19-04-2026, 11:09 AM
Part - 48
పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి బ్లూటూత్ ఆన్ చేస్తుంది. చెప్పండి మిస్ అని విక్రమ్ వాయిస్ గంభీరంగా వస్తుంది. ఒక్క నిమిషం కంగారుపడుతుంది.
అటు పక్క నుంచి.. విశి నేను రెడీ అని చెబుతోంది. ఓకే అని ప్రీవియస్ ప్రాజెక్ట్ ఎక్సప్లయిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది.
కంటిన్యూ చేస్తూ ఉంటే.. విక్రమ్ స్టాప్ అనగానే ఏమైంది సార్ అని గౌతమ్ కంగారుగా అడుగుతాడు.. ప్రీవియస్ వర్క్ గురించి అవసరం లేదు.
ప్రెసెంట్ మీరు మాతో కోలాబరేషన్ అవ్వాలనుకున్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి అనగానే.. ఓకే అని హిమవైపు చూస్తాడు. తప్పకుండా సార్.. ప్రెసెంట్ ప్రాజెక్టు గురించే చెబుతాము అని విశి కి హిట్ ఇస్తుంది..
విశి చెప్పడం స్టార్ట్ చేయగానే.. గౌతమ్ ఫోన్ రింగ్ అవుతుంది. విక్రమ్ కోపంగా చూస్తాడు. శ్రీ వెంటనే ఇలాంటి మీటింగ్స్ లో ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలి అన్న విషయం కూడా తెలియదా..
ఆనంద్ అనగానే... ఎస్ ఆర్ అని ఇద్దరు ఫోన్స్ తీసుకుని... గౌతమ్ దగ్గరకు వచ్చి సైలెంట్ లో పెట్టండి అని ఇస్తాడు
దానికి కన్న ఏరోప్లేన్ మోడ్ లో పెట్టండి. అది అయితే ఇంకా ప్రాబ్లం ఉండదు అనగానే.. సార్ అని గౌతమ్ బిక్క మొహం వేస్తాడు.
ప్లీజ్ కానివ్వండి.. గౌతమ్..
సైలెంట్ లో పెడితే సరిపోతుంది కదా సార్.. ఇక్కడ నువ్వు డిసైడ్ చేస్తే మేము వినడం కాదు. మేము డిసైడ్ చేస్తే నువ్వు వినాలి.
క్యారీ ఆన్ అనగానే ఇక తప్పక గౌతమ్ అతి తెలివితేటలు చూపిస్తూ గౌతమ్ ఫోన్ లో ఏరోప్లేన్ మోడ్ లో పెట్టి.. హిమ ఫోన్ సైలెంట్ లో పెట్టి ఇస్తాడు.
హలో మిస్టర్ గౌతమ్ అనగానే చూసుకోలేదు అని ఏరోప్లేన్ మోడ్ లో పెడతాడు రెండు ఫోన్స్ దూరంగా పెట్టగానే విశి చెబుతున్న వాయిస్ ఏమీ రాక హిమకి ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది.
చెప్పండి మిస్ అనగానే... గౌతమ్ వైపు చూస్తుంది. గౌతమ్ తల పట్టుకుంటాడు. అటు పక్కనుంచి విశి ఎంత చెప్పడానికి ట్రై చేస్తున్నా సిగ్నల్స్ దొరకవు.
ఏమయింది వీళ్ళకి సడన్ గా.. నాకెందుకులే... నాకు ఇచ్చిన టైం వరకు ఆన్లైన్ లో ఉంటాను. తర్వాత వాళ్ళ ఇష్టం..
ఫోన్ ఆన్ లోనే ఉంచి వర్క్ చేసుకుంటూ ఉంటుంది
శ్రీకర్ వచ్చి ఏమైంది.. ఏమో సార్ వాళ్ళు సడన్ గా రెస్పాండ్ అవ్వడం లేదు.
నాకిచ్చిన టైం వరకు వెయిట్ చేస్తాను. తర్వాత మనకు సంబంధం లేదు..
