13-04-2026, 09:32 AM
ఈ మనిషి రిపేరు చేయబడ్డాడు!
![[Image: R.jpg]](https://i.ibb.co/QFbfqQ4h/R.jpg)
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
ఆనందరావు తన కొడుకును చదువు నిమిత్తం చెన్నై హాస్టల్ లో ఉంచడానికి వచ్చి, తగిన ఏర్పాట్లు చేసి... తను తిరిగి తన ఊరు కాకినాడ వెళ్ళిపోతూ.. కొడుకుకు చాలా విష యాలు చెప్పడం ఆరంభించాడు... ఆ ప్లాట్ ఫారం మీద.
ఇది రమారమి మూడు సంవత్సరాల క్రితం సంఘటన......
***
జనవరి, 2020... "కోవిడ్".. ప్రజా జీవనాన్ని అల్లకల్లోలం చేస్తున్న సమయమది.
"ఒరేయ్.. రవీ.. నిన్ను ఈ చెన్నై లో ఉంచటం నాకసలు ఇష్టం లేదురా. ఏదో.. నీ ఫ్రెండ్స్ ఇక్కడే చదువుతున్నా రన్నావని 'సరే'... అన్నాను.
నాకసలు ఏమాత్రం ఇష్టంలేని వ్యక్తి… అదేరా.. మీ బాబాయ్ వెధవ.. ఇక్కడే ఉంటున్న విషయం నీకూ తెలుసుగా... ఇక్కడకుదగ్గరే... అదే........
అది... అది... " చెట్టియార్ స్ట్రీట్ ".. ఏదో అను కుంటాను... అక్కడ ఏడుస్తున్నాడట.
వాడు నాకు పరమశత్రువు. ఇరవైఏళ్ల క్రితం మాట.... నీకు అప్పుడు ఐదేళ్లు ఉండొచ్చు. విషయాలు నీకు గుర్తుండి వుండవులే.
ఆస్తి పంపకాల్లో అప్పట్లో మాకు- మాకు, చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు వచ్చి విడిపోయాం. ఆ వెధవ సెక్యూరిటీ అధికారి స్టేషన్, కోర్టు ల వరకు నన్ను తిప్పాడు. తిట్టాలని కాదుగాని... వాడు దుర్మార్గుడు.. నీచుడు.. పాపాత్ముడు.
సమయం వచ్చినప్పుడు వాడు.. రాక్షసుడిలా ఎలా ప్రవర్తించాడో నీకు చెప్తాను.. వాడి మీద కసి, పగ... నేను కాకపోయినా... నువ్వైనా.... తీర్చుకొని.. మగాడినని పించుకోవాలిరా. నీ మీద ఆ నమ్మకం నాకుంది.. నా దృష్టిలో వాడు ఆ రోజే చచ్చిపోయినట్టురా. వాడి అవసరం మనకు లేదు.. రాదు.. ఉండదు. మన అవసరం కూడా వాడికి లేదులే.
ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఈ రైల్వే ప్లాట్ ఫామ్ మీద నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు ఈ చెన్నై లో ఉండి చదువుకున్నన్నాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు.. ఆ... స్ట్రీట్.. ఏది ఆ చెట్టియార్ స్ట్రీట్ కు వెళ్ళడానికి వీలులేదు.
వాడికో కొడుకున్నాడు.. వాడు కూడా మా తమ్ముడు వెధవ లాగే పెద్ద వెధవన్నర వెధవ అయ్యుంటాడు. ఆ వెధవలు ఇద్దరి దృష్టి లోనూ నువ్వు పడటం నాకసలు సుతారాము ఇష్టంలేదు. రక్త సంబంధీకుల మైనప్పటికీ మన సంప్రదాయం వేరే.... వాళ్ల సాంప్రదాయం వేరే.
ఒకవేళ తేడా వచ్చింది అనుకో.... నీ చదువు మానిపించేస్తాను. బాగా అర్థమైందా. అదిగో ట్రైను వస్తున్నట్టుంది, నే వెళ్తాను. జాగ్రత్తగా అందరితో పాటు హాస్టల్లోనే ఉండు"
అంటూ కొడుకు రవికి ఇంకా మిగిలిన విషయాలు
కూడా చెప్పి.. వచ్చి ఆగిన తను ఎక్కవలసిన ట్రైన్ గబగబా ఎక్కి తన రిజర్వేషన్ లో కూర్చొని కొడుకుని హాస్టల్ కు వెళ్లి పొమ్మని చెప్పి పంపించేశాడు ఆనంద రావు.
***
ట్రైన్ చాలా స్పీడ్ గా దూసుకుపోతుంది... కాకినాడ వైపు
ఆనందరావు బుర్రలో అంతకన్నా స్పీడుగా గతం తిరిగేస్తుంది.
అతని కొడుకు రవికి అప్పుడు ఐదేళ్లు. అంటే.. 20 సంవత్సరాల క్రితం విషయం గుర్తు చేసుకుని పళ్ళు కొరుకుతున్నాడు కసితో ఆనందరావు. తన కొడుకు రవిని తప్పని పరిస్థితులలో తన శత్రువైన తమ్ముడు ఉండే చెన్నై లోనే చదివించ రావలసి కావడంతో ఈ సమస్య ఏర్పడింది అతనికి.
రెండు దశాబ్దాల క్రితం.....
