18-04-2026, 08:23 AM
Part - 46
బాబీ ఒక్క నిమిషం. ఏమిటి వైభవ్... నీ ఫోన్ ఆన్ లో ఉంచవా ప్లీజ్.. ఎందుకు.. నువ్విచ్చే కోటింగ్ ఏంటో నాకు వినాలని ఉంది.
పర్సనల్గా మాట్లాడాలి అంటే దగ్గరలో ఉండలేను కదా.. ప్లీజ్ ప్లీజ్ మెలికలు తిరుగుతూఉంటాడు.
సరే అని ఫోన్ ఆన్ చేసి గౌతమ్ దగ్గరకి వెళుతుంది.
చెప్పండి మిస్టర్ గౌతమ్ ఏం మాట్లాడాలి... ప్లీజ్ విశిష్ట మనం ఒకప్పటి లవర్స్ లాగా మాట్లాడుకుందాం..
ఇంకా ఆపుతావా అని చేతితో చూపిస్తుంది.. ఇక్కడ వైభవ్ ఫోన్ స్పీకర్లు ఉంచుతాడు. మనిద్దరం లవర్స్ మా ఎప్పుడు.. అలా అంటావేంటి విశి ఎంత గాఢంగా ప్రేమించుకున్నాము..
అవునా.. సరే నాకు ఇష్టమైన పువ్వు ఏది అని అడుగుతుంది. ఆ మాటకి తడబడుతూ ఆడవాళ్ళకి ఎక్కువ రోజ్ సే కదా ఇష్టం అని చెప్పి రెడ్ రోజ్ అంటాడు.
రాంగ్ ఆన్సర్.. పోనీ నాకు ఇష్టమైన కలర్... పింక్. రాంగ్ ఆన్సర్.. చూసావా ఒక పువ్వు.. రంగులోనే.
నాకేం ఇష్టమో నీకు తెలియదు. అలాంటిది మన ఇద్దరం లవర్స్ అని చెబుతున్నావు.
అవి తెలియనంత మాత్రాన లవర్స్ మీ కాదా... ఇంకా నీకు లవర్స్ అని నమ్మకం ఉంది కదా.
సరే మనిద్దరం కలిసి వెళ్ళిన మొదటి డేట్ ఎప్పుడు.. ఎక్కడ..
ఆ మాటకి గౌతమ్ నీళ్లు నములుతూ ఉంటాడు. లేదు కదా.. పోనీ నువ్వు కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనిద్దరం పర్సనల్గా కలిసింది ఎప్పుడు ? అది.. లేదు కదా...
ఇప్పటికీ కూడా మనం లవర్స్ అని నీకు అనిపిస్తుందా...
ఐ యాం సారీ విశి.. నేను ఇప్పుడు తెలుసుకుంటాను. నీకు ఇష్టమైన కలర్.. ఫుడ్..
అలాగే డేట్ కి తీసుకువెళ్తాను. వీకెండ్ పర్సనల్గా మీట్ అవుతాను. ఇంకా ఆపుతావా... అడిగిన తర్వాత చేసేదాన్ని ప్రేమ అనరు. అడగకుండా చేసేదానినే ప్రేమ అంటారు.
ఇన్ని రోజుల్లో నీకు అనిపించినది.. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడేటప్పటికీ ఎందుకనిపిస్తుంది. ప్రతిసారి నువ్వు మా అమ్మ పేరు చెప్పి నన్ను ఎమోషనల్ గా లాక్ చేసి నాతో నీ వర్క్ చేయించుకునే వాడివి.
ఇప్పుడు నా వర్క్ కి ఉన్న వాల్యూ ఏమిటో తెలుసుకుని నేను స్ట్రాంగ్ గా నిలబడేటప్పటికీ కాళ్ళ బేరానికి వస్తున్నావు.
నిజంగా నువ్వు నన్ను ప్రేమించే ఉంటే హిమతో పెళ్లికి ఎంత ఒప్పుకుంటావు. హిమంటే నాకు ఇష్టం లేదు. పెద్దవాళ్ల ఫోర్స్ కి ఒప్పుకోవాల్సి వచ్చింది.
