16-04-2026, 08:18 AM
Part - 90
రుద్ర ఆ ఉత్తరం చదివి మయూరివైపు చూస్తాడు. జీవం లేని మయూరి శరీరాన్ని చూస్తే ఆ నిమిషం బాధగా అనిపిస్తుంది.
నీలో నిజంగా ఇంత మార్పు వచ్చిందా.. మారినదానివి ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు అని ధీరజ్ వైపు చూసి చిన్న మామని రమ్మని చెప్పు.
ఇక్కడకు అవసరమా...బ్రతికుండగానే ఎవరికైనా ప్రేమ.. పగ ఎక్స్ట్రా ఎక్స్ట్రా.. ఇక చనిపోయిన ఆ దేహానికి వీటి తో ఏమి పని.. చెప్పు.
ఫోన్ చెయ్. సరే అని ధీరజ్ పక్కకు వెళ్లి ఫోన్ చేసి విషయం చెబుతాడు.. దేవేంద్ర రావడానికి ఇష్టపడక పోతే రుద్ర రమ్మని చెప్పాడు అంటే.. సరే అని తప్పక వస్తాడు.
మయూరి దేహాన్ని గదిలో నుంచి బయటికి తీసుకువస్తారు. బయట పడుకోబెడతారు. బృందావనం మొత్తం అక్కడికి వస్తుంది.
దేవేంద్ర.చూస్తాడు అంతే.. అనసూయ.. లక్ష్మీ భుజం మీద చెయ్యి వేస్తోంది.. చూసావా వదిన ఎంత పని చేసిందో... ఏడుస్తూ ఉంటే ఊరుకో.. లక్ష్మి అని ఓదారుస్తుంది.
దేవేంద్ర రుద్ర కోసం చూస్తూ ఉంటే... ఇక్కడ అని చేయి ఊపుతాడు. ఎందుకు రమ్మన్నావురా.. ఈ ఉత్తరం చదువు.. ఇప్పుడు అవసరమా.. అవసరమే.
సరే అని ఉత్తరం చదువుతాడు. నీకు ఏమీ బాధగా లేదా... బాధపడడానికి తను ఏమైనా నాకు కావలసిన మనిషా.. కాదు కదా...
రోజు కొన్ని వేలమంది చనిపోతున్నారు. అలా చనిపోయిన వాళ్ళ అందరి కోసం నేను బాధపడుతూ కూర్చుంటానా.. నీకు వాళ్ల మీద కోపం ఉంది అని తెలుసు మామ.
కాకపోతే ఇప్పుడు ఈ మనిషి మన మధ్యలో లేదు. ఆఖరి కోరిక తీర్చడం న్యాయం కదా.. నన్ను ఏం చేయమంటావు.
ఆ మనిషికి నేను తలకొరివి పెట్టాలా.. అది జరిగిన పని.
శేషాద్రి వచ్చి బ్రతిమాలుతాడు అయినా దేవేంద్ర ఏమి మాట్లాడాడు. లక్ష్మి దేవేంద్ర మందు మోకాళ్ళ మీద కూర్చుని నా కూతురు ఆఖరి కోరిక తీర్చు దేవేంద్ర..
అత్తయ్య ఏమిటిది అని వెనక్కి జరిగితే...
నా కూతురు నీ విషయంలో చేసింది తప్పే.. ఇప్పుడు అది ప్రాణాలతో లేదు. నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమతో ఒక ఉన్మాదిలాగ తయారయ్యింది. మనిషి మారి ఈ లోకాన్ని వదిలేసినప్పుడు కూడా నీ గురించే ఆలోచించింది. నీ చేతులు మీదగా వెళ్లాలి అని కోరుకుంటుంది.
రాఘవేంద్ర కూడా నచ్చ చెప్పడానికి చుస్తే.. మీరు కూడా ఏమిటి.. నీకు తెలియని ఒక అనాధ శవం నీ ముందు ఉంది అనుకో..
