15-04-2026, 07:24 PM
అది హైదరాబాద్ నగరంలోని kphb కాలనీ.
ఆ రోజు శుక్రవారం !
నగరం నిద్రపోతున్న వేళ ...
అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలు కావస్తోంది.
ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లన్నీ,
అసలే అర్ధరాత్రి, ఆపై హోరు గాలితో జోరుగా వర్షం పడుతుండడంతో ఆ రోడ్లన్నీ చాలా నిర్మానుష్యంగా మారాయి.
ఆ గాలి, వర్షం ధాటికి పవర్ కూడా వస్తూ పోతుంది.
రోడ్డు నెంబర్ 3 లో ఉన్న తన హాస్టల్ కి, ఆఫీసు పని ముగించుకుని సరిగ్గా అప్పుడే ఆఫీసు క్యాబ్లో వచ్చింది సరిత !
సరిత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని. ఈ మధ్యనే మంచి ప్యాకేజీ తో క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా జాయిన్ అయ్యింది.
సరిత హాస్టల్ ...
అదే రోడ్డులోని ఒక చిన్న సందులో ఉండడంతో
ఆ క్యాబ్ లోపలికి వెళ్లదు..!
ఇక ప్రతిరోజూ తనే ఆ స్ట్రీట్ చివర క్యాబ్ దిగి హాస్టల్ వరకూ నడుచుకుంటూ వెళ్ళేది.
ఎప్పటిలానే ఆ రోజు కూడా అలానే క్యాబ్ దిగి, ఆ గాలి వానలో హాస్టల్ వరకూ నడుచుకుంటూ వెల్దాం అనుకుంది.
తను ఆ క్యాబ్ దిగగానే ఆ క్యాబ్ అక్కడి నుండి వెళ్ళిపోయింది.
తను క్యాబ్ దిగినప్పుడు ఉన్న పవర్ ఆ క్యాబ్ వెళ్ళిపోయేసరికి పోయింది. రోడ్డు అంతా చాలా చీకటిగా ఉంది. పైగా గాలి వాన. చుట్టూ ఎవరూ లేరు. పైగా ఆ సందు అంతా వర్షపు నీటితో నిండిపోయింది.
దాంతో ఆ వీధి చివర్లో పక్కనే ఉన్న ఒక హాస్టల్ గోడకున్న షట్టర్ వద్ద నిలబడి, తన ఫోన్ తీసి, తన హాస్టల్ లోని రూం మేట్ అయినా ప్రియకు కాల్ చేసి "తాను వీధి చివర వర్షంలో ఇరుక్కుపోయానని, గొడుగు తీసుకుని రమ్మని" చెప్పింది సరిత !
ఇక ప్రియ తనకి సాయంగా ...
ఇంకో రూం మేట్ అయిన రవళిని తీసుకుని, గొడుగు పట్టుకుని సరిత చెప్పిన ప్రదేశానికి వెళ్ళింది.
కానీ, అక్కడ వారికి సరిత కనిపించలేదు.
ఆమె మాత్రమే కాదు, అసలు అక్కడ ఎవరూ లేరు ?
ఎటు చూసినా నిర్మాన్యుష్యమే !
దీంతో ప్రియ, తిరిగి సరిత నెంబర్ కి కాల్ చేసింది.
రింగ్ అవుతుంది...
కానీ, సరిత...
ప్రియ కాల్ లిఫ్ట్ చేయడం లేదు.
మరొక సారి కాల్ చేయగా
ఈ సారి కాల్ కట్ అయ్యింది.
"సరిత కాల్ కట్ చేస్తుందేంటి ?" అని ప్రియ మనసులో అనుకుంటూ...
మళ్ళీ కాల్ ట్రై చేయగా...
ఇప్పుడు సరిత మొబైల్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది.
"ఏమైంటుంది..?" అన్న సందేహంతో
అదే విషయం..
సరిత తనతో పాటు వచ్చిన రవళికి చెప్పింది .
దాంతో రవళి ...
"ఇక్కడ వర్షం పడుతుందని ఇక్కడెక్కడికైనా వెళ్ళిందేమో ?" అన్న డౌట్ పడింది.
ఇక రవళి అన్నట్టుగానే వారిద్దరూ ఆ చుట్టు పక్కల వెతికారు.
అయినా వారికి అక్కడ ఎవరూ కనిపించలేదు.
అలా చాలా సేపు వాళ్ళు సరిత కోసం చూసినా...
ఏం లాభం లేకపోయింది.
అసలే పెద్దగా వర్షం...
ఆపై చిమ్మచీకటి...
పవర్ కూడా లేదు.
ఇక చేసేదేమీ లేక, అక్కడి నుండి హాస్టల్ కి తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ.
