03-04-2026, 09:59 AM
Part - 15
వైభవ్ లేకపోతే నాకు ఏమీ తోచదు అమ్మ. అవునా అంత స్పెషల్ ఏముంది వాడిలో. వాడు ఒక ఫన్నీ. నాకు స్ట్రెస్ అనిపిస్తే వాడిని కదిపాను అనుకో నా స్ట్రెస్ అంత గాల్లోకి ఎగిరిపోతుంది.
మరి ఎందుకు ఆస్తమాను వాడిని ప్రతిదానికి ఇరికిస్తావు. చెప్పాను కదా వాడు నాకు స్ట్రెస్ బాల్ లాగా.. రేపు వాడి పెళ్ళాం వస్తే...
అమ్మ ఆపుతావా.. వాడి పెళ్లి చేసుకున్నాక అప్పుడు ఆలోచిద్దాంలే. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని విసుక్కుంటుంది.
ఇప్పుడు నేను ఏమన్నానని దీనికి ఇంత కోపం వచ్చింది. షాపింగ్ కి వెళ్దామా అంటే.. పదా అని బయటికి వెళతారు.
షాపింగ్ కి వెళ్ళిన దీనిమీద మనసు పెట్టదు. అది బాగోలేదు. ఇది బాగోలేదు అని ఏదో ఒక వంక చెబుతూనే ఉంటుంది.
చందు.. నీ బ్రెయిన్ అసలు పని చేయడం లేదు. వెళ్లి కామెడీ మూవీ పెట్టుకుని చూడు నన్ను విసిగించకు అని షాప్ బయటకు వచ్చేస్తుంది.
అమ్మ ప్లీజ్.. ప్లీజ్... అంటే.. ఏం ప్లీజ్.. నీ బుర్రంతా వైభవ్ దగ్గరే ఆగిపోయింది. అది స్నేహమా లేక నువ్వు అన్నట్టు ఫన్నీ నా లేక ఇంకేమైనా నా ఆలోచించుకో...
చందు ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటే.. నివి కూతురు వైపు తిరిగి చూడు చందు చిన్నప్పటి నుంచి మీరిద్దరూ ఒకే చోట ఉండడం వలన మీ మధ్యన ఏముంది అన్నది అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నావు.
అది ఏమిటో క్లారిటీ తెచ్చుకో. అది ఏ రిలేషన్ అయినా సరే నేను నీకు సపోర్ట్ ఇస్తాను అర్థమైందా.. ఇంకా ఇంటికి వెళదాం పద అని తీసుకువచ్చేస్తుంది.
అన్నవరం నుంచి ముగ్గురు వచ్చి మంచం మీద పడతారు. సూర్య దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే.. బావ నేను ఇంటికి వెళుతున్నాను. ఎక్కువ ఆలోచించకు.
వైభవ్ గాడు చెప్పినట్టు క్యూటి సరౌండింగ్ లోనే చదువుతూ ఉంటుంది. ఎలాగైనా పట్టుకుందాం.. సరేనా...
హ్మ్.. నాకు నిద్ర వస్తుంది అని సూర్య కళ్ళు మూసుకుంటాడు.
శ్రీకర్ రూమ్ బయటకి వచ్చి స్టెప్స్ దిగుతూ ఉంటే సౌమ్య లోపలికి వస్తుంది. నా బుజ్జి పప్పీ ఏంటి ఇంట్లోనే ఉంది అని స్పీడ్ గా వెళ్తాడు.
శ్రీకర్ ని చూసి ఉలిక్కిపడుతుంది. ఏంటి బుజ్జి పప్పీ కాలేజీకి వెళ్లకుండా ఏం చేస్తున్నావు. మీరేప్పుడొచ్చారు. ఇప్పుడే గాని ఏమిటి సంగతి.
నథింగ్ వెళ్లాలి అనిపించలేదు. బయటకు ఎక్కడికైనా వెళదామా. ఇప్పుడే కదా జర్నీ చేసి వచ్చారు. ఇంటికి వెళ్ళరా.. ఆంటీ ఎదురు చూస్తూ ఉంటుంది కదా..
అందుకేనే నువ్వు నాకు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తావు. నైట్ కి ఫోన్ చేస్తాను. వెయిట్ చెయ్ బాయ్ అని చంప మీద తట్టి వెళ్ళిపోతాడు.
వెళుతున్న శ్రీకర్ ని చూసి నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది.
భవ్య షాపింగ్ కి వెళుతుంది. విశి బర్త్డే వస్తుంది. మంచి డ్రెస్ తీసుకోవాలి. అది ఎప్పుడు అమ్మ అమ్మ అనేగాని దాని గురించి ఆలోచించడం మానేసింది.
ఏ డ్రస్సు బాగుంటుందా అని వెతుకుతూ ఉంటుంది. డ్రెస్ చూస్తూ ఉండేది ఆగిపోతుంది. ఎదురుగుండా కనిపించేది చూసి షాక్ అవుతుంది. వెంటనే ఫొటోస్ తీస్తుంది.
