12-04-2026, 07:39 AM
Part - 75
నేను రోజు గుడికి వెళ్లడం మొదలు పెట్టాను లహరిని చూడడమే నా దేవి పూజ. నా దేవి పూజ ని మా అన్నయ్య కనిపెట్టేసాడు.
అది ఎలా అంకుల్.. ఎందుకు కనిపెట్టారు..గుడికి అంటే వంకలు చెప్పే నేను... ఏదో ఒక వంకతో గుడికి వెళుతూ ఉంటే... కనిపెట్టారా..
ఒకరోజు నాతోపాటు గుడికి వచ్చి లహరిని చూశాడు. లహరి పద్ధతి చూసి.. వాళ్ళ నాన్నగారిని ఆచారాలు చూసి ఒప్పుకుంటారా అని అనుమానంగా అడిగాడు.
నా ప్రయత్నం నేను చేస్తాను. చాలా రోజుల నుంచి వస్తున్నావు. ఆ అమ్మాయి నీ వైపు చూస్తున్నట్టే లేదు. లహరి దృష్టి మొత్తం అమ్మవారి మీదే ఉండేది. పూజ అయిపోయిన తర్వాత తల ఎత్తకుండా ఇంటికి వెళ్ళిపోయేది.
సంతోషంగా రోజులు వెళితే ఎవరికీ నచ్చదేమో... నా జీవితంలో అమావాస్య రోజులు మొదలవుతున్నాయి అన్నట్టుగా... మేనమామ అయిన నాగేంద్ర కుటుంబంతో సహా మా ఇంటికి వచ్చాడు.
తనకి ముగ్గురు పిల్లలు సునంద, శేషాద్రి, మయూరి. సునందకి, శేషాద్రి కి పెళ్లి అయిపోయింది. మయూరీకి నాతో పెళ్లి చెయ్యాలి అని...
ఆ విషయం గురించి మాట్లాడాలి అని వచ్చాడు. మయూరి కి కూడా నేనంటే ఇష్టమే కానీ ఎందుకో నేనే మయూరిని ఆ దృష్టితో చూడలేకపోయాను.
అప్పటికే నా మనసులో లహరి పీఠం వేసుకుని కూర్చుంది. మయూరి, సునంద అమ్మతో ప్రేమగా మాట్లాడుతూ మచ్చిక చేసుకుంటున్నారు.
మా మేనమామ భార్య అయిన లక్ష్మి అత్తయ్య మాత్రం చాలా మంచిది. దేవేంద్ర కి ఇష్టం లేకపోతే పెళ్లి చేయవద్దు అని కచ్చితంగా చెప్పేది. అమ్మతో కూడా అదే మాట చెప్పేది .
ఆడవాళ్ళకి ఎంత లేదు అనుకున్నా ఒక మెట్టు పుట్టింటి వైపు ఉంటుంది కదా.. మా అమ్మ ఆలోచన కూడా అలాగే ఉండేది.
మయూరిని చేసుకుంటే చెప్పినట్టు వింటుంది. ఇల్లు ఎప్పుడు కలిసే ఉంటుంది అని ఏవేవో ఆలోచించింది. అలాగే నా మొండి పట్టుదల కూడా మా అమ్మకి తెలుసు.
అందుకే తొందరపడి మాట ఇవ్వలేదు. దేవేంద్రకి ఇష్టమైతే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు.. వాడు ఒప్పుకుంటే నిన్ను వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని మయూరితో చెప్పింది.
ఆ మాట పుచ్చుకొని అత్తయ్య మా పెళ్ళికి ఒప్పుకుంది అని అందరితో చెప్పింది..మా నాన్నగారికి కూడా మయూరిని చేసుకోవడం ఇష్టం లేదు.
కానీ అమ్మ మాట కాదనలేక మౌనంగా ఉన్నారు. పెళ్లి మాటలు గట్టిగా మొదలయ్యేటప్పటికీ ధైర్యం చేసి లహరిని ప్రేమిస్తున్న విషయం చెప్పాను.
మా మావయ్య అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. మాట ఇచ్చి తప్పుతారా...నా కూతురు ఈ ఇంటి కోడలు అవుతుంది అని అందరికీ చెప్పుకున్నాను. ఇప్పుడు నీ కొడుకు ఇలా ప్రవర్తిస్తే ఎలా అక్క అని అమ్మ దగ్గర మొసలి కన్నీరు కార్చాడు.
ఆ కన్నీరు నిజమే అనుకుని.. మా అమ్మ ఏది ఏమైనా మయూరియే నా ఇంటి కోడలు. నువ్వు టెన్షన్ పడకు అని మాట ఇచ్చింది.
నాకు తెలియకుండా అమ్మ, మావయ్య, అత్తయ్య గుడికి వెళ్లారు. అత్తయ్య ఎంత చెబుతున్నా వినకుండా లహరి నీ, వాళ్ళ నాన్నగారిని గుడిలో అందరూ ముందు నిలబెట్టి మావయ్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు.
నేను ప్రేమిస్తున్న విషయం లహరికి ఏమాత్రం తెలియదు. అందుకే మావయ్య ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాక ఏడుపు ముఖంతో.. చూస్తూ..
మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు ఏమీ తెలియడం లేదు. అసలు ఎవరు మీరు..ఎందుకు నాపై ఇలాంటి నిందలు వేస్తున్నారు అని ఏడ్చింది.
శేషాద్రి భార్య అయిన జ్యోతి ద్వారా విషయం తెలిసి నేను, నాన్నగారు, అన్నయ్య వెనకాలే గుడికి వెళ్ళాము. అప్పటికే జరగాల్సిన గొడవ జరిగిపోతుంది.
నాన్నగారిని చూడగానే మావయ్య భయంతో బిగుసుకుపోయాడు. అమ్మ కూడా మౌనంగా ఉండిపోయింది.
నాన్నగారు వెంటనే లహరి వాళ్ళ నాన్నగారు చేతులు పట్టుకుని క్షమించమని అడిగారు. దైవం తప్ప తెలియని వాళ్ళకి ఇది చాలా పెద్ద అవమానం.
కాస్త గొడవ సద్దుమణిగిన తర్వాత అక్కడే అందరిముందే లహరిని నాకిచ్చి పెళ్లి చేయమని నాన్నగారు అడిగారు. ఆత్మ అభిమానం ఎక్కువ కదా అసలు ఒప్పుకోలేదు.
ఎన్నో విధాలుగా నచ్చజెప్పిన తరువాత అప్పుడు ఒప్పుకున్నారు. అది కూడా అమ్మతో చెప్పించిన తర్వాతే ...
ఆ గుడిలోనే మా పెళ్లి జరిగింది. మయూరి మాత్రం పంతం పట్టింది. నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని... నేను కూడా ఎన్నో విధాలుగా నచ్చచెప్పాను.
నీపై నాకు ఎటువంటి ప్రేమ లేదు. నిన్న ఆ దృష్టితో ఏ రోజు చూడలేదు. రెండో భార్యగా అయినా ఉంటాను పెళ్లి చేసుకో అని సైకో లాగా ప్రవర్తించేది.
లహరి మా వదినతోను, చారుతో బాగా కలిసిపోయింది. తన నిత్య పూజకి ఇంటిలో ఎటువంటి ఆటంకం రానివ్వకుండా చూసుకునేవాళ్ళము.
ప్రపంచం లో ఉన్న కుళ్ళు కుతంత్రాలు తెలియని ఒక అందమైన పసిపాప లాంటిది లహరి.. అమ్మవారికి పూజ చేయడం. ఇంట్లో అందరికీ ఏమేమి కావాలో చూసుకోవడం. సంగీతం నాట్యం తప్ప మరో ప్రపంచం తెలియదు.
మా సంతోషానికి మరో సంతోషం కలుస్తూ లహరి నెల తప్పింది. అప్పటికే అన్నయ్య ఇద్దరూ అబ్బాయిలే.. చారుకు కూడా అదుగో వీడు పుట్టేశాడు.
అందుకే అందరూ ఈసారి ఆడపిల్ల పుట్టాలి అని ఎదురు చూశారు . అమ్మ కూడా లహరి మంచితనానికి మురిసిపోతూ కాలు కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకునేది.
నెలలు నిండుతున్న సమయంలో అనుకోకుండా నేను ప్రాజెక్టు విషయం బొంబాయి వెళ్లాను. వదిన చారు అమ్మ ఉన్నారు అన్న ధైర్యంతోనే వెళ్లాను. అదే నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అని తర్వాత తెలిసింది.
ప్రాజెక్ట్ ఫినిష్ చేసుకుని నేను ఉంటున్న హోటల్ కి వచ్చేటప్పటికి మయూరి భయంగా పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించింది.
నాకు ఆశ్చర్యమేసింది. మయూరి ఏమిటి ఇక్కడ అని వెనకాలే వెళ్లాను. మయూరిని ఇద్దరి అబ్బాయిలు ఏడిపిస్తూ ఉంటే వాళ్ల ఇద్దరినీ నాలుగు పీకి అక్కడ ఉన్న రెస్టారెంట్లో కూర్చోబెట్టి కాఫీ ఆర్డర్ ఇచ్చాను.
ఇక్కడికి ఎలా వచ్చావు.. ఏ పని మీద వచ్చావు అని అడిగితే.. నాన్న నాకు పెళ్లి చేస్తాను అన్నారు అని తలదించుకుని చెప్పింది. మంచిదే కదా... నాకు నచ్చాలి కదా...
నీకు ఎలాంటి వాడి కావాలో చెప్పు. మావయ్యతో నేను మాట్లాడతాను. నాకు కావలసిన వాడు నాకు అందనంత దూరంలో ఉన్నాడు. వేరే వాళ్ళని నేను ఆ స్థానంలోకి తీసుకురాలేను.
అందుకే నా ఫ్రెండ్ ఇక్కడ జాబ్ చూశాను అంటే వచ్చాను. కానీ... కానీ చెప్పు అంటే.. ఇక్కడికి వచ్చాక మోసం చేశారు అని అర్థమయింది. వాళ్ల నుంచి తప్పించుకునే వెళుతూ ఉంటే... నాకు దొరికావు అంతే కదా...
