16-04-2026, 08:17 AM
Part - 89
మయూరిలో వచ్చిన మార్పు కి అందరూ ఆశ్చర్యపోతారు.
ఇది నిజంగా మార్పా లేక నటన అని కూడా అనిపిస్తుంది. మనకెందుకులే... అనుకుని షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళతారు.
నాగేంద్ర కూతురు వెనకాల కోపంగా వెళ్లి మయూరి అని పిలిస్తే... చెప్పండి అని ముభావంగా అంటుంది. నువ్వు చేసింది ఏమిటి...
ఏమి చేశాను. నువ్వు దేవేంద్ర కూతురికి చీర పెట్టడం ఏమిటి.. క్షమించమని అడిగడం.. ముద్దు పెట్టుకోవడం.. నాకు తల తీసేసినట్టు ఉంది.
మీరు ఎందుకు అంత అవమానంగా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నా కూతురివేనా.. ఆ అనుమానం మీకెందుకు వచ్చింది.
కాకపోతే ఏమిటి.. మన శత్రువుని క్షమించమని అడిగడం.. అది అవమానం కాదా.. నాకు ఒక విషయం అర్థంకాక అడుగుతున్నాను.
శాంభవి కదా మనల్ని శత్రువుగా చూడాలి. అన్యాయంగా తన తల్లిని చంపేశాము. కానీ అవి ఏమి మనసులో పెట్టుకోకుండా నన్ను ఆశీర్వదించండి నా కాళ్ళకి దండం పెట్టింది.
శత్రువు అయినా కాళ్ళకి నమస్కారం చేస్తే సుఖీభవ అని ఆశీర్వదిస్తాము. మనలాగా కోపం.. అసూయ.. ద్వేషము లేకుండా స్వచ్ఛంగా ఉన్న శాంభవి ఆశీర్వదించమని అడిగితే...
ఎలా కాదనగలను. నువ్వు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు. శత్రువు నాశనం కోరుకోవాలి కానీ బాగు కాదు. నాకు ఎవరు శత్రువులు లేరు. నాకు నేనే శత్రువుని.
కూతురు మాట్లాడిన విధానానికి నాగేంద్ర ఏమీ మాట్లాడలేకపోతాడు. ఇక వెళదామా అన్న కూతురి మాటకి హ అని వెనకాలే బొమ్మలాగా వెళతాడు.
రుద్ర.. ఆనంద్ విహారీలను తీసుకొని శేషాద్రి ఇంటికి వెళతాడు. రుద్ర తో పాటు బావమరుదులు ముగ్గురు కూడా వెళతారు.
రుద్ర వెళ్లేటప్పటికి ప్రభాకర్ కూడా అక్కడే ఉంటాడు. రారు అనుకున్నాను... పరవాలేదు వచ్చారు. ఇది నా కూతురు జీవితానికి సంబంధించిన విషయం. రాకుండా ఎలా ఉంటాను.
కూతురు వైపు చూసి ఆనంద్ విహారీలు వైపు చూస్తాడు. ఆశ సైలెంట్ గా ఆనంద్ పక్కన నిలబడితే.. నిషా వెళ్లి విహారి పక్కన నిలబడుతుంది.
జంటలను చూసిన పెద్దవాళ్ళకి తృప్తిగా అనిపిస్తుంది.. రుద్ర లక్ష్మీ వైపు తిరిగి ఎలా ఉన్నారు మీ మనవళ్లు.. నీవు తీసుకొచ్చావు అంటే అన్ని విషయాలు మంచిగాఉన్నట్టే..
ఏంటండీ ప్రభాకర్ గారు ఏమీ మాట్లాడడం లేదు. అల్లుడు నచ్చలేదా...
ప్రభాకర్ లేచి నిలబడి రుద్ర దగ్గరికి వచ్చి..
