Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - పుణ్యం కోసం
షీ ఈజ్ జీనియస్! ఆమె జ్ఞాన సంపత్తిని మొక్కలోనో తుంచేయకండి. మామూలు చిన్నాచితకా పనులకు ఆమె సరిపోదు. ఉన్నవ ప్రేమాబాయిలా, సరోజినీ నాయుడులా, విజయలక్ష్మిపండిత్ లా, పి, శారదా దేవిలా గొప్పగొప్ప కార్యాలు చేయగల దిట్ట. ఆమెను అమెరికాకి గాని పంపిస్తే ఆమె తప్పకుండా కొన్నాళ్ళకు కౌంటీ హెడ్గానో బిజినస్ సి వో గానో యెదగ గల సర్వ సమర్థురాలు



అతడదంతా విని ముఖం అదోలా పెట్టాడు. అదంతా తరవాత వింటాను గానీ! మొదట దీనికి బదులియ్యి. నికార్సుగా బదులిస్తావా? ’ 



సుదర్శనం బుర్రూపాడు. 
నువ్వన్నట్లు మృణాళిని నిజంగానే చాలా గొప్ప జీనియస్సే అనుకో! ఆరు అంతర్జాతీయ విశ్వ విద్యాలయాల నుండి స్కాలర్ షిప్పులతో సీట్లిస్తామని ఆఫర్లు వచ్చాయి కాబట్టి ఆమె నిజంగానే గగన కుసుమాన్ని అందుకోగల మేధావే అనుకో! మరి ఆమెకు జీవితంలో ఏదో ఒకనాడు తోడన్న వాడు కావాలా వద్దా? రేపో మాపో పిల్లకు తనకంటూ ఒక కుటుంబం ఉండాలా వద్దా! కాలమంతా నేనూ కాంచనమాలగారు పిల్లకు తోడుగా ఉండం కదా! బంగారు పళ్ళేనికి కూడా గోడ ఆసరా ఉండాలి కదా!



మాటతో సుదర్శనం కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తరవాత తన రీతిలో బదులిచ్చాడు- కాదనను మామ య్యా! కాని ఆమె తన కాబోయే భర్తను వెతుక్కోవలసిన పరిస్థితి ఎదురవదు. ఆమె ఔననాలేగాని ఎంత మంది క్యూ కట్టరూ? ” 



ఈసారి దక్షిణమూర్తి సన్నటి నిట్టూర్పు విడుస్తూ ఉండిపోయాడు. కాసేపు తరవాత, ఆలోచనలనుండి తేరుకుంటూ అన్నాడు. ఇంత చెప్పావు. ఇంకా యేదేదో చెప్పాలను కుంటున్నా వు. ఒకటి మాత్రం ఇంతవరకూ నువ్వు చెప్పనేలేదురా సుదర్శనం! ” 
అదేమటన్నట్టు కళ్లెత్తి చూసాడతను. 



మృణాళినిని పెళ్ళి చేసుకోవడం నీకిష్టమేనా?



అదేం ప్రశ్నమామయ్యా? నేనెప్పడు వద్దన్నానని! మీరేది చేసినా నామంచికే చేస్తారన్నది నాకు తెలియనిదా? నేను చెప్పొచ్చే దేమంటే ఆమెను యే మగాడూ కాదనలేడంటాను



విషయం పూర్తిగా తెలుసుకోకుండా నువ్విక్కిడే తడుముతూ పొరపడుతున్నావోయ్! మృణాళినికి కావల్సింది మగాడు కాదు. జీవితాంతం తోడుగా నీడగా ఉండాల్సిన భర్త. పాణి గ్రహణం చేసిన భర్త. మామూలు విషయాన్ని నేనింత సీరియస్ గా యెందుకు నొక్కి చెప్తున్నాననే కదూ ఆశ్చర్యపోతున్నావు! ఇప్పుడు అసలు సంగతి చెప్తాను. నేను చెప్పబోయే విషయం కాంచన మాలగారికి కూడా తెలియదు. 



మృణాళిని చిన్నప్పట్టినుంచి ఒంటరిగానే పెరిగి పెద్దదయింది. బియ్యం బస్తాల గోడౌన్ లో చిక్కు కున్న చిట్టెలుకలా పెరిగింది. ఎందుకంటే పిల్ల జీవితం చిన్నప్రాయం నాడే అస్తవ్యస్థంగా తయారయింది. నీకు ఒకవిషయాన్ని సగం చెప్పా ను, మరొక సగం విప్పలేదు. పరిస్థితి ఇంతవరకూ వచ్చింది కాబట్టి ఇక చెప్పకుండా ఉండలేను. పిల్ల తల్లి దండ్రులిద్దరూ యెలా చనిపోయారనుకుంటున్నావు?



