04-04-2026, 03:01 PM
Part - 54
ఆ పెద్దాయన అంత గంభీరంగా అడుగుతూ ఉంటే.. ఆశ, నిష భయంతో వనికిపోతూ ఉంటారు. ఆనంద్, విహారి మీరు కంగారు పడకండి అని..తాతగారు మీకు ముందే చెప్పాము కదా...
వీళ్ళిద్దరూ మా ఫ్రెండ్స్ అంటారు. సరే అయితే వీళ్ళని లోపలికి తీసుకువెళ్లి విశ్రాంతి తీసుకోమను. తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి పంపిస్తాడు.
హమ్మయ్య అనుకుని ఇద్దరు మెల్లిగా లోపలికి వెళ్తారు. వాళ్లు వెళ్లిన తర్వాత పెద్దాయన ఎవరికో ఫోన్ చేసి మాట్లాడతారు.
లోపలికి వెళ్ళిన ఆశ,నిషా అయ్యబాబోయ్ మీ తాతగారు ఏంటి అలా ఉన్నారు. ముందే చెప్పాము కదా మా తాతగారు చాలా స్ట్రిక్ట్ అని.
ఆ కుటుంబం మీద కూడా చాలా కోపంగా ఉన్నారు అని. మిమ్మల్ని ఎవరు ఏమిటి అని అడిగితే.. సమాధానం చెప్పకుండా అలా చూస్తారు ఏమిటి అని విసుగ్గా అంటారు
ఏంటి మాట్లాడేది.. ఆయన అలా అడుగుతూ ఉంటే.. టెన్షన్ తో చెమటలు పట్టేసాయి. ఇప్పుడు మళ్లీ సమాధానం చెప్పాలి అంటే ఎలాగా..
సరేలే ప్రస్తుతానికి వెళ్లి రెస్ట్ తీసుకోండి. తర్వాత మాట్లాడుకుందాం అని వాళ్ళిద్దరికీ ఒక గది చూపిస్తారు. రూమ్ లోకి వెళ్ళగానే.. చూసి చాలా బాగుంది కదా అని అనుకుని ఫ్రెష్ అయ్యి మంచం మీద పడుకుంటారు
ఇంతలో మేయిడ్ వచ్చే డోర్ నాక్ చేస్తుంది. కమింగ్ అని చాలా పొగరుగా పిలుస్తారు. జ్యూస్ మేడం అని. అక్కడ పెట్టు అని పొగరుగానే చెబుతారు.
వాళ్ళని పైనుంచి కిందకి ఒకసారి చూసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకే ఆ అమ్మాయి మనల్ని అలా చూసింది.
మన లాంటి బ్యూటిఫుల్ గర్ల్స్ ని ఎప్పుడూ చూసి ఉండరులే అని జ్యూస్ తీసుకుని తాగుతూ అంటుంది.
ఇద్దరూ జ్యూస్ తాగి ఫ్రెష్ అయి పడుకుంటారు. ఇద్దరు సాయంత్రం దాకా లెగరు. మళ్లీ ఆ అమ్మాయి వచ్చి డోర్ నాక్ చేసి పెద్దయ్య గారు రమ్మంటున్నారు అని చెబుతోంది.
ఇద్దరూ గుడ్ గర్ల్స్ లాగా బయటికి వెళ్తారు. పిలిచారంట తాతగారు అని చాల వినాయంగా అడుగుతారు. వాళ్ళిద్దర్నీ పైనుంచి కింద వరకు చూసి మీ ఇద్దరి గురించి మా మనవళ్ళు చెప్పారు .
మీ గురించి చెప్పిందంతా నాకు బాగా నచ్చింది. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారంట అనిఅడుగుతారు. దానికి తడబడతు ..వీళ్ళిద్దరూ ఏం చెప్పుఉంటారే అని చెవులు కొరుక్కుంటూ ఉంటారు.
అది... అది అని నాన్చుతూ ఉంటే... అంటే మీకు ఇష్టం లేదా.. మీకు ఇష్టం లేకుండానే మా మనవళ్లతో కలిసి మా ప్యాలెస్ కి వచ్చారా అని కోపంతో కళ్ళు ఎర్ర చేస్తారు.
ఆయన కోపానికి భయపడి మాకు ఇష్టమే అని గబగబా పాఠం చెప్పినట్టుగా చెబుతారు. వెంటనే ప్రసన్న వదనంతో మంచిది అమ్మాయిలు.
మిమ్మల్ని ఇద్దరినీ మా మెయిడ్స్ రెడీ చేస్తారు. వెళ్లి రెడీ అవ్వండి అని చెబుతారు. ఎక్కడికి అని అడిగితే..ఈరోజు మీ పెళ్లి అని చెబుతారు.
ఆ మాట వినగానే ఇద్దరి నెత్తి మీద బాంబు పడినట్టుగా ఉలిక్కిపడి... పెళ్లా అని గట్టిగా అరుస్తారు. ఏమైంది అలా అరుస్తున్నారు అని మళ్లీ సీరియస్ గా మొఖం పెట్టుకుని అడుగుతారు.
ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పాలి కదా.. మా తల్లిదండ్రుల తీసుకువచ్చి అందరి మధ్య గ్రాండ్గా చేసుకుందాము అని భయంగా చెబుతారు.
ఈ పెళ్లి గురించి చెబితే మీ అత్తయ్య, తాతయ్య ఒప్పుకుంటారా అని అడుగుతారు. వాళ్ళు లేదు అనే తలుపుతారు.
మరి ఇంకేంటి? మీకు నాకు కావాల్సింది పగ తీరడమే. మీకు అంతగా ఇష్టం లేకపోతే పగ తీరిన తర్వాత డివోర్స్ తీసుకోండి అని చెబుతారు.
ఆ మాట ఏదో బాగుందే అనుకుని సరే అని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్తారు. వాళ్ళిద్దరూ వెళ్లిన తర్వాత ఆనంద్ విహారి అక్కడికి వచ్చి ఏమైంది తాతగారు అంటే...
వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు ఏంట్రా అని అడుగుతారు..ఆ మాటకి ఇద్దరు సైలెంట్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటారు.
ఒక్క నిమిషం తాతగారు అని వీళ్లిద్దరూ వాళ్ళిద్దరూ వెనకాల వెళ్లి తలుపు కొడతారు.
తలుపు తీసి ఏంటి అని అడిగితే... మీకు ఈ పెళ్లి నిజంగానే ఇష్టమేనా.. అసలు మీలో ఎవరు మమ్మల్ని చేసుకుంటున్నారు అదైనా తెలుసా అని అడుగుతారు.
ఇందులో తెలుసుకోవడానికి ఏముంది. ఇప్పుడు దాకా మనకు ఎవరికీ పరిచయాలు లేవు కదా... ఎవరికి ఎవరు మ్యాచ్ అవుతుంటే వాళ్ళ పెళ్లి చేసుకోవడమే.
తర్వాత మన అందరికీ ఓకే అనుకుంటే ట్రావెల్ చేద్దాం లేకపోతే అప్పుడే బ్రేకప్ చేసేసుకోవచ్చని చాలా సింపుల్గా చెబుతారు. ఆ మాటకి ఇద్దరిలోనూ కమింగ్ స్మైల్ వస్తుంది. సరే సరే కానివ్వండి అని చెప్పి బయటకు వచ్చేస్తారు.
ఆశ నిషా రెడీ అయ్యేటప్పటికి ఆనంద్ విహారి కూడా రెడీ అవుతారు. సింపుల్ గా ప్యాలెస్ లోనే ఆశ ఆనంద్ కి, నిషా విహారికి పెళ్లి చేసి మ్యారేజ్ రిజిస్టర్ చేస్తారు..
ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి. రేపు మీ ఇంటికి వెళ్లి అక్కడ కూడా కనబడుదురు గాని అని చెబితే... అమ్మో మా ఇంటికా... ఇద్దరు భయంగా అంటారు.
చెప్పకపోతేనే ఇంకా తప్పు అవుతుంది. అమ్మాయిలు ఇద్దరికీ ఒక గది చూపించండి అని చెప్పి వెళ్ళిపోతారు.
ఆశ నిషాని రెస్ట్ తీసుకోమని ఆనంద్ విహారి వేరే గదిలోకి వెళ్లి పోతారు
మయూరి ఇంటి దగ్గర ఆలోచిస్తూ ఉంటుంది. ఏవో నెగటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరూ రెండు రోజుల నుంచి కనపడటం లేదు.
ఎక్కడికి వెళ్లి ఉంటారు. ఫోన్ చేస్తున్న స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఏమై ఉంటుంది. రుద్రాఏమైనా చేసి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటుంది.
ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే అనుకొని బృందావనంలో తన మనిషి కాల్ చేస్తుంది. అక్కడ ఏమైనా తేడాగా ఉందా...
లేదు మేడం అంత నార్మల్గానే ఉంది. రుద్ర ఎక్కడున్నాడు. చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు. సాయంత్రం ఆఫీసు నుంచి తొందరగానే వచ్చేస్తున్నారు అని చెబుతోంది.
సరే అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక్కడ ఇన్ఫర్మర్ మాత్రం చెమటలు తుడుచుకుంటూ పక్కకి చూస్తుంది. అక్కడ ధీరజ్, విహాన్ చెరుకో పక్కన చాకు పట్టుకునే ఉంటారు.
సార్ నన్ను వదిలేయండి అని భయంగా అడుగుతుంది. ఈ తప్పుడు పని చేయకముందు ఆలోచించాలి.ఇక్కడ విషయాలు అక్కడికి చేరవేయడానికి ఎంత ధైర్యం నీకు.
ఏదో డబ్బులకు కక్కుర్తి పడ్డాను కానీ ఏమీ చెప్పలేదు కదా... చెప్పడానికి అసలు నీకు ఏం తెలుసు అని. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని ధీరజ్ అడిగితే మన కంట్రోల్ లోనే ఉంటుంది.
