06-04-2026, 09:08 AM
(This post was last modified: 06-04-2026, 09:09 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
నాలో ఊపిరి -22
విశి అని గట్టిగా అరుస్తుంది. అబ్బా పక్కనే ఉన్నాను కదా.. ఎందుకే అరుపు.. అటు చూడు అని ఒక ఫ్రేమ్ ని చూపిస్తుంది.
అది చూస్తూ విశి బొమ్మలాగా బిగుసుకుపోతుంది. భవ్య కదుపుతూ... ఏం చూస్తున్నావు.. ఇది ఇది అని టెన్షన్ గా అడుగుతుంటే...
హ అది నీదే.. దేవాగారు... మీకు ఈ వర్క్ చూపించాను కదా.. అవును ఇక్కడికి ఎలా వచ్చింది. అదే మాకు అర్థం కావడం లేదు.
ఇది ఒక్కటేనా లేక ఇంకేమైనా ఉన్నాయా.. చెక్ చేయండి అని మొత్తం ఫ్రేమ్స్ చూస్తూ ఉంటారు. అవి చూస్తూ ఉంటే విశి కి కళ్ళు తిరిగినట్టుగా అనిపించి... భవ్యని గట్టిగా పట్టుకుంటుంది.
టెన్షన్ పడకు విశి.. ఇలా కూర్చొ.. అక్కడ ఒక చైర్ లో కూర్చోబెట్టి వాటర్ ఇస్తుంది. వాటర్ తాగి కాసేపు కళ్ళు మూసుకొని ఉండిపోతుంది.
శ్రీకర్, దేవా కూడా విశినే చూస్తూ ఉంటారు. శ్రీకర్ మెల్లగా ఏం జరుగుతుంది రా... ఈ వర్క్ విశి చేసినదే... ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు.
ఇది ఒకటేనా లేక మిగిలిన ఫ్రేమ్స్ కూడానా.. తెలియదు తను మాట్లాడితే కానీ...
విశి కళ్ళు తెరిచి నా వర్క్ మొత్తం ఇక్కడికి ఎలా వచ్చింది భవ్య. అది నన్ను అడుగుతావేంటే... నువ్వే కదా చేసిన ప్రాజెక్ట్ స్ అన్ని గౌతమ్ కి ఇచ్చావు.
నా వర్క్ అంత సాటిస్ఫాక్షన్ గా లేదు అని చెప్పేవాడు కదా... మరి ఇక్కడ నా వర్క్ హిమ గారి పేరుతో ఉండడమేమిటి.. నాకసలు ఏమీ అర్థం కావడం లేదు.
ఒకసారి గౌతమ్ కి ఫోన్ చేస్తాను. ఎందుకు.. ఏదో కహాని చెబుతాడు. అవునా అని గొర్రె బిడ్డలాగా తల ఊపుతావు.
ప్లీజ్ భవ్య కాసేపు సైలెంట్ గా ఉండు అని గౌతమ్ కి కాల్ చేస్తుంది. గౌతమ్ నెంబర్ బిజీ బిజీ అని వస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చేసినా సరే డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది. మెసేజ్ చేస్తుంది. అర్జెంటుగా కాల్ చెయ్ గౌతమ్ మాట్లాడాలి అని ...
స్టాల్ దగ్గర అంతా గోల గోల కింద ఉంటుంది హిమగారు వస్తున్నారు అందరూ సైలెంట్ గా ఉండండి అని అనౌన్స్ చేస్తారు.
వస్తున్న హిమని చూసి భవ్య నోరు వదిలేస్తుంది. నీస్ లెంగ్త్ ఫ్రాక్ వేసుకుని.. హెయిర్ లీవ్ చేసి హెవీ మేకప్ తో స్టైల్ గా నడుచుకుంటూ వస్తుంది.
భవ్య ని చూసి ఈసారి విశి కదుపుతుంది.. ఏమైందే అలా బిగుసుకుపోయావు. ఒసేయ్ పిచ్చి మాలోకమా.. ఆరోజు మాల్లో గౌతమ్ తో చూసింది ఈ అమ్మాయినే...
హిమగారు గౌతమ్ కి ఎలా తెలుస్తుంది. నువ్వు ఎవరో అనుకోని పొరపడినట్టు ఉన్నావు. నీ మొఖం.. ఉండు అని గేలరీ ఓపెన్ చేసి.. ఫొటోస్ చెక్ చేసి.. గౌతమ్ హిమ ఉన్న ఫోటో చూపిస్తుంది.
ఇప్పుడు చూసి చెప్పు... ఆ ఫోటో చూడగానే... నాకు తలంతా తిరిగిపోతున్నట్టు ఉంది భవ్య.. అసలు ఏం జరుగుతుంది అని ఫోను వదిలేస్తుంది.
వెంటనే సూర్య ఫోన్ క్యాచ్ పట్టుకుంటాడు. సూర్య ఆ ఫోటో చూసి.. వీడేనా గౌతమ్... అని అడుగుతాడు. అవును దేవాగారు..