కూతురి పెళ్లి అంటే ప్రతి తండ్రి కల. తాళిబొట్టు కట్టించే ఆ క్షణం కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తాడు. కానీ ఆ రోజు వచ్చింది… తనకే తెలియకుండా పోయింది. తన శ్వాస లాంటి కూతురి పెళ్లి గృహంలో తన నీడ కూడా లేకపోవడం నా హృదయం ఎంత గాయపడి ఉంటుంది ఆలోచించలేక పోయావా.
నా కూతురి ముక్కుపుడకలో తళతళలాడే ముత్యం తనకు కనబడలేదు, కానీ నా కూతురు అయ్యోమయ్య పరిస్థితి నా హృదయంలో మండే గాయమై రగులుతుంది.
‘నాకు తెలిసి ఉంటే నా కూతురి పెళ్లి ఇంటికి పండుగలా చేసేవాడిని… ఆమె అడుగులు పూల మీద నడిచేవి… కానీ నన్ను లేకుండా ఆ ఆనందం ఎలా పండగ అవుతుంది?
నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను రుద్ర..
“కూతురి పెళ్లికి తండ్రి అవసరం లేకపోతే… తండ్రి బతకడానికి కారణమేంటి?”
రుద్ర కూడా లేచి నిలబడి ప్రభాకర్ చేతిలో పట్టుకుని నేను చేసిన పెళ్లి మాత్రమే మీకు కనపడుతుంది. ఈ పెళ్లి నేను చేసి ఉండకపోతే ఆ నాగేంద్ర చేతులో ఈ ఆడపిల్లల ఇద్దరి జీవితం నాశనం అయిపోయేది.
మా నలుగురిని ట్రాప్ చేయమని వీళ్లిద్దరు పంపేవారు. వావి వరసలు కూడా పక్కన పెట్టేశారు. అంటే ఎంత నిచానికి దిగారో ఆలోచించుకోండి.
డ్రగ్ ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయలేదు. ఏదైనా జరిగే మీ అమ్మాయి జీవితం నాశనం అయ్యి ఉంటే.. అప్పుడు ఏం చేసేవారు.
లక్ష్మీ గారు, జ్యోతి గారిని దృష్టిలో పెట్టుకొని ఆనంద్, విహారీలతో వీళ్ళిద్దరి పెళ్లి చేశాను. వీళ్ళిద్దరూ ఏమీ తక్కువ కాదు. వాళ్ళకంటూ సొంత బిజినెస్ ఉంది. ఆస్తులు ఉన్నాయి.
నాకు ఒక ఆడపిల్ల బాధ తెలుసు ప్రభాకర్ గారు... మేము మా అత్తయ్యని కోల్పోయినప్పుడు నా భార్య మా ఇంటికి చేరే వరకు మేము ఆ లోటును చూస్తూనే ఉన్నాము.
ప్రభాకర్ రుద్రని కౌగిలించుకుని నీ గురించి తప్పుగా అనుకున్నందుకు క్షమించు..ఊరు తీసుకువెళ్లి మళ్లీ అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాను. నా అల్లుడు అని పరిచయం చేస్తాను.
కన్యాదానం చేయాలి అంటే పక్కన భార్య ఉండాలి కదా.. ఆ విషయం మాత్రం మన మధ్యన వద్దు.. మీ భార్య ఆరోజు నుంచి కుమిలిపోతుంది.
మా అత్తయ్య చావు నరకంలాగా ఉంది. ఇంటిలో నుంచి పంపించేస్తారురేమో అనుకుని వాళ్ళ నాన్నకి సహాయం చేసింది.
ఇంత దారుణం జరిగినప్పటి నుంచి తను కూడా పుట్టింటికి రాలేదు కదా... అది ఎందుకు గుర్తించడం లేదు..
సునంద రుద్ర కాళ్లు పట్టుకొని నన్ను క్షమించు. తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టే పిల్లలు బుద్దులు వస్తాయి. మీ పెంపకం గొప్పది. మీ పెద్దవాళ్ళు ఔన్నత్యం కలిగిన వాళ్ళు. అందుకే మీకు ఇంత గొప్ప సంస్కారం వచ్చింది.
