09-04-2026, 02:29 AM
గిరిధర్..
ఈ భూమ్మీద పుట్టిన ప్రతీ మనిషి వాడిలా ఒక్కరోజు బతకాలని అనుకుంటాను. అంత మంచివాడు, అంత దయగలవాడు, అంత సహృదయుడు. నాకు కొడుకు వరస అవుతాడు. ఓ మనిషిని ఇంతలా ప్రేమిస్తారని వాడిని చూసాకే తెలుసుకున్నాను. అలానే నేనూ ఓ మనిషిని అంతలా ఆరాధిస్తానని వాడిని ప్రేమించే వరకూ తెలియదు. కొడుకు వరస అని మళ్ళీ ప్రేమా అంటుంటే ఇది చదివేవాళ్ళకి చెత్తగా అనిపించవచ్చు కానీ వాడి ప్రేమలో తడిసిన నాకు మాత్రమే తెలుసు ఆ ప్రేమ విలువ. నాకు సంబంధించి అది వెలకట్టలేనిది. గిరిధర్ ని ప్రేమించానని చాలా గర్వంగా చెపుతాను.
వాడికి సంబంధించిన ప్రతీ విషయం నాకు గుర్తే.. నా చిన్నతనంలో కృష్ణపట్నం తప్పించి పెద్ద బడులు ఉండేవి కాదు. ఊళ్లలో మొదటి తరగతి వరకు, ఆ పైన పెద్ద బళ్ళు అంటే ఐదవ తరగతి వరకు మాత్రమే ఉండేవి. పై చదువు అదే.. మెట్రికులేషన్ చదవాలంటే అయితే గూడూరు, లేదంటే నెల్లూరు వెళ్లాల్సి వచ్చేది. కృష్ణపట్నంలో బడి ఉన్నా వసతులు బాగుండేవి కాదు. ఆడపిల్లలం కృష్ణపట్నంలోనే చదువులు కానిచ్చేసేవాళ్ళం. అలా నాకు గిరిధర్ చిన్నప్పటి నుంచీ తెలుసు. మాకు వాడు చాలా దూరపు చుట్టాలు అవుతారని నాకు వాడిని కలిసేవరకు తెలియదు. రెండూర్ల అవతల ఉండేవాడు గిరిధర్. అందువల్ల మాది ఒకే బడి, నాకంటే ఏడాదిన్నర చిన్నవాడు గిరి.
గిరి చిన్నప్పటి నుంచీ అంతే వాడి చూపు నా మీద ఉండేది. ఐదో తరగతి తరువాత వాళ్ళ నాన్న వాడిని బడి మానిపించేసాడు. అక్కడి నుంచి ఊళ్లు పట్టుకుని తిరుగుతూ కూలి పని చేసాడు. ఇవన్నీ నాకసలు గుర్తు లేవు, అన్నీ వాడే చెప్పాడు. పదో తరగతి మొదలవుతుందనగా ఓ పెళ్లిలో నన్ను కలిసాడు, నేనసలు వాడిని గుర్తుపట్టలేదు. వాడే పరిచయం చేసుకుని వాడే నాకు గుర్తు చేసాడు. అక్కడే వాళ్ళ అమ్మ నాకు వాడికి చుట్టరికం కలిపింది. గిరి వాళ్ళు ఆస్తిపరులు, ఇక్కడే గిరి వాళ్ళ అమ్మ జాగ్రత్త పడింది. ఆమె మొత్తం కథ చెప్పలేదు, గిరి వాళ్ళ నానమ్మ ద్వారా తెలిసింది ఏంటంటే నాకు గిరిధర్ కి రెండు రకాలుగా చుట్టరికం ఉందని..
మా మేనత్త వియ్యంకులకి ఒక రకంగా మా మావయ్య తరపున ఇంకో రకంగా చుట్టరికం ఉంది గిరిధర్ కుటుంబానికి. అందువల్ల ఒకలా గిరి నాకు కొడుకు వరస, ఇంకోలా నాకు బావ వరస అవుతాడని తెలిసింది. వాడు నా వెంట పడిన విధానానికి నేను త్వరగానే కరిగిపోయాను. అందరి ముందుకు వాడికి పిన్నిని, పెద్దదాన్ని. ఎవరూ లేనప్పుడు వాడికి మరదలిని, చిన్న దాన్ని. అదీ వాడి ప్లానే.. చాలా చురుకైన వాడు. త్వర కాలంలోనే అమ్మని పోగొట్టుకున్నాడు. ఇంట్లో ఆడమనిషి లేకపోవడంతో నరకం కనిపించింది గిరికి.. కారణం తన చెల్లి జానకి.
