17-04-2026, 08:48 AM
Part - 44
విశి తో మాట్లాడావా.. వర్క్ ఎప్పుడు ఇస్తానంది. మనం విక్రమ్ సార్ ని కలవాలి కదా... ఎప్పుడు వెళదాము. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చావా...
హిమని వదిలి సోఫాలో కూలబడతాడు. నో.. నా ఉద్దేశ్యం అది కాదు. నిన్ను చూడాలనే వచ్చాను. బట్ ఎలాగా కలిసాము కదా అని బిజినెస్ విషయం మాట్లాడుతున్నాను. నాకు నీ తర్వాతే ఏదైనా సరే...
హిమని వళ్ళోకి లాక్కుని.. అందుకే బేబీ నువ్వంటే నాకంత ఇష్టం. ఆ విశి కి ఒళ్ళు అంతా పొగరే..టాలెంట్ ఉన్న వాళ్లకి పొగరు ఎక్కువ ఉంటుంది.
అలా ఎందుకు అనుకుంటున్నావు నాకు టాలెంట్ ఉంది.. అందము ఆస్తి అన్ని ఉన్నాయి. కానీ నేను అణుకువగా ఉండడం లేదా..
ఆ విశిలాంటి వాళ్ళు ఎక్కడో కొంత మంది ఉంటారు. అందరినీ అలా చూడకూడదు. నువ్వు అన్నది కూడా నిజమే బేబీ అని బుగ్గ నిమురుతూ ఉంటాడు.
తాగిన మైకంలో హిమ.. విశిలాగా కనపడుతూ ఉంటే ఎలాగైనా విశిని సొంతం చేసుకోవాలి అన్న ఆలోచనతో ఉండి దగ్గరగా వెళ్లి పెదవులు అందుకోబోతాడు.
గౌతమ్ ఏం చేస్తున్నా నువ్వు స్పీడ్ గా ఒళ్ళో నుంచి లెగుస్తుంది. ఏమైంది బేబీ ఇప్పుడు దాకా బానే కోపరేట్ చేస్తావు కదా.. ఇవన్నీ పెళ్లయిన తర్వాత..
ఇలాంటివి తెలిస్తే డాడీ కోప్పడతారు. నువ్వు రాంగ్ మూడ్ లో ఉన్నావు మళ్ళీ కలుద్దాం బాయ్ అని వెళ్ళిపోతుంది. వెళుతున్న హిమని చూసి తల పట్టుకుంటూ..
ఛ అనుకొని... నా వర్క్ అయ్యే వరకు హిమతో జాగ్రత్తగా ఉండాలి. నేను నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి అంటే హిమని లైన్ లో పెట్టుకోవడమే...
ఎప్పుడైనా నా చేయి జారిపోతుంది అనిపిస్తే లొంగ దీసుకోవడమే. ప్రస్తుతానికి మాత్రం గుడ్ బాయ్ లాగానే ఉండాలి అని మంచం మీద పడతాడు .
వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి వెళదామా అంటే సరే అని చెప్పి బయలుదేరుతారు. ఏమైంది బేబీ అంత సైలెంటుగా ఉన్నావు అని హిమా ఫాదర్ అయిన రమేష్ అడుగుతాడు.
నథింగ్ డాడ్.. ఈ డాడీ తో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటావు.. కమాన్ బేబీ . ఎనీ ప్రాబ్లం.. విశిష్ట కి నిజం తెలిసింది.
విశిష్ట.. ఎవరు.. అదే గౌతమ్ కాలేజ్ లో లవ్ చేశాను అని చెప్పి వర్క్ చేయిపిస్తున్నాడు కదా. ఆ వర్క్ తోనే నేను ఫేమస్ అయ్యింది .
ఓ థట్ గర్ల్.. హ్మ్.. గౌతమ్ చీట్ చేశాడని తెలిసిన దగ్గరనుంచి దూరంగా ఉంటుంది. ఈ అమ్మాయి కాకపోతే ఇంకొకళ్ళు ఇస్తారు.
