Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - పుణ్యం కోసం
ఒక యోచన - ఒక అవలోకన

రచన: పాండ్రంకి సుబ్రమణి



మంగళాపురం కాలనీ మొదటి రోడ్డు వచ్చేటప్పటికి దక్షిణ మూర్తి కారు వేగం తగ్గించి సుదీర్ఘంగా సాగే పక్క దారిలోకి మలుపు తిప్పాడు. కాసేపు ముందుకు కారుని డ్రైవ్ చేస్తూ ఆపాడు. పిదప ఫ్రంట్ డోరు తెరిచి డ్రైవింగు సీటునుండి క్రిందకు దిగి నవ్వు ముఖంతో మేనల్లుడు సుదర్శనం వేపు సాభిప్రాయంగా చూసి, ఇక దిగమన్నట్టు సంజ్ఞ చేసాడు. 



సుదర్శనం వెంటనే దిగలేదు. ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి ప్రయత్నిస్తూ మీ ఫ్రెండు వాళ్ళ యిల్లు అన్నావే! ఇదేనా మామయ్యా! ” 



దక్షిణమూర్తి విప్పారిన ముఖంతో తలూపాడు. అప్పుడు సుదర్శనం తల విదిలిస్తూ అన్నాడు- కాదు మామయ్యా! ముమ్మాటికీ ఇది ఇల్లు కాదు. సుందరమైన శ్వేత భవంతి అంటూ ఇంటిని ఇంకా విస్మాయాత్మకంగా పరకాయిస్తూ కారు నుండి దిగాడు. యింటిని చూసి సుదర్శనం అంతలావు అబ్బురపడటానికి కారణం ఉంది. బోలెడంత కారణం ఉంది. దక్షిణామూర్తి వాళ్ల చిన్ననాటి మిత్రుడింటికని బయల్దేరదీసినప్పుడు అదేదో తమ స్థాయిలోనో లేక తమకంటే కాస్తం పై ఎత్తున ఉండే బంగళా టైపు ఇల్లో అయుంటుందనుకునే మామయ్య వెంటవచ్చాడు. తీరా యిప్పుడిక్కడకు వచ్చి చూస్తే అదొక వైట్ హౌస్ తరహా కళాత్మక కట్టడంలా ఉంది. 
మామయ్యతో కలసి అడుగులు చేస్తూ అన్నాడతను- అయితే మామయ్యా.. మొత్తానికి మీ దివంగత ఫ్రెండు మోతుబరి వ్యాపారస్థుడే కాదు, మంచి రసికత గల కళాకారుడు కూడానన్నమాట!



వ్యాపారం వల్ల చేకూరిన ద్రవ్యార్జన మాత్రమే కాదు, అతడికి పిత్రార్జితంగా యాబై యెకరాల వరిభూమి కూడా సక్రమించింది.



అప్పుడు సుదర్శనం గంభీరవదనంతో అన్నాడు-బ్యాడ్! వెరీ బ్యాడ్! పూర్తిగా అనుభవించకుండానే వెళ్ళిపోయాడు. వెళ్ళి పోయినవాడు తానుగా వెళ్ళిపోకుండా తన భాగస్వామినిని కూడా వెంట తీసుకెళ్ళిపోయాడు. అందుకే అంటారు దేనికైనా ప్రాప్తం ఉండాలని!



లోపల దక్షిణమూర్తి వచ్చిన అలికిడి గమనించి, నౌఖర్లిద్దరూ మెయిన్ గేటు తీసి దక్షిణాముర్తికి దండాలు పెట్టి అతడి చేతినుండి సూటుకేసు అందుకుని అమ్మగారు మీ కోసం యెదురు చూస్తున్నారయ్యా! అంటూ లోపలకు వెళ్ళిపోయారు; వాళ్ళు వచ్చిన కబురు మృణాళినికి అందజేయడానికి. 



అప్పుడు దక్షిణమూర్తి అదే చెరగని చిరునవ్వుతో వెనుతిరిగి అడిగాడు- తోట నచ్చింది కదూ!
దానికి సుదర్శనం నవ్వూతూ స్పందించాడు- మళ్ళీ అదే మాటా! ఇది భూలోకానికి చెందిన తోట కాదు మామయ్యా! కుబేరుడి చైతన్యరథం. ఇంకానయం, దీనిని సత్యభామ చూడలేదు. చూసుంటే శ్రీకృష్ణుడి చెవిలో ఊది సొంతం చేసుకున్ను. మరి దీనిని సాకటానికి చాలా ఖర్చే--
కాదు. అంతవదు. హార్టికల్చర్ కోర్సు పూర్తిచేసిన మృణాళినికి పనంటే చాలా ఇష్టం. తోటిమాలితో కలిసి అంతా తానై చూసు కుంటుంది. తోటిపని ఆహ్లాదకరమైన వ్యాయామం కదూ!