షాపింగ్ చేసే మూడ్ లేక ఇంటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్డే కాలేజీకి వెళ్లి విశి కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. విశి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి.. వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను.
ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నావు. విశి నీకు ఒక నిజం చెప్పాలి. అది విన్నాక మాత్రం నువ్వు ధైర్యంగా ఉండు. కాదు కాదు చూపించాలి.
అబ్బా.. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు. నేను ధైర్యంగానే ఉంటాను. సరే అని ఫొటోస్ చూపిస్తుంది. ఆ ఫొటోస్ చూసి.. దీనిక నువ్వు ఇంత కంగారు పడింది.
నీకు ఏమీ అనిపించడం లేదా.. అక్కడ గౌతమ్ వేరే అమ్మాయితో ఉన్నాడు. తెలుసు. తెలుసు అంటే..కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంది.
నిన్న షాపింగ్ కి గౌతమ్ ఈ అమ్మాయిని తీసుకుని వెళ్లాడు. వాళ్ళిద్దరూ అంత క్లోజ్ గా ఉన్నా నీకు అనుమానం రావడం లేదా.. ఎందుకు అనుమానం.
ఆ అమ్మాయి గౌతమ్ ఫ్యామిలీ ఫ్రెండ్. అబ్రాడ్ నుంచి వచ్చిందంట. షాపింగ్ కి వెళుతున్నాము అని నాకు కాల్ చేసి చెప్పాడు.
ఏ టైం కి ఫోన్ చేశాడు. కరెక్ట్ గా గుర్తులేదు కానీ నేను రెస్టారెంట్ లో ఉన్నప్పుడు చేశాడు అని ఆలోచిస్తూ.. సిక్స్ టు సెవెన్ మధ్యన అంటుంది.
ఆ మాటకి భవ్య ఆలోచిస్తూ.. ఆ రాస్కెల్ నన్ను చూశాడు. నేను ఎలాగైనా ఈ తింగరబుచ్చికి చెబుతానని అర్థమయ్యి ముందుగానే వాడే ఫోన్ చేశాడన్నమాట.
వీడు ఎంత కంత్రిగాడు. ఇదొక పిచ్చి మాలోకం. వాడి ఏది చెప్పినా నమ్ముతుంది. భగవంతుడా దీన్ని కాపాడు.
సూర్య గార్డెన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే విక్రమ్ వచ్చి పక్కనే కూర్చుని ఎవరు ఆ అమ్మాయి.. అమ్మాయా.. అమ్మాయి ఎవరు ఇక్కడ ఎవరూ లేరే..
నేను అడుగుతుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కాదు. నీ మనసులో ఉన్న వాళ్ళ గురించి.నాన్న అంటే.. ఆ నాన్ననే అడుగుతున్నాను.
అలాంటిదేమీ లేదు. ఒరేయ్ నేను నీ వయసు దాటి వచ్చాను. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఆ మాత్రం అర్థం కాదా.. ఏమిటి సంగతి..
నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ వి నాన్న. ఏదైనా నువ్వు సలహా ఇచ్చినట్టుగా నాకు ఎవరూ ఇవ్వలేరు. అందుకే విషయం మొత్తం చెబుతాను. ఇది ఏమిటో అన్నది చెప్పండి అని అప్పటిదాకా జరిగిందంతా చెబుతాడు.
విక్రమ్ మొత్తం విని ఆలోచిస్తూ ఉంటాడు. మీరు చెప్పండి.. నేను ఇది స్నేహం అంటున్నాను ఆ శ్రీకర్ గాడేమో ప్రేమ అంటున్నాడు. వైభవ్ ఏమో వదిన అంటున్నాడు. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు .
విక్రమ్ చిన్నగా నవ్వుతూ అందరూ చెప్పింది కాదు. నీ మనసు ఏమి చెబుతుందో అన్నది మాత్రమే ఆలోచించు. ముందు నువ్వు క్యూటీని పట్టుకో. అప్పుడు నీకే ఒక క్లారిటీ వస్తుంది.
క్యూటీని వెతకడంలో నా హెల్ప్ ఏమైనా కావాలి అంటే అడుగు. షుర్ నాన్న.. ముందు నా ప్రయత్నం నేను చేయని. ఈ వెతుకులాటలో నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా..
గుడ్.. మీ ముగ్గురికి నేను ఒక టాస్క్ ఇస్తున్నాను. ఆ టాస్క్ ఫినిష్ చేస్తూ నీ క్యూటిని వెతుకు. ఏమిటి నాన్న.. మన కంపెనీస్ కి సంబంధించిన ప్రతి బ్రాంచ్ దగ్గరికి వెళ్లి మీరు చెక్ చేయండి.
హాస్పటల్స్,మాల్స్, కాలేజ్స్ రెస్టారెంట్స్ మొత్తం చెక్ చేయండి. ఎక్కడ ఏది తేడా ఉన్నా సరే.. ఎలాంటి మార్పులు చేయాలి అన్నది ఆలోచించండి.