తన కోసమే చూడాల్సిన అవసరం ఏముంది బేబీ. నో డాడ్ తన వర్క్ లో స్పార్క్ ఉంటుంది. దానితోనే నాకు ఒక క్రేజ్ వచ్చింది..
ఆ స్పార్క్ వేరే చోట దొరుకుతుంది అన్న హోప్ లేదు. వి.జె.స్ కంపెనీతో మాకు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో డైరెక్ట్గా విక్రమ్ నన్ను ఇంటర్వ్యూ చేస్తాను అన్నారు.
ప్రీవియస్ వర్క్ గురించి అడిగితే నేను దొరికిపోతాను. దొరకకుండా ఉండాలి అంటే ఆ విశిష్ట నాకు ఆ వర్క్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి హౌ టు హ్యాండిల్ అన్నది చెప్పాలి.
బట్ ఇప్పుడు దాకా ఈ గౌతమ్ ఏమీ చేయకుండా బాటిల్ ఎత్తాడు. గౌతమ్ వల్ల కాకపోతే నేనున్నాను కదా.. డైరెక్ట్ గా నేనే హ్యాండిల్ చేస్తాను. ఎంత మని కావాలన్నా ఇచ్చేద్దాము .
మనం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే కరెక్ట్ గా ఉండదు. ఇది గౌతమే హేండిల్ చేయాలి. మన సపోర్టు లేకపోతే గౌతమ్ నథింగ్.
సపోర్ట్ కోసం ఏమైనా చేస్తాడు..సపోర్టుతో పాటు ఆ విశిష్ట వర్కు కూడా చాలా ఇంపార్టెంట్.. ఎప్పుడైతే విశిష్ట స్టాప్ చేసిందో అప్పటినుంచి గౌతమ్ కి వచ్చే ప్రాజెక్ట్ కూడా తగ్గిపోయాయి.
వాళ్ళు ఆఫీసులో ఉన్న అర్క్ టెక్చర్స్ అంతా క్వాలిటీ ఇవ్వలేకపోతున్నారు. సో కాంపిటీషన్ పెరుగుతుంది. ఒక అమ్మాయినే హ్యాండిల్ చేయలేని వాడు రేపు మనతో కలిసి ఎలా ట్రావెల్ చేయగలుగుతాడు కాబట్టి పడనివ్వండి..
నువ్వేమీ అడ్వాన్స్ అవలేదు కదా బేబీ.. అలాంటి వాడితో అడ్వాన్స్ అవడమా.. నాకు ఎంతవరకు ఉపయోగపడతాడో అంతవరకే నొక్కుతున్నాను.
అడ్వాన్స్ తీసుకోవాలని చాలా తాపత్రయ పడుతున్నాడు. బట్ ఇక్కడ ఉన్నది ఎవరు... హిమ. హేమతో గేమ్స్ ఆడడం అంటే వాడు చావు వాడు కోరుకున్నట్టే..
బట్ కేర్ఫుల్ బేబీ. ఇలాంటి వేస్ట్ గాళ్ళు ఎలాంటి పనులు చేయడానికి అయినా వెనకడుగు వేయరు. నేను కూడా రేపు ఫోన్ చేసి గౌతమ్ కి ప్రెషర్ ఇస్తాను.
ఉదయమే గౌతమ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే బద్దకంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటే...హలో గౌతమ్ నేను రమేష్ ని మాట్లాడుతున్నాను.
వెంటనే నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయి చెప్పండి అంకుల్.. ఏమిటి ఇంకా లెగలేదా.. రాత్రి తాగింది దిగలేదా.. అలాంటిదేమీ లేదు. దేనికో ఫోన్ చేశారు.
రేపే అనుకుంటా మీకు వి. జె. స్. కంపెనీతో మీటింగ్. అవును అంకుల్. మరి ఎంత వరకు వచ్చింది నీ ప్రోసెస్. రేపు అమ్మాయి పేరుకి ఏదయిన డామేజ్ జరిగితే మాత్రం నేను అసలు ఊరుకోను.
