07-04-2026, 02:52 AM
Past - 23
ఎక్స్క్యూజ్మీ సార్ అని విశి అనగానే ఎస్ అని వెనక్కి తిరుగుతాడు. విశిని చూడగానే ఆ వ్యక్తి బిగుసుకు పోతాడు.
విశి నువ్వేంటి ఇక్కడ అని తడబడుతూ అడిగితే.. మాకు ఇండియాలో వేడి ఎక్కువయ్యి చల్లదనం కోసం స్విట్జర్లాండ్ వచ్చాము అని భవ్య వెటకారంగా చెబుతుంది.
ఆగు భవ్య.. ఏంటి గౌతమ్ స్విజర్లాండ్ నుంచి ఇంత ఫాస్ట్ గా తీసుకువచ్చిన ఫ్లైట్ ఏది అని అడుగుతుంది. ప్లీజ్ విశి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడటానికి ఏంటి ప్రాబ్లం.
చెప్పేది అర్థం చేసుకో విశిష్ట. ఇప్పుడు చాలామంది విఐపిలు వస్తున్నారు. నీతో డిస్కస్ చేస్తూ కూర్చొనా.. అసలు నీకు ఇక్కడ ఏం పని అని ఉంది అది చెప్పు.
హిమ గౌతమ్ పక్కకి వచ్చి.. ఎవరు గౌతమ్... ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా...
అంత ముఖ్యమైన పర్సన్ ఏమి కాదు. జాబ్ కోసం రిక్వెస్ట్ చేస్తుంది. ప్రజెంట్ వేకెన్సీస్ లేవు అని చెబుతున్నాను.
అవునా.. మా గౌతమ్ చాలా బిజీ. మీరు కంపెనీకి మెయిల్ చేయండి. ఎప్పుడైనా వేకెన్సీస్ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు.
విశి అలాగే చూస్తూ ఉంటుంది. భవ్య వెంటనే మీరు గౌతమ్ సార్ కి ఏమవుతారో తెలుసుకోవచ్చా... గౌతమ్ కోపంగా ఇప్పుడు ఇవన్నీ మీకు అవసరమా..
ప్రొఫెషనల్ లైఫ్ లోకి పర్సనల్ లైఫ్ ఎందుకు తీసుకోవస్తున్నారు. అయ్యో సార్ మీలాంటి సెలబ్రిటీస్ గురించి తెలుసుకుంటే ఏదో మాకు అదోక తృప్తి.
మీరు చెప్పండి మేడం.. మీలాంటి బ్యూటీ ఇలాంటి సార్ పక్కన ఉంది అంటే సంథింగ్ సంథింగ్ అని అడుగుతుంది. హిమ సిగ్గుపడుతూ చేతితో జుట్టుని చెవి వెనక్కి తోసుకుంటూ.. త్వరలో మేము పెళ్లి చేసుకోబోతున్నాము.
మా ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది అని చెబుతుంది. వావ్.. సూపర్ జోడి మామ్.. కంగ్రాట్స్ అని విశి వెళదామా అంటుంది.
అలాగే చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. గౌతమ్ తల పట్టుకుంటాడు. ఏమైంది డార్లింగ్ అని అడిగితే... ఇప్పుడు అవసరమా.. మన పర్సనల్ లైఫ్ గురించి ఇక్కడ చెప్పడం.
అరే ఇప్పుడు ఏమైందని నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు.. నథింగ్ ఏమీ లేదు పద అని చేయి పట్టుకుని తీసుకువెళతాడు.
విశి మౌనంగా బయటికి వచ్చేస్తుంది. వెనకాలే మిగిలిన ముగ్గురు వచ్చేస్తారు. పక్కనే ఉన్న టీ స్టాల్ దగ్గర కూర్చుని సూర్య టి ఆర్డర్ ఇస్తాడు. మౌనంగా టీ తాగుతున్న విశి ని చూసి ఏంటి తెగచించుతున్నావు...