నేను ఫస్ట్ నుంచి చెబుతూనేఉన్నాను. వాడు ఒక పెద్ద చీటర్ అని.. ఇదే నమ్మలేదు.
భవ్య నువ్వు కొంచెం కూల్ గా ఉండు. అసలు ఏం జరుగుతుందో అన్నది చూద్దాం. తర్వాత ఏం చేయాలో అన్నది ఆలోచిద్దాం.
నీ ఫ్రెండ్ ని మాత్రం వదలకు. మీరిద్దరూ ఏమీ తెలియనట్టుగానే హిమతో మాట్లాడి ఆటోగ్రాఫ్ తీసుకోండి. వర్క్ గురించి డిస్కషన్ చేయండి.
నిజంగా ఆ అమ్మాయి టాలెంటెడ్ అయితే వర్కు గురించే మాట్లాడుతుంది. ఆ విషయంలో హ్యాపీగా ఫీలవుతుంది. బట్ ఫ్రాడ్ అయితే గనక ఎలా ఎస్కేప్ అవ్వాలి అన్నది ఆలోచిస్తుంది.
సో మీరు అలా ప్రొసీడ్ అవ్వండి. మిగిలింది నేను చూస్తాను. ఇంతకీ గౌతమ్ గాడి కంపెనీ పేరేమిటి...
గౌతమ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పాడు.
ఓకే.. విశి నువ్వు డల్ అవ్వకు. ఒక్కొక్కసారి మనకు ఎదురయ్యే సమస్య వల్ల మనం స్ట్రాంగ్ గా తయారవుతాము.
ఆ విధంగా నిన్ను నువ్వు తయారు చేసుకోగాని వీక్ అవ్వద్దు. అర్థమైందా.. నీతో మేమంతా ఉన్నాము.
సూర్య శ్రీకర్ కి సైగ చేస్తాడు. అర్థమైంది బావ అని శ్రీకర్ పక్కకు వెళ్లి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి వచ్చి ఫైవ్ మినిట్స్ లో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.
భవ్య... మీరిద్దరూ వెళ్లి హిమతో మాట్లాడడానికి ట్రై చేయండి.
రా విశి నువ్వైతేనే మాట్లాడడానికి కరెక్ట్... ఎందుకంటే ఆ వర్క్ గురించి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ నీకే తెలుసు. కాబట్టి ఏ పాయింట్ అడిగితే తను మాట్లాడలేదో ఆ పాయింట్ మాట్లాడడానికి ఉంటుంది రా అని లాక్కుని వెళుతుంది.
వెళుతున్న ఇద్దరినీ చూస్తూ... శ్రీకర్.. సూర్యతో ఏంటి బావ ఇంత దారుణం. ఒక ఆడపిల్ల వర్క్ ని వేరే వాళ్ళకి ఇవ్వడమా.. అది కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి వర్క్.
సూర్య చేతులు కట్టుకుని.. నువ్వు టెన్షన్ పడకు. అసలు ఈ ప్రాబ్లంని విశిష్ట ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దాము. విశిష్ట వల్ల అవ్వనప్పుడు మనం హ్యాండిల్ చేద్దాము.
భవ్య విశి వెళ్లి హలో మామ్ అని పలకరిస్తారు. వెంటనే హిమ అసిస్టెంట్ మేడం ఎవరితోనూ మాట్లాడరు. అపాయింట్మెంట్ తీసుకోవాలి.
చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అంతే... మీలాగా అందరూ అడుగుతారు. మేడం ఇక్కడే లాక్ పడిపోతే ఎలా చెప్పండి.
ప్లీజ్.. మేము స్టూడెంట్స్ మి. మీ వాల్యుబుల్ సజెషన్స్ మాకు బాగా యూస్ అవుతాయి. క్యాంపస్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అవుతాము. ప్లీజ్ ప్లీజ్ అని భవ్య రిక్వెస్ట్ చేస్తుంది.
హిమ ప్రౌడ్ గా ఫీల్ అవుతూ.. అడగండి.. వెంటనే విశి ఆర్చిటెక్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డిజైనర్ కి ఉన్న తేడా ఏమిటి మామ్...
ఆ క్వశ్చన్ కి హిమ తెల్ల మొఖం వేసుకొని చూస్తుంది. పోనీ చార్టర్డ్ ఆర్కిటెక్ అండ్ ఆర్కిటెక్చర్ డిజైనర్ కి ఉన్న తేడా ఏమిటి..
వర్డ్స్ డిఫరెంట్ కానీ వర్క్ అంతా ఒకటే.. ఇబ్బందిగా చెబుతుంది. అలా ఎలా ఒకటి అవుతుంది. మాకు ఒక ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగారు.
మాకు అర్థం కాలేదు. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు చాలా ప్రొఫెషనల్ కదా... దీని గురించి బాగా తెలిసి ఉంటుంది. ప్లీజ్ మామ్ హెల్ప్ చేయండి.
హిమ అసిస్టెంట్ వైపు చూస్తుంది. వెంటనే ఫోన్ తీసుకుని హలో హలో అని... మామ్ మీకు అర్జెంట్ ఫోన్ వచ్చింది.
