03-04-2026, 09:57 AM
Part - 51
బృందావనానికి చేరుకున్న దేవేంద్ర గారు సంతోషంతో విషయం రాఘవేంద్ర గారికి చెబుతారు. ఎంత మంచి విషయం చెప్పావు రా..
పెళ్లి కూడా మన ఊరిలోనే జరుగుతుంది అని తెలిసినప్పటినుండి నా మనసు మనసులో లేదు. గాలిలో తేలుతుంది.
అక్కడ పనులన్నీ పురమాయించాలి నేను వెళతాను అని చెబుతారు. లేదు నాన్నగారు.... నేను, అన్నయ్య అన్ని సిద్ధం చేసేసాము.
అక్కడ మనుషులను పెట్టి చేపిస్తున్నాము. మీరు ఏమి కంగారు పడకండి. మధ్య మధ్యలో మేము ఎవరిమైనా వెళ్లి చూసి వస్తాము. మీరు అలసిపోవద్దు.
ఈ పెళ్లి విషయం విన్న ధీరజ్, విహాన్, అద