Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(5) తల్లి పిల్లా న్యాయం _ completed
#29
(08-04-2026, 02:02 PM)Jalsaa Wrote: ఆ ఒక్క మాట. కుప్పకూలిపోయింది పూజ. అక్కడే నేల మీద పడి ఏడుస్తుంటే నిహారిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పూజ, నిహారిక, వంశీ.. ముగ్గురిలో ఎవరూ ప్రశాంతంగా లేరు. అందరి మనసులో ఒకటే ప్రశ్న.. తరువాత ??


***

తెల్లారింది.
లేవగానే వంశీకి ఫోన్ చేసింది నిహారిక. మనం పెళ్లి చేసుకుందాం వంశీ.. ఎవరెటుపోతే నాకేంటి అంది. వంశీ గొడవ పడ్డావా అని అడిగితే లేదు.. అంది.

నేను చెప్పాను కదా నీకు, ఇందులో తనది ఎంత తప్పో నాదీ అంతే తప్పు ఉంది. అండ్ ఇంతకముందు జరిగినవి కూడా నీకు తెలుసు. నా ఫీల్డ్ అలాంటిది త్వరగా టెంప్ట్ అయిపోతాం అని నీకు పరిస్థితి చెప్పాను కదా

అది వేరే ఇది వేరే అంది నిహారిక 

అత్తా అల్లుడు అవుతామని మాకు తెలీదు కదే.. 

అవన్నీ పక్కన పెడితే ఈ టెంప్ట్ అవ్వాలా వద్దా అన్న దాని గురించి ఆమెకి బాగా తెలుసు, తనేం చిన్న పిల్ల కాదు. మగాడు ఊరికే టెంప్ట్ అవ్వడు, ఆడది చనువు ఇస్తేనే ఏ మగాడు అయినా ముందడుగు వేసేది. నేనేం ఎర్రిపువ్వుని కాదు.

తనని ఏమైనా అన్నావా ?

నేనేం అనలేదు. గొడవ పడ్డాం

నీ దెగ్గర నిజాయితీగా ఉండాలి, నిన్ను పెళ్లి చేసుకున్నాక నేను మీ అమ్మ బాధ్యత కూడా తీసుకుంటాను కాబట్టి నీకు నేనీ విషయం చెప్పాను. రేపటి రోజుల్లో నేను నిన్ను మోసం చేశాను అనే భావన నీకు రాకూడదని చెప్పాను. నువ్వు పిచ్చి ఆలోచనలు చేసి గొడవ పెద్దది చెయ్యకు.

అయినా అది మన పెళ్ళికి ఒప్పుకోలేదు. వద్దని చెప్పింది.  ఆజానుబాహుడిలా నువ్వు  కటింగ్ కొట్టకు.

నువ్వు అప్పుడే ఎందుకు అడిగావ్. తనకి టైం ఇవ్వాల్సింది కదా

నాకు దాని గురించి బాగా తెలుసు, పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. మొండిది. ఒక్కసారి వద్దు అందంటే ఇక అంతే.. దేవుడు దిగి వచ్చినా దాని మనసు మారదు.

ఇందాకటి నుంచి దాన్ని దీన్ని అని ఏంటే ఆ మాటలు.. తను మీ అమ్మ

నువ్వు నిజంగా లక్కీరా బాబు.. నేను కూడా అనాధలా పుట్టాల్సింది.
..
..
..
..
..

కూతురిని ఆఖరిసారిగా చూసుకుందామని వచ్చిన పూజ, కూతురు మాటలు వినగానే అక్కడే ఆగిపోయింది. బాధని మొత్తం దిగమింగి మోహంలోకి నవ్వుని తెచ్చుకుంది. భుజానికి బ్యాగు తగిలించుకుని బైటికి నడిచింది. లిఫ్టు దిగి రోడ్డు వరకు నడిచి చెయ్యి ఎత్తి ఆటో ఆపింది. చివరిగా వెనక్కి తిరిగి చూసి బై తల్లీ అనుకుంటూ ఆటో ఎక్కేసింది.

నీకు ఒంటరిగా అనిపించినప్పుడు
నువ్వు ఒంటరి దానివి అయినప్పుడు
నీ కోసం నా సంపాదనలో ఒక రూపాయి
నా ఇంట్లో నీకో గది, తినడానికి కంచం, పడుకోడానికి మంచం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.

