04-04-2026, 02:58 PM
Part - 52
దేవేంద్ర పొద్దున్నే రెడీ అయ్యి గుడికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్ గా అనిపిస్తుంది కానీ చెప్పడం తన ధర్మం అని వెళ్లి.. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.
గుడి తెరిచే టైంకే వచ్చేయడం వలన భక్తులు ఎక్కువ ఉండరు. పల్చ పల్చగా ఇద్దరు ముగ్గురు కనిపిస్తూ ఉంటారు.
ఒక పెద్దాయన ఒక పక్క మంత్రాలు చదువుకుంటూ.. అభిషేకానికి నీళ్లు తీసుకువెళుతూఉంటారు. దేవేంద్ర స్పీడ్ గా వెళ్లి మావయ్య గారు అని పిలుస్తారు.
ఎవరా అని చూస్తూ... ఎవరు మీరు.... నన్ను గుర్తుపట్టలేదా అంటే... క్షమించండి బాబు. నాకు ఈ మధ్యన చూపు మందగించ్చింది.
తప్పుగా అనుకోకుండా మీరు ఎవరో చెబుతారా... నేను దేవేంద్ర ని. ఆ మాట వినగానే ఆయన కోపంగా దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి.
అమ్మవారి సేవకి వెళుతున్నాను. నా నోటి నుండి ఇప్పుడు ఎటువంటి చెడు మాటలు మాట్లాడనివ్వద్దు అని కోపంగా అడుగు ముందుకు వేస్తుంటే....
మీ మనవరాలు కనిపించింది అని చెబుతారు. అది వినపడి ముందుకు పడే అడుగు ఆపి ఏమంటున్నారు మీరు...
నేను నిజమే చెబుతున్నాను మావయ్యగారు...మీ మనవరాలు కనిపించింది. మన నిరీక్షణ ఫలించింది అని చెబితే..
ఒక్క అరగంట మీరు ఆగండి ఇప్పుడే వస్తాను అని గుడిలోకి వెళ్లి అమ్మవారి అభిషేకం అన్ని స్వయంగా చేతులతో చేసి బయటకు వచ్చి కూర్చుంటారు.
అక్కడే ఒక చెట్టు కింద అరుగు మీద కూర్చుని ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పేది ఏమిటో అడుగుతారు. నేను నిజమే చెబుతున్నాను.
మీ మనవరాలు కనిపించింది. కాకపోతే నేనే తండ్రిని అని తెలియదు. ఆయన విరక్తిగా నవ్వుతూ...ఇప్పుడు ఈ విషయం చెప్పడం వలన మీ ఆంతర్యం ఏమిటి అని అడుగుతారు.
దానికి దేవేంద్ర పెళ్లి కుదిరింది. అమ్మాయి పేరు శాంభవి అని చెబుతారు. శాంభవి నోట్లోనే మననం చేసుకుంటూ ఉంటారు.
పెళ్లి కూడా నా మేనల్లుడు రుద్రతోనే అని చెబుతారు. ఇప్పటికి కూడా వదలడం లేదా...ఆ నరకంలోనికే ఇప్పుడు ఆ పసిప్రాణాన్ని కూడా లాగుతున్నారా అని అడుగుతారు.
ఆ మాటక ఆయన బాధగా మీలాంటి గొప్ప వారి నోటి వెంట చెడు మాటలు వద్దు. నా కూతురు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి.
సంతోషం... ఇంకా ఏమీ మాట్లాడలేక అంతా అమ్మ లీలా అనుకొని... రేపు ఒక్కసారి అమ్మాయిని గుడికి తీసుకు రాగలరా అని అడుగుతారు. తప్పకుండా..
నా కూతురు ఎప్పుడు పచ్చగాఉండాలి. దయచేసి నామీద కోపాన్ని బిడ్డ మీద చూపించవద్దు. మేము మరీ అంత మూర్ఖులం కాదు.
తను మీ బిడ్డ అనే దాని కన్నా..
ముందు నా కూతురు బిడ్డ. మేము అలాగే చూస్తాము అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు.
వెళుతున్న పెద్దాయన చూస్తూ కళ్ళు మూసుకుని అమ్మవారి వైపు చూస్తూ ఇంకా ఎంతకాలం అమ్మ ఈ శిక్ష అనుకోని వెళ్లిపోతారు.
దేవేంద్ర కి కొంచెం మనసు శాంతిఇస్తుంది. శాంభవి వంకనైనా వాళ్ళ మామగారు మాట్లాడారు.
రేపు మనవరాలని చూస్తే ఇంకొంచెం మనసు మెత్తబడవచ్చు. అత్తగారిని కూడా క్షమాపణ అడిగి శాంభవి ని చూపించాలి అనుకుంటారు.