వావ్! షి ఈజ్ గ్రేట్! అయినా నువ్విక్కడికి ఇంత ఆలస్యంగా తీసుకొచ్చి నాకు అన్యాయం చేసావు మామయ్యా!



అన్నీ కుదరాలి కదోయ్! మనూరేమో ఇక్కడికి యాభై కిలోమీటర్ల దూరాన ఉంది. నువ్వేమో ఊళ్లో ఎప్పుడు కుదురుగా ఉన్నావని? ఆది నుంచీ రెసిడెంటు కాలేజ్లోనూ, కాలేజీ హాస్టల్ లోనూ కాలం గడిపేవాడివి. ఇప్పుడిప్పుడే కదా కోర్సులన్నీ పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించి ఊరుచేరావు. తరవాత తీరుబడిగా నా కంటబడ్డావు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది?



అమ్మా నాన్నా ఇక్కడికెప్పుడైనా వచ్చారా మామయ్యా!



రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళారు. ఒకసారేమో తిరునాళ్ళప్పుడు మృణాళినితో రోజుంతా గడిపి వెళ్ళారు కూడాను



ఇంతకూ నేనెందుకు ఇక్కడికి వచ్చానో మృణాళినికి తెలుసా మామయ్యా? లేక ఆమెను సస్పెన్షన్ లో ఉంచేసావా?



దక్షిణ మూర్తి బదులివ్వలేదు. నవ్వి ఊరుకున్నాడు. చిరువయసు నుండీ అతడికి మామయ్య వద్ద మాలిమెక్కువ. ఇద్దరూ లోపలకొచ్చి ఆసీనులవడానికి సిధ్ధమవుతున్నప్పుడు మృణాళిని మేనత్త కాంచనమాల కళ్లజోడు సవరించుకుంటూ వచ్చి వాళ్ళకెదురుగా కూర్చుంది. దక్షిణామూర్తి సోఫాలో కూర్చున్నాడు గాని సుదర్శనం మాత్రం ఆసీనుడు కాలేదు. నమస్కరించి నిల్చున్నాడు. 



ఆమె తనలోని ఆరాటాన్ని ఆపుకోలేక అతడి నమస్కారాన్ని అందుకోకుండానే కూర్చోమని సైగ చేస్తూ అతణ్ణి కన్నార్పకుండా చూడసాగింది. సుదర్శనం మరుపలుకు లేకుండా కూర్చున్నాడు, లోలోన యిబ్బందికి లోనవు తూనే-- ఆమె అంత దీర్ఘంగా యెందుకు చూస్తుందో అతడికి తెలియకపోలేదు. సకల సంపదలకూ యేకైక వారసురాలైన ఆమె మేన గోడలకు తను తగిన వాడా కాడా అన్నదే ఆమె కున్న జిజ్ఞాస! 



అసలామెగారి మేనగోడలు అంతటి శ్రీమంతురాలని తన కెలా తెలుసు? మామయ్య పూర్తిగా చెప్తేనేగా! ఎట్టకేలకామె తనలో తను నవ్వుకుంటూ మనసున కలిగిన సంతృప్తి భావానికి సూచనగా తల పంకిస్తూ దక్షిణమూర్తి వేపు మెచ్చుకోలుగా చూసింది. మొత్తానికి ఎక్స్ రే వంటి ఆమె చూపులు మొదట సుద ర్శనానికి అసహనం కలిగించినా ఆమె ప్రశాంత వదనం తెరపిని కలిగించింది. సోఫాలో కుదురుగా సర్దుకుని కూర్చుంటూ అనుకున్నాడు; ఇక్కడ కథ కొంచెం తారు మారుగానే ఉందనిపించింది. 



ఫెళ్ళి చేసుకోబోయేవాడికి అమ్మాయి నచ్చిందో లేదో అన్నది కాదిక్కడ ముఖ్యమైన అంశం. తను నచ్చాలి! అలా ఆలోచిస్తున్నప్పుడు అటునుంచి వినిపించింది ఉత్సాహంతో ఉరకలెత్తే ఒక తియ్యటి గొంతు-ఎప్పుడొచ్చారు పెదనాన్నా? మీరొచ్చిన అలికిడే వినిపించలేదు, తోటమాలి వచ్చి చెప్తే తెలిసింది అని రంగుల రవ్వల్ని వెదజల్లుతున్నట్లు గల గలా మాట్లాడుతూ సుదర్శనాన్ని ఓపారి నిదానందా చూసి హాయ్ ఎలాగున్నారు? బ్యాంకులో ప్రొబెషనరీ ఆఫీసరు పోస్టులో జాయినయారటగా! ప్రక్క ఊళ్ళోనే పోస్టింగటగా! కంగ్రాట్స్! అంటూ వాళ్ళ మధ్యకు వచ్చి కూర్చుంది. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 11-04-2026, 02:06 PM



Users browsing this thread: 1 Guest(s)