Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - పుణ్యం కోసం
మరణ శిక్ష

రచన: పద్మావతి దివాకర్ల



పట్టణం దాటి పది కిలోమిటర్లు దూరం వచ్చిన తర్వాత, ఆటో ఆపమని చెప్పి కిందకి దిగాడు అంకిత్. జేబులో చెయ్యపెట్టి పర్సులో మిగిలిన ఆఖరి పచ్చ నోటు వంక ఆప్యాయంగా చూసి తనివితీరా తడిమి, ఆటో డ్రైవర్ చేతిలో పెట్టాడు. అతనివంక విచిత్రంగా చూసాడా ఆటో డ్రైవర్, "ఎక్కడికెళ్తారు సార్ ఇక్కణ్ణుంచి?" అని అడిగాడు. 



ఎందుకంటే అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. చుట్టుపక్కలెక్కడా ఇల్లూ, వాకిళ్ళూ కూడా లేవు. కొద్ది దూరంలో చాలా స్టీప్ గా ఉన్న కొండప్రదేశం పక్కనే లోతైన లోయ మాత్రమే ఉంది. 



"ఏమో నాకే తెలియదు!" విరక్తిగా నవ్వు నవ్వి అక్కణ్ణుంచి ముందుకి కదిలాడు అంకిత్. అతనివైపు అయోమయంగా క్షణం చూసి, తనకెందుకని అనుకున్నాడో ఏమో ఆటో వెనక్కి తిప్పి అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. 



అక్కణ్ణుంచి అటవీ ప్రాంతం మొదలవుతుంది. పక్కన ఎత్తైన పర్వత ప్రదేశం ఉంది. కొండ మీదో చిన్న పాతకాలంనాటి శివుడి గుడి ఉంది. శివరాత్రి, కార్తీక సోమవారాలులాంటి పర్వదినాల్లో తప్పించి అక్కడికెవరూ వెళ్ళరు. గుడి పూజారి మాత్రం ప్రతీ రోజూ ఉదయం వెళ్ళి శివునికి ధూపదీప నైవేద్యాలు మాత్రం సమర్పించి వస్తూంటాడు. పిక్నిక్ సీజన్లో మాత్రం జనం వనభోజనాలకోసం అక్కడికి వెళ్తూఉంటారు అంతే! మిగతా రోజుల్లో పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుందా ప్రదేశం. 



ఆటో అతను కనుమరుగయ్యేదాకా చూసి, అక్కణ్ణుంచి ముందుకి కదిలాడు. ఎప్పుడో ఉదయం తిన్న టిఫిన్ అరిగిపోయి, ఆకలి వేస్తోంది. దాహం కూడా వేస్తోంది. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి కడుపునిండా నీళ్ళు తాగిన తర్వాత మనసు కొద్దిగా శాంతించింది. ఖాళీ అయిన వాటర్ బాటిల్ ని దూరంగా విసిరేసాడు. అయినా, ఇంకొద్ది గంటల్లో దేహం చాలించబోతున్న తనకి ఆకలేమిటి, దప్పికేమిటి? 



విరక్తిగా నవ్వుకొన్నాడు. శివాలయానికి దారితీసే మట్టి రోడ్డులో నడుచుకుంటూ ముందుకు సాగిపోయాడు. మనసులో ఆలోచనలు చెలరేగుతున్నాయి. సాధ్యమైనంత వరకూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఎంత ప్రయత్నించినా ఆలోచనలు మాత్రం అతన్ని వదలటం లేదు. 



చిన్నప్పుడే తండ్రి పోవడంతో, తల్లి వర్ధనమ్మ కాయకష్టంతో పెరిగాడు అంకిత్. చాలా కష్టపడి కొడుకుని పెంచిందామె. చదువు పూర్తై, మంచి కంపెనీలో ఉద్యోగం రావడంతో చాలా సంతోషించాడు. తనని అంత కష్టపడి పెంచి, చదివించినందుకు ఆమెని పువ్వుల్లో పెట్టుకొని చూడాలనుకున్నాడు. కానీ అతని ఆశ నెరవేరలేదు. 



ఉద్యోగం వచ్చిన రెండునెలల్లోనే ఆమె కనుమూసింది. తన అనారోగ్యాన్ని కూడా ఖాతరు చెయ్యకుండా కష్టపడిన ఆమె ఆరోగ్యాన్ని రకరకాల జబ్బులు బాగా దెబ్బ తీసాయి. సరైన చికిత్స అందకముందే, కొడుకుని వంటరివాణ్ణి చేసి ఆమె వెళ్ళిపోయింది. తండ్రిప్రేమ ఎరుగని అంకిత్ తల్లి అండనే బతికాడిన్నాళ్ళూ. ఆమె కూడా పోవడంతో దిక్కులేనివాడయ్యాడు. తనకి భగవంతుడు ఎందుకు ఇంత ఘోరమైన శిక్ష విధించాడో బోధపడలేదు అంకిత్కి. 