దేవేంద్ర ఇంటికి వెళ్లేటప్పటికీ శాంభవి ఎదురు వస్తూ ఉంటుంది. అలా చూసిన దేవేంద్రకి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
శాంభవి తల పైన చేయి వేసి ఏంటి తల్లి అని అడుగుతారు. పొద్దుట నుండి నాకు మీరు కనపడలేదు. ఏంటో వెలితిగా అనిపించింది.
ఎక్కడికి వెళ్లారు నాకు చెప్పకుండా అని అలకగా అడుగుతుంది. శాంభవి మాటలకు నవ్వుకుంటూ గుడికి వెళ్లాను అని చెబుతారు.
అయ్యో చెబితే నేను వచ్చేదాన్ని కదా అంటుంది. రేపొద్దున్న నిన్ను తీసుకువెళ్తాను. వస్తావా అని అడుగుతారు.
తప్పకుండా వస్తాను అని చెబుతుంది. సరే అని చెప్పి ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు.
వస్తున్న ఇద్దరినీ చూసి రుద్ర ఏంటి తండ్రి కూతుర్లు ఇద్దరూ తిప్పుకుంటూ వస్తున్నారు అని అడుగుతాడు. ఆ మాటకి శాంభవి....తండ్రి కూతుర్లు ఏమిటి అని అడుగుతుంది.
అదే...నువ్వు నాకు కాబోయే పెళ్ళాం. ఈయన నాకు మేనమామ అంటే...వరుసకు నువ్వు కూతురివే అవుతావు కదా అలా చెప్పాను అంటాడు.
రుద్రా రేపు నువ్వు కూడా మాతోపాటు గుడికి రావాలి అని దేవేంద్ర చెబుతారు. ఏ గుడికి మామ అంటే.. శాంభవిని తీసుకుని వెళుతున్నాను.
నువ్వు కూడా రా అని ఇండైరెక్టుగా ఏ గుడో చెబుతారు. సరే మామ నాకు కాబోయే పెళ్ళంతో అంటే ఎందుకు రాను అంటాడు.
ఈయన.. ఈ వెటకారాలు.. ఎవరి ముందు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు అని పళ్ళనూరుతూ ఉంటుంది.
ఎక్కువ నూరకు... అరిగిపోయాయి అనుకో మాటలు కూడా సరిగ్గా రావు అని కౌంటర్ వేస్తాడు. ఎందుకురా అస్తమాను నా కూతురుని ఏడిపిస్తూ ఉంటావు...
అలా అడగండి అంకుల్.ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. శాంభవిని చూసి రుద్ర నవ్వుకుంటాడు. సార్ నుంచి అంకుల్ కి వచ్చింది పరవాలేదులే అనుకుని...
ఏంటే నా మీదే మా మామకి కంప్లైంట్ ఇస్తున్నావా... ఎవరికి కంప్లైంట్ ఇచ్చిన నాకు ఫరక్ పడదు అని అంటాడు.
అవునా మీరు ఎప్పుడో ఒకప్పుడు... ఎవరో ఒకరికి భయపడతారు చూడు... అప్పుడు అది నేను చూడాలి అని డ్రీమ్స్ లోకి వెళుతూ ఉంటే....
హలో పాప నీకు అంత సీన్ లేదు. నన్ను భయపెట్టే వాళ్లు ఇంకా పుట్టలేదు. పుట్టినప్పుడు సంగతి ఆలోచిద్దాంలే అంటాడు.
పుట్టాలి అని నేను కోరుకుంటున్నాను అని గట్టిగా అంటుంది. వాళ్ళిద్దరు గొడవ చూసి నవ్వుకుంటూ దేవేంద్ర తండ్రి దగ్గరికి వెళతాడు.
నన్ను భయపెడితే నీకెందుకే అంతా ఆనందం అని అడిగితే... అస్తమాను మీరు నన్ను ఏడిపిస్తున్నారు కదా అందుకే అని అంటుంది.
అక్కడి నుంచి దేవేంద్ర వెళ్ళిపోయిన సంగతి కూడా శాంభవి పట్టించుకోకుండా రుద్రతో గొడవ పడుతూ ఉంటుంది.
సరే తొందరగా రెడీ అవ్వు. కార్ లో వెళుతూ కూడా మనం గొడవ పడొచ్చు అని అక్కడి నుండి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు.
పక్కకు చూస్తే.. అప్పటికీ దేవేంద్ర కనపడడు. ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటూ చుట్టూ చూస్తుంది హాల్లో శాంభవి ఒక్కతే ఉంటుంది.
