05-04-2026, 03:53 PM
(This post was last modified: 05-04-2026, 03:54 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 57
రుద్ర గారు చేసుకుంటున్న అమ్మాయిని అనా నామీద మీరు ఇంత ప్రేమను చూపిస్తున్నారు అని అడుగుతుంది.
ఆ మాటకి ఏం చెప్పాలో తెలియక కౌసల్య మౌనంగా ఉంటే.. మాట్లాడరేమిటి అని చేయ పట్టుకుని కదుపుతుంది.
ఆ మాటకి ఏం చెప్పాలో తెలియక కౌసల్య మౌనంగా ఉంటే.. మాట్లాడరేమిటి అని చేయ పట్టుకుని కదుపుతుంది.
కౌసల్య తేరుకొని పక్కన కూర్చుని.. శాంభవి చేతిని తన చేతిలోకి తీసుకుని... ఆ చేతి మీద చిన్నగా తడుతూ.. అలాగే ఏమీ లేదు.
నిన్ను చూడగానే మా అన్న ఫీలింగ్ వచ్చింది. రుద్రతో పెళ్లి ఈ మధ్యన అనుకున్నాము కానీ.. ముందు నుంచి నీతో మేము అలాగే ఉన్నాము కదా.
నిన్ను చూస్తూ ఉంటే దూరమైన మా ఇంటి అమ్మాయి మళ్లీ మా దగ్గరికి వచ్చింది అనిపిస్తుంది అని చెబుతారు. అంటీ మీకు ఒక విషయం తెలుసా అని అడుగుతుంది.
ఏమిటమ్మా అంటే.. పొద్దుట దేవేంద్ర సార్ తో కలిసి గుడికి వెళ్ళాము కదా.. అక్కడ పెద్దవాళ్లు ఇద్దరూ
కలిశారు.
నిత్యం అమ్మవారి కి పూజ చేస్తూ ఉంటారంట. ఆ అమ్మమ్మగారు ఐతే నన్ను చూసి చాలా ఎమోషనల్ అయ్యారు తెలుసా అని చెబుతుంది.
ఆ మాటలు వినగానే కౌశల్యకి అర్థం అవుతుంది వాళ్ళ ఎవరో. వాళ్లు చాలా మంచి వాళ్ళు. చీమకు కూడా హాని తల పెట్టని గొప్ప వాళ్ళు అని ఆ రోజులు తలుచుకుని కంటతడి పెడతారు.
అయ్యో ఆంటీ మీరు ఎందుకు బాధ పడుతున్నారని కళ్ళు తుడుస్తోంది. సరే.. సరే.. మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఎంతసేపన్న టైం సరిపోదు.
పడుకో. పొద్దున్నే లెగాలి కదా అని చెప్పి శాంభవిని పడుకోబెట్టి దుప్పటి కప్పి ఎ. సి. అడ్జస్ట్ చేసి తలుపు దగ్గరికి వేసి వచ్చేస్తారు.
గదిలోకి వచ్చిన కౌసల్య ముభావంగానే ఉంటుంది. అది చూసి జితేంద్ర ఏమైంది.. ఎలా ఉన్నావు. శాంభవితో జరిగిందంతా చెబుతుంది.
ఎందుకండి వాళ్ళకి ఇంత బాధ. సొంత మనవరాలని దగ్గరికి తీసుకోలేకపోతున్నారు. మన కుటుంబానికి ఇంకా ఎన్ని రోజులండి ఈ పరీక్ష అంటే అన్ని సద్దుమణుగుతాయి. నువ్వు ఎక్కువ ఆలోచించకు. పడుకో అని లైట్ ఆపేస్తారు.
ఉదయం అందరికన్నా ముందే లేచి శాంభవి గబగబా రెడీ అయిపోతుంది. హాల్ లోకి వచ్చి రుద్రా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
అప్పుడే లేచి బయటికి వచ్చిన కౌసల్య, చారు శాంభవిని చూసి ఏంటి అప్పుడే రెడీ అయిపోయావా.. ఎప్పుడో ఆంటీ. రుద్ర సార్ వస్తే బయలుదేరడమే.
