Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - కనురెప్ప
"అతను ఫోటో ఎవరికి ఇవ్వనంటున్నాడు కదా. పాపం టైం వేస్ట్.. ఎందుకు అబ్బాయిని అలా సతాయిస్తారు. ఇదిగో నేను లంగావోణి బుట్టచేతులు జాకెట్టు వేసుకున్నాను. మీరు పొడుగు గొట్టం ప్యాంటు షర్టు వేసుకున్నరాయే. పాత జ్ఞాపకాలు ముసిరేస్తు న్నాయి.. మీరిలా వచ్చి నిలబడండి. ఫోటో అబ్బాయి త్వరగా స్విచ్ నొక్కు నాయనా.".. కంగారు పెట్టింది కాత్యాయని. దాంతో సత్తిపండు చాలా కష్టపడి చిరాకు చెత్త ఫోజులుతో ఒక ఫోటో తీసి వెళ్లబోయి వెనక్కి వచ్చాడు.



"చిరాకుగారూ... మరచిపోయాను ఆ ఎడిటర్ గారికి మీ ఫోటో ఇస్తే డబ్బులు వెయ్యి కన్నా ఎక్కువ ఇవ్వడా..” అంటూ ఆత్రుతగా అడిగాడు.



"ఫోటో అతనికి నచ్చింది అనుకో.. డిమాండ్ చేస్తే రెండు వేలు ఇవ్వవచ్చు. అతనికి లాభం ఏమిటి అంటే సర్కులేషన్ పెరగడమే కాదు ఫోటో అవార్డులకు పంపి బోలెడు డబ్బు సంపాదిస్తాడు. ఇంతకీ నువ్వు ఇదే ప్లాన్ లో ఉన్నావా?''.. అనుమానం గా అడిగాడు శివరామకృష్ణయ్య.



"అబ్బబ్బ.. మీరు నిశ్చింతగా ఉండండి చిరాకుగారు.. నేను పెద్దాపురం పర్ఫెక్ట్ పడుచు కుర్రాడు లాంటి వాడిని. ఇప్పుడు మీరు నాకు చెప్పినదంతా మరిచిపోండి మీరు నాకేం చెప్పలేదు. ఆ ఎడిటర్.. ఆ రెండు వేలు అంతా మాయ. జగమే మాయ.. ఒక కల" అనుకుంటూ వెళ్లిపోయాడు సత్తి పండు.



**********
ఆ మర్నాడు.. ఫోన్ మోగింది రిసీవర్ అందుకున్నాడు శివరామకృష్ణయ్య.



"రిసీవర్ పట్టుకున్నది చిరాకుగాడేనా..’ ఫోన్ చేసిన వ్యక్తి ప్రశ్నించాడు.



"అవునురా శివరామకృష్ణయ్యనే. మాట్లాడేది సుబ్రహ్మణ్యం అని గుర్తుపట్టాను కూడా... ఏంటి విషయం ఇంత పొద్దుటే ఫోన్ చేశావు?'''



"ఏరా నీకు మతి పోతుందా.. నువ్వు వెధవ వేషాలు వేసేది కాకుండా మా చెల్లెమ్మ చేత కూడా పిచ్చివేషాలు
వేయిస్తున్నావన్నమాట. ఇప్పుడే పేపర్ చూశాను. చి చి ఆ పిచ్చి ఫోటోలు ఏమిటి.. ఉండు వస్తున్నాను వచ్చి డైరెక్ట్ గా తిడతాను. " అంటూ సుబ్రహ్మణ్యం రిసీవర్ పెట్టేసాడు.



సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని నిమిషం నిమిషం కష్టంగా గడుపుతున్నారు.. ఆ వృద్ధ దంప తులు ఇద్దరూ. సాయంత్రం ఏమవుతుందో వాళ్లకు తెలుసు.. ఆ సమయం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.



సాయంత్రం అయ్యింది.. నాలుగు మారుతి కార్లు స్పీడుగా వచ్చి శివరామకృష్ణయ్య ఇంటి ముందు ఆగాయి. ఆ కార్లలోంచి తమ తమ సంతానఆసంతానయొక్క సంతానం అందరూ శ్రీ కౌముది న్యూస్ పేపర్లు చేతితో పట్టుకొని కోపంగా దిగడం శివరామకృష్ణయ్య గమనించి సీన్ అర్థం అయిపోయి వీధిలో మెట్ల మీదే కూర్చుని చూస్తున్నాడు.. ఆనం దంగా. కాత్యాయని గుమ్మం పట్టుకొని నవ్వుతూ నిలబడుతూ ఉంది.



అందరూ కలిసి ఇంటి లోపలికి వచ్చారు.



"ఇలాంటి తలతిక్క ఫోటోలు న్యూస్ పేపర్ లో పడటం వల్ల తమ పరువు పోతుందని ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయవద్ద”ని చీవాట్లు వార్నింగులు లాంటివి గంటసేపు కడుపునిండా పెట్టారు ఆ దంపతులు ఇద్దరికీ వచ్చిన వాళ్ళు అందరూ. వాటితోపాటు వాళ్లు తెచ్చిన స్వీట్లు హాట్లు పళ్ళు పూర్తిగా లాగిన్ చేశారు ఆ దంపతులు.. అంతేకాకుండా వాళ్ళందరినీ పూర్తిగా తనివి తీరా చూసుకుంటూ పెద్దల్ని దీవిస్తూ పిల్లల్ని ముద్దాడుకుంటూ గడిపేశారు.. మహాఆనందంగా. ఆ రాత్రంతా వచ్చిన వాళ్ళందరితో చాలాసేపు తనివి తీరా మాట్లాడుకున్నారు ఆ దంపతులు. తెల్లవారుతుండగా వాళ్ళిద్దరి దగ్గర సెలవు తీసుకుని వచ్చిన మారుతీ కారులన్నీ కదలి వెళ్ళిపోయాయి జంట నగరాల వైపు.