చాలా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. తన గదికి వెళదామని మెల్లిగా అడుగులు వేస్తూ ఉంటే... చల్లటి గాలి వచ్చి చెంపని తాకుతుంది
ఆ గాలి స్పర్శ ఎందుకో తెలియని ఆత్మీయతను చూపిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. చంప పైన చెయ్యి వేసుకుని ఆ గాలిని ఆస్వాదిస్తూ చుట్టూ చూస్తూ ఉంటుంది.
అక్కడ నిలువెత్తు ఫోటో కనపడుతుంది. అది చూడగానే అడుగులు అటువైపుకు వేస్తుంది. అది దేవేంద్ర గారి భార్య ఫోటో. ఎందుకో ఆ ఫోటోని చూడగానే శాంభవిని పిలుస్తున్నట్టే గానే ఫీలవుతూ దగ్గరికి వెళ్ళిపోతుంది.
దేవేంద్ర తండ్రి దగ్గరికి వెళ్లి గుడిలో జరిగిందంతా చెబుతారు. అది అంతా విని రాఘవేంద్ర కొడుకు వైపు చూసి వాళ్ళది చాలా పెద్ద మనసులు రా..
వెన్నకంటే మెత్తన. ఊరికే కరిగిపోతారు. రేపు మనవరాలను చూసిన తర్వాత ఇంకా మెత్తబడిపోతారు. తప్పకుండా మనల్ని క్షమిస్తారు అని చెబుతారు.
సరే నాన్న ఇంక నేను బయలుదేరుతాను అని లెగిస్తే నేను వస్తాను పద అని తండ్రి కొడుకులు ఇద్దరు గది బయటికి వచ్చి నిలబడిపోతారు.
శాంభవి ఫోటో దగ్గరకు వెళ్లి తాకుతూ.. మీరు ఎవరో నాకు తెలియదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని ఒక ఆత్మీయత భావన కలుగుతుంది.
అది ఏమిటో కూడా అర్థం కావడం లేదు. మిమ్మల్ని పదేపదే చూడాలి... మీతో మాట్లాడాలి అని ఎందుకో నా మనసు ఆరాటపడుతుంది.
ఎవరు మీరు... మీకు నాకు ఉన్న సంబంధం ఏమిటి.. మనిద్దరికీ పూర్వజన్మ సంబంధం ఉన్నదా... అని ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది.
అది చూసిన దేవేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటూ.. చూసావా నాన్న నా కూతురు తన తల్లి ఎవరో తెలియకుండానే నా భార్య ఫోటో వైపు అడుగులు వేస్తుంది.
తన తల్లితో మాట్లాడుతుంది. మీకు ఒక విషయం తెలుసా.. పొద్దుట నేను కనపడలేదు అని...చెప్పకుండా బయటికి వెళ్లాను అని... నాపైన అలిగింది కూడా అని మురుపెంగా చెబుతారు.
ఆ మాటలకి రాఘవేంద్ర కొడుకు భుజం పైన చేయి వేసి శాంభవి దగ్గరకి వస్తారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న అనసూయ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మరీ ఏడుస్తూ ఉంటుంది.
అనసూయని చూసిన చారులత ఇప్పుడు ఏడవడం వల్ల ఏంటి ఉపయోగం. నీ అహంకారం చూడు... తండ్రి కూతుర్లు ఇద్దరినీ ఎంత దూరంలో నుంచో పెట్టిందో...
నేనే తండ్రిని అని తన కూతురికే చెప్పుకోలేక నా అన్న పడే ఆవేదన నీకు కనపడుతుందా.... ఇంత ఐశ్వర్యం ఉండి ఏమీ ఉపయోగం.
నా అన్న బాధను తీర్చగలుగుతుందా.. నిన్ను ఎప్పటికైనా నాన్నగారు క్షమిస్తే బాగుండును అనుకునే దాన్ని. కానీ అన్నయ్య బాధ చూస్తూ ఉంటే..
నాకే నిన్ను ఛా.... అని అక్కడనుండి వెళ్ళిపోతుంది. వెళుతున్న కూతురు వైపు చూస్తూ నేను ఈ ఛీత్కారాలకి అర్హురాలనే అనుకొని గదిలోనికి వెళ్ళిపోతారు.
చారులత కూడా శాంభవి దగ్గరికి వెళుతుంది.
రాఘవేంద్ర గారు శాంభవి భుజం పైన చెయ్యి వేస్తారు. శాంభవి ఉలుక్కుపడి వెనక్కి తిరుగుతుంది. ఏమైంది తల్లి అని..ఎందుకు ఆ ఫోటో వైపు అంత తదేకంగా చూస్తున్నావు అని అడుగుతారు.
శాంభవి ఏమని చెబుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)