హిమ స్క్రీన్ వైపు.. గౌతమ్ వైపు చూస్తూ ఉంటే... ఏంటి మిస్ ఏమీ చెప్పరేంటి... ఇందాక టైం పంచువాలిటీ గురించి మా ఆనంద్ కేదో చెప్పినట్టున్నారు.. ఇప్పుడేంటి మా టైం వేస్ట్ చేస్తున్నారు.
అది సార్.. ఇంతకీ మీకు తెలుసా లేక మా ముందు.. నో సర్ ఇవంతా నేను డిజైన్ చేసినదే.. మరి ఇంకేంటి నీ వర్క్ మీరు చెప్పలేకపోతున్నారు.
మీలాంటి పెద్ద వాళ్ళని చూసేటప్పటికి కొంచెం నేర్వోస్ గా అనిపిస్తుంది. ఇంకొక రోజు ప్లాన్ చేసుకుందామా అని భయంగా అడుగుతుంది.
వాట్ మిస్టర్ గౌతమ్.. నీ అర్క్ టెక్చర్ బిహేవియర్ ఇలాగుంది మీరు మాతో కొలాబరేట్ అవ్వడానికి ఎన్ని నెలలు నుంచి ట్రై చేస్తే ఇప్పటికీ మీకు ఛాన్స్ వచ్చింది.
మళ్ళీ అంటే ఏమో చెప్పలేం అని కమాన్.. శ్రీ బయలుదేరదాం.. ప్లీజ్ సార్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము.
హిమ టెన్షన్ పడకు.. స్క్రీన్ మీద చూసి ఎక్స్ప్లెయిన్ చెయ్.. ఓకే ఓకే అని స్క్రీన్ వైపు చూస్తుంది. అక్కడ కనిపిస్తున్న డిజైన్ చూసి హిమకి ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కాదు..
ఏదైతే అది అయ్యింది ఎక్కడో ఒకచోట స్టార్ట్ చేద్దాము అని.. డిజైన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సార్ ఇది మొత్తం ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్.
ఇక్కడ సెల్లార్ పార్కింగ్ వస్తుంది. ఫస్ట్ టూ ఫ్లోర్స్ కమర్షియల్ బ్లాక్స్ సెట్ చేసాము. పైన రెస్టారెంట్స్.. బెస్ట్ ఎమినిటీస్ తో పాటు పార్టీస్ చేసుకునేటట్టుగా డిజైన్ చేశాము అని చెప్పి ఓకేనా అని గౌతమ్ వైపు చూస్తుంది.
గౌతమ్ కి అర్థమైపోతుంది. ఈ ప్రాజెక్టు వచ్చినట్టే అని.. ఏమీ మాట్లాడలేక చూస్తాడు. శ్రీ వెంటనే.. టెర్రస్ పైన మాకు స్విమ్మింగ్ పూల్ కూడా కావాలి.
ఇక్కడ అరేంజ్ చేస్తున్నాము పైన చూపిస్తుంది. అంత పైకి వాటర్ ఎలా వెళతాయి అని అడిగితే.. ఏముంది సార్.. డ్రమ్స్ తో వాటర్ పైకి తీసుకెళ్లి.. ఫిల్ చేస్తారు.
అంతే గౌతమ్ కి ఫ్యూస్ లు ఎగిరిపోయి లోపల నుంచి కాలిపోతున్న వాసన బయటికి కొడుతూ ఉంటుంది. హిమ టాలెంట్ కి.. మిగిలిన వాళ్ళకి వస్తున్న నువ్వునీ కష్టంగా ఆపుకుంటారు.
విక్రమ్.. మిస్ మీరు బాగా టాలెంటెడ్ అనుకుంటా... విక్రమ్ పొగడగానే ఆకాశంలో తేలిపోతూ ఉంటుంది. ఆ పొగడ్తలో ఉన్న వెటకారం గౌతమ్ కి అర్థమవుతుంది..