విషయం హాస్టల్ ఓనర్ కి చెప్దామ్ అని వాళ్ళు అతనికి కాల్ చేస్తే,
"ఎక్కడికో వెళ్లి వుంటుంది లేమ్మా... సరిగా చూడండి!
కరెక్టుగా పడుకున్న టైంలో నిద్ర చెడగొడతారు !" అంటూ అతను నిద్ర మత్తులో ఉన్న విసుక్కుంటూ సరిగా రెస్పాండ్ అవ్వలేదు.
వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా సరిత ఫోన్ స్విచ్ ఆఫ్ అని మాత్రమే వస్తుంది.
అలా ఎంతసేపు గడిచినా సరిత దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి,
వాళ్ళలో కొంచెం భయం స్టార్ట్ అయ్యింది!
సరిత రూం లో సరితతో పాటు వాళ్లిద్దరే ఉంటారు.
వాళ్ళలో కొంచెంగా మొదలైన భయం క్రమ క్రమంగా పెరిగిపోతుంది.
వేరే రూం లో ఉన్న మిగిలిన అమ్మాయిలను నిద్ర నుండి లేపి, విషయం చెప్పగా..
"ఈరోజు ఫ్రైడే కదా !
ఫ్రెండ్స్ తో కలిసి ఏ పబ్కో బయటకు వెళ్లి ఉంటుంది.
ఎంతైనా తను సాఫ్ట్వేర్ కదా!" అంటూ ఒకరు...
"ఏ బాయ్ ఫ్రెండ్ తోనో బయటకు వెళ్లి ఉంటుంది.
లేదా తన ఫ్రైండ్ రూం కి వెళ్లి ఉంటుంది !" అంటూ ఇంకొకరు లైట్ తీసుకోమంటూ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు.
కానీ, ఆ ఇద్దరికీ మాత్రమే తెలుసు...
సరిత ఎలాంటి అమ్మాయో!
సరితతో తమకి పరిచయమయ్యి రెండు నెలలే అయినప్పటికి..
ఆమె గుణగణాలేంటో వాళ్ళకి పూర్తిగా తెలుసు !
తను అలాంటిది కాదని,
చాలా సంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చిందని.
తనకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని.
ఇక ఎవరికీ చెప్పి ప్రయోజనం లేదని భావించిన ఆ ఇద్దరూ రూం లో కూర్చుని చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు...
"సెక్యూరిటీ ఆఫీసర్ కంప్లయింట్ ఇద్దామా ?
అంటూ ప్రియా తనకొచ్చిన ఐడియా చెప్పగా...
"అమ్మో సెక్యూరిటీ ఆఫీసర్ కంప్లయింట్ ఆ !" అంటూ రవళి భయంతో నోరెళ్ళబెట్టింది.
తను ఇలా అందో లేదో...
ప్రియ తన మొబైల్ తీసుకుని...
వెంటనే 100 కి కాల్ చేసి, విషయం చెప్పింది...
నిద్ర మత్తులోనే ఆ కాల్ రీసీవ్ చేసుకున్న కానిస్టేబుల్ కూడా సరిత హాస్టల్, ఆఫీసు అడ్రస్ లు మరియు వాళ్ల కాంటాక్ట్ డిటైల్స్ తీసుకుని ...
"సరే !
ఇప్పుడు బయట బాగా వర్షం పడుతుంది.
తగ్గిన తర్వాత మేము వెతికి పెడతాం.
మీరు ఏమి కంగారు పడకండి !" అంటూ భరోసా ఇచ్చాడు.
భరోసా ఐతే ఇచ్చాడు...
ప్రియ కాల్ కట్ చేయగానే తాను మాత్రం యధావిధిగా నిద్రలోకి జారుకున్నాడు.
ఇదంతా పక్కన నుండి గమనిస్తున్న రవళి
"అయినా ...
తన విషయంలో మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం అనుకుంటా...
బహుశా తను నిజంగానే ఎవరితోనైనా బయటకి వెళ్ళిందేమో ?
ఇందాక వాళ్ళు అన్నట్టు..." అంటూ నెమ్మదిగా ఒక పాజిటివ్ వే లో ఆలోచించడం మొదలు పెట్టింది.
"అలా ఐతే,
వీధి చివర ఉన్నాను ...
గొడుగు తీసుకు రమ్మని ఎందుకు అంటుంది తను ?
పైగా ఈ గాలి వానలో, అది కూడా ఈ టైం లో ...
ఎక్కడికో ఎందుకు వెళ్తుంది !
ఒక్కసారి ఆలోచించు !"
అంటూ ఆమె తనకున్న సందేహాన్ని చెప్పగా...
రవళి మళ్ళీ దీర్ఘంగా ఆలోచించడం మొదలు పెడుతుంది.
అప్పుడే అంతకుముందు ఆ హాస్టల్ అమ్మాయిలు అన్న మాటల్లో ...