దానికి అంత్యక్రియలు చేయడం అంటే భగవంతునికి సేవ చేయడం లాంటిదే... ఇప్పుడు మయూరి నీకు తెలిసిన మనిషిగా కాకుండా ఒక తెలియని అనాధ శవం అనుకుని చూడు..
ఎవరు ఎలా చెప్పినా దేవేంద్ర మనసు అంగీకరించలేకపోతోంది.
23 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన దేవేంద్ర గుండెలో ఇంకా పచ్చిగానే ఉంది.
తన భార్యను చంపి, తనను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని వెంటపడిన మయూరి… ఆ పేరు వినగానే రక్తం మరిగిపోయేంత ద్వేషం.
ఆమె ముఖం అతనికి శత్రువు గుర్తుగా, తన జీవితాన్ని నాశనం చేసిన చీకటి గుర్తుగా మాత్రమే కనిపించేది.
ఇన్ని సంవత్సరాల తర్వాత మారాను.. నన్ను క్షమించు...
నా ఆఖరి కోరిక తీర్చు ఎలా ఒప్పుకునేది
మయూరి రాసిన ఆ అక్షరాల్లో వేరే రూపం ఉంది—
నేను చేసిన పాపానికి ఆఖరి నిమిషం వరకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను .
జీవితం మొత్తం నన్ను తినేసింది.
నిన్ను క్షమించమని అడగలేను, కానీ… నా అంతిమ కోరిక ఒక్కటే… నా తలకు నువ్వే కొరివి పెట్టాలి. అదే నాకు శాంతి ఇస్తుంది.”
ఆ ఉత్తరం చదివిన క్షణం నుంచి దేవేంద్రలో కొత్త తుఫాను మొదలైంది.
“ఇది ఏ న్యాయం? నన్ను నాశనం చేసినవాళ్లకు నేను గౌరవం ఇవ్వాలా?
ఆమె చేసిన క్రూరత్వానికి ఇంత తేలికైన ముగింపు కావాలా?” అని గుండె అరణ్య రోదన చేసింది .
అయినా చుట్టూ ఉన్నవాళ్లందరూ అదే చెబుతున్నారు—
“చనిపోయిన మనిషి ఆఖరి కోరికను తీర్చడం పెద్దమనసు, అది నీ గౌరవాన్ని తగ్గించదు, పెంచుతుంది” అని.
కానీ దేవేంద్ర హృదయం మాత్రం మరో వాదన చేస్తోంది—
“నా భార్య ప్రాణం తీసిన ఈమెకు తలకొరివి పెట్టడం అంటే, నేను నా ప్రేమని, నా బాధని మోసం చేసినట్టే కాదా?”
అతని మనసు రెండుగా పగిలింది.
ఒకవైపు బాధ్యత, మర్యాద, సమాజం చెప్పే న్యాయం.
మరోవైపు తన గుండె లోతుల్లో రగిలే ద్వేషం, ద్రోహపు జ్ఞాపకం.
అతని చేతులు కొరివి వైపు కదలడంలేదు, వెనక్కి తగ్గడంలేదు.
ఆ క్షణం అతనికి యుద్ధరంగంలా అనిపిస్తోంది—
బయట ఎవరూ చూడని ఒక యుద్ధం, తనలో తానే సాగుతున్న రణరంగం.
రుద్ర దేవేంద్ర భుజం మీద చేయి వేసి నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను చినమామ.. కానీ కాలం మన కోసం ఆగదు కదా..
అందరూ బలవంతం చేసి అయినా సరే నీతో ఈ పని చేయిపిస్తారు. అంతసేపు ఇక్కడ ఉండి ఈ మనుషులను చూడడం కన్నా రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని కార్యక్రమం జరిపించేయడం ఉత్తమం కదా...