మాకు ఈ ప్రాజెక్టులో ఇంకొక బెస్ట్ ఆప్షన్ కూడా కావాలి. చెప్పండి సార్.. ఏదైనా సరే చిట్టుక్కున చేసేస్తాను. కొంతమంది కస్టమర్స్ కి సెల్లార్లో, ఫస్ట్ ఫ్లోర్ లోను స్విమ్మింగ్ పూల్ కావాలి అంటారు.
వాటర్ తో అక్కడ ఎంజాయ్ చేస్తాము అని.. అప్పుడు ఈ ప్లాన్ లో ఏమైనా మార్పు చేయగలరా.. గౌతమ్ కంగారుగా సార్ మేము ఆలోచించి డిజైన్ చేసి ఇస్తాము..
దీనికి ఆలోచించాల్సిన అవసరం ఏముంది గౌతమ్.. నేను చెబుతాను కదా అని ఈ ప్లేస్ లో పెట్టొచ్చు అని ఒక చోట మార్క్ చేసి చూపిస్తుంది.
అక్కడ ఎలా కుదురుతుంది మిస్.. అక్కడ పిల్లర్స్ ఉన్నాయి కదా.. ఏముంది సార్.. ఈ పిల్లర్స్ తీసి పక్కనపెట్టి ఇక్కడ స్విమ్మింగ్ ఫుల్ సెట్ చేస్తే సరిపోతుంది.
సేమ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలా చేయడమే అనగానే.. గౌతమ్ తల పట్టుకుంటాడు. అయిపోయింది ఈరోజుతో నా కెరియర్ మొత్తం క్లోజ్ అయిపోయింది.
ఈ తింగరిది చెప్పినా విధానానికి విక్రమ్ సార్ కి అర్థమైపోయిఉంటుంది. ఈ ప్రాజెక్టు చేసింది హిమ కాదు అని.. ఇప్పుడు ఆ పాయింట్ అడిగితే నేను ఏం చెప్పాలి.
ఓరి భగవంతుడా... దీనికి ఎన్నిసార్లు చెప్పాను.. ఏమైనా జరగొచ్చు.. విశి తో ఒక్కసారి ప్రాజెక్టు గురించి మాట్లాడుఅంటే లెక్క చేయలేదు.
బ్యూటీ మీద పెట్టిన ఫోకస్ ప్రాజెక్ట్ మీద పెట్టలేదు... వాట్ మిస్టర్ గౌతమ్ ఇదేనా మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లనేషన్ అని విక్రమ్ కోపంగా అడుగుతాడు.
అది సార్.. ఈ మిస్ మీ కంపెనీలో చాలా బెస్ట్అర్క్ టెక్చర్ అని చెప్పారు. అంటే మిగిలిన వాళ్ళు వర్కింగ్ ఎంత వరెస్ట్ గా ఉంటుందో..
ఇలాంటి ప్రాజెక్ట్ పుచ్చుకొని మా దగ్గరికి వచ్చారా.. మిస్టర్ ఆనంద్ అనగానే.. చెప్పండి సార్.. స్టాల్స్ ఈ అమ్మాయే కదా పెట్టింది.
బాగా ఎక్స్పోజ్ చేసింది. అవార్డ్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ బ్లా.. బ్లా.. అని చెప్పారు. పిల్లర్స్ తీస్తే ఏం జరుగుతుందో కూడా తెలియని అమ్మాయికి అవార్డ్స్ ఎలా వచ్చాయి.. సంథింగ్ ఫిషీ..
అసలు ఏం జరిగిందో అన్నది ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి నాకు సబ్మిట్ చేయండి. వీళ్ళు గనక నన్ను చీట్ చేయడానికి ట్రై చేశారని తెలిస్తే మాత్రం..
గౌతమ్ వైపు ఫింగర్ చూపిస్తూ నీ కంపెనీ మీద నువ్వు హోప్స్ వదిలేసుకో... రోడ్డు మీదకు తీసుకోవచ్చేస్తాను. నాకు మోసం అన్న... అబద్ధం అన్నా పరమ చిరాకు.