పుట్టుకతోనే వెన్నెముక సరిగా లేనందు వల్ల జానకి మంచానికే పరిమితం. పసిగుడ్డుని చంపుకోవడానికి గిరి వాళ్ళ ఒప్పుకోలేదు, ప్రేమగా జానకిని సాక్కుంది.
ఇప్పుడు ఆమె లేదు. జానకికి బట్టలు మార్చడానికి, తన అవసరాలు చూసుకోవడానికి ఇంట్లో ఇంకో మనిషి లేదు. ఉన్నా ఎంతకాలం సేవలు చేస్తారు, అప్పటికీ గిరి నాన్న రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ పెళ్లి వెనక ఉద్దేశం అందరికీ తెలిసి ఎవ్వరు ముందుకు రాలేదు. అదే పరిస్థితి గిరికి కూడా ఎదురైంది. ఒకరైతే ఆ బతికున్న శవాన్ని బైట పారేస్తే తప్ప మీకు మంచి రోజులు రావని మొహం మీదే అనేశాడు, తరువాతి రెండు రోజుల్లో వాడి నాలిక తెగిపోయింది. ఇక్కడే నాకు అవకాశం చిక్కింది. ఇంట్లో వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేశాను. విఫలం ఎదురైంది. ఇంట్లో నుంచి పారిపోయి గిరి పంచన చేరితే మా నాన్న ఊరి పెద్ద మనుషులతో గిరిని కొట్టించి నన్ను బలవంతంగా లాక్కుపోయి ఇష్టం లేని పెళ్లి చేశారు.
అమ్మ దూరం అవడం, నేను పక్కన లేకపోవడం, ఉన్నా లేనట్టి చెల్లి. గిరిని పిచ్చివాడిని చేసింది. ఇంట్లో నుంచి పారిపోయి మళ్ళీ రెండు రోజుల్లోనే తిరిగి వచేసాడు. బాగా ఆలోచించగా వాడికి ఒకటే మార్గం కనిపించింది. వాడి వెన్నెముకని, ఎముకలోని గుజ్జుని చెల్లికి దానం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికి నేను వాడిని దొంగతనంగా కలుస్తూనే ఉన్నాను. మా వారు ఉద్యోగ ప్రయత్నాల్లో గుంటూరు, విజయవాడ తిరుగుతున్నారు. ఏదో ఒకరోజు వాడి దెగ్గరికి వచేస్తానని వాడికి చెపుతూనే ఉన్నాను, అది చేస్తానని నాకూ తెలుసు.. కానీ వాడి నిర్ణయం విన్నాక నా నోటా మాట రాలేదు.
చెల్లి రేపో మాపో పెద్ద మనిషి అవుతుంది. నాకున్నవి రెండే దారులు. ఒకటి నా చేతులతో నేనే నా చెల్లిని చంపడం. రెందోవది ఇది. మొదటిది నేను చెయ్యలేను, రెండవది నేను మాత్రమే చెయ్యగలను అన్నాడు. నీకేమైనా జరిగితే అన్నాను, తల దించాడు గిరి. అన్ని వసతులు లేవు, బతికే అవకాశాలు యాభై శాతం మాత్రమేనాని చెప్పారట. కానీ వంద శాతం బతికిస్తామని హామీ ఇచ్చారు అని చెప్పాడు. నాకు నమ్మకం లేదు. ఆ తరువాత రెండు పక్షాలు నేనసలు వాడిని చూడనేలేదు. ఉన్నాడో పోయాడో తెలియక, ఉండబట్టలేక ఇంట్లో నుంచి మళ్ళీ పారిపోయాను. గిరి ఇంటికి వెళ్లి చూస్తే గిరి ఉండాల్సిన చోట జానకి నిలుచుని ఉంది. జానకి మంచంలో గిరి పడుకుని ఉన్నాడు. ఆపరేషన్ సరిగ్గా జరగక వైద్యం బెడిసికొట్టింది అన్నారట డాక్టర్లు. వంశీ జీవితంలో ఇక నడవలేడు. ఆ పూట మొత్తం వాడిని చూస్తూ ఏడుస్తూనే ఉన్నాను. నాతో పాటు జానకి కూడా ఏడ్చింది. ఆ రోజే చెప్పింది జానకి, అన్నయ్యకి తోడుగా పక్కనే ఉండి తన శేష జీవితం గడిపేస్తానంది. ఆ ఇద్దరినీ చూస్తే ముచ్చటేసింది నాకు.. ఒకరికోసం ఒకరు పుట్టినట్టు అనిపించింది. చెల్లి కోసం ప్రాణాలకి లెక్కచెయ్యని అన్న.. అన్న కోసం జీవితాన్నే అంకితం ఇచ్చేసిన చెల్లెలు. నేనూ మీతో పాటే అని తెగేసి చెప్పాను. కానీ గోపి ఒప్పుకోలేదు.. నాన్న వాళ్లకి కూడా నేను ఎక్కడున్నది తెలిసిపోయింది. పెద్ద గొడవలే జరిగాయి. అదే గిరి నాతో చివరిగా మాట్లాడింది. తన మీద ఒట్టు వేయించుకున్నాడు.