నాకిష్టం లేకపోయినా మీ అందరి కోసం చేస్తున్నాను. అది ఒక్క తలకొరివి పెట్టడం మాత్రమే. మిగిలిన కార్యక్రమాలు చేయమంటే మాత్రం నా వల్ల కాదు. చెయ్యను కూడా..
అవసరం లేదు మామ.. తాతయ్య చెప్పినట్టు ఒక అనాధ శవం అనుకుని నీ పనులు నువ్వు చెయ్యి...
దేవేంద్ర కి ఇష్టం లేకపోయినా మొక్కుబడుగా కార్యక్రమం పూర్తి చేస్తాడు. ఇన్ని జరుగుతున్న నాగేంద్ర మాత్రం ఏమీ మాట్లాడకుండా రాయిలాగా ఉండిపోతాడు.
మిగిలిన కార్యక్రమాలు అన్ని శేషాద్రి చూసుకుంటూ ఉంటాడు. ప్రభాకర్ కూడా సాయం చేస్తాడు.
నాగేంద్రని ఎవరూ పలకరించరు... పట్టించుకోరు.
నిశి రాత్రిలో కూతురి ఫోటో ముందుకు వెళ్లి నిలబడతాడు. ఫోటోని తడుముతూ నేనే నీ జీవితాన్ని నాశనం చేశానా.. అని మొదటిసారిగా నిజమైన బాధని చూస్తాడు.
ఆస్తి కోసం... నేను కోరుకున్న విధంగా జరగ లేదు ఆ కుటుంబం పైన పగ పెంచుకున్నాను...
స్వంత కూతురినే కూడా కత్తిలా తయారు చేశాను.
నిండు గర్భిణీ అయినా మేనల్లుడి భార్యని చంపించి..
పురిటికందుని దూరం చేసిన పాపం ఇంత భయంకరంగా ఉంటుంది అని తెలుసుకోలేకపోయాను.
కానీ పగతో పెంచుకున్న నా కూతురే చివరికి
నా కుట్రల్లో చిక్కుకొని మరణించినప్పుడు గాని నాకు తెలియలేదు. కన్న కూతురు దూరం అవుతే ఆ బాధ ఎలా ఉంటుందో..ఆ తండ్రి గుండె ఎలా పగిలిపోతుందో అని...
నా ఆస్తి కోరికల కోసం, నా పగ కోసం
నేను నా రక్తాన్నే త్యాగం చేశానా?
నేను తండ్రినా లేక రాక్షసుడినా?
అని తలపట్టుకొని విలపించాడు.
నేను కోరుకున్న విధంగా జరగలేదు అని.. నా పగ తీర్చుకోవడానికి సొంత చెల్లిని వాడుకొని.. చెల్లి సంసారాన్ని చిన్నాభిన్నం చేశాను. చెల్లి సంసారం పాడైపోయిన ఆ ఇల్లు దుఃఖంలో మునిగింది అని గర్వంగా ఫీలయ్యాను.
కానీ ఆ పాపమే నా స్వంత చేతులతోనే కూతురి చావుకి కారణం అయ్యేలాగా చేసి నేను తీర్చలేని పశ్చాత్తాపంగా మిగిలిపోయింది.
ఇప్పుడు నాగేంద్ర కళ్ల ముందు ఒకే ఒక జ్ఞాపకం—
తన చిన్నప్పటి కూతురు
“నాన్నా… నువ్వు నా హీరో వి ” అని చెప్పిన రూపమే.
కానీ ఆ హీరోనే రాక్షసుడై,
తన చిన్నారిని తానే మింగేశాడనే శాపంతో
జీవించి ఉండడమే నాగేంద్రకి శిక్ష అయింది.
ఎలాంటి పరిస్థితి వచ్చినా మీ వెనక నేనున్నాను.. నా ధైర్యం మీరు. మీ బలం నేనవుతాను అని చెప్పిన కూతురిని పగకి బలి ఇచ్చి నా బలాన్ని నేనే కోల్పోయాను.
