03-04-2026, 10:01 AM
Part - 16
కొడుకు బాగుపడితే మొగుడికి గుండు కొట్టేస్తానన్న పెళ్ళం నువ్వేనేమో.. చరిత్రలో నిలిచిపోతావు. థాంక్యూ. దేనికి.. నన్ను పొగిడారు కదా..
నీకు అలా అర్థమైందా. బావ ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నాడో నాకు బాగా అర్థం అయింది.. పోనీలే ఇన్ని సంవత్సరాలకైనా అర్థం అయింది అందుకు సంతోషించాలి.
సూర్య బ్యాచ్ ముందు హాస్పిటల్ కి వెళతారు. నార్మల్ పీపుల్ లాగా వెళ్లి ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటారు. మెడిసిన్స్ ఎక్విప్మెంట్స్, డాక్టర్స్.. ప్రతిదీ ఏదీ వదలకుండా చెక్ చేస్తారు.
విశి.. భానుమతిని తీసుకుని హాస్పిటల్ కి వస్తుంది. నేను బాగానే ఉన్నాను అని చెబుతున్న వినవేంటి విశి. ఈ హాస్పిటల్ చూడు ఎంత కాస్ట్లీ గా కనిపిస్తుందో..
మన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకుంటారు. నాన్నగారు వచ్చేదాకా మనం జాగ్రత్తగా ఉండాలి కదా... హాస్పిటల్ పైకి అలా కనిపిస్తుంది కానీ నార్మల్ ఫీజు తీసుకుంటున్నారు అమ్మ.
నేను అన్ని కనుక్కున్నాను. నువ్వు కొంచెం నీరసంగా కనిపిస్తున్నావు. ఒకసారి చెక్ చేశారు అనుకో నాకు తృప్తిగా ఉంటుంది కదా..
నీరసమేమీ లేదురా.. మీ నాన్నగారు ఇంకా రాలేదు కదా.. అందుకే బెంగగా ఉంది. ఈరోజు సాయంత్రానికి వచ్చేస్తున్నారమ్మా..
ఒక్క నిమిషం ఇక్కడే కూర్చో. డాక్టర్ ఉన్నారో లేదో చూసి వస్తాను. సరే.. ఎక్కడికి వెళ్లొద్దు. నేను ఏమైనా చిన్నపిల్లనా తప్పిపోవడానికి...
చిన్నపిల్లవి కాదు కాబట్టి నా భయం. వీళ్ళ మాటలు విన్న వైభవ్.. అక్కడికి వచ్చి నా హెల్ప్ ఏమైనా కావాలా మిస్ అని అడుగుతాడు .
విశి ఇబ్బంది పడుతూ ఉంటే.. నో, ఫార్మాలిటీస్. మేము చెకప్ కోసమే వచ్చాము. మా బావ, అన్నయ్య లోపల డాక్టర్ తో మాట్లాడుతున్నారు.
నాకు ఆ స్మెల్ పడక బయట వెయిట్ చేస్తున్నాను. నాకు టైం ఉంది. సో మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి . నేను రిసెప్షన్ దగ్గరికి వెళ్లి మేము కలవాల్సిన డాక్టర్ ఉన్నారా లేదో చూసి వస్తాను.
అప్పటిదాకా అమ్మని చూసుకుంటారా.. నో ప్రాబ్లం వెళ్ళండి. భానుమతి పక్కన కూర్చుని ఐ ఆమ్ వైభవ్ అంటాడు .
నమస్తే బాబు నా పేరు భానుమతి అంటుంది. ఎక్కడ ఉంటారు. ఇక్కడే.. అమ్మాయి చదువు కోసం అని హైదరాబాద్ వచ్చాము.
మా వారు ఇంకా రాలేదు. ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను. ఆయన రాగానే అమ్మాయి చదువు అయిపోతుంది కదా.. వెంటనే మా ఊరు వెళ్ళిపోతాము .
