09-04-2026, 07:41 AM
Part - 28
అందరూ బయటికి వచ్చి.. హస్బెండ్స్ బైక్స్ స్టార్ట్ చేస్తారు. ఏమిటి ఇప్పుడు బైక్స్ మీద వెళ్లడమా అని అవని ఆశ్చర్యంగా అడిగితే.. నేనైతే యూత్ తమరు కాదా ఏమిటి అని చిన్నగా అడుగుతాడు..
మీరైనప్పుడు నేనెందుకు కాను అని చిన్న జెలసితో చెబుతుంది. మరి ఇంకేంటి ప్రాబ్లం..ఎక్కు.. సరే అని ఒక పక్కకి కూర్చుంటుంది.
హలో మేడం నేను.. అమ్మమ్మలాగా కూర్చోమనలేదు. మన పెళ్లి అయిన కొత్తలో ఎలాగో అలాగా.. అవ్వ సిగ్గు లేకపోతే సరి...
పక్కనే పిల్లలు ఉన్నారు. వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలని ఉత్సాహపడుతున్నారు..ఎక్కండి మేడం.. పక్కన వాళ్ళ గురించి ఆలోచించొద్దు.
ఇది మన లైఫ్. మనం ఎంజాయ్ చేయాలి. ఒక్కసారి మీ ఆడపడుచుని, తోటి కోడల్ని, నీ సీనియర్ ని చూడు అనగానే...నివి, పూజిత, నేహా టు సైడ్స్ కూర్చుని భుజాల మీద చేతులు వేస్తారు.
ఇప్పుడు అర్థమైందా ఎవరి లైఫ్ వాళ్ళ ఎంజాయ్ చేయాలి. ఎవరో వచ్చి చెప్పారు. మీరు మరి కుర్రోడు అయిపోతున్నారు.
చెప్పాను కదా నేను యూతే అని మరి నా పెళ్ళాన్ని కూడా యూత్ చేద్దామని నా తాపత్రయం అంతా.. ఏం చేద్దాం చెప్పు.
ఇక తప్పక అవని టూ సైడ్స్ కి కూర్చుంటుంది. భరత్ లుక్ విద్యాకి అర్థమయి... విద్య కూడా అలాగే కూర్చుంటుంది.
సూర్య శ్రీకర్ భుజం మీద చేయి వేసి మీ మామగారు చూడరా.. ఒక్క కంటి చూపుతోనే మీ అత్తయ్య ని కంట్రోల్ లో పెట్టేస్తున్నాడు.
ఫ్యూచర్ లో నేను కూడా అదే ఫాలో అవుతాను బావ. నువ్వు అది కాదు ఫాలో అయ్యేది. మరి ఇంకేం ఫాలో అవుతాను.
మా సౌమ్య కంటి చూపుకి నువ్వు ఫాలో అవుతావు. అంత ఉందా మీకు.. ఎంత ఉందో చిన్నప్పటినుంచి చూడడం లేదా..
ఎక్కడికైనా డేట్ కి తీసుకువెళ్లావా.. లేదు...ఏదైనా అంటే సౌమ్య భయపడుతుంది. కంగారు పడుతుందని కహానీలు చెబుతున్నావు.
అప్పుడెప్పుడో ఏదో ప్రపోజ్ చేశావు. ఇంకా అంతే అయిపోయింది. ఏం చేయను బావ.. ఎప్పుడు బయటికి తీసుకువెళ్లదామన్నా..
అమ్మో కాలేజ్ ల్యాబ్ లు, టెస్ట్ లు అది కోయడం.. ఇదిగో అని పారిపోతూనే ఉంటుంది.
నాకు మాత్రం ఉండదా నా బుజ్జి పప్పీ తో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి అని.. వీక్ డేస్ కాలేజ్ అని పారిపోతుంది. వీకెండ్స్.. అమ్మో నాన్న అంటుంది.