ఫోన్ తీసుకుని మనమే మాట్లాడదాం అని విహాన్ ఫోన్ లాక్కుంటాడు.
మయూరి ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్లారు వీళ్ళు ఇద్దరు. సమాధానం లేని ప్రశ్న ఎదురవుతుంది.
శాంభవి దేవేంద్ర గారిని అడుగుతుంది. పొద్దుటే నన్ను తీసుకువెళతాను అన్నారు మర్చిపోరు కదా... లేదమ్మా తప్పకుండా తీసుకువెళ్తాను అని చెబుతారు. సరే అని పడుకోవడానికి వెళ్ళిపోతుంది.
బావమరిదులు ముగ్గురు బావ పక్కన కూర్చుని ఏంటి బావ.. శాంభవి వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చావు అంట. ఏంటి సంగతి అని అడుగుతాడు.
అందులో అంతా అనుమానం ఎందుకు. పెళ్లి ఎలాగు దగ్గర పడుతుంది కదా.. ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఉంది అన్నది. సరే అని ఒప్పుకున్నాను అని చెబుతాడు.
కానీ నీ మొఖం చూస్తే మాకు అలా అనిపించడం లేదే.. ఇంకా ఏదో జరిగింది అనిపిస్తుంది. ఏమయి ఉంటుంది బావ అని ముఖాన్ని అటు ఇటు తిప్పుతూ అడుగుతాడు.
నా ముఖంలో ఏమైనా కోతులు ఆడుతున్నాయా అని అడుగుతాడు. కోతులు కాదు గాని ఏదో కొత్త కళ కనపడుతుంది.
అది ఏంటో మాకు అర్థం కావడం లేదు. అర్థం అవ్వాలి అంటే...ఒక పని చేయాలి అంటాడు.. ఏం పని బావ.. ప్రేమలో పడండి.. ఆటోమేటిగ్గా ఆ కళ వచ్చేస్తుందని పక్క నుంచి దేవేంద్ర గారు అంటారు.
అంటే ఇది ప్రేమలో ఉన్న కళ మా బాబాయ్. హ్మ్.. అందులో ఉన్న మ్యాజిక్ ఏ అది అని.. దేవేంద్ర గారు ఆయన ప్రేమలో పడిన రోజులు గుర్తు చేసుకుంటారు.
ఆయన భార్యని గుర్తు చేసుకుంటూ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా.. మండుటెండలో కూడా వెన్నెల కురిపిస్తుంది. చెప్పుల్లేకుండా ఎడారిలో నడిచిన హాయిగానే అనిపిస్తుంది అంతా మత్తు ఉంటుంది ప్రేమకి.
మనం ప్రేమించిన అమ్మాయి చిరునవ్వు చాలు.ఎలాంటి కష్టాన్నయినా దాటివేయగలము. అది దూరమైతే మాత్రం ఎన్ని సుఖాలు మన చుట్టూ ఉన్న ఊపిరాడినట్టుగానే ఉంటుంది అని కళ్ళు మూసుకుంటారు.
ఆ ముసిన కళ్ళు వెనకాల అందమైన చిరునవ్వుతో చూస్తూ ఉన్న తన భార్య రూపమే కనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆ రూపాన్ని చూస్తూ అలాగే ఉండిపోతారు.
ఎంతసేపు ఉన్నా ఆయన బయటికి రాలేకపోతుంటే జితేంద్ర తమ్ముడు చేతి మీద చెయ్యి వేసి చిన్నగా తడతాడు.
వెంటనే దేవేంద్ర కళ్ళు తెరిచి నేను బాగానే ఉన్నాను అన్నయ్య అని పిల్లల వైపు చూస్తారు. నలుగురు ఈయన వైపే చూస్తూ ఉంటే...
నేను బాగానే ఉన్నాను. రుద్ర నాకు ఒక్క మాట ఇవ్వు అంటారు. చెప్పు చిన్న మామ అనగానే నా కూతుర్ని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదలొద్దు.
మన చుట్టూ చాలా దుష్టశక్తులు ఉన్నాయి. రేపన్న రోజున శాంభవికి మాయ మాటలు చెప్పి నీకు దూరం చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు అని గద్గద స్వరంతో చెబుతూ ఉంటే...
ఎలాంటి పరిస్థితి వచ్చినా.. ఆఖరికి నీ కూతురు నన్ను చీకొట్టి దూరంగా వెళ్ళాలి అనుకున్నా సరే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను సరేనా చిన మామ అని చేతిలో చేయి వేసి చెబుతాడు.
చాలు రా.. ఈ ఒక్క మాటతో నా మనసులో ఉన్న బాధనంత తీసివేసావు అని రుద్రని హత్తుకుంటాడు.
అది చూసిన రాఘవేంద్ర గారికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది.
వీళ్ళని దూరంగా నిలబడి చూస్తున్నా అనసూయ వైపు చూసి ఛీ.. అన్నట్టుగా చూస్తారు. భర్త చూపులో అసహ్యాన్ని చూసి అనసూయ తట్టుకోలేక పోతుంది.
అనసూయ పరిస్థితి ఏమిటి...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)