తన తమ్ముడు... మూర్ఖుడు.. పద్మాకర్ తో గొడవలు.. తగువులు....... కొట్లాటలు...... పెద్ద మనుషులు... సెక్యూరిటీ ఆఫీసర్లు... లాయర్లు.... అలా అలా బుర్రలో గిర్రున జోరీగల తిరిగేస్తున్నాయి... అంతేనా.. విజృంభిస్తున్నాయి... బోగి లో కూర్చొని కళ్ళు మూసుకున్న ఆనందరావుకి.
ఈ 20 ఏళ్లలో పద్మాకర్ చాలా చోట్ల,.. ఫంక్షన్లలో కూడా కన పడ్డాడు ఆనందరావుకు. మాట్లాడ ప్రయత్నించ మనస్కరించలేదు.... ఆనందరావుకి. పద్మాకర్ కాస్త తెగువ చూపించినా... ఆనందరావు చీదరించుకునే వాడు. మరి తన మనసుకు మానకుండా తగిలిన "గాయం "...... అలాంటిది..!!!
పెద్దమనుషులకు లంచాలు ఎరచూపి ఆస్తిలో ఎక్కువ భాగం వచ్చేలా కూడా సెట్ చేయించుకుని తనను బెదిరించి, భయపెట్టి ఎలాగోలా ఆస్తి పంపకాలు చేయించేశాడు... పద్మాకర్.
నరకయాతన అనుభవించలేక చిరాకు వచ్చి, చివరికి తమ్ముడికి కొంత భాగం ఆస్తి ఎక్కువైతే అయ్యిందని ఆనందరావు సర్దుబాటు చేసు కున్నాడు.... అతి కష్టం మీద.
అప్పట్లో.. ఆ గొడవలలో... తనపై పద్మాకర్ గునపంతో హత్యాప్రయత్నం చేయటం... ఇంకా మర్చిపోలేక పోతున్నాడు ఆనందరావు. అదంతా తమ్ముడు దుర్మార్గత్వం, దుష్టత్వం. అందుకని వాడిని ఒక వెధవ గా జమ చేసి తన కుటుంబం లోంచే వెలివేసినట్టు..... నిర్ణయం చేసుకున్నాడు అప్పుడే.. ఆనందరావు!
అప్పట్లోనే తమ్ముడు పద్మాకర్.. అతని ఆస్తి మొత్తం అమ్మేసుకుని... భార్య బిడ్డలతో చెన్నై పోయి బిజినెస్ లో బాగా సంపాదించినట్లు తన బంధువులు చెప్తుంటే వినేవాడు ఆనందరావు.
అలా కొంత కాలం గడిచి పోయాక ఈమధ్యనాలుగేళ్ల క్రితం...
తమ్ముడు పద్మాకర్ కొడుకు రాజారామ్ తను బాల్యంలో గడిపిన కాకినాడ వీధులు చూడా లని , అతను పెరిగిన ఆనాటి తన తాతగారి ఆ పాత ఇల్లు చూడాలని.. తన పెదనాన్న కు తన రాక ఇష్టం ఉండకపోవచ్చు కనుక కనీసం దూరంనుండి అయినా చూడాలనే... ఉద్దేశ్యంతో పండగ సెలవులకు సరదాగా కాకినాడ వచ్చాడు.
ఆనందరావు తన వీధి అరుగుమీద అప్పటికే కూర్చుని ఉన్నాడు. దూరంనుండి.. అతనే తన పెదనాన్న అని ఎవరి ద్వారానో తెలుసుకున్న రాజారాం.. తనను చూసి ప్రేమగా నవ్వడం గమనించాడు.. ఆనందరావు. కానీ.. ఆ కుర్రోడు పద్మాకర్ కొడుకని గ్రహించలేకపోయాడు.
అదే వీధిలోంచి తనను దాటుకుంటూ వెళ్తున్న తన బంధువు.....
" ఇదిగో ఆనందరావూ... దూరంగా జీన్స్ ప్యాంట్ వేసుకొని ఒక కుర్రోడు కనిపిస్తున్నాడు చూడు.. అదే ఆ కిళ్ళీ కొట్టు పక్కన.... వాడు మీ తమ్ముడి కొడుకట! పండగ సెలవులు కదా.. ఇక్కడ మనందరినీ చూద్దామని వచ్చాడట... నీతో మాట్లాడటానికి భయపడు తున్నాడు. పిలువమంటావా ఏంటి?... "... అని అడిగాడు.
ఉలిక్కిపడి పైకి లేచాడు ఆనందరావు.
" ఇదిగో.. వాడు అడిగితే మా ఇంటికి పంపించకు. వాళ్లంతా ఎప్పుడో చచ్చిపోయారుకదా.. నీకు తెలుసు కదా.. మేమంతాకూడా చచ్చిపోయాము... అని చెప్పు... వచ్చిన దారినే వెళ్ళమని చెప్పు.. మళ్లీ ఎప్పుడైనా కాకినాడ రావద్దని చెప్పు... వచ్చిన.. ఈ రామారావుపేట రావద్దని చెప్పు.. "
అంటూ... పెద్ద అడుగులతో ఇంటి లోపలకు వెళ్ళిపోయి చెక్కలు విరిగిపోయేలా తలుపు వేసుకున్నాడు ఆనందరావు..
ట్రైన్ జర్క్ ఇచ్చిన కుదుపు తో 20 సంవ త్సరాల క్రిందటి గత జ్ఞాపకాలన్నీ చెల్లాచెదురై పోయి... పరాయి లోకం నుండి ఈ లోకానికి వచ్చిన అనుభూతి పొందాడు... ఆనందరావు..
మొత్తానికి ఆ మర్నాడు మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ తన ఇంటికి చేరాడు ఆనందరావు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)