మరి ఎలా రా... ప్రయత్నించు... సాధించు అప్పుడే ఆ ప్రేమలో ఉన్న గమ్మత్తు తెలుస్తుంది.. నేనంటే ప్రేమలో ఉన్నాను కాబట్టి నేను చెబితే అర్థం ఉంటుంది.
నువ్వు అసలు ప్రేమలో పడకుండానే చెబుతున్నావు. ఏంటి కథ.. దీనికోసం ప్రేమలోనే పడాల ఏమిటి.. ఎన్ని సినిమాలు చూడటం లేదు.
నేత్ర ఆనందం వేరు... మానసిక అనుభూతి వేరు. ఏమో అవన్నీ నాకు తెలియదు. చెప్పాలనిపించింది చెప్పాను. నచ్చితే ఫాలో అవ్వు. నచ్చకపోతే ఇక్కడే వదిలేసి బైక్ ఎక్కు...
ఆ యూత్ కపుల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. మనమే లేటు. ఇంకా లేట్ చేసామనుకో... మనల్ని ఓల్డ్ పీపుల్ కింద లెక్క వేస్తారు.
అందులో రాజ్ మామ, శ్రీ అంకుల్ ముందుంటారు. మనకి అవసరమా పదా.. అది నిజమేలే మా నాన్న మరీ ఆడేసుకుంటున్నారు.
వైభవ్ ఒక బైక్ మీద... శ్రీకర్, సూర్య ఒక బైక్ మీద వెళుతూఉంటారు. ఎలాగైనా మనం వయసును వేస్ట్ చేసేస్తున్నాం బావ.
ఎందుకనిపించిందిరా.. మరి లేకపోతే చూడు.. నా పిల్ల పక్కన ఉన్నా సరే ఒక ముద్దు ముచ్చట ఉండదు. ఆ వైభవ్ గాడికి ప్రేమలో పడిన అది ప్రేమ అని వాడికి తెలియదు. అమ్మో దానితోనా అంటాడు.
ఇక. నీ సంగతి.. ఇంక నిన్ను ఆపమన్నానా... అరే నిజాలు మాట్లాడుతున్నప్పుడు యాక్సెప్ట్ చేయాలబ్బా.. ఏమిటో ఈ సమాజం..
సమాజం గురించి ఎందుకులేగాని... మన గురించి మాట్లాడుకుందాం. మన గురించి మాట్లాడుతుంటేనే కదా తమరికి నచ్చడం లేదు.
నువ్వు ఊహించుకుంటున్నంత సీను లేదు విశి నాకు మంచి ఫ్రెండ్ అంతే.. తను ఇబ్బందుల్లో ఉంది ఒక ఫ్రెండ్ గా నేను ఎంత హెల్ప్ చేయగలనా అని మాత్రమే ఆలోచిస్తున్నాను.
అవునా అని ఒరేయ్ వైభవ్ అని పిలిస్తే.. పక్కనే వెళుతూ చెప్పు బావ. మీ వదిన దొరికేసింది రా.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా..
నాకు ఇప్పటివరకు చెప్పలేదు. నేను అలిగాను. ఐ హర్ట్ అబ్బా. ఒరేయ్ నీ అలకలు పక్కన పెట్టు. నీకు ఇన్ఫర్మేషన్ కావాలా వద్దా అని శ్రీకర్ అడిగితే.. సూర్య కోపంగా నిన్ను ముయ్యమన్నానా...
చూసావా వైభవ్.. క్యూటి ఇన్ఫర్మేషన్ కావాల్సినంత వరకు నిన్ను వాడుకున్నాడు.. ఇప్పుడు తెలిసిన తర్వాతే నీకే చెప్పొద్దంటున్నాడు .
అంతే బావ.. ప్రేమ వచ్చేటప్పటికి రక్తసంబంధాలకి విలువ లేకుండాపోతుంది. ఏమి చేద్దాం అని రాని కన్నీరు తుడుచుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు.
నీ ఎకసక్కలు వదిలి ముందుకు చూస్తూ డ్రైవ్ చేయ్.. లేకపోతే రాని కన్నీరు నిజంగానే వస్తుంది. నా చూపు రోడ్డుమీద... నా చెవులు బావ చెప్పే క్లూ మీద ఉంది అన్నయ్య. పర్వాలేదు.. నువ్వు చెప్పు బావ.