నేను కూడా నీ దారిలో వచ్చి నిన్ను క్షమాపణ అడగాలని ఉంది. కానీ నాలాంటి వాడికి చావు అంత తొందరగా రాకూడదు.
నీ చావు కి కారణంమైన.. నేను.. ప్రతిరోజు నీ సమాధిని చూస్తూ బ్రతికి ఉన్నంతకాలం కుళ్ళి కుళ్ళి చస్తూ నరకం అనుభవించాలి.
ఇదే ఈ తండ్రి పాపానికి శిక్ష...
ఆలోచిస్తున్న రుద్ర దగ్గరకి శాంభవి వచ్చి ఏమి ఆలోచిస్తున్నారు. హ్మ్.. ఇలా రా అని చేయిస్తాడు. రుద్ర చెయ్యి పట్టుకుని వచ్చి పక్కన కూర్చుంటుంది.
చెప్పండి. ఏం చెప్పాలి.. అదే ఏదో ఆలోచిస్తున్నారు కదా.. దాని గురించి..
మనం శోభనం ఎక్కడ చేసుకుందామా అని ఆలోచిస్తున్నాను. ఒక నెలలోనే నీతో పుల్లమామిడికాయలు తినిపించాలి అని ఫిక్స్ అయ్యాను. అవి ఏ మామిడికాయలా.. ఎక్కడినుంచి తెప్పించాలా అని ఆలోచిస్తున్నాను. ఏమంటావు...
రుద్ర వెటకారానికి గుర్రుగా చూస్తుంది. ఏమైంది పాప అలా చూస్తున్నావు. నచ్చలేదా.. నెలరోజులు అంటే ఎక్కువ.. మిమ్మల్ని అని చేతితో కొడుతూ ఉంటుంది.
అరె పాప కొట్టకు.. దెబ్బ తగులుతుంది. తగలాలనే కదా కొట్టేది. నేను చెప్పేది నాకు తగులుతుందని కాదు.. నీకు తగులుతుందని...
చూడు చేతులు ఎలా కందిపోయాయో.. మీకు అసలు నొప్పి లేదా.. శాంభవి నీ ఒళ్ళో కి లాక్కుని.. పువ్వు వచ్చి మీద పడితే ఎవరికైనా దెబ్బ తగులుతుందా...
అందులో ఏడు మల్లెలు ఎత్తు బరువు నా పెళ్ళాం.. నాదేమో జిమ్ బాడీ. ఇంకెలా తగులుతుంది చెప్పు అని బుగ్గలు పట్టుకుని లాగుతాడు.
చాల్లే మీ వెటకారాలు.. ఏదో అడగాలని వచ్చావు కదా అడుగు. మీ గొడవలో పడి అసలు విషయమే మర్చిపోయాను. ఇందాక ఏదో అడిగాను ఏమిటి అబ్బా... హ.. దేని గురించో సీరియస్ గా ఆలోచిస్తున్నారు.
ఏమిటది.. ఒళ్ళు కూర్చున్న భార్య నడుము చుట్టూ చేతులు వేసి.. భుజంపైన గెడ్డం పెట్టి రేపు రేపల్లె వెళుతున్నాను.
నాతో పాటు చినమామ కూడా వస్తున్నాడు. నాన్నగారు కూడానా.. అని భయంగా అడుగుతుంది.
ఎందుకు అంత భయపడుతున్నావు. భయం కాదు..ఇది అని చెప్పలేని అంటూ రుద్రా వైపు తిరిగి గట్టిగా హగ్ చేసుకుంటుంది.
నేను ఉన్నాను కదా భయపడకు. అంత సాఫ్ట్ గా డీల్ చేసి.. అందరినీ ఎక్కడికి తీసుకువస్తాను.
రుద్ర మాట నిలబెట్టుకుంటాడా...
కథ కొనసాగుతుంది......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)