నీకు ఒంటరిగా అనిపించినప్పుడు,
నువ్వు ఒంటరి దానివి అయినప్పుడు
బంధాలు, బాధ్యతలు లేనప్పుడు
ఇక మిగిలింది చావే అని నాకు అనిపించినపుడు
ఆ రోజు వచ్చే వరకూ
తన దెగ్గరికి రావొద్దని ఒట్టు పెట్టించుకున్నాడు.
నా భర్త నన్ను బలవంతంగా ఊరు దాటించడం. రేప్ చేసినందుకు పుట్టిన కూతురు. నాకు జీవితం మీద అసహ్యం వేసింది. రోజూ గిరి చెప్పే మాటలు తలుచుకునేదాన్ని. ఆ ఆలోచనల్లో నుంచే నా కూతురిని ప్రేమించడం మొదలుపెట్టాను. గిరికి నాకు ఆడపిల్ల పుడితే నిహారిక అని అనుకున్నాం. ఆ పేరే నా కూతురికి పెట్టాను. తనే నా సర్వసం అయిపోయింది. గిరి ఆలోచనలని నా నుంచి పూర్తిగా దూరం చేసింది నా కూతురు. నా భర్త క్రూరుడు అయినా నా కూతురికి ఏనాడు తెలియనివ్వలేదు. అది నాకు, నాకు అది.. కూతురు ప్రేమలో పడ్డ నాకు గిరిని చేరే అవకాశం ఈ జన్మలో ఇక రాదు అని అర్ధమైపోయింది. అయినా బాధ లేదు. నిహారిక తోడుగా నా జీవితం తృప్తిగా ఉంది. ఈ ఏడాదికి ఇంతే... పూర్ణమ్మ అని రాసి ఉంది.
నిహారిక రాసిన తేదీ చూస్తే అది తన అమ్మ పుట్టిన రోజు నాడుఅని తెలిసింది, అలా ప్రతీ పుట్టిన రోజుకి గిరి గురించి రెండు మూడు పేజీలు రాసింది పూజ. అవన్నీ చదివారు నిహారిక, వంశీ ఇద్దరూ..
మనం కృష్ణపట్నం వెళ్ళాలి అంది నిహారిక కళ్ళు తుడుచుకుని లేచి నిలబడుతూ.. వంశీ కూడా లేచాడు. నిహారిక మంచినీళ్లు తాగుతూ ఎట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళని కలవనివ్వకూడదు. అమ్మ గిరిని కలిసిన మరుక్షణం నన్ను మర్చిపోతుంది, ఈ లోకాన్నే మర్చిపోతుంది. వంశీ నా అమ్మ నాకు కావలి అంది బిగ్గరగా ఏడుస్తూ.. వంశీ కూడా బాధగా హత్తుకున్నాడు.
పూజ మొండిది కాదు, మొండితనానికి అలవాటు పడింది. పూజ గురించి తెలుస్తున్న విషయాలు ఒక్కోటి వంశీకి తెలీకుండానే తన మనసులో ముద్రలా పడుతున్నాయి. ఇప్పుడు అర్ధమవుతుంది పూజ ప్రేమలోని నిజాయితీ.. ఓ రకంగా నన్ను మర్చిపోలేకపోవడమే ఇలా వెళ్లిపోవడానికి కారణమా అని ఆలోచించాడు వంశీ..
బులెట్ బండి కృష్ణపట్నం వైపు దూసుకుపోతుంది. పూజ అక్కడే ఉంటుంది అన్న ఆశ నిహారికది. ఊరికి వెళ్తే తప్ప అమ్మ జాడ తెలియదు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)