ఆ సజెషన్స్ అన్నీ కూడా నోట్ చేసుకుని మీటింగ్లో మాకు చెప్పండి. దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుందాము. మీరు ఆల్రెడీ పర్ఫెక్ట్ గా చేసే ఉంటారు కదా...
జనరేషన్ మారుతున్నప్పుడు ఆలోచనలు మారుతాయి. సో మీ జనరేషన్ ఎలా ఆలోచిస్తుందో దానికి తగ్గట్టుగా మన బిజినెస్ ఉందో లేదో అన్నది కూడా చెక్ చేసుకోవాలి.
షుర్.. రేపటి నుంచే వెళతాము. ఈరోజు ఏమైనా ముహూర్తం బాగోలేదా. వాట్ అని నవ్వుతాడు. ఎప్పుడైనా పని అంటే ముందు పని మీదే ఉండాలి.
పోస్ట్పోన్ చేయకూడదు. క్యారీ ఆన్. ఓకే అని వైభవ్ కి శ్రీకర్ కి కాల్ చేసి రమ్మని చెబుతాడు. వైభవ్ రాగానే ఏంటి అన్నయ్య..
ఏం చేస్తున్నావ్ రా. కాలేజీకి వెళ్ళాలి. త్రీ డేస్ లీవ్ తీసుకున్నాను. ఎంత వర్క్ పెండింగ్ ఉందో... పూజిత ఆ మాటలు విని ఒరేయ్ ఒక్కసారి కూడా నిజాలు మాట్లాడవా...
నువ్వు కాలేజీకి వెళ్లి ఏ రోజు బుక్కు తీసావు. ఈరోజు పెద్ద.మిస్ అయిపోతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. నువ్వెక్కడ నుంచి వచ్చావమ్మా.. అన్ని అలా వినేస్తావు.
నేను ఎక్కడున్నా ఒక కన్ను నీ మీద.. ఇంకో కన్ను మీ నాన్న మీదే ఉంటుంది. అనుకున్నాను ఇంకా నన్ను లాగలేదేంట...
ప్రశాంతంగా నన్ను ఎందుకు ఉంచిందా అని వినయ్ అంటే.. మీ బుద్ధులే మీ కొడుక్కి వచ్చాయి చూడండి ఏమంటున్నాడో...
అరే చదువుతాను అన్నా తిడుతున్నావు. చదవలేదు అన్న తిడుతున్నావు ఇలాగైతే ఎలాగే... సూర్య పూజిత మెడ చుట్టూ చేతులు వేసి.. పిన్ని చెప్పేదంతా వైభవ్ మంచి కోసమే..
నువ్వు ఒక్కడివే రా నన్ను అర్థం చేసుకుంటావు. ఇంతకీ ఎందుకు పిలిచావో చెప్పలేదు అన్నయ్య.. ఈరోజు నుంచి మనం కంపెనీస్ అన్నింటిలో చెక్ చేయడానికి వెళుతున్నాము .
అయ్యో నా ఎగ్జామ్స్.. నీ ఎగ్జామ్స్ పాస్ చేయించే బాధ్యత నాది. అన్నయ్య మాటిచ్చాక కాదంటానా... ఓకే ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం.
హాస్పటల్ అంటాడు. అబ్బా హాస్పిటల్ మందుల వాసన అన్నయ్య అని ముక్కు మూసుకుంటాడు. శ్రీకర్ కూడా జాయిన్ అయ్యి... మందుల వాసన అయితే ఏమైందిరా..
అక్కడే కూర్చుని అవి ఏమైనా తింటావా ఏమిటి.. వచ్చేసావా అని.. బాయ్ మామ్ అని.. బ్లెస్స్ మీ మామ్... దేనికి రా అంటే ఫస్ట్ టైం వర్క్ చేయడానికి వెళుతున్నాను. బ్లెస్ చేయవా.
మొన్నేదో సీక్రెట్ జాబ్ చేస్తున్నానన్నావు. అది వేరు ఇది వేరు. బ్లెస్స్ మీ మామ్ అని గారాల పోతాడు. ఏదో ఒకటి చెయ్..
కానీ మన ఇంటి గౌరవానికి మచ్చ తీసుకురాకు అన్నయ్యని ఫాలో అవ్వు అర్థమైందా.. అర్థమయింది. ముగ్గురు స్టార్ట్ అవుతారు.
పూజిత నువ్వు టెన్షన్ పడకు. వైభవ్ ఈసారి పక్కా జెంటిల్మెన్ అవుతాడు అని అవని అంటే.. నా కోరిక కూడా అదే.
వాడు అలా మారితే ఆ తిరుపతి కొండ మా వారిని నడిపించి.. గుండు కొట్టిస్తాను అంటుంది. ఆ మాటకి వినయ్ ఉలిక్కిపడి.. నీ కొడుకు పక్కా జెంటిల్మెన్ అవుతే నాకు గుండు కొట్టించడమేమిటి.
వాడికే గుండు కొట్టించవచ్చు కదా.. వాడిది అంతా మీ పోలికల కదా.. మీకు కొట్టిస్తే వాడికి కొట్టించినట్టే...
ఇది ఎక్కడి లాజిక్ ??

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)