క్లూ అన్నావు కాబట్టి మీ వదిన గురించి నీకు ఒక క్లూ ఇస్తాను బామ్మర్ది... క్యాచ్ చెయ్.. చెప్పు బావ. మా అందరికన్నా ఫస్ట్ నువ్వే కలిసావు. నువ్వే మాట్లాడావు. ఎవరో చెప్పుకో చూద్దాం..
ఇది నిజంగానే అగ్నిపరీక్షలాగా ఉంది. రోజుకి నేను చాలామంది అమ్మాయిలతో మాట్లాడతాను. గోకుతాను. అలాంటిది వదిన ఎవరు అన్నది ఎలా తెలుసుకోవాలి.
అందుకే రా నిన్ను చందు... నాలుగు పీకేది. ఇంత ఆనందకరమైన సమయంలో ఆ రాక్షసి గురించి ఎందుకు బావ.
నీ రాక్షసి నీకు ముద్దుగా ఉంటుంది కదా అందుకనే గుర్తు చేశాను.. ఏరా బాగోలేదా.. టాపిక్ డైవర్ట్ చేయకు. చెప్పు బావ. నీకు ఇంత పెద్ద క్లూ ఇచ్చిన నువ్వు కనుక్కోకపోతే నిజంగానే వేస్ట్ రా...
ఈసారి ఇంకొక క్లూ ఇవ్వు పట్టేస్తాను. సరే ఇప్పుడు ఇచ్చేది మాత్రం చాలా ఈజీ క్లూ.. నలుగురికి భోజనం పెట్టాలి అనుకునే అన్నదాత.
ఎవరి గురించి చెప్తున్నావు బావ. విశిష్ట కదా ఈ పనులు చేసేది... చాలా దగ్గరికి వచ్చేసావు. క్యూటీనే.. విశిష్టాన... విశిష్ట నాకు కాబోయే వదిన...
యాహువా అని అరుస్తాడు. ఒరేయ్ అరుపులేమిటిరా... డీసెంట్ గా డ్రైవ్ చేయి.. ఎలా అన్నయ్య ఇంత హ్యాపీ న్యూస్ తెలిసాక కూడా అంత స్టేబుల్ గా ఉండగలుగుతున్నావు.
హలో బామ్మర్ది... మీ అన్నయ్య ఏమి స్టేబుల్ గా లేడు. అక్కడే పక్కకు వెళ్లి డాన్స్ చేశాడు..ఈరోజు ట్రీట్ అంత ఇచ్చేదే మీ అన్నయ్య.
నేను డాన్స్ చేసిన విషయం నీకు ఎలా తెలుసురా... మాకు వెనకాల కూడా కళ్ళు ఉంటాయి బాబు. తమరు ఏం చేస్తున్నా నాకు తెలిసిపోతుంది.
చిన్నప్పటినుంచి నిన్ను చూడడం లేదా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తావో నాకన్నా బాగా ఎవరికి తెలుసు..ఇంతకీ వదినకి విషయం చెప్పారా.
వదినని కూడా తీసుకువచ్చి ఉంటే ఫ్యామిలీకి పరిచయం చేసేవాళ్లం కాదా... నువ్వు మరీ అంత అడ్వాన్స్డ్గా వెళ్లకు. అసలు విశిష్ట కి సూర్య ఎవరో తెలియదు.
అదేమిటి.. మీ వదిన గుర్తుగా మీ అన్నయ్య దగ్గర రింగ్ ఉన్నట్టే.. మీ అన్నయ్య గుర్తుగా మీ వదిన దగ్గర కూడా ఉంది.
కాకపోతే అది సూర్య ఇచ్చినదే అన్నది తెలియదు. వాళ్ళ నాన్నగారు ఏదో స్టోరీ చెప్పారు. అదే నిజం అనుకుంటుంది. అవునా... ఇప్పుడు ఎలా..