''మనం తిరగలేమని తిరిగినా వీళ్లంతా ఒకచోట కనిపించరనివీళ్ళందర్నీ ఇక్కడకు రప్పించడం కోస ప్లాను వేసి మీ కోరిక తీర్చుకున్నారు తనివి తీరా చూసుకొని తాదాత్మ్యం పొందారు. రెండు నెలల క్రితం వీళ్లందరినీ చూడాలని ఆశపడి నాకు అప్పుడు ఒంట్లో బాగుండలేదని నాటకం ఆడింప చేసి వీళ్ళందర్నీ ఇలాగే రప్పించారు.. ఇక ఇప్పుడు ఈ ఫోటో ప్లాన్ కూడా బాగానే వేశారు. " వాళ్లంతా వెళ్ళిపోయాక భర్తను పొగిడింది కాత్యాయని.



"నువ్వు మాత్రం ఆ చిన్న పిల్లలతో ఆడుతూ ఆ పెద్దవాళ్లతో తిరుగుతూ ఎంత ఆనందించావో నేను గమనించాను. గుండె నిండా ఎంతో సంబరాన్ని నింపుకొని చిన్నపిల్లవై పోయావు. ఇలాంటి ఆనం దకరమైన సందర్భాలు చాలు మనం ఇంకో ఆరు నెలలు ఆనందంగా గడిపేయడానికి. కాటికి కాలు చాపిన మనకు వీళ్ళందరి రాకతో మళ్ళీ యవ్వనం వచ్చేసినట్టు ఉంది కదూ. " అన్నాడు మహదా నందభరితంగా శివరామకృష్ణయ్య.



"ఇంతకీ అటక మీద ఆ పాతచింతకాయపచ్చడి విషయం ఏమిటండీ. " అనుమానం తీరక అడిగింది కాత్యాయని.



"అదా.. పాత బట్టలు అటక మీద ఉన్నాయి.. అటక ఎక్కి ఆ ట్రంకు పెట్టి క్రిందకు దింపండి.. అని ఎవరితో చెప్పినా మన మాట వినరు. అందుకనే ఇలా పచ్చడి వంక పెట్టాను. పాత చింతకాయ పచ్చడి ఆశ పెడితేనే కదా మా అబ్బిరాజు గాడు ఫోటో సత్తిపండు ని పంపించింది. వాడొస్తేనే కదా అటక మీద ట్రంకు పెట్టి కాస్త క్రిందకు దిగింది. అందులోని పాత బట్టలు వేసుకుంటేనే కదా మన వాళ్లకు తిక్కరేగే ఫోటో తీసుకోగలిగింది. ఆ ఫోటో వస్తేనే కదా న్యూస్ పేపర్లో తీపి గుర్తు శీర్షికలో పడింది. అలా పడితేనే కదా.. అది చూచి కోపమొచ్చి మన వాళ్ళందరూ చీమలదండులా వచ్చింది.



వాళ్లు సరదా పడే మంచి ఫోటో అయితే ఇలా వస్తారాచాలా కోపం వస్తేనే కదా మనల్ని తిట్టడా నికైనా వాళ్లంతా వచ్చి తీర్తారు. ఎంతసేపు ఉన్న పర్వాలేదు.. ఎలాగోలా వాళ్ళంతా రావడమే నాకు కావలసింది. వాళ్లందరినీ కళ్ళ నిండా మరోమారు చూసుకోవాలన్న నా ఆశ తీరింది. " యుద్ధంలో విజయం సాధించిన వీరుడులా మాట్లాడాడు శివరామ కృష్ణయ్య.



"అందరూ ఒకే చోట ఉంటే ఎంత ఆనందం.. కానీ ఎలా కుదురుతుంది. ఈ కంప్యూటర్ యుగంలో బంధాలు,
అనుబంధాలు కాలగమనoలో అటకెక్కకుండా కుదు రుతుందా?''... భర్త వైపు నవ్వుతూ చూస్తూ అంది కాత్యాయని.



"అందుకనే మన అటక ఎక్కిన ఆనందాన్ని ఓ రెండు నెలల్లో మరోమారు క్రిందకు దింపే ప్లాన్ సిద్ధం చేస్తున్నాను.".. అన్నాడు శివరామకృష్ణయ్య భార్య వైపు చిలిపిగా చూస్తూ.



''ఈసారి డైరెక్షన్ నాది.".. అంది కాత్యాయని.



వృద్ధ దంపతులు ఇద్దరు నవ్వుకున్నారు మనసారా.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - BSC - by k3vv3 - 03-09-2025, 09:46 PM
RE: హాస్య కథలు - ఆనవాయితీతో ఆబ్దికం - by k3vv3 - 06-04-2026, 04:41 PM



Users browsing this thread: 2 Guest(s)