చూడు మయూరి.. మన పెద్ద వాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసమే.. మీ నాన్న నీకు సరైన సంబంధమే తీసుకు వస్తాడు.
కొన్ని రోజులకి నీ భర్త మంచితనానికి నువ్వే ప్రేమించడం మొదలుపెడతావు. నా మాట విను.. నా జీవితంలో ఎవరి మాటైనా వింటాను అంటే అది నీదే దేవేంద్ర .
సరే రూమ్ తీసుకున్నావా... తీసుకోనా... నాకు ఒక్కదాన్నే ఉండాలి అంటే భయంగా ఉంది. మళ్ళీ వాళ్ళు వస్తారేమో..
మరి ఇప్పుడు ఎలా.. రేపు ఎలాగు బయలుదేరుతున్నాము కదా.. ఈ ఒక్క రాత్రికి నీ రూములోనే ఉంటాను. నా రూములోన...
నా పైన నమ్మకం లేదా... అలా అని కాదు. చూసే వాళ్ళకి బాగోదు. ఇక్కడ మనం ఎవరికీ తెలుసు దేవేంద్ర. లేకపోతే నేను ఇక్కడ క్యాబిన్లోనే కూర్చుని ఉంటాను. ఉదయమే నువ్వు వెళ్లేటప్పుడు నీతో వస్తాను.
ఎందుకో ఆడపిల్లని అలా వదలడం ఇష్టం లేక నా గదిలోకి తీసుకు వెళ్లాను. మయూరిని మంచం మీద పడుకోమని నేను బయట బాల్కనీలో పడుకున్నాను.
మయూరి కంగారుగా నా దగ్గరికి వచ్చి ఎవరో తలుపు కొడుతున్నారు. భయంగా ఉంది అంటే వెంటనే నేను చూస్తాను అని డోర్ దగ్గరికి వచ్చాను. మయూరి నా వెనకాలే నిలబడి నా షర్ట్ ని గట్టిగా పట్టుకుంది.
భయపడుతుందేమో అనుకుని ఒక చెయ్యి మయూరి చేతి మీద వేసి తలుపు తీశాను. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ల్ని చూసి ఆశ్చర్యపోయాను.
ఏమిటి అని అడిగితే ఈ హోటల్ లో రాంగ్ పర్సన్స్ ఉన్నారు అని మాకు కాల్ వచ్చింది. మీరిద్దరూ ఎవరు.. ఏమవుతారు...
ఫ్రెండ్స్ అనే నేను చెప్పబోయే లోపు భార్యాభర్తల మని మయూరి చెప్పింది. ఓ అవునా అని వాళ్ళు వెళ్ళిపోయారు.
నేను కోపంగా ఎందుకు అలా చెప్పావు. మనం ఫ్రెండ్స్ అని చెప్పినా వాళ్లు నమ్మరు. మనల్ని కూడా తప్పుగా అనుకోని స్టేషన్ కి తీసుకువెళ్తే మావయ్య పరువు ఏమవుతుంది.
మన ఇంటి పరువు గురించి ఆలోచించి అలా చెప్పాను. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు అని వెళ్లి సోఫాలో కూర్చుంది.
నాకు ఇంకా నిద్ర రాలేదు. ఆ మిగిలిన టైం అంతా జాగారమే చేసి ఉదయమే బయలుదేరి హైదరాబాద్ వచ్చేసాము.
నేను ఇంటికి వచ్చేటప్పటికి నాగేంద్ర అందరం ముందు చిందులు తొక్కుతూ ఉన్నాడు. నా భార్య కన్నీళ్ళతో చూస్తూ ఉంది. వదిన, చారు లహరి ని ఓదార్చుతున్నారు.
ఏమైంది అని నేను లహరి దగ్గరికి వెళితే... లహరి భయంగా నా చేతులు పట్టుకుని నన్ను దూరం చేయరు కదా ...
ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఆరోగ్యమేమైనా బాగోలేదా అని కంగారుగా అడిగాను. ఆ మాటకి మా అమ్మ కోపంగా నీ భార్య ఆరోగ్యం బాగానే ఉంది.
కానీ మన ఇంటి పరువే... ఏమైందమ్మా.. ఇదిగో ఈ పేపర్ చూడు అని మా ఇద్దరి ఫోటోలు ఉన్న న్యూస్ పేపర్ నా ముఖం మీదకి కొట్టింది.
ఆ పేపర్లో ఉన్న న్యూస్ చూసి ఆశ్చర్యపోయాను. ఇది ఎలా వచ్చింది. అది మేము నిన్న అడగాలి.. పెళ్ళికాని ఆడపిల్లని నీ గదిలో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది.
మయూరి మీద నీకు అంత ప్రేమ ఉంటే మీ ఇద్దరికే పెళ్లి చేసే వాళ్ళము కదా.. ఎందుకు ఈ రహస్య ప్రేమ.. అమ్మ ఆవేశంగా మాట్లాడింది.
దేవేంద్ర నిర్ణయం....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)