ఏమి లేదు దేవాగారు.. రేపు వచ్చే సమస్యని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్నాను. దేని గురించి మాట్లాడుతున్నావు.
గౌతమ్ గురించి.. వాడు గురించి మాట్లాడడానికి ఏముంది అని శ్రీకర్ చిరాగ్గా అంటాడు. శ్రీకరర్ వైపు చూస్తూ ఇన్ని రోజులు నా వర్క్ బాగోలేదు ఏమో...
నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. నిజంగానే నాకు హెల్ప్ చేస్తున్నాడు అనుకున్నాను. బట్ ఈరోజు అర్థమయింది నా వర్క్ చాలా బాగుంటుంది అని ...
గౌతమ్ ఫియన్స్ కోసం నా దగ్గరికి వస్తాడు. ఏదో ఒక స్టోరీ చెప్పి వర్క్ చేయించుకోవడానికి చూస్తాడు . చెయ్యను అని చెప్పేయ్ సరిపోతుంది అని భవ్య అంటుంది.
అలా చెబితే ఏమొస్తుంది... అంటే ఏమిటి.. ఇంకా ఆ వేస్ట్ ఫెలో గాడికి నీ వర్క్ ఇస్తాను అంటున్నావా... ఇస్తాను కానీ ఇలాగా కాదు.. నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో క్లియర్ గా చెప్పు నాకేమీ అర్థం కావడం లేదు.
సింపుల్ భవ్య... ఇప్పుడు నేను చెయ్యను అన్నాను అనుకో వెంటనే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి చూస్తాడు. అప్పటికి లొంగకపోతే అమ్మ ట్రీట్మెంట్ విషయంలో ఏదైనా చేయడానికి చూస్తాడు.
నాకు కావాల్సింది అమ్మ ట్రీట్మెంట్ కూల్ గా జరిగిపోవడం. ఖచ్చితంగా కలిసినప్పుడు ఓపెన్ అవుతాడు. అప్పుడు నేను ఒక బిజినెస్ డీల్ కిందే మాట్లాడతాను.
అది కూడా నార్మల్ వర్క్ ఇస్తాను.. నేను ఏ వర్క్ ఇచ్చినా సరే గౌతమ్ తీసుకుంటాడు. ఎందుకంటే అతను ఫియాన్సీ నాలెడ్జ్ సున్న.
నిన్ను గౌతమ్ చీట్ చేశాడని బాధగా లేదా అని భవ్య అడుగుతుంది. ఒక నిమిషం సైలెంట్ గా ఉండి ఏమో....
మొదటి నుంచి కూడా గౌతమ్ విషయంలో నేను పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేకపోయాను.
నేనున్నా సిచువేషన్ లో హెల్ప్ చేస్తున్నాడు అనుకున్నాను. మిస్ యు.. లవ్ యు అంటే నిజమే అనుకున్నాను.
కానీ నా మనసు మాత్రం స్పందించలేదు. నేనున్నా పరిస్థితులను బట్టి అలాగున్నానేమో అనుకున్నాను. ఈరోజు కూడా వాళ్ళిద్దర్నీ పక్కపక్కన చూసినప్పుడు కూడా నాకేమీ అనిపించలేదు.
కాకపోతే ఒకటే బాధ.. ఏమిటే అంటే... ఎందుకు మనుషులు ఇంత దారుణంగా ఉంటున్నారు. చీట్ చేయడానికి చూస్తున్నారు.
దీనివల్ల ఏమిటి ఉపయోగం. ఏమొస్తుంది. తాత్కాలికమైన సంతోషం కోసం ఎదుటి మనిషిని బాధ పెడుతున్నారు. అది తప్పు అనిపించడం లేదా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
విశి కన్నీళ్లు చూడగానే సూర్య కదిలిపోతాడు. పిడికిలి బిగించి కోపంగా ఉంటాడు. భవ్య వెంటనే విశిని హాగ్ చేసుకుని... పిచ్చిదానా నీలాంటి బంగారాన్ని దూరం చేసుకున్నందుకు వాడు ఏడవాలి.