నాకు నా బేబీ తరువాతే ఎవరైనా... నా బేబీ నిన్ను ఇష్టపడింది అన్న ఒకే ఒక్క రీజన్ తో నా రేంజ్ కి సరిపోకపోయినా మీ మ్యారేజ్ కి ఒప్పుకున్నాను.
అది కూడా నువ్వు నాకు ప్రామిస్ చేసావు అనే.. నా కూతురి ని వరల్డ్ లోనే టాప్ అర్క్ టెక్చర్ గా నిలబెడతాను అని.. ఇప్పుడు దాకా నువ్వు ఏం చేసావో నాకు కనపడటం లేదు.
అదేంటి అంకుల్ అలా మాట్లాడుతారు. లాస్ట్ టైమే కదా హిమా వర్క్ ని ఎగ్జిబిషన్ పెట్టి స్టాల్ ఓపెన్ చేశాను. అది నా కూతురు కోసం చేసావా.. నీ బిజినెస్ ఎస్టాబ్లిష్ కోసం చేసావో తెలియనంత ఫుల్ ని కాదు.
రేపు ప్రోగ్రాం మాత్రం సక్సెస్ అవ్వాలి. ఇది చెబుదామనే ఫోన్ చేశానని పెట్టేస్తాడు. నైల్ పాలిష్ వేసుకుంటున్న హిమ.. ఏమంటున్నాడు డాడ్.
ఏదో పిచ్చివాగుడు వాగుతున్నాడు. అయినా వాడిని నువ్వెలా లైక్ చేశావు బేబీ. కమాన్ డాడ్.. నా గురించి తెలిసి కూడా మీరు ఎలా అనుకుంటున్నారు.
ఒకసారి అనుకోకుండా వాడి దగ్గర కన్స్ట్రక్షన్స్ సంబంధించిన ప్రింట్స్ చూశాను. చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది.
వాడే చేశాడు ఏమో...మనకి బాగా యూస్ అవుతాడు అనుకున్నాను. బట్ మాటల్లో పెట్టిన తర్వాత గాని తెలియలేదు వాడు గర్ల్ ఫ్రెండ్ వర్క్ అని .
సో మన స్టేటస్ చూపించేటప్పటికి ఆటోమేటిక్ టర్న్ అయ్యాడు. నేను వాడుతున్నాను. జాగ్రత్త బేబీ. రేపు మన కన్నా ఇంకా బాగా యూస్ అయ్యే వాళ్ళు దొరికితే నిన్ను వదిలేస్తాడు కూడా.. వాడికి అంత సీన్ లేదు. ఎప్పుడో నా గ్రిప్ లోకి వచ్చాడు.
గౌతమ్ ఫోన్ పెట్టేసి తల పట్టుకు కూర్చుంటాడు. విశిష్ట నువ్వు నాకు ఈ రోజు ఎలాగైనా దొరకాలి అని... హాయ్ విశిష్ట.. ఈరోజు ఈవినింగ్ కలుద్దాము.
నీ వర్క్ అవ్వగానే అక్కడే మీట్ అవుదాము. క్యాబిన్ కూడా బుక్ చేశాను అని మెసేజ్ చేస్తాడు. మెసేజ్ రిసీవ్ అయినట్టుగా ఉండదు. బ్లాక్ అయినట్టుగా చూపిస్తూ ఉంటే విశిష్ట అని పళ్ళు నూరుతూ..
వైభవ్ నెంబర్ కి మెసేజ్ చేస్తాడు. వైభవ్ అది చూసి పర్వాలేదు గురుడు నాకు మెసేజ్ చేశాడు అనుకుని ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి.
మేడం ఫ్రీగా ఉన్నారా లేదో కనుక్కొని చెబుతాను అని రివర్స్ మెసేజ్ పెడతాడు. అది చూసి గౌతమ్ ఫ్రస్టేషన్ పీక్ లోకి వెళుతుంది.
ఇంకా వర్క్ స్టార్ట్ చేయకుండానే వీళ్ళంత బిల్డప్ ఇస్తున్నారు అసలు స్టార్ట్ చేస్తే ఇంకా దొరుకుతుందా.. ఈ లోపే నా గ్రిప్ లోకి తెచ్చుకోవాలి అనుకుని ఓకే అని పెడతాడు.
