8 hours ago
పాలస్‌ని తలపించే ఇంటిని చూస్తూ గేటు ముందు నిలుచున్నాడు శివ. గోడ మీద అపరంజి నిలయం అని చెక్కి ఉంది. అప్పటికే శివని చూసిన సెక్యూరిటీ వాళ్ళు విషయం అడిగితే అపరంజి గారిని కలవాలని అడిగాడు. సెక్యూరిటీ వాళ్ళు అప్పోయింట్మెంటు లేకుండా ఎవ్వరిని లోపలి రానివ్వము అని చెపుతుంటే అంతలోనే సెక్యూరిటీ ఫోన్ రింగ్ అయ్యింది. సెక్యూరిటీ అతను మాట్లాడిన తరువాత మారు మాట్లాడకుండా శివని లోపలికి వదిలారు. గేటు దెగ్గర నుంచి ఇంటి గుమ్మం దాకా నడవడానికే ఐదు నిమిషాల సమయం పట్టింది. విశాలమైన గార్డెన్ చూస్తూ, పని వాళ్ళని, వాళ్ళు వేసుకున్న బట్టలని చూస్తూ లోపలికి నడిచాడు. గుమ్మం దెగ్గరే రెండు ఎత్తైన కుక్కలు కాపలా ఉన్నాయి, వాటిని చూసి శివ అక్కడే ఆగిపోయాడు.
రెండు నిమిషాల మౌనం.
గట్టిగా ఓ నవ్వు వినిపించింది. తల ఎత్తి చూసాడు శివ. రాజసంగా మెట్లు దిగుతుంది అపరంజి. మొన్నే నలభై నాలుగులోకి అడుగు పెట్టింది అపరంజి. తన ఒంట్లో ఉన్న పొగరు నడకలో ప్రదర్శిస్తూ నడుస్తుంటే వంకర నవ్వుగా మొహం పెట్టాడు శివ. అపరంజి అది చూసి మొహం కోపంగా పెట్టి గుమ్మం లోపలే శివకి ఎదురుపడి పొగరుగా నవ్వింది.
ఆ రెండు కుక్కల్లో మూడో వాడిలా బాగా కలిసిపోయావు. ఎవరు నువ్వు? అంది లెక్కచెయ్యకుండా
శివ గుమ్మంలోకి అడుగు పెడుతుంటే కుక్కలు గాండ్రింపుగా చూశాయి. శివ వెంటనే జేబులో నుంచి ఏదో తీసి కుక్కకి నొక్కి పెట్టి బటన్ నొక్కినట్టు నొక్కాడు. ఒక్క క్షణం కుక్క అదిరిపడింది. వెంటనే రెండో కుక్క వెనక్కి వెళ్లిపోతుంటే రెండు మీదకి దూకబోయాయి. అపరంజి ఆపేసింది. శివ నవ్వాడు. చేతిలో ఉన్న పోర్టబుల్ లైటర్ చుపించాడు. మరేం పరవాలేదు భయపడకు, స్టవ్ వెలిగించే లైటర్‌లే.. ఇంటి కోసం కొన్నాను అని నవ్వుతుంటే అపరంజి ఒక అడుగు వెనక్కి వేసింది.
ఎవరు నువ్వు? అంది మళ్ళీ తెలియనట్టుగా
శివ తన నడుము మీద రెండు చేతులు పెట్టుకుని లోపలికి వచ్చి ఇల్లంతా తల ఎత్తి పరికించి చూస్తూ అపరంజి వైపు చూడకుండానే నేనెవరో తెలీకుండానే రాత్రి నా మీదకి మనుషులని పంపించావా అన్నాడు. అన్నాక తల దించి అపరంజి వైపు చూసాడు.
పొగరుగా నవ్వింది అపరంజి. అయితే ఎందుకు కొట్టించానో కూడా తెలిసి ఉండాలే అంది చులకనగా
హలో మేడం. నువ్వు కొట్టించలేదు, నేనే కుక్కల్ని కొట్టినట్టు కొట్టాను అన్నాడు. అపరంజి కోపంగా చూస్తుంటే శివ మళ్ళీ నవ్వాడు. ఇప్పుడేగా పరిచయం అయ్యింది. ఆట మెల్లగా ఆడదాం, తొందర దేనికి, ఇంకా నీ కూతురు నాకు ముద్దు అయినా పెట్టలేదు. నువ్వు అప్పుడే మీద పడిపోతే ఎలా
హా.. ఇంపాసిబుల్, రేపటి నుంచి నువ్వు అసలు నా కూతురిని చూడనేలేవు
అది నీ వల్ల కాదులే, నువ్వు అవునన్నా కాదన్నా నేనే నీ అల్లుడిని. ఎంత త్వరగా నీ బుర్రకి సర్ది చెప్పుకుంటావో నీ ఇష్టం. మళ్ళీ బాధ పడి నా మీద కోపం తెచ్చుకోకు.
పిల్ల కుంకా.. నువ్వెంత నీ బతుకెంత. నా కుక్క ఒక రోజు బిస్కెట్లు ఖరీదు చెయ్యవు మీ నెలసరి సామాను.
నువ్వెంత గీ పెట్టినా ఆశ నాదే.
ఆశని నువ్వు దక్కించుకోవాలనుకోవడమే దురాశ. ఇక్కడితో వదిలేస్తే నీకే మంచిది.
చూద్దాం, అదీ చూద్దాం..
అసలు ఎవడ్రా నువ్వు, నీ అమ్మా బాబు ఎవరు? నీ కులం ఏంటి? నీ గోత్రం ఏంటి? నీ ఆస్తి పాస్తులు ఎంతా ? దిక్కు మొక్కు లేని అనాధ గాడివి. నువ్వు నా ఎదురు నిలుచుని మాట్లాడుతున్నావా.. అర్హత.. నా ముందు నిలుచోడానికి కూడా నీ అర్హత సరిపోదు.
అనాధ అనే టాపిక్ వస్తుందని తెలుసు కానీ ఇంత త్వరగా వస్తుందని, అపరంజి ఇంత కఠినంగా మాట్లాడుతుందని శివ ఊహించలేదు.
నాకూ అమ్మ ఉంది (శివ మాటలు తడబడ్డాయి)
ఎవరు మీ అమ్మ?
శివ నోటి నుంచి సమాధానం రాలేదు
అపరంజి మాటల్లో బలం తోడైంది. పోనీ మీ నాన్న పేరైనా తెలుసా అని చులకనగా అడిగింది. శివ చేతి వేళ్ళు పిడికిలి బిగుస్తుంటే అది గమనించిన అపరంజి గట్టిగా నవ్వింది. అమ్మా నాన్నా పేర్లు కూడా తెలియని వాళ్ళని ఏమంటారో తెలుసా అని మళ్ళీ రీసౌండ్ వచ్చేలా నవ్వింది. పోనీ మీ అమ్మ కనీసం మీ నాన్నతోనే నిన్ను కన్నదా లేక అని పగలబడి నవ్వుతుంటే.. శివ కోపం ఆపుకోలేక ఎదురుగా గోడకి తగిలించిన అద్దం ఫ్రెముని గట్టిగా గుద్దాడు. ఆ శబ్దానికి అపరంజి భయపడగా సెక్యూరిటీ వాళ్ళు లోపలి వచ్చేసి శివని అదుపులోకి తీసుకున్నారు. అపరంజి వెంటనే పుల్లీసులకి ఫోను కొట్టింది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)