కమాన్ శ్రీ అని విక్రమ్ కోపంగా వెళ్ళిపోతాడు. ఏమైంది గౌతమ్ నేను బాగానే చెప్పాను కదా అని హిమ వస్తే.. అది చెప్పడం అంటారా..
పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ ఏమవుతుంది అన్నది చిన్నపిల్లల కైనా తెలుస్తుంది.. అలాంటిది నీకు తెలియలేదా.. న్యూ టెక్నాలజీతో కన్స్ట్రక్ట్ చేస్తాము.
టెక్నాలజీని వాడుకోవాలి. పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కట్టే టెక్నాలజీ రాలేదు. వచ్చినప్పుడు నువ్వు సెపరేట్గా కట్టు..
ఈసారి ప్రిపేర్ అయి వద్దాము.. నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నావా.. ఇన్వెస్టిగేషన్ చేయించమంటున్నారు.
అది చేస్తే కనుక మనం చేసిన ఫ్రాడ్ బయట పడుతుంది.. అప్పుడు మన పరిస్థితి ఏమిటో నీకు అర్థం అవుతుందా.. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశావు కదా.. పిల్లర్స్ లేకపోతే ఏమవుతుంది అన్నది కూడా నీకు తెలియదా..
ఏమో.. నేను ఏ రోజు కాలేజీకి వెళ్లాను.. సర్టిఫికెట్ కొనడమే కదా.. ఫస్ట్ నుంచి నీకు చెబుతున్నాను. ఈ కంపెనీకి వస్తున్నాము అంటే మనం ప్రొఫెషనల్ గా ఉండాలి..
అట్లీస్ట్ మినిమం అయినా తెలుసుకోవాలి అని.. కానీ నువ్వు ఏం చేసావో తెలుసా నన్ను నడిరోడ్డు మీదకు తీసుకువస్తున్నావు.
కమాన్ గౌతమ్.. ప్రతిదాన్ని భూతద్దంలో చూసి నాతో ఆర్గ్యు చేయకు. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. ఈ కంపెనీ లేకపోతే మనకి ఇంకా ఏ కంపెనీలు లేవా ఏమిటి..
విక్రమ్ సార్ తో పెట్టుకుంటే ఏమవుతుందో వెళ్లి మీ నాన్న ని అడుగు అని సీరియస్ గా బయటికి వెళ్లిపోతాడు. హే గౌతమ్ ఆగు నేను వస్తున్నా అని వెనకాలే వెళుతుంది.
కానీ అప్పటికే గౌతమ్ వెళ్ళిపోతాడు. ఛ.. వీడు ఇలా చేసాడు ఏంటి.. నిజంగా నేను అంత పెద్ద మిస్టేక్ చేశానా.. నా టాలెంట్ వీళ్ళకి అర్థం కాలేదా లేక నన్ను రీచ్ అవ్వలేకపోతున్నారా...
నిన్నే రీచ్ అవ్వలేకపోతున్నారు. ఎవరు అని చూస్తుంది.. ఐ యాం సూర్య సన్నాఫ్ విక్రమ్.. సూర్య ని చూడగానే ఫ్లాట్ అయిపోతుంది.
ఆరడుగుల అందగాడు.. షార్ప్ లుక్ తో విక్రమ్ కి ప్రింట్ లాగా కనిపిస్తాడు. నిన్ను చూస్తూ ఉంటే విక్రమ్ సార్ కి జిరాక్స్ కాపీ లాగా ఉన్నావు. సో హ్యాండ్సం..
థాంక్యూ మిస్ బ్యూటీ.. ఇలా పబ్లిక్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు.. మనిద్దరం క్యాబిన్ లో కూర్చుని మాట్లాడుకుందాం..
తప్పకుండా సూర్య అని తిప్పుకుంటూ వెళుతుంది..
సూర్య ప్లాన్...
కథ కొనసాగుతుంది......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)