ఒక ప్రాబ్లం సాల్వ్ అయ్యింది ఇంక మేము వెళ్తాము. జ్యోతి వచ్చి మొదటిసారి వచ్చారు. భోజనం చేసి వెళ్ళండి..అది మాత్రం అడగద్దు. తప్పుగా అనుకోవద్దు.
ఇంటిలో భోజనం చెయ్యకపోయినా పెళ్లి భోజనాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి . మా ఆనంద్ విహారిల కోసం అయినా చేస్తాము. అంతేనా ఏంటిరా అంటే.. అందరూ సంతోషంగా నవ్వుకుంటారు.
శేషాద్రి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఈ టైం లో ఎవరో అనుకుని లిఫ్ట్ చేస్తాడు. అటు పక్క నుంచి చెప్పింది విని ఎప్పుడు అని గట్టిగా అరుస్తాడు.
లక్ష్మీ కంగారుగా ఏమయిందిరా.. అమ్మ.. మనం ఆ ఇంటికి వెళ్ళాలి. నేను రానురా.. వెళ్లి తీరాలి. ఏమైందిరా అంత కంగారు పడుతున్నావు .
మన మయూరి ఇంకా చెప్పలేక పోతాడు.. మయూరీకి ఏమైంది రా.. ప్లీజ్ పదమ్మ అని రుద్ర వస్తారా అని అడుగుతాడు.
రుద్ర బావ మరదలు వైపు చూసి.. వస్తాం పదండి అని వెనకాలే వెళ్తారు. అందరూ నాగేంద్ర ఇంటికి వెళ్లేటప్పటికి నాగేంద్ర హాల్లో జీవం లేనట్టుగా కూర్చుని ఉంటాడు.
లక్ష్మీ మయూరి అని అరుస్తూ లోపలికి వెళుతుంది నాగేంద్రని చూసి నా కూతురు ఎక్కడ..మిమ్మల్ని అడిగేది... అలాగా బొమ్మలాగా కూర్చుంటారు ఏమిటి..
మీ పగ కోసం హాని తలపెట్టారా అని భయంగా అడుగుతుంది. నా కూతురికి నేను హాని తలపడతానా.. అని మాటలు కూడబలుక్కుని అడుగుతాడు.
ఇప్పుడు మీతో వాదించే ఓపిక నాకు లేదు. ఎక్కడ ఉంది. మయూరి గది వైపు చూస్తాడు. సర్వెంట్స్ అందరూ కూడా భయంగా నిలబడి ఉంటారు.
లక్ష్మీ భయంగా తలుపు దగ్గరికి వెళ్లి చూసి అక్కడే కూలబడిపోతుంది. సునంద జ్యోతి వెళ్లి లక్ష్మీని పట్టుకుని గదిలోకి చూసి ఏమేమి మాట్లాడలేకపోతారు.
శేషాద్రి స్పీడుగా వచ్చి గదిలోకి చూసి మాటరాని బొమ్మలాగా బిగుసుకుపోతాడు. చలనం లేకుండా కంటి నుండి కారుతున్న నీళ్లు తుడుచుకోవాలి అన్న ఆలోచన కూడా లేకుండా అలాగే నిలబడిపోతాడు.
ఏమైంది వెళ్ళిన వాళ్ళు వెళ్లినట్టే అక్కడే ఆగిపోయారు అని ధీరజ్ అడిగితే... రుద్రాకి అనుమానం వచ్చి మొదటిసారిగా మయూరి గది దగ్గరికి వెళతాడు.
గదిలో జీవం లేని మయూరిని చూసి ఇది నేను ఊహించిందే అని అనుకుంటాడు. కాకపోతే ఇంత తొందరగా అనుకోలేదు.
లక్ష్మీ కష్టంగా వెళ్లి కూతురుని ఒళ్లంతా తడుముతూ ఉంటుంది.. నిండుగా పట్టు చీర కట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకుని.. చేతిలో మంగళసూత్రం పట్టుకొని పక్కన దేవేంద్ర మైనపు బొమ్మ పెట్టుకుని ఉంటుంది.
