06-04-2026, 08:56 AM
Part - 58
నువ్వు ఓడిపోయినట్టు కాదా అని అడుగుతాడు. కాదు కాదు నేనే విన్ అయాను. అదే చెప్పు ఎలా విన్ అయ్యావు అంటే...
మీరు అనుకునేది ఏంటో నాకు తెలుసు అంటున్నాను కదా ఇంక అంతే ఇంక అడగద్దు అని మూతి బిగించేస్తుంది.
చిన్నపిల్లల ప్రవర్తిస్తున్న శాంభవిని చూస్తూ కారు ముందుకు దూకిస్తాడు.
కొంచెం దూరం వెళ్ళేటప్పటికి శాంభవి ఫేస్ లో కనపడుతున్న ఎక్స్ప్రెషన్స్ అర్థమయ్యి దగ్గర్లో ఉన్న రెస్టారెంట్ దగ్గర ఆపి వెళ్లి ఫ్రెష్ అయ్యి రా అని పంపిస్తాడు.
చెప్పకుండానే తన ఫీలింగ్స్ బట్టి అర్థం చేసుకున్న రుద్రని చూస్తూ ఫ్రెష్ అయ్యి వస్తుంది. శాంభవి కారు ఎక్కిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి ఖాళీ ప్లేస్ దగ్గర కార్ ఆపి బ్రేక్ ఫాస్ట్ ఓపెన్ చేస్తాడు.
రుద్ర తినిపిస్తుంటే నేను తింటాను కదా అంటే పరవాలేదు తిను అని చెప్పి తినిపిస్తూ ఉంటాడు. మీకు లేట్ అవుతుంది కదా...
మీరు తినండి. నేను తింటాను అని ఇబ్బందిగా చెబుతుంది. ఇప్పుడు నేను తినడం లేదు అని నువ్వు బెంగ పెట్టుకున్నావా...
సరే అయితే ఉండు అని శాంభవికి తినిపిస్తూనే రుద్ర కూడా తింటూ ఉంటాడు. అయ్యో నా ఎంగిలి అని కంగారుపడుతుంది.
అయితే ఏమైంది తినిపించేది నా చేతి వేళ్ళే కదా పరవాలేదు.. మీరు అలా నా ఎంగిలి తినకూడదు అని చెబుతుంది. అని ఎవరు చెప్పారు నీకు.
ఇది కూడా తెలియదా.. పెళ్లి అవ్వకుండా ఒకరిఎంగిలి ఒకళ్ళు తినకూడదు. పెళ్లి అయిన తర్వాత ఇద్దరికీ కలిపి ఒకే ఆకులో వడ్డిస్తారు. అప్పుడు తినాలి అని చెబుతోంది.
అబ్బో మా పాపకి చాలా విషయాలు తెలుసే.. మరి శాంభవి అంటే ఏమనుకుంటున్నారు.. నేనేమనుకుంటాను ఒక చిన్న పాపా అనుకుంటాను అంతే అని టీస్ చేస్తూ మాటల్లో పెట్టి ఎప్పుడు తినేదాన్ని కన్న ఎక్కువ తినిపించేస్తాడు.
అమ్మో మీరు చాలా ఎక్కువ తినిపించేశారు. ఇలా తింటే నా పని అంతే. ఏమవుతుంది అంటాడు. చాలా లావు అయిపోతాను తెలుసా అంటుంది.
ఎంత లావైనా భరించేది నేనే కదా... నాకు లేని ఇబ్బంది నీకు ఎందుకు పాప నువ్వు ఫుల్లుగా తిను అని ఇంకా కుక్కుతాడు.
తినిపించి మూతి కూడా కడిగి నీట్ గా నాప్కిన్ తో తుడిచి కాసేపు రెస్ట్ తీసుకుంటావా అంటాడు. మీరు పెట్టిన ఫుడ్ కి కళ్ళు మూతలు పడిపోతున్నాయి.
ఒక్క నిమిషం అని సీట్ అడ్జస్ట్ చేసి పడుకో అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు . పడుకుంటూ రుద్రనే చూస్తూ ఉంటుంది.
ఏంటి పాప.. మరీ ఓపెన్ సైట్ కొడుతున్నావు. వెంటనే చూపు తిప్పి.. ఎందుకు నా మీద మీరు ఇంత కేర్ చూపిస్తున్నారు అని అడుగుతుంది.
అదేం ప్రశ్న తింగరి. నువ్వు నాకు కాబోయే భార్యవి. పైగా నా మనసు దోచిన చిన్నదానివి అంటే.. అబ్బ మీ కవిత్వం ఆపి నిజం చెప్పండి.