ఆ మాటకి గట్టిగా నవ్వుతుంది. నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. గౌతమ్ అలాగే చూస్తూ ఉంటే.. సోరి అని కష్టంగా నవ్వు ఆపుకుంటూ..
నేను ఏమన్నా నీ కళ్ళకి ఒక త్రీ ఇయర్స్ బేబీగా కనిపిస్తున్నానా.. ఏది చెప్పినా నమ్మడానికి... స్టాల్ జరిగిన రోజు నువ్వు చెప్పిన ఏ మాట నేను మర్చిపోలేదు.
నా రేంజ్ ఏంటో నా లైఫ్ ఏంటో అన్నది చూపించావు. జస్ట్ నీ వరకు మాత్రమే వర్క్ చేయాలి.. నీకోసమే నేనుండాలి. కానీ బయట ప్రపంచానికే మాత్రం నీ భార్యగా మాత్రం హిమ ఉండాలి.
అప్పుడు నన్ను ఏమంటారో తెలుసా.. ఆ పిలుపుకి ఎలాంటి విలువ ఉంటుందో తెలుసా.. నీకు ఒక సిస్టర్ ఉండి.. ఆ అమ్మాయికి కూడా నీలాంటి వాడే ఇలాంటి ఆఫర్ ఇస్తే అర్థమవుతుంది.
ఒకరకంగా నేను నీకు థాంక్స్ చెప్పాలి.. ఎందుకో తెలుసా... ఆరోజు నువ్వు అలా మాట్లాడకపోయి ఉండి ఉంటే...
నేను అలాగే నీకోసం వర్క్ చేస్తూ నాలో నిజంగానే టాలెంట్ లేదేమో అని అలాగే ఉండిపోయేదాన్ని..
మనిద్దరి మధ్యన అసలు ప్రేమే లేదు. ప్రేమ ఉండి ఉంటే నువ్వు నన్ను మోసం చేయడానికి చూసేవాడివి కాదు. నువ్వు నాకు దూరం అయితే ఆ పెయిన్ తట్టుకోలేక నేను నరకం చూసేదాన్ని...
బట్ నువ్వు నన్ను మోసం చేశావు అన్న బాధ తప్ప... నిన్ను మిస్ అవుతున్నానే అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు.
అలాంటప్పుడు మన మధ్యన ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది. జస్ట్ ఒక బిజినెస్ డీల్ మాత్రమే.. నువ్వు నాకు మనీ ఆఫర్ చేశావు. దానికి తగ్గట్టుగా నా వర్క్ నీకు ఇస్తూన్నాను.
థట్స్ ఇట్.. ఇంకేమైనా మాట్లాడాలా.. ఇది నువ్వు కాదు. నువ్వేంటో నాకు తెలుసు కదా నీతో ఎవరో మాట్లాడిస్తున్నారు ...
బిజినెస్ పరంగా దెబ్బతీయ లేక పర్సనల్గా దెబ్బతీయడానికి నిన్ను వాడుకుంటున్నారు. ఎవరో చెప్పు... భుజాలు పట్టుకుని కుదిపేస్తూ ఉంటాడు.
మిస్టర్ గౌతమ్ మీరు దూరంగా ఉండండి. ఇలా మిస్ బిహేవ్ చేశారంటే అరిచి అందరినీ పిలుస్తాను. పిలువు విశి...
నా ప్రియురాలు నన్ను వద్దని వెళ్ళిపోతుంది.. అందరూ కలిసి నచ్చచెప్పండి అని నేనే చెబుతాను. నువ్వు చెప్పగానే అందరూ నమ్ముతారు అనుకుంటున్నావా...
పిచ్చి.. విశి.. ఎవరు ఏడుస్తూ మాట్లాడుతారో వాళ్ళది నిజం అనుకునే మాయలోకం..
వీళ్ళ సంభాషణ వింటుంటే.. సూర్యకి కోపం వస్తుంది. అక్కడున్న స్టాప్ కి చెప్పి... అక్కడ ఒక అమ్మాయిని హెరాస్ చేస్తున్నారు.. చూడండి అని పంపిస్తాడు..