అవునా... ఎవరూ అంటూ ఫోన్ తీసుకుంటుంది. మీ డిజైన్స్ నచ్చి యూకే కంపెనీ మీతో టై అప్ అవ్వడానికి ట్రై చేస్తుంది కదా...
ఆ కంపెనీ సెక్రటరీ.. రోజుకి పదిసార్లు అయినా కాల్ చేస్తున్నారు. మీరు ఖాళీగా లేరు అని చెప్పినా వినడం లేదు.
మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే వర్క్ స్టార్ట్ చేద్దాం అంటున్నారు. నేను మాట్లాడుతాను అని ఫోన్ పుచ్చుకుని పక్కకి వెళ్ళిపోతుంది.
అసిస్టెంట్ వెంటనే భవ్యతో చెప్పాను కదా.. మేడం చాలా బిజీ అని.. మీ అదృష్టం బాగుండి మేడంని మళ్ళీ కలిసే అవకాశం వస్తే.. అప్పుడు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందురు గాని ఓకేనా అని స్పీడ్ గా వెళ్ళిపోతాడు.
భవ్య విశి సూర్య దగ్గరకి వస్తారు. ఏమయింది.. నేను చెప్పాను కదా దేవాగారు. ఈ వర్క్ మొత్తం విశిదే.. ఏం అడుగుతున్నా సరే సమాధానం చెప్పలేకపోతున్నారు.
ఇదిగో మొత్తం రికార్డ్ చేశాను అని వినిపిస్తుంది. ఇది ఎప్పుడు చేసావే అని విశి అడిగితే.. తమరు ట్యూబ్ లైట్ కదా అందుకే నా జాగ్రత్తల్లో నేనున్నాను.
భవ్య చేతులు పట్టుకుని నిజంగా నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టమే... ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే నీలాంటి ఫ్రెండ్ దొరికి ఉంటుంది. ఇదిగో నువ్వు మరీ ఇంత సెంటి అవ్వకు...
నాకసలే చాలా తిక్కగా ఉంది. ఆ గౌతమ్ ఎదురుపడిని.. వాడు చొక్కా పట్టుకుని నాలుగు గుంజి వాయించేయకపోతే అని పళ్ళు నూరుతుంది.
మీకెందుకు భవ్య అంతా స్ట్రెస్... ఈ ప్రాబ్లం విశిది. విశినే సాల్వ్ చేసుకోవాలి. ఏమంటావు విశిష్ట.
అవును దేవాగారు నేనే ఫైట్ చేస్తాను. అసలు గౌతమ్ ఏం చెబుతాడో చూస్తాను. విశి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి హలో అంటుంది.
ఎక్కడున్నావు విశి.. ఏమిటి అంత అర్జెంటుగా మాట్లాడేది. నువ్వెక్కడున్నావు గౌతమ్. నేను ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి స్విట్జర్లాండ్ వెళ్ళాను.
నేను నిన్ను అర్జెంటుగా కలవాలి ఎప్పుడు కలుద్దాం.. పర్వాలేదు ఫోన్లో చెప్పు.. ఇది ఫోన్లో మాట్లాడుకునేది కాదు. డైరెక్ట్ గానే మాట్లాడాలి. రాగానే కలుస్తాను.
ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు. ఏమంటున్నాడు గురుడు అని భవ్య అంటే.. స్విట్జర్లాండ్ వెళ్ళాడంట. వచ్చాక కలుస్తాను అంటున్నాడు.
వీడి బొంద స్విట్జర్లాండ్ వెళ్లి ఏం చేస్తున్నాడు అంట.... హిమా దగ్గరికి ఒక పర్సన్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. హిమ టెన్షన్ చూసి... నాప్కిన్ తో హిమ నుదుటనా పట్టిన చెమటలు తుడుస్తాడు.
హిమ ఏదో చెబుతూ ఉంటే... వింటూ ఉంటాడు. భవ్య చూస్తూ ఉంటుంది కానీ ఫేస్ కనిపించదు. ఆ పర్సన్ బ్యాక్ సైడ్ మాత్రమే కనపడుతూ ఉంటుంది.
విశి... విశి.. అని గోకుతుంది. ఏమిటి.. ఈ బ్యాక్ పోర్షన్స్ చూస్తూ ఉంటే ఎక్కడో చూసినట్టు ఉంది... నీకేమైనా తెలుసా.. నాకు అలాగే అనిపిస్తుంది.
పద ముందుకు వెళ్లి చూద్దాం అని ఇద్దరూ వెళ్తారు. సూర్య శ్రీకర్ ఇద్దరు మాస్క్ వేసుకుని వీళ్ళిద్దరి వెనకాలే వెళతారు.
ఆ పర్సన్ దగ్గరిగా వెళ్లి ఎలా పలకరించాలో అర్థం కాక ఒకరి మొఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు.
విశి ఆ పర్సన్ వెనకాలే నిలబడి ఎక్స్క్యూజ్మీ సర్ అంటుంది.
ఎస్ అని వెనక్కి తిరుగుతాడు.
ఆ పర్సన్ ఎవరు...
కథ కొనసాగుతుంది...



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)