"ఎవరో తన ఫ్రెండ్ రూం కి వెళ్లి ఉంటుందన్న !" మాట గుర్తుకు వచ్చి,
"ఓహ్ అన్నట్టు మర్చిపోయాను...
మొన్న ఒకసారి ఇద్దరం కలిసి వెళ్తుంటే, ఆ పక్క స్ట్రీట్ స్టార్టింగ్ పాయింట్ లో ఉన్న హాస్టల్ దగ్గర తన కాలేజీ మేట్ అంట... చూసి, గుర్తు పట్టి మాట్లాడింది. నాకు కూడా పరిచయం చేసింది!
ఆమె పేరు ...
ఆమె పేరు..." అంటూ
ఆమె పేరు గుర్తు చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నా...
రవళికి ఏ మాత్రం గుర్తుకు రావడం లేదు !
"ఐతే, తను తన ఫ్రెండ్ హాస్టల్ రూం కి వెళ్లి ఉంటుంది అంటావా ?" అన్న ప్రియ ప్రశ్నకు
"అవును !
ఎందుకు కాకూడదు... ?
మనం వెళ్ళడం కాస్త లేట్ అయ్యింది, పైగా ఈ వీధి అంతా వర్షపు నీటితో నిండిపోయింది. పైగా పవర్ కట్ అవ్వడంతో... భయంతో సరిత అక్కడికి వెళ్లి ఉండొచ్చు గా..!" అంటూ సమాధానం చెప్తుంది రవళి
"మరి కాల్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయలేదు తను.
కాసేపటికి స్విచ్ ఆఫ్ అని కూడా వచ్చింది ?
కనీసం, తను సేఫ్ గా ఉన్నట్టు
ఒక మెసేజ్ అయినా పెట్టాలి గా...!
మనం కంగారు పడతాం అని కొంచెం కూడా లేదు తనకి " అని అంటూ ప్రియ తన అసహనాన్ని వ్యక్తపరుస్తుంది.
"అబ్బా...
ప్రియా ...
నువ్వు ఎప్పుడూ ఇంతే, అన్నీ ఇలా నెగటివ్ గానే ఆలోచిస్తావ్ !
ఏముంది మనం కాల్ చేసినప్పుడు..
వర్షంలో మొబైల్ తడిచిపోతుందని, తన బ్యాగ్ లో పెట్టీ ఉంటుంది. కాసేపటికి సరిగా చార్జింగ్ లేక మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యి ఉంటుంది.
చార్జింగ్ పెట్టడానికి కనీసం ఈ ఏరియాలో పవర్ కూడా లేదు ఇప్పుడు. బహుశా అది కూడా కారణం అయ్యి ఉంటుందేమో ?" కంగారు పడకుండా నిదానంగా ఆలోచించు.
"అలా ఐతే తన ఫ్రెండ్ మొబైల్ నుండి మనకు చెయొచ్చుగా ..."
అంటూ ప్రియ అనగా ..
"ఒసేయ్ పిచ్చి మొహమా...
మన నెంబర్ తన మొబైల్ సేవ్ చేసుకుంది కానీ,
తన బ్రెయిన్ లో కాదు !
ఇంతకు మించి నువ్వేం ఎక్కువగా ఆలోచించకు...
నా బుర్ర తినకు !" అంటూ ప్రియపై చిరాకు పడుతుంది రవళి.
"నిజంగా ఇదే జరిగుంటుందంటావా ? "
అని ప్రియ మళ్ళీ ఏదో చిన్న సందేహాన్ని రేకిత్తించగా...
"సరిగ్గా ఇదే జరిగి ఉంటుంది.
రేపు మార్నింగ్ కల్లా తను రూం కి వచ్చేస్తుందిలే కానీ,
నువ్వు ఇంకేం ఆలోచించకుండా పడుకో !" అంటూ దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకుంటుంది రవళి
"అది కాదే రవళి!" అని ప్రియ ఆమెను మళ్ళీ లేపడానికి ప్రయత్నించగా...
"ఇదిగో ప్రియా !
నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావ్!
నాకు నిద్ర వస్తుంది. నువ్వు కూడా ఏం ఆలోచించకుండా పడుకుంటే మంచిది!" అంటూ ఆమెపై కోప్పడడంతో...
ఇక చేసేదేమి లేక,
"అలా దీర్ఘంగా ఆలోచిస్తూనే పడుకుంటుంది ప్రియ !"
" రవళి చెప్పినట్టు సరిత సేఫ్ గానే ఉందా ?
లేక ప్రియ అనుమాన పడ్డట్టు తను ఏదైనా అపాయంలో ఉందా ?
అసలు సరిత ఆ కొద్ది గ్యాప్ లోనే ఎక్కడికి వెళ్లి ఉంటుంది ?"
తర్వాతి భాగం "ఎవరు ? - 2" లో చూద్దాం.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)