చెప్పారు కదా మామయ్యా! భార్యా భర్తలిద్దరూ పయనం చేస్తున్న విమానం నడి సముద్రాన కూలిపోవడంవల్లపోయారని—“



కాదు! నిజం అది కాదు. నేను చెప్పబోయే విషయాన్ని యెక్కడా పొక్కనివ్వకు. ఇద్దరూ స్విసైడ్ చేసుకున్నారు. మామూలుగా కాదు. ఒప్పందం ప్రకారం. అంటే స్వీసైడ్ ప్యాక్టు ప్రకారం కూడబల్కుకొని ప్రాణత్యాగం చేసుకున్నారు! అది విని సుదర్శనం ఆశ్చర్యంగా కుర్చీనుండి లేచి నిల్చున్నాడు. మ్యూచ్వల్ అగ్రిమెంటుతో ప్రాణాలు తీసుకోవడమా! ఎందుకు మామయ్యా?



చెప్తాను. ముందు కూర్చో! విపరీతమైన మనోద్రేకాలతో చెలరేగి పోయే రెండు మదపుటేనుగులు గుద్దుకుంటే యేం జరుగు తుంది? అడవి దద్దరిల్లిపోతుంది. అదే జరిగింది! ఇద్దరిదీ ఒకరితో ఒకరు సర్దుకుపోయే మనస్తత్వం కాదు. ఇద్దరిదీ ఒకే విధమైన సైకలాజికల్ కంపల్సివ్ డిస్ ఆర్డర్. అంటే-ఎక్స్టీమ్ టెంపర్ మెంటల్ సైకలాజికల్ డిస్ ఆర్డరన్నమాట. పూర్తిగా ఒకరినొకరు ద్వేషిం చుకోలేరు. అదే సమయంలో పూర్తిగా ఒకరినొకరు ప్రేమించుకోనూ లేరు. అవగుణాలు సరాసరి వాళ్ల జన్యువుల్లో యిమిడి ఉన్నప్పుడు దాని ప్రభావం నుండి వాళ్లెలా బయట పడగలరు? సహనాన్ని ఎలా అలవర్చేకోగలరు?



ఇద్దరూ ఒక రోజు కూడబలుక్కుని నాకు ఫోను చేసి- తాము చేసుకోబోయే దాని గురించి నాకు చెప్పి- నేను వద్దంటూ గోలపెడ్తూ వచ్చే లోపల ఇద్దరూవి గత జీవులై పడున్నారు. నేనొచ్చేటప్పటికి పాప గుక్క తిప్పుకోకుండా యేడుస్తూ నేల పైన దొర్లుతూంది. పాపతో బాటు నాకంతా అప్పజెప్పి వెళ్తున్నట్టు ఇద్దరూ వ్రాతమూలంగా వ్రాసి పెట్టారు. నా వరకు మృణాళిని నాకు మేనకోడులు వంటిది కాదు. కూతురు కంటే అధికం. నా ప్రాణానికి మరు ప్రాణం
సుదర్శనం మాట్లాడుకుండా మౌనంగా ఉండిపోయాడు. 



ఇప్పుడు బాగా ఆలోచించి చెప్పు. వాళ్ళిద్దరిలో కొట్టుమిట్టాడిన మనోభావాల తీవ్రత కొంతలో కొంతైనా మృణాళినిలో కూడా ఉంటుందా లేదా!



అతడు దిగ్భ్రాంతితో మామయ్య వైపు చూసాడు. మామయ్యది ఎంతటి లోతైన ఆలోచన! సాలోచనగా బుర్రూపాడతను శ్రీ రామచంద్రుడిలో చాలా గొప్ప గుణాలున్నాయి. వాటిలో రెండు చాలా ఉన్నతమైనవి-ఒకటి శాంత స్వభా వం. రెండవది-కృతజ్ఞతా భావం. చిన్నప్పటినుంచీ నిన్ను చూస్తున్నవాడిని కాబట్టి గుణాలు నీలో కూడా ఉన్నాయనుకుంటు న్నాను. అందుకే మృణాళినిని నీకప్పగించి మీ అత్తయ్యతో కలసి తీర్థయాత్రలకు బయల్దేరా లనుకుంటున్నాను. ఇక ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే పిల్ల ప్రవర్తన చూస్తుంటే ఇప్పటికిప్పుడే పెళ్ళి చేసుకునే మూడ్ లో లేదనుకుంటాను. ఇక నేను మాత్రం చేసేదేముంది? పిల్ల తలవ్రాత! వేదాంతం వల్లించడం కాదు గాని, మనం అనుకున్నవన్నీ మనకు అనుకూలంగా జరగవుకదా! ” 



అప్పుడు గది గుమ్మం వద్ద అలికిడి వినిపించింది. ఇద్దరూ అటు తిరిగి చూసారు. కొత్త చీర కట్టుకుని మృణాళిని గది గుమ్మం వద్ద నవ్వుతూ నిల్చుంది. నేను డిస్టర్బ్ చేస్తున్నానా పెద నాన్నా!
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 11-04-2026, 02:09 PM



Users browsing this thread: 1 Guest(s)