అదంతా సూర్య చేతిలోనే ఉంది. మీరిద్దరూ ఇంక మూస్తారా.. ఏమీ లేని దానికి ఒక సినిమా క్రియేట్ చేస్తున్నారు.
ఏంటి బాబు... మేము సినిమా క్రియేట్ చేస్తున్నామా... క్యూటినే విశిష్ట అని తెలియగానే నీ మొఖం చిచ్చుబుడ్డి లాగా వెలిగిపోలేదా...
అంటే అప్పటికే మనం వెతుకుతూఉన్నాం కదా.. దొరికేటప్పటికీ హ్యాపీగా అనిపించింది. ఏ నీకు మాత్రం కావాల్సింది దొరకగానే సంతోషపడవ ఏమిటి..
మేమనేది కూడా అదే సూర్య. నీకు కావాల్సింది నీ ఎదురుగుండా ఉంది. గుర్తించు అంటున్నాము. తమరే ఇంకా స్నేహం స్నేహం అంటున్నారు.
ముగ్గురు ఒకచోట ఆగితే... వైభవ్ వెళ్లి సాఫ్ట్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇస్తాడు. డ్రింక్ తీసుకుని సూర్య మౌనంగా తాగుతూ ఉంటే.. ఏంటి సూర్య ఏదో చించుతున్నట్టున్నావు.
ఏమోరా... మీరేమో ప్రేమ అంటున్నారు. నేనేమో స్నేహం అంటున్నాను. విశి ఏమో తెలిసిన మనిషి అనుకుంటుంది. ఇంత ట్రయాంగిల్ లో ఏది కరెక్ట్ ఓ తెలియడం లేదు.
మేమందరం చెప్పడం కాదు. నీకేమనిపిస్తుందో అది ఆలోచించు... చాలా కన్ఫ్యూషన్ గా ఉంది.. కన్ఫ్యూషన్ లో నుంచి వచ్చేదే ప్రేమ. అలా అని ఫోర్స్ చేయము. నువ్వే ఆలోచించు.
విశి గురించి తెలియగానే అంకుల్ ఎక్కడ ఉన్నారు అని కూడా చూడకుండా నీ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నావు. సడన్ గా ట్రీట్ ఇచ్చావు.
విశిని స్ట్రాంగ్ చేయాలి అనుకుంటున్నావు. మరి ఇవన్నీ ఏమిటిరా.. అది.. ఫ్రెండ్ అని మాత్రం చెప్పకు. అంతకుమించి మీ ఇద్దరి మధ్యన ఉంది. అది ఏమిటో నువ్వే చెక్ చేసుకో.. అంతేనా వైభవ్.
ఏమో బావ ఈ ప్రేమల గురించి నాకు ఏమీ తెలియదు. తెలిసిన తర్వాత నేను కూడా నీలాగే సలహాలు ఇస్తాను.
మనగోల లో పడి ఇక్కడే ఆగిపోయాము. ఈ లవ్ కపుల్స్ ఎక్కడికి వెళ్లిపోయాయి. వాళ్లతో మనకెందుకురా... ఎక్కడికో ఎగురుకుంటూ వెళ్ళుంటారు.
రాత్రికి గూటికి చేరుకుంటాయి కదా.. అప్పుడు తెలుస్తుందిలే...
ఆ గౌతమ్, హిమల గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమన్నాను. ఎంతవరకు వచ్చింది. ఆల్మోస్ట్ మొత్తం కలెక్ట్ అయింది.
రేపటి నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆపరేషన్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు కదా అన్నయ్య..
ఇక్కడ నేను కనబడను రా.. అంతా విశిష్టనే.. నేను జస్ట్ బ్యాక్ బోన్ గా ఉంటాను. వదినకి నన్ను అసిస్టెంట్ చెయ్యి..
ఇంకొకసారి వదిన అన్నావు అంటే... సరే... సరే నా ఫ్రెండ్ కి నన్ను అసిస్టెంట్ ని చేయి.
సూర్య నిర్ణయం...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)