అమ్మ మయూరి ఏమిటే ఇంత పని చేశావు అని కూతురు మీద పడి ఘల్లుమని ఏడుస్తుంది. నువ్వు మారాలి అని కోరుకున్నాను కానీ ఇలాంటి పని చేసి నా కడుపున చిచ్చుపెట్టావు కదే.. ఇంత మొండితనం ఏమిటి నీకు..
మయూరి చేతుల్లో ఒక లెటర్ కనబడుతుంది. రుద్రా వెళ్ళి ఆ లెటర్ తీసుకుని చదువుతూ ఉంటాడు.
నా ప్రాణంమైన దేవేంద్ర కి...
ఈ లేఖ నువ్వు చదివేసరికి నేను ఈ లోకంలో ఉండను. 23 సంవత్సరాలు… ఒక్కో రోజు శతాబ్దంలా అనిపించింది. నీ చూపు కోసం, నీ మాట కోసం, నీ నవ్వు కోసం నా గుండె ఎన్ని క్షణాలు మ్రోగిందో నాకు మాత్రమే తెలుసు. కానీ ఆ ప్రేమ నాకెప్పుడూ సొంతం కాలేదు.
నిన్ను కోరి పుట్టిన నా మనసు, నీకోసమే బతికిన నా జీవితం… చివరికి నువ్వు నాకు శత్రువయ్యాక కూడా ఆగలేకపోయింది.
నిన్ను పొందాలనే ఆతృత, నిన్ను కట్టిపడేయాలనే మూర్ఖత్వం… నన్ను మూర్ఖురాలని చేసింది. నీ జీవిత భాగస్వామిని నా వల్లే కోల్పోయావు. ఆమె మరణానికి నేను కారణమవ్వడం నా పెద్ద నేరం.
నీకు పుట్టిన బిడ్డని పురిటిలోనే దూరం చేశాను. అందుకే ఈ జన్మలో తల్లి అయ్యే అవకాశం ఆ భగవంతుడు నాకు దూరం చేశాడు. ఆ పాపం కోసం నేనెన్నిసార్లు నన్ను శిక్షించుకున్నానో నాకు మాత్రమే తెలుసు.
క్షమించు. నువ్వు క్షమిస్తావో లేదో తెలియదు కానీ, నీ ముందు తలవంచి క్షమాపణ అడుగుతున్నాను. నేను చేసిన పాపం ఎప్పటికీ చెరగనిది..
కానీ నా ప్రేమ మాత్రం నిజం. నిన్ను ఎంతగా ప్రేమించానో ఆ నిజం మాత్రం ఎవరూ నాకోసం తీయలేరు.
నేను ఆత్మహత్య చేసుకుంది పిరికితనంతో కాదు. అది నా స్వభావం కాదు అని కూడా నీకు తెలుసు. నేను నిన్ను పొందలేకపోయాను. నిన్ను మరవలేకపోయాను.
అందుకే ఈ శరీరాన్ని వదిలి వెళ్తున్నా… కనీసం ఈ ఆత్మ అయినా నీకు శత్రువుగా కాకుండా నీకోసమే పరితపిస్తూ నిన్ను ఆరాధీస్తూ ఉంటుంది .
నన్ను ప్రేమించకపోయినా, నన్ను ద్వేషించకు.
నీకు, శాంభవి కి అభ్యంతరం లేకపోతే నాచితికి నిప్పు పెట్టి సాగనంపుతావా.. దేవేంద్ర.
ఇదే చివరి కోరిక.. అది కూడా నీకు అభ్యంతరం లేకపోతే..
నిన్ను అంతులేని ప్రేమతో,
నీ శత్రువుగానూ, నీ ప్రేమికురాలిగానూ మిగిలిపోయిన…
నీకు ఏమి కానీ ఒక ప్రాణి..
దేవేంద్ర మయూరి చివరి కోరికను తీరుస్తాడా....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)