ఫైవ్ మినిట్స్ తర్వాత వైభవ్... మేడం నైట్ షార్ప్ ఎయిట్ కి కలుద్దాం అన్నారు. లేట్ అవుతే మాత్రం మేడం దొరకరు అని పెడితే.. నేను 7:30 కే అక్కడే ఉంటాను అని పెడతాడు.
ఓకే.. ఆల్ ద బెస్ట్ అని మెసేజ్ చేస్తే.. నాకు ఆల్ ద బెస్ట్ పెడతారు ఏంట్రా.. ఇది నేను నీకు ఇచ్చే ప్రాజెక్ట్.. మీకు చెప్పాలి..
చూద్దాం అని గౌతమ్ సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన సూర్య అలర్ట్ గా ఉంటాడు.
నైట్ విశి వర్క్ ఫినిష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకోనేటప్పటికీ వైభవ్ వస్తాడు. హాయ్ బాబి అంటే.. బాబీ నా... పోనీ వదిన.
హలో మనం ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు ప్రొఫెషనల్ గా మాట్లాడుకోవాలి. మన వర్క్ అయిపోయిన తర్వాత ఎలా పిలుచుకున్న పర్వాలేదు కదా..
నువ్వు చాలా ఫన్నీగా మాట్లాడతావో తెలుసా? దేవాసార్ ప్రొఫెషనల్ గా మాట్లాడతారు. మీ ఇద్దరికీ ఎలా రిలేషన్ ఉందో అర్థం కావడం లేదు.
దేవా సార్ నాకు బ్రదర్ లే.. అవునా ఎప్పుడూ చెప్పలేదు. ముందు ముందు ఇంకా తెలుసుకోవాల్సింది ఉందలే బాబి. అదిగో..ఇంకా మన ప్రొఫెషనల్ గా స్టార్ట్ అవ్వలేదు.
నిన్ను చూస్తుంటే మా చిన్నప్పుడు తప్పిపోయిన మా బాబీ లాగా కనిపిస్తున్నావు. అవునా మీ బాబి తప్పు పోయిందా అని బాధగా అడుగుతుంది.
అవును బాబి చాలా క్యూట్గా చబ్బీ గా ఉండేది. ఎక్కడ తప్పిపోయింది. అన్నవరంలో. అన్నవరంలోనా అని కొంచెం దిగులుగా మాట్లాడుతుంది.
నీకేమైంది బాబి.. ఒక్కసారిగా అలా డల్ అయిపోయావు. అన్నవరం అనగానే నాకు మా నాన్న గుర్తొస్తారు. మా నాన్నగారు ఉన్నన్ని రోజులు నా ప్రతి పుట్టినరోజుకి అన్నవరం తీసుకు వెళ్లేవారు.
ఇప్పుడు మాత్రం ఏమైంది బాబి నేను తీసుకువెళతాను కదా.. సూర్య మాస్క్ తో వస్తాడు. మీరేంటి సార్ ఇలాగా.. లైట్ గా కోల్డ్ చేసింది.
ఏమిటి మీ ఇద్దరూ డిస్కషన్. ఆ గౌతమ్ వచ్చినట్టున్నాడు. ఇంకా 10 మినిట్స్ టైం ఉంది అన్నయ్య..
సోరి సార్ మీ పెయిన్ నాకు తెలియలేదు. దేని గురించి.. మీ బాబీ తప్పిపోయారు అంట కదా.. బాబి అని వైభవ్ వైపు చూస్తే వైభవ్ నాలిక కరుచుకుంటాడు.
బాబి నాకు... మా అన్నయ్యకి మరదలు అవుతుంది అవునా అంటే సరే తర్వాత మాట్లాడుకుందాం ముందు మీరు ఇద్దరు వెళ్లండి అని పంపిస్తాడు.
ఈ బాబీ మరదలు గోల ఎక్కడికి తీసుకు వెళుతుందో ??
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)