రుద్ర అప్పుడే లేచి బయటకు వచ్చి గుడ్ మార్నింగ్ అమ్మ అని చెబుతాడు. రుద్రాన్ని అలా చూడగానే శాంభవికోపం పిక్స్ లోకి వెళ్ళిపోతుంది.
ఏంటి సార్ మీరు ఇంకా రెడీ అవ్వలేదు అంటే... అప్పుడు శాంభవిని చూసి ఏంటి ఎప్పుడు రెడీ అయ్యావు
అని అడుగుతాడు.
మీకు నిన్ననే చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాదామని . అవును ఇంకా తెల్లారలేదు కదా.. బయట చూడు సన్ ఇంక రాలేదు.
మనం ఇప్పుడు బయలుదేరితే ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు. మీరు ఇప్పుడు వెళ్లి ఎప్పుడు ఫ్రెష్ అవుతారు. ఎప్పుడు రెడీ అయ్యి వస్తారు అని కంగారు పడుతూ ఉంటుంది.
కూల్... కూల్... శాంభవి నిన్ను జాగ్రత్తగా సాయంత్రం లోపు మా అత్తారింటి దగ్గర దింపే బాధ్యత నాది. సరేనా అని చెప్పి వాళ్ళ అమ్మకి ఒక కిస్ ఇచ్చి రూమ్ లోకి వెళ్ళిపోతాడు.
రుద్ర తో పాటు విహాన్, అద్వైత్ కూడా రెడీ అయ్యి వస్తారు. ధీరజ్ కూడా రెడీ అయ్యి వచ్చేస్తాడు. కారు మొత్తం రకరకాల స్వీట్స్ తో నింపేస్తారు.
ఆంటీ ఏంటి ఇవన్నీ... ఇక్కడి నుండి మొదటిసారి ఇంటికి వెళుతున్నావు కదా.. ఉత్తి చేతులతో ఎలా పంపిస్తాము. అందుకే ఏవో కొన్ని చేసి పెట్టాను అంతే అంటారు.
ఇవి కొన్నినా ఆంటీ. కారు మొత్తం స్వీట్స్ స్మెల్ వచ్చేస్తుంది. దేవేంద్ర గారి రుద్ర దగ్గరికి వచ్చి నా కూతురు జాగ్రత్త.
ఎక్కువ ఏడిపించకు అని చెప్తే.. మామ అని గారాలు పోతాడు. చేసిన ఓవరాక్షన్ చాలు. ఎక్కువ ఏడిపించకు రా..
అమ్మాయికి ఇప్పుడు దాకా ఇలాంటివి తెలియదు కదా.. చిన్నబుచ్చుకుంటుంది. అంత లేదు ఎంజాయ్ చేస్తుంది. పైకి అలా బిల్డప్ ఇస్తుంది.
నేను చూసుకుంటాను కదా.. టెన్షన్ పడకండి అని హగ్ చేసుకుంటాడు. రాఘవేంద్ర గారు కూడా మనవరాలు దగ్గరికి వచ్చి చాలా జాగ్రత్తలు చెబుతూ ఉంటారు.
వెనుక సీట్లో పడుకుని దుప్పటి కప్పుకో. కూలింగ్ ఎక్కువైతే తగ్గించమను. నీకు ఏదైనా అవసరం అయితే రుద్రాకి చెప్పు గాని కారు దిగకు అమ్మా ఎండ పెరిగిపోతుంది.
కోడల్ని చూస్తూ టిఫిను, లంచ్ అన్ని ప్యాక్ చేసావా అమ్మ అని అడుగుతారు. అన్ని పెట్టేసాను మావయ్య గారు. జ్యూసెస్ కూడా కారులో పెట్టాను అని చెబుతుంది.