స్టాఫ్ వచ్చి.. హలో మిస్టర్ అమ్మాయిని వదలండి.. తను నా లవర్.. కాదు భయ్యా.. ఇతను ఏడిపిస్తున్నాడు. మాకు విశిష్ట గురించి బాగా తెలుసు. మాతో పాటు వర్క్ చేస్తుంది. మీరు మర్యాదగా వదిలితే మంచిది. లేదు అంటే సెక్యూరిటీ ఆఫీసర్లని పిలుస్తాను.
ఆలోచించుకో.. విశి అని వెళ్ళిపోతాడు. థాంక్స్ భయ్యా... జాగ్రత్త విశి అని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే ముగ్గురు అక్కడికి వస్తారు. సూర్య మాత్రం చాలా కోపంగా ఉంటాడు.
వాళ్ళ ముగ్గురిని చూడగానే కన్నీళ్లు తుడుచుకుని.. హాయ్ సార్ అంటుంది. సూర్య మాత్రం సీరియస్ గానే ఉంటాడు.
ఏమైంది.. సార్ అంతా కోపంగా ఉన్నారు. ఏమీ లేదు బాబి.. ఏదో వర్క్ టెన్షన్.. అవునా... వైభవ్ నీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వు..
ఎందుకు బాబి.. పంపించు.. సరే అని సెండ్ చేస్తాడు.
వెంటనే అకౌంట్కి 1 లాక్ పంపిస్తుంది. ఎందుకు బాబి ఇంత అమౌంట్ పంపించారు.
ఈరోజు నీ వల్లే నాకు అంత అమౌంట్ వచ్చింది. ఫుల్ అమౌంట్ ఇవ్వలేను కదా.. అందులో టెన్ పర్సెంట్ ఇస్తున్నాను.
ఎవ్రీ టైం నా వర్క్ లో 10% నీకే.. సాలరీ కన్నా ఇదే బాగుంది కదా అని శ్రీకర్ అక్కడ వాతావరణాన్ని తేలిక చేస్తాడు.
సూర్య కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. విశిలో ఉన్న ఆ స్వచ్ఛతే సూర్య ని ఎప్పుడూ లాగుతూ ఉంటుంది.
బాబీ రేపు మరి 10:30 టు 11:30 అంటే... మరి కాలేజీలో ఉంటావు కదా.. ఎలా.. మాది లాస్ట్ సెం కదా... సెల్ఫ్ వర్క్ ఎక్కువ ఉంటుంది.
సో ఆ టైం మేనేజ్ చేస్తాను. మరి నన్ను ఆలో చేయరు కదా.. నువ్వు హ్యాండిల్ చేసుకుంటావా.. సూర్య వైపు చూస్తుంది.
నాకు రేపు అర్జెంట్ వర్క్ ఉంది. లేకపోతే నేను విశికి తోడుగా ఉండేవాడిని. శ్రీకర్ నువ్వు హ్యాండిల్ చేయి. వర్క్ అయ్యే వరకు అక్కడే ఉండు..
సరే బావ. విశి ముగ్గురిని అలాగే చూస్తూ ఉంటే.. ఏమైంది బాబీ అలా చూస్తున్నావు.. ఏమీ లేదు.. మీరెవరో... నేనెవరో...
కానీ పరిచయమైనప్పటి నుంచి మీ ముగ్గురు నన్ను చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. అది ఏమిటో అన్నది అర్థం కావడం లేదు అలా అని ఈ బంధాన్ని నేను తప్పుపట్టను.
ఎందుకంటే కలిసిన రోజు నుంచి కూడా మీ ముగ్గురు నాతో చాలా స్వచ్ఛంగా ఉన్నారు. థాంక్యూ ..
ఇదిగో బాబి.. థాంక్యూ అని చెప్పి మన మధ్యన దూరాన్ని పెంచకు. చెప్పాను కదా నువ్వు తప్పిపోయిన మా బాబీ లాగా కనిపిస్తున్నావు.
