? అతని ఎదురుగా నిర్భయంగా కూర్చొని తన కథంతా చెప్పుకొచ్చాడు అంకిత్. అంతా విని నిట్టూర్పు విడిచాడు బిల్లా. తర్వాత చేతిలోని సీసా ఎత్తి గటగటా తాగాడు అందులోని ద్రవాన్ని. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - ఒక యోచన - ఒక అవలోకన - by k3vv3 - 19-04-2026, 06:08 PM



Users browsing this thread: 1 Guest(s)