ఆ మాటలకు రుద్రా నోరు వదిలేసి... అదేమైనా నాలుగైదు రోజులు ట్రిప్ వెళుతుందా ఏంటి. గట్టిగా ఇక్కడ కారు తొక్కితే 6:00 గంటల్లో అక్కడికి చేరుకుంటాము.
దానికి ఇన్ని ప్రిపరేషన్స్ అవసరమా అని అడుగుతాడు. నీకు ఏమి తెలీదు. నువ్వు కామ్ గా ఉండు అసలే శాంభవి చిన్న పిల్ల.నిన్ను అడగడానికి మొహమాట పడవచ్చు. అందుకే అన్ని సర్దాము అని చారులత గారు కూడా వెనకేసుకొస్తారు.
సరిపోయింది ఇలాగైతే మా జర్నీ సాగినట్టే అని వెళదామా అని అడుగుతాడు. సరే అని కార్ ఎక్కి అందరికీ బాయ్ చెబుతుంది.
జాగ్రత్త తల్లి. జాగ్రత్త రుద్ర.. స్పీడ్ గా వెళ్లకు. మళ్ళీ అమ్మాయికి కళ్ళు తిరుగుతాయి అని 100 జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు.
అన్నగార్లు ముగ్గురు కూడా కంగారుగా వచ్చి శాంభవి చేతికి చాక్లెట్స్ ఇస్తారు. మధ్యలో ఏమైనా తినాలి అనిపిస్తే ఉంటాయి ఉంచుకో తల్లి.
రుద్ర కోపంగా వాళ్ళని చూస్తూ ఇంకా ఏమైనా ఉంటే ఒక ట్రక్కులో నింపి కార్ కి కట్టండి రా అని అరుస్తాడు. ఎందుకు బావ అంత కోపం.
దారి మధ్యలో శాంభవి ఇబ్బంది పడకూడదు అనే మా తాపత్రయం అంతా అని చెబుతారు. నేను ఉన్నది ఎందుకు..
మా ఏదైనా అవసరం అయితే నేను చూసుకోనా... నాకు ఇంకా ఛాన్స్ ఇవ్వరా మీరు అని అడిగితే.. నువ్వు డ్రైవింగ్ చేస్తావు కదా బావ.డిస్టర్బ్ అవ్వడం ఎందుకు అని మేము అన్ని సర్దాము అని వచ్చె నవ్వును ఆపుకుంటూ చెబుతారు.
చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ మూసుకుని దొబ్బేయండి అని చెప్పి కార్ ని ముందుకు పోనిస్తాడు.
వెళుతున్న రుద్ర కొంచెం సీరియస్ గానే ఉంటాడు. ఎందుకు సార్ మీరు అంత కోపం. ఆ సార్ వాళ్ళు ఏం చేశారు అని అడుగుతుంది.
నా కోపం వాళ్ల మీద కాదు నీ మీద అంటాడు. మధ్యలో నేనేం చేశాను. వాళ్ళు అన్ని చాక్లెట్స్ ఇస్తుంటే.. అయ్యో అన్నయ్యలు వద్దు.
మా వారు ఉన్నారు కదా.. ఆయన నాకేం కావాలన్నా చూసుకుంటారు అని చెప్పడం మానేసి... థాంక్యూ.. థాంక్యూ అనుకుంటు అవన్నీ పుచ్చుకుంటావా అని వెటకారంగా అంటాడు.
ఇది మరీ బాగుంది ప్రేమతో ఇస్తే వద్దు అనాలా అంటే.. మరి నా ప్రేమను అంత ఎప్పుడు చూపించాలి. పోనీ ఒక పని చేయనా అంటాడు.
ఏంటి అని అడిగితే వాళ్లందరూ నీకే ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ విధంగా ప్రేమను చూపించారు కదా.. నేను ఇంకొక విధంగా చూపించనా అని అడుగుతాడు.