వైభవ్ అర్థం కాక కన్ఫ్యూషన్ గా చూస్తాడు. ఏమైంది బాబు అలా చూస్తున్నావు. అంకుల్ షాప్ కి వెళ్లడమేమిటి.. రాగానే మీ అమ్మాయి చదువు అయిపోవడమేమిటి..
అయ్యో నీకు అర్థం కాలేదా... మా పొలానికి కావలసిన ఎరువులు కొనడానికి వెళ్లారు. అవి కొంచెం దూరం అంట. ఆ మందులు ఇంకా దొరకలేదు. రాత్రికి ఆలస్యం అవుతుందట. రేపొద్దున్నే వచ్చేస్తారు రాగానే మేము వెళ్ళిపోతాము.
సూర్య, శ్రీకర్ వచ్చి ఏం చేస్తున్నావురా.. ఈ ఆంటీ తో మాట్లాడుతున్నాను. ఎవరు. ఇప్పుడే పరిచయమయ్యారు. వీళ్ళ అమ్మాయి వచ్చేవరకు తోడు ఉంటున్నాను. ఓకే అని విశి కోసం వెయిట్ చేస్తూఉంటారు.
సూర్యాకి ఫోన్ వస్తుఉంటే నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. మీరిద్దరూ రండి అని బయటికి వెళ్ళిపోతాడు. సూర్య వెళ్లిన రెండు నిమిషాలకి విశి వస్తుంది.
విశి ని చూడగానే డాక్టర్ ఉన్నారా అని అడుగుతాడు. ఉన్నారు. థాంక్యూ సార్ అంటుంది. బలే వారే ఇంత చిన్న దానికి కూడా థాంక్స్ ఎందుకు.
ఈరోజుల్లో మన అనుకున్న వాళ్లే నిలబడడం లేదు. అలాంటిది మీరు ఎవరో... నేనెవరో.. నా కోసం ఇంతసేపు ఉండడం అంటే మాటలు కాదు కదా..
మనం ఎప్పుడూ ఖాళీయే.. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి వాడడం వలన మంచిదేలే.. ఎనీ హో మీ పేరు చెప్పలేదు విశిష్ట అంటుంది.
చాలా బాగుంది. థాంక్యూ. శ్రీకర్ దగ్గరికి వచ్చి ఇంకా వెళదామా అంటే.. సరే బావ. బాయ్ విశిష్ట. ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళుతున్న వైభవ్ ని చూసి నవ్వుకుంటుంది .
అంతా బాగానే ఉంది అని సాటిస్ఫై అయ్యి బయటకి వస్తారు. అన్నయ్య ఇప్పటికే అలసిపోయాము. కాసేపు రెస్ట్ తీసుకుందామా..
ఏం వర్క్ చేసావ్ అని అలసిపోయావు. మొత్తం అంతా ఏసీలోనే కదా తిరిగావు. ఎంత ఏసీలో తిరిగితే మాత్రం బ్రెయిన్ కి వర్క్ ఇవ్వలేదా..
బ్రెయిన్ ఎంత అలసిపోయింది. అలసిపోతే ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గ అందక లోపల ఉన్న సెల్స్ అన్ని బొజ్జుంటాయి. అవి బొజ్జున్నప్పుడు మనం కూడా బొజ్జోవాలి కదా...
నీ సెల్స్ ఎక్టివ్ అవ్వాలి అంటే ఒకటి చెప్పనా అని శ్రీకర్ అంటే.. ఏంటి బావ.. మీ కాలేజీకి వెళ్లి... నువ్వు ప్రపోజ్ చేసిన అమ్మాయిని ఒకసారి కలుద్దామా..
ఎందుకు బావ నేనంటే నీకు అంత ప్రేమ.. అవున్రా నువ్వంటే ప్రేమే.. అందుకనే మాతో తిప్పుతున్నాము. ఇది తిప్పుతున్నట్టు లేదు. నా బాడీలో ఉన్న కొవ్వు అంతా కరగదీస్తున్నట్టు ఉంది.