మీ ఇంట్లో కూడా అందరూ నన్ను చాలా అపురూపంగా చూస్తున్నారు. నేను ఏదంటే అదే కరెక్ట్ అంటున్నారు. మా ఇంట్లో అంటే ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ కూడా ఎందుకలా ఉంటున్నారు. నాకు నిజం మాత్రమే చెప్పండి ప్లీజ్ అని అడుగుతుంది.
రుద్రా శాంభవి వైపు చూస్తూ ఫస్ట్ అఫ్ ఆల్ మీ, మా.. కాదు. అది మన ఇల్లు అర్థమైందా అంటాడు. ఇంకొక ముఖ్యమైన విషయం నీకు అన్నయ్యలు లలిత్, చరణ్, స్వరూప్ తో పాటు విహాన్, అద్వైత్ ధీరజ్ కూడ.
వాళ్లందరూ ఎప్పుడు నువ్వు అన్నయ్య అని పిలుస్తావా అని ఎదురుచూస్తున్నారు. అదే ఎందుకు అని అడుగుతున్నాను.
ఏదేదో చెబుతున్నారు కానీ నేను అడిగిన దానికి మాత్రం సరైన సమాధానం చెప్పడం లేదు. చెప్పాము కదా మా చిన్న మామ కూతురు అచ్చు నీలాగానే ఉంటుంది.
దూరమై చాలా సంవత్సరాలు అయింది. నిన్ను చూస్తుంటే తనే మాకు అందరికీ కనిపిస్తుంది. అందుకే నువ్వంటే మా అందరికీ అపురూపం అంటాడు.
అంటే మీ చిన్న మామ కూతురు నా వయసు ఉంటుంది కాబట్టి మీరు నన్ను ఇష్టపడ్డారా అని అడుగుతుంది. ఆ మాటకి రుద్ర వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అలాగే అనుకో అంటాడు.
అంటే నాలో మీ చిన్న మామ కూతురిని చూసుకుని తినిపించారా అని కొంచెం కోపంగానే అడుగుతుంది . శాంభవి కోపాన్ని పట్టించుకోకుండా ఒకసారి బావ అని పిలవవా అని అడుగుతాడు.
శాంభవి కి వస్తున్న నిద్ర మొత్తం ఎగిరిపోయి.. ఇప్పుడు మిమ్మల్ని నేను బావ అని పిలవాలా... పిలిస్తే నాలో పూర్తిగా మీ మరదల్ని చూసుకుంటారా...
అంతేగా... అంతేగా... అంటాడు. అలా ఎలా కుదురుతుంది. నాకు నచ్చదు. నేను... నేనే. తను... తనే అంటుంది.
నేను చెప్పేది అదే కదా అంటాడు. కాదు మీరు నాలో తనని చూసుకుని ఇష్టపడ్డారు అలాంటి ప్రేమ నాకు వద్దు. నన్ను నన్నుగా చూసి ఇష్టపడాలి అని ఈసారి టాప్ విప్పేస్తుంది.
శాంభవి కన్నీళ్లు చూసి కారు ఓ పక్కకి ఆపి. పిచ్చి ఎందుకే ఏడుస్తున్నావ్ అని కన్నీళ్లు తుడిచి... నిన్ను ఏదో సరదాగా ఆటపట్టిస్తున్నాను.
నువ్వు బంగారం. యూనిక్ పీస్ వి. నిన్ను ఎవరితోను కంపేర్ చేయడం లేదు. నిజంగానా అని వేలు పెట్టి చూపిస్తూ అడుగుతుంది.
నిజంగా బంగారం ఇంత అమూల్యమైన బంగారం ఎవరితో పోల్చిన అది తక్కువే అవుతుంది కదా ... మరి ఎందుకు నా పైన అంత ప్రేమ చూపిస్తున్నారు అని మళ్లీ మొదటికే వస్తుంది.
చెబితేనేమో ఫీలవుతున్నావు.. చెప్పకపోతే నేమో ఎందుకు అంటున్నావ్... ఎలాగమ్మాయి నీతో అని కార్ స్టార్ట్ చేస్తాడు.
ఇద్దరు గిల్లికజ్జాలు ఆడుకుంటూ మెల్లిగా రేపల్లెకు చేరుకుంటారు. మధ్యలోనే లంచ్ కూడా ఫినిష్ చేసి సాయంత్రానికి ఇంటికివస్తారు.