ఎలా చూపిస్తారు అని క్యూరియాసిటీతో అడుగుతుంది. చాలా ఆత్రంగా ఉన్నట్టుంది పాపకి అంటే.. ఇదిగో మళ్లీ పాప అంటున్నారు.
నేనొక్కడినేమీ అనడం లేదు. ఇంటి దగ్గర కూడా అందరూ ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకో అని అంటాడు. ఏమన్నారబ్బా అని బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచించి చిన్నపిల్ల అన్నారు.
అంటే మీ అందరి దృష్టిలో నేను అంత చిన్న పిల్లనా అని అడుగుతుంది. చెప్పాను కదా మనకి పిల్లలు పుట్టిన... ఆ పిల్లలకు మళ్ళీ పిల్లలు పుట్టిన నువ్వు ఎప్పటికీ అందరూ దృష్టిలో పాపవే అని నవ్వుతాడు.
రుద్ర నవ్వుని చూసి ఉడుక్కుంటూ ఉంటుంది. ఇంతకీ నా ప్రేమని ఎలా చూపిస్తానో నువ్వు తెలుసుకోలేదు అని టాపిక్ మళ్ళీ మార్చుతాడు.
చెప్పు... చెప్పు.. అని రుద్ర వైపుకి తిరుగుతుంది. నిన్ను ఈజీగా డైవర్ట్ చేసేయొచ్చు పాప అని మనసులో
అనుకొని...
చెప్పనా అని శాంభవి ముందుకి వంగుతాడు. మీరు సరిగ్గా డ్రైవింగ్ చేస్తూ కూడా చెప్పవచ్చు. ఇలా మరి
నా మీదకు వచ్చి చెప్పక్కర్లేదు అని వెనక్కి బెండ్ అవుతుంది.
అయ్యో నీకు అర్థం కావడం లేదు పాప. ఇంత దగ్గరికి వస్తేనే చెప్పడం కుదురుతుంది అని అంటాడు. అలాగైతే ఏమీ అవసరం లేదు. నాకు మీరు ఏమి చెప్పక్కర్లేదు డ్రైవింగ్ చేయండి అని మూతితిప్పుతుంది.
అయితే అవసరం లేదు అంటావు అంటాడు. అవును అవసరం లేదు. సరే అయితే తర్వాత నువ్వు బ్రతిమాలిన నేను చెప్పను అంటాడు.ఏమి చెప్పనవసరం లేదు. మీరేం చెబుతారో నాకు తెలుసు అంటుంది. ఓ అవునా ఏం చెబుతాను. కొంచెం చెప్పవా..
నేను చెప్పను అంటుంది. ఒక బెట్టు వేసుకుందామా.. ఏమిటి అంటే... నేను అనుకున్నది నువ్వు అనుకున్నది ఒకటే అయితే నువ్వు విన్ అయినట్టు.
కాకపోతే అని ఉత్సాహంగా అడుగుతుంది. నేను విన్ అయినట్టు అంటాడు. నాకు తెలుసు... నేనే విన్ అవుతాను అంటుంది.
అయితే ఏమనుకున్నానో చెప్పు అంటాడు. అమ్మ అలా ఎలా చెబుతాను. నేనేమనుకున్నానో చెప్పించేద్దామనే. అంత సీన్ లేదు.
అప్పుడు నేను విన్ అయినట్టు. నేను విన్ అయితే నేను చెప్పింది నువ్వు చేయాలి అంటాడు. లేదు లేదు అని దెబ్బలాటకి దిగుతుంది.
అడ్డంగ ఇల దెబ్బలాడకూడదు. ఏదైనా స్ట్రెట్ గా ఉండాలి అంటాడు. నేనేమి దెబ్బలాడడం లేదు. మీరు అనుకున్నది చెబితే నీ మనసులో ఇది ఉందా అని మొదలు పెడతారు.
నాకు తెలుసు అంటుంది.
శాంభవి మనసులో ఏముందో చెబుతుందా...
కథ కొనసాగుతుంది...



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)