ఏదో ఒకటి నీకు ఉపయోగపడుతుంది కదా.. పద అంటే.. ఇప్పుడు ఎక్కడికి.. జస్ట్ నీకు రిలాక్సేషన్ కోసం అలా అలా తిరుగుదాం..
థాంక్స్ అన్నయ్య. నువ్వు అన్నయ్య అంటే.. పొగిడింది చాలు గానీ.. అప్పచెప్పిన వర్క్ ఎంతవరకు వచ్చిందీ. క్యూటి గురించి ఆల్రెడీ మా వాళ్ళు సెర్చింగ్ మొదలు పెట్టారు.
పేరు, ఫోటో ఏమీ లేదు కదా.. కొంచెం కష్టం అవుతుంది. కానీ దొరికేస్తుంది.
శ్రీకర్ బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది బావ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాక ఆలోచిస్తున్నావు.
నువ్వు హెల్ప్ చేసిన అమ్మాయి గురించి. ఆ అమ్మాయి చూస్తే మన సౌమ్య ఏజ్ లాగానే ఉంది. వాళ్ళ మదర్ ఏదేదో మాట్లాడుతున్నారు.
ఐ థింక్ మెంటల్గా డిస్టర్బ్ అయినట్టున్నారు. అవునురా.. ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్ అని చెప్పావు. నీ ఫోన్ నెంబర్ ఇచ్చావా..
నాలుక కరుచుకుని మర్చిపోయాను బావ.. నిన్ను అందుకే మీ అమ్మ తిట్టేది... ఇప్పుడు ఏమైంది బావ..మన హాస్పిటల్ ఏ కదా. డీటెయిల్స్ తెలుసుకుందాం దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు.
ఎందుకో అమ్మాయిని చూస్తే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. బట్ ఎక్కడ అన్నది తెలియడం లేదు. ప్రస్తుతపు రోజుల్లో సోషల్ మీడియా ఎక్కువగా ఉంది.
ఏ ఫేస్ బుక్ లో లేకపోతే ఇంకా ఏ సోషల్ ఆక్టివిటీస్ లోనో చూసి ఉంటావులే. ఏమో అని భుజాలు ఎగరేస్తాడు. సూర్యకి ఎందుకో అలజడిగా అనిపిస్తూ ఉంటుంది.
ఏమైందన్నయ్య.. ఒక్కసారిగా డిస్టర్బ్ గా కనిపిస్తున్నావు. తెలియడం లేదురా.. నాకు కావలసింది దగ్గరగా వచ్చి మళ్ళీ దూరంగా వెళ్లినట్టు అనిపిస్తుంది.
నీకు దగ్గరగా వచ్చి దూరంగా అంటే.. అని ఆలోచిస్తూ క్యూటీనా. క్యూటి ఇక్కడ ఎందుకు ఉంటుంది. చదివితే వైజాగ్ సైడ్ చదవాలి కదా...
అలా ఎందుకనుకోవాలి మంచిర్యాంకు వస్తే ఎక్కడికైనా వచ్చి చదువుకుంటున్నారు. నీ మనసు చెబుతుంది అంటే ఖచ్చితంగా మనం హైదరాబాదులో జల్లెడ పట్టేద్దాము.
ముగ్గురు సరదాగా తిరిగి సాయంత్రానికి రెస్టారెంట్ కి వెళతారు. రెస్టారెంట్లో ముగ్గురు మూడు ప్లేసెస్ లో కూర్చుంటారు.
సూర్య కూర్చుని చుట్టూ చూస్తూ ఉంటే... ఎక్స్క్యూజ్మీ సార్ ఆర్డర్ అని ఒక స్వీట్ వాయిస్ వినపడుతుంది. ఆ వాయిస్ వినిపించిన వైపుకి చూస్తాడు.
వెయిటర్ డ్రెస్సులో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి వైపు అలాగే చూస్తూ ఉంటే ఎక్స్క్యూజ్ ని అని మళ్ళీ పిలుస్తుంది.