నీకు నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను వాడిది ప్రేమ కాదే ట్రాప్ చేస్తున్నాడు అని... నువ్వే నమ్మలేదు. ఆ మాటకి విశి నవ్వుతూ.. ఆ పరిస్థితుల్లో నమ్మడం నమ్మకపోవడం అన్నది ఉందా...
అది నిజమేలే.. ఆ రాస్కెల్ ఈ టూ ఇయర్స్ నుంచి నీకు కనపడకుండా ఫోన్లో మెయింటైన్ చేయడం నీ మంచికే లేకపోతే రోజు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక రోజు నువ్వు డిస్టర్బ్ అయ్యేదానివి..
అది నిజమేలే అని... చైన్ పట్టుకొని థాంక్యు నాన్న అంటుంది. అంకుల్ కి ఎందుకు థాంక్స్ చెబుతున్నావు.
హ్మ్... స్టాల్ కి బయలుదేరేముందు నాన్న గుర్తుగా మిగిలిన ఈ చైన్ ఇచ్చి వేసుకోమని చెప్పింది.
నాన్న మాకు దూరమైన తర్వాత ఈ చైన్ తీసేసాను..మళ్ళీ ఈ రోజే పెట్టుకున్నాను. ఇది నా మెడలోకి రాగానే నాకు చాలా మంచి జరిగింది.
అలాగైతే ఈ చైన్ ఎప్పుడు నీ మెడలోనే ఉంచుకో..చిన్నగా నవ్వుతుంది... ఈ నవ్వు చాలే బాబు ...
థాంక్యూ దేవాగారు, శ్రీకర్ గారు అని చెబుతోంది. హలో ఈ గార్లు తీసేయ్ తల్లి... వినలేకపోతున్నాము. నువ్వు అలా పిలుస్తూ ఉంటే మేమేదో ఏజ్ బార్ పర్సన్స్ లాగా అనిపిస్తుంది.
సూర్య మాత్రం విశినే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ పెదాలు నవ్వుతున్నాయి కానీ కళ్ళల్లో అంతులేని బాధ కనిపిస్తుంది. అది సముద్రానికి మించిన లోతు అని అర్థమవుతుంది.
ఎలా విశి బాధ పోగొట్టాలి అనే ఆలోచనతో... ఇప్పుడే వస్తాను అనే పక్కకి వెళ్లి విక్రమ్ కి కాల్ చేస్తాడు. చెప్పరా.. డాడ్ నాకు తెలిసిన ఒక అమ్మాయికి జాబ్ ఇవ్వాలి..
ఎవరూ విశిష్టానా.. అవును.. ఇంకా స్టడీస్ అవ్వలేదు ఏమో.. సిచువేషన్ మొత్తం చెప్తాడు. ఓ అవునా సరే అయితే మన కంపెనీకి అప్లై చేయమను.
నేను చూసుకుంటాను. ఓకే థాంక్యూ అని చెప్పి వచ్చి కూర్చుంటాడు. క్యాజువల్ గా మాట్లాడుతూ విశి.. మీరు జైసింహ కంపెనీలో జాబ్ కి అప్లై చేయొచ్చు కదా...
అమ్మో అది చాలా పెద్ద కంపెనీ.. నాకు ఇస్తారా.. వస్తుందా అంటుంది. ముందు నీ ప్రయత్నం నువ్వు చేయాలి కదా.. ఏమో నీ టాలెంట్ కి అదే బెస్ట్ కంపెనీ అవ్వచ్చు ఏమో.. ఎవరికీ తెలుసు.
ముందు నిన్ను నువ్వు నమ్ముకో. తర్వాత ఏదైనా సరే.. వేకెన్సీస్ ఉన్నాయి ఈ కంపెనీలో. భవ్య డౌటుగా చూస్తూ మీకెలా తెలుసు సార్.