రేపల్లె ను చూడగానే శాంభవికి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. రుద్రవైపు తిరిగి ఇదే మా ఊరు అని ఉత్సాహంగా చెబుతుంది.
ఓ...అవునా ఇంకా నేను మా అత్తగారి ఊరు అనుకున్నానులే అంటాడు. ఈ వెటకారాలే మీకు వద్దనేది అంటూ...
అదిగో అటు వెళితే మా కాలేజ్ అని చెబుతుంది. పర్వాలేదు పాప.. నీకు దారి బానే గుర్తుంది అంటాడు. అదేంటి మా కాలేజ్ నాకెందుకు తెలవదు...
నువ్వు కాలేజీలో తక్కువ. రోడ్లమీద ఎక్కువ కదా.. అందుకే అన్నానులే అంటాడు. ఇదిగో మిమ్మల్ని... మీరు గనక నన్ను ఇలాగే ఏడిపించారనుకో మాములుగా ఉండదు.
అసలే మా ఊరు వచ్చారు అని కుర్త హాండ్స్ ని కొంచెం పైకి మడత పడుతుంది. మీ ఊరి చూసేటప్పటికి నీలో లేని బలం వచ్చిందా...
మాలో ఎప్పుడూ ఉంది. కాకపోతే అవసరం లేనప్పుడు ఎందుకులే అని వదిలేసాను. అవునవును... మీ ఊరు చూసేటప్పటికి బలం కనిపించిందా అంటే...
అంత లేదమ్మా శాంభవి సింగిల్ గా వెళ్లిన సరే వేటాడిరాగలదు అంటుంది. అ.. బ్బో... అంటాడు.
మరీ ఎక్కువ సాగదీయకండి అని మూతితిప్పుతుంది. శాంభవి అలకలు... రాగాలు అన్నీ చూస్తూ ఇంటి ముందుకు వచ్చి కారు ఆపుతాడు.
హై... మా ఇల్లు వచ్చేసింది. ఎన్ని రోజులైందో మా ఇల్లు ని చూసి అంటూ కారు దిగుతుంది. శాంభవి వెనకాలే రుద్ర కూడా కారు దిగుతాడు. అప్పటికే ఇంటిల్లిపాది శాంభవి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
అన్నలు ముగ్గురు వచ్చి శాంభవిని గట్టిగా కౌగిలించుకొని ఎన్ని రోజులైపోయింది రా బంగారం.. నేను కూడా మిమ్మల్ని అందరిని చాలా మిస్ అయ్యాను అన్నయ్య అని ఏడుపందుకుంటుంది.
సరే ఏడవకు. బావగారితో కలిసి వచ్చావు కదా ఇలా ఏడుస్తే బాగోదు అని కన్నీళ్లు తుడిచి.. రండి బావగారు అని రుద్ర చేయిపట్టుకుని లోపలికి తీసుకువస్తూ ఉంటే...
గుమ్మం దగ్గరకి రాగానే ఆగండి అన్న పిలుపు వినిపిస్తుంది. అయ్యో మా శక్కు బేబీ అంటుంది.
ఆ పిలుపుకి రుద్ర ఒక్కసారిగా శాంభవి వైపు చూస్తాడు. వెంటనే శాంభవి ఒక చిన్న నవ్వు నవ్వి... మా జేజి.. ఇప్పుడు మొదలు పెడుతుంది చూడు అనగానే...
వెంటనే పనమ్మాయి ఒక గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీసి వెళుతుంది. రుద్ర ఒక అడుగు ముందుకు వేయగానే మళ్ళీ ఆగండి అని ఆపుతారు. ఈసారి ఎర్రనీళ్ళతో దిష్టి తీసి పడేస్తారు.
ఇప్పుడు లోపలికి రావచ్చా అన్నట్టుగా రుద్ర చూస్తే...జేజి నా కాళ్లు లాగుతున్నాయి అని శాంభవి బిక్క మొహం వేస్తుంది.
వెంటనే శకుంతలాగారు కంగారు పడిపోతూ అయ్యో నా మనవరాలు కాళ్లు లాగుతున్నాయంట. కోడళ్లు ఏం చేస్తున్నారని కంగారుపెట్టేస్తారు.
అది చూసి రుద్ర నవ్వుకుంటూ.. నీ పనే బాగుంది కదా.. ఎక్కడ చూసినా రాజ భోగమే అని మెల్లిగా అంటాడు. మరి శాంభవి అంటే ఏమనుకుంటున్నారు అని లేని కాలర్ ఎగరేస్తుంది.
రేపల్లెలో రుద్ర అనుభవాలు...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)