ఎస్ అంటే.. ఆర్డర్ సార్.. వెజ్ ఫ్రైడ్ రైస్ అని చెబుతాడు. ఒకేసార్.. ఇంకేమైనా కావాలా.. నథింగ్.. థాంక్యూ అని చెప్పి వెళ్ళిపోతుంది.
వెళుతున్న అమ్మాయిని చూస్తూ ఉంటాడు. ఆర్డర్ వచ్చిన తర్వాత సూర్య తిని టెస్ట్ బానే ఉంది అనుకుంటాడు. కంప్లీట్ చేసిన తర్వాత.. వెయిటర్ బిల్ తీసుకోవచ్చి ఇస్తుంది.
బిల్ పే చేసేలోపు సూర్యకి వైభవ్ కాల్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా... అన్నయ్య నీ ఫుడ్ టేస్ట్ ఎంతవరకు వచ్చింది.
నేను టేస్ట్ చూసిన చికెన్ బిర్యానీ సూపర్ ఉంది. బావ కూడా నా దగ్గరే ఉన్నాడు. బావకి కూడా ఫుడ్ బాగా నచ్చింది. ఓకే నేను తిన్నది కూడా బాగుంది అని మాట్లాడుతూ లేచి నుంచి ఉంటాడు.
ఒక్క అడుగు ముందుకు వేసేలోపు వెయిటర్ కంగారుగా ఎక్స్క్యూజ్మీ సార్ అంటుంది. యస్ మిస్. బిల్ అంటుంది.. బిల్ అని.. ఓ మర్చిపోయాను అని చూపుడు వేలుతో కణతల మీద రబ్ చేసుకుంటాడు .
ఆ వెయిటర్ కి వేరేలాగా అర్థమయ్యి ఇంకా దగ్గరికి వెళ్లి డబ్బులు లేవా అంటుంది. ఆ మాటకి సూర్య ఒక్కసారిగా అమ్మాయి వైపు చూసి వాట్ అంటాడు.
అదే డబ్బులు లేవా.. స్లోగా మాట్లాడు.. ఎవరైనా విన్నారు అంటే నిన్ను బయటికి వెళ్ళనివ్వరు. ఆ అమ్మాయి అడిగే విధానానికి సూర్యకి నవ్వు వస్తుంది.
అసలు ఏం చేస్తుందో చూద్దాము అని. అవును మిస్.. డబ్బులు లేవు అంటాడు. ఇలాంటి రెస్టారెంట్లో ఫుడ్ తినాలి అనిపించిందా.. అందుకే మంచి డ్రెస్ వేసుకొని వచ్చావు .
సూర్య తను డ్రెస్ వైపు చూసుకొని అవును అంటాడు. సరేలే నీ డబ్బులు నేను పే చేస్తాను. నువ్వు టెన్షన్ పడకు. ఆ మాటకి ఆశ్చర్యంగా అమ్మాయి వైపు చూస్తూ.. నీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా..
ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టడం కనీస ధర్మం. రోజూ చాలామంది వస్తారు. వాళ్ళందరికీ ఇలాగే భోజనం పెట్టిస్తావా...
భగవంతుడు అంత శక్తిని ఇస్తే అలాగే పెట్టేస్తాను. మన ముందు ఆకలితో ఎవరైనా ఉంటే భోజనం పెట్టాలి అని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు...
ఇక్కడ ఫుడ్ కాస్ట్లీ కదా ఎలా పే చేయగలుగుతావు. ఈరోజు నా శాలరీలో కట్ చేసుకోమంటాను. మా మేనేజర్ మంచివారే...
అర్థం చేసుకుంటారు. నువ్వు టెన్షన్ పడకు సరేనా... ఈసారి వచ్చినప్పుడు కొంచెం డబ్బులు తెచ్చుకో.. ఆస్తమాను నేనే ఉండాలి అన్న రూలు లేదు కదా...
వీరి ప్రయాణం...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)