మేము కూడా జాబ్ సెర్చింగ్ లో ఉన్నాము. ఆ మాత్రం తెలియదా అని శ్రీకర్ సమాధానం చెబుతాడు.. అవును కదా మర్చిపోయాను. మాకు గుర్తు ఉందిలే..
ఇంటికి వెళ్లగానే అప్లై చేస్తాను. ఇప్పుడు ఏమైనా రాహుకాలం ఉందా ఏమిటి.. అర్థం కాక ఏమన్నారు.. ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు వెంటనే చేసేయాలి.
మీనవేషాలు లెక్కిస్తూ పోస్ట్ పోన్ చేయకూడదు.. నీ దగ్గర మొబైల్ ఉంది కదా తీసుకుని అప్లోడ్ చెయ్.. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను అని పక్కనే కూర్చుంటాడు.
సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేయించి గుడ్.. రెస్యూమ్ ఫార్వర్డ్ చేశాము. ఆ కంపెనీ నుంచి మెయిల్ రాగానే వెంటనే వెళ్ళు అర్థమైందా.. అర్థమయింది సార్ అని తల ఊపుతుంది.
శ్రీకర్ ఇద్దరిని చూస్తూ నో డౌట్...వీడు తెలియకుండానే విశిష్టకి దగ్గర అవుతున్నాడు. ఒక పక్కన క్యూటీ కోసం వెతుకుతున్నాడు.
క్యూటి కూడా వీడుకోసమే చూస్తూ ఉంటే.. నారీ నారీ నడుమ మురారి పరిస్థితా ఏమిటి నా ఫ్రెండ్ కి అని ఒకసారి సీను ఊహించుకుని.. అమ్మో అలాగా మాత్రం వద్దు.
ఒక భార్యే ముద్దు. సరే ఇంకా మేము వెళతాము. ఎక్కువ ఆలోచించద్దు విశిష్ట. ఏది జరిగిన మన మంచికే అనుకో.. అని జాగ్రత్తలు చెబుతాడు.
నేను ఫైన్ సార్.. ఇలాంటి వాటి గురించి ఆలోచించే అంత టైం నా దగ్గర లేదు. ఒన్స్ అగైన్ థాంక్యూ. యువర్ వెల్కం అని నవ్వుతారు.
నలుగురు నవ్వుకుంటూ అడుగులు ముందుకు వేస్తూ ఉంటే... అడ్డుగా ఒక ఆకారం వచ్చి నిలబడుతుంది. విశిష్ట ఉలిక్కిపడి వెనక్కి అడుగు వేయబోయి.. పడబోతే...
జాగ్రత్త అని ఒక పక్కన సూర్య.. మరో పక్కన భవ్య పట్టుకుంటారు. తమాయించుకుని నిలబడి ఎవరా అని చూస్తే గౌతమ్ ఉంటాడు.
కోపంగా విశిని, పక్కనే ఉన్న సూర్యని చూస్తూ ఉంటాడు. భవ్య చిరాకుగా నువ్వా అంటే.. ఏ ఇంకా నీకోసం మహేష్ బాబు వచ్చాడు అనుకున్నావా..
మేము అలాంటి గాలిలో మేడలు కట్టంగాని.. ఏమిటి నీ ఫియాన్సీ ని వదిలేసి ఇటు వచ్చావు అని వెటకారంగా అడుగుతుంది.
భవ్య నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటే మంచిది..విశిష్ట నేను నీతో మాట్లాడాలి ప్లీజ్ అంటాడు.
ఏం మాట్లాడాలి మిస్టర్ గౌతమ్ అని అడిగితే... మిస్టర్ గౌతమ్ అని ఆశ్చర్యంగా నోరు వదిలేసి చూస్తాడు...
గౌతమ్ ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు...
విశిష్ట రియాక్షన్...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)