తల్లి ఋణం తీర్చుకొనే అవకాశమే లభించలేదు అంకిత్ కి. చాలా రోజులవరకూ మామూలు మనిషి కాలేకపోయాడు. సరిగ్గా అప్పుడే అంకిత్ జీవితంలో ప్రవేశించింది అలేఖ్య. ఎడారిలాంటి తన జీవితంలో ఒయాసిస్లా సేద తీర్చిందామె సాంగత్యం. ఆమెతో పరిచయం అయిన కొద్దిరోజుల్లోనే జీవితంలో తనకి తగిలిన దెబ్బలని మర్చిపోగలిగాడు అంకిత్. అమెతో మాట్లాడితే మధువనంలో విహరించినట్లు ఉండేది. అమెని మనసారా ప్రేమించాడు అంకిత్. అలేఖ్య కూడా అతనితోటే తన జీవితమనేది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని షికార్లు, సినిమాలు తిరిగారు. ఇక తన జీవితం ఆనందమయం కాబోతోందని అనుకున్నాడు అంకిత్. 



అప్పుడే తెలిసింది అలేఖ్య తన కంపెనీ యజమాని దామోదరరావు ఒక్కగానొక్క కూతురని, తండ్రి తదనంతరం ఆమె కంపెనీ వారసురాలని. విషయం తెలియగానే అతని భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. ఇన్నాళ్ళూ నింగినంటిన ఆశలు ఒక్కసారి నేలకూలాయి. 



సినిమాలో ప్రేమలాగ వాళ్ళిద్దరి ప్రేమ సుఖాంతం కాలేదు. వాళ్ళిద్దరి ప్రేమ దామోదరరావు కంట్లో పడింది. అతని హోదాకి తను మాత్రం తగనని అంకిత్ కి బాగా తెలుసు. అయినా తన ప్రేమ మీద, అలేఖ్య ప్రేమ మీద అంతులేని నమ్మకం ఉన్న అంకిత్ వెనక్కి తగ్గలేదు. తన కూతురు అలేఖ్య అతనితో కలుసుకోకుండా కట్టడి చేసాడు దామోదరరావు. 



అంతటితో ఊరుకోలేదు అతను. ఫలితంగా అంకిత్ ఉద్యోగం కోల్పోయాడు. ఇంకా దామోదారరావు కసి తీరలేదు. తన కూతురిపై కన్ను వేసిన అంకిత్ కి తగిన బుద్ధి చెప్పడానికి కొంతమంది కిరాయి రౌడీలను నియమించాడు. ఆస్పత్రి పాలైన అంకిత్ కోలుకొనేసరికి అలేఖ్యకి పెళ్ళి కూడా కుదిరిపోయింది. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. 
అలాంటి పరిస్థితిలో ఆమెని కలుసుకోవడం దాదాపు అసాధ్యమైన పనైనా సాహసం చేసాడు అంకిత్. 



తన ప్రాణాలకు తెగించి సాహసం చేసి ఆమెని కలిసాడు అంకిత్. అలేఖ్య ఒప్పుకుంటే దామోదరరావుని ఎదురించైనా ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. కానీ అప్పుడు ఆమె మాటలు విన్న అంకిత్ పూర్తిగా హతాశుడైయ్యాడు. 



"నువ్వంటే నాకు ప్రేముంది, కాదనను. కానీ, ఇప్పుడు ఉద్యోగమూ లేని నువ్వు నన్నెలా పోషిస్తావు? నీ మాట విని నిన్ను పెళ్ళాడితే నాన్న తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా మనకి ఇవ్వరు. ప్రాణంకన్నా పరువుని మిన్నగా భావిస్తారు. పైగా నాన్న ఇప్పుడు తెచ్చిన సంబంధం నీకన్నా ఎన్నో రెట్లు గొప్పది. పెళ్ళికొడుకు రేయాన్ష్ కి యుఎస్లో పలు వ్యాపార సంస్థలున్నాయి. అశ్వైరవంతుడేకాక, అందగాడు కూడా! పెళ్ళవగానే అమెరికాలోనే కాపురం! ఇంతవరకూ ఇంట్లో గారాబంగా పెరిగిన నేను, నీవెంట వెళ్ళి కష్టాల జోలికి పోలేను. నీ కోసం అంతమంచి సంబంధం వదులుకోలేను. నా మాట విని నన్ను మరిచిపో! అది మనిద్దరికీ శ్రేయస్కరం. " అని మరో మాటకు తావులేకుండా అతని మొహం మీదే తలుపేసుకుంది. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - ఒక యోచన - ఒక అవలోకన - by k3vv3 - 19-04-2026, 06:07 PM



Users browsing this thread: 1 Guest(s)