ఇరవై ఎనిమిదేళ్ల క్రితం విన్న మాటలు ఇప్పుడు ఆటోలో తలుచుకుంది. చివరిసారిగా తన కన్నీళ్లు తుడుచుకుంది. వాడి దెగ్గరికి వెళితే ఏడ్చే అవకాశం వాడు ఇవ్వడు. వాడి పక్కన ఉంటే సంతోషం తప్ప ఇంకో భావం ఉండదు. చాలా లేత గొంతు వాడిది, ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో.. వచ్చేస్తున్నా అనుకుంది మనసులో 


స్టేషన్‌కి వెళ్లి కనుక్కుంటే ఇంకో పావుగంటలో నెల్లూరుకి వెళ్లే రైలు ఉందని తెలిసి త్వరత్వరగా ప్లాట్ఫారంకి నడిచింది. అప్పుడే నా సంతోషం మొదలయింది అనుకుంటూ రైలు కోసం ఎదురు చూసి రాగానే పరిగెత్తుకుంటూ రన్నింగులో ఎక్కి కూర్చుంది. ఇవన్నీ తన చిన్నప్పటి ఆటలు. రైలు కదులుతుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు మోహంలో నవ్వుని తెప్పించాయి. ఫోన్ వస్తుంటే చూసింది, కూతురు చేస్తుంది. తన నెంబరు బ్లాక్ చేసి గుంటూరులో తన కొలీగ్ స్నేహకి కాల్ చేసింది.

స్నేహా ఇవ్వాళ నా పనులు మొత్తం అయిపోవాలి 

చేస్తానే.. బ్యాంకు తెరవనీ.. 

సరే అని పెట్టేసింది. తను తీసుకున్న కొత్త నెంబరు ఆక్టివేట్ అయినట్టు నోటిఫికేషన్ రాగానే పాత నెంబరు సిం ఆఫ్ చేసింది. కిటికీలో నుంచి ఎండకి మెరుస్తున్న పట్టాలు, తన వెంటే వచ్చే సూర్య కిరణం, అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోతున్నా కంకరరాళ్లు చూస్తూ ఆనుకుంది.

***

వంశీతో ఫోను మాట్లాడాక బైటికి వచ్చింది నిహారిక. వంశీ మాటలు తనని చల్లబరిచినా నిహారిక మనసులో ఇంకా ఆవేదన తగ్గలేదు. తన తల్లి తప్పు చెయ్యదన్న ఆత్మవిశ్వాసం సన్నగిల్లేసరికి తట్టుకోలేకపోయింది. ఆ కోపంలో వివేకం, విజ్ఞానం కోల్పోయి నోటికొచ్చింది వాగేసింది. రాత్రంతా మేల్కొనే ఉంది నిహారిక. ఓ పక్క తల్లి ఇంకొకరితో శారీరిక సంబంధంలో ఉందన్న విషయం దహించి వేస్తుంటే ఇంకోపక్క ఆ సంబంధం తాను పెళ్లి చేసుకోబోయేవాడితోనని భయంగా ఉంది. భవిష్యత్తులో ఈ టాపిక్ వచ్చిన ప్రతీసారి తన తల్లి జీవితాంతం ఈ మచ్చని మోస్తూనే ఉండాలి. ఏ విషయంలోనూ తల్లిని కించిత్ నైనా తగ్గడానికి ఒప్పుకోదు నిహారిక, అలాంటిది ఇలాంటి ఒక సంఘటనలో తన తల్లి ఉండటం నిహారిక ఇంకా జీర్ణించుకోలేకపోతుంది.

గదిలో నుంచి బైటికి వచ్చి మెల్లగా తల్లి గది వైపుకి వెళ్ళింది.  తొంగి చూస్తే తల్లి కనిపించలేదు. తలుపు తెరిచి బాత్రూం వైపు చూసింది, అది బైట నుంచి లాక్ వేసి ఉండటంతో లోపలికి వెళ్ళింది. అమ్మ కనిపించకపోయేసరికి వెతుకుతూ వంట గది, స్టోర్ రూమ్, బాల్కనీ కూడా వెతికి తన గదిలోకి వచ్చి ఫోన్ తీసుకుని తల్లికి ఫోన్ చేసింది. రింగ్ అవుతున్నా ఎత్తలేదు. ఇంకో రెండు సార్లు చేసినా లాభం లేకపోవడంతో వెంటనే వాట్సాప్ లో సారీ అని మెసేజ్ పెట్టింది. అది సింగల్ టిక్ మాత్రమే చూపించింది. సరే ఎటైనా వెళ్ళిందేమో వస్తుందిలే అని ఊరుకుంది నిహారిక. అమ్మ గదిలోకి వెళ్లి చూస్తే మంచం మీద కాయితాలు కనిపించాయి. వాటన్నిటి మీదా రెండు ఎన్వలొప్స్ ఉన్నాయి. ఒకదాని మీద వంశీ అని ఇంకోదాని మీద నిహా అని రాసి ఉంది. ముందుగా వంశీకి రాసిన కవర్ చించి లోపల ఉన్న కాయితం తీసింది.








ila suspense lo vunchadam emaina nyayama?
[+] 1 user Likes undeleteddata's post
Like Reply


Messages In This Thread
RE: (5) తల్లి పిల్లా న్యాయం - by undeleteddata - 08-04-2026, 03:19 PM



Users browsing this thread: 1 Guest(s)