శ్రీకర్ వెంటనే... అవును విశి నిన్ను చూస్తుంటే మా చెల్లె గుర్తుకు వస్తుంది. ఏమంటావు బావ అని కన్ను కొడతాడు. సూర్య ఏమి సమాధానం చెప్పాలో తెలియక..
సరే ఇప్పటికే లేట్ అయింది. అమ్మ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు పదా అని చెయ్యి పట్టుకుని తీసుకు వెళ్లిపోతాడు.
చూసావా బావ మనిద్దరం అలా చెబుతూ ఉంటే అన్నయ్యకి ఎంత కోపం వస్తుందో... కానీ బయటపడడం లేదు.
విశి ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. బైక్ దిగి బాయ్ సార్ అంటే.. అలాగే చూస్తూ ఉంటాడు. నాతో ఏమైనా చెప్పాలా.. జాగ్రత్త..
అలాంటి ఎదవలు పట్టుకున్నప్పుడు వదులు వదులు అని కాదు... చేతులు పట్టుకుంటే.. కాళ్లు ఉన్నాయి కదా...
సెంటర్ పాయింట్ లో ఒక కిక్ ఇచ్చామంటే వాడే మూసుకుని కూర్చుంటాడు..
మన చుట్టూ ఆస్తమాను జనం ఉండరు కదా.. అని బైక్ ని రివర్స్ చేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళుతున్న సూర్యనే చూస్తూ ఉండిపోతుంది.
ఇంటికి వెళ్లిన సూర్య కి కోపం తగ్గదు. వెళ్లి షవర్ కింద నిలబడతాడు. ఆ చన్నీళ్లలో తడిసి తడిసి కాసేపటికి శాంతిస్తాడు.
డ్రెస్ చేంజ్ చేసుకుని విక్రమ్ దగ్గరకి వెళతాడు. విక్రమ్ చేస్తున్న వర్క్ ని పక్కన పెట్టి.. ఏమైందిరా అంత డిస్టర్బ్డ్ గా ఉన్నావు..
రేపు నేను ఆఫీస్ కి వస్తాను.. ఏమంటున్నావు రా.. అవును వస్తాను.. నా కోడల్ని వాడు ఏమైనా చేశాడా.. జరిగింది చెబుతాడు.
వాడికి ట్రీట్మెంట్ మామూలుగా ఇవ్వడం లేదు కదా.. మన ఇంటి ఆడవాళ్ళ జోలికి వస్తే ఏం జరుగుతుందో వాడికి రేపు మనం చూపిద్దాము.
నువ్వు ఎవరో తెలిస్తే ప్రాబ్లం కదా.. వాడికి నేను కనిపించను.. కానీ వాడి వెనక ఒక తోక ఉంటుంది కదా దానికి ఇస్తాను..
అర్థమయింది... రాంగ్ రూట్లో వెళ్ళి గొప్పవాడు అవ్వాలి అనుకున్నా గౌతమ్ కి రేపటి నుంచే కటింగ్ పడుతుందన్నమాట..
ఉంచుకున్నది పోయే... కట్టుకున్నది పోయే అన్నట్టుగా ఉంటుంది గౌతమ్ పరిస్థితి..
వైభవ్ సంతోషంగా పెదనాన్న అనుకుంటూ పరిగెత్తుకొస్తాడు. ఏమైందిరా.. నాది ఈ ఒక్కరోజు శాలరీ ఎంతో తెలుసా.. వన్ లాక్ అంటాడు.
అవునా అంత అమౌంట్ ఎలా రా.. బాబీకి ఈరోజు కాంట్రాక్టులో 10 లాక్స్ వచ్చాయి. తను ప్రతి వర్క్ లో నాకు 10% ఇస్తుంది.
చెప్పాను కదా.. నా కొడుకులు టాలెంటెడ్ అని.. కాకపోతే నీలో ఇంకా చిన్నపిల్లాడి లక్షణాలు ఉన్నాయి. చూస్తూ ఉండు మీ వదినతో కలిసి నువ్వు ఒక టాప్ బిజినెస్ మాన్ అయిపోతావు.
గౌతమ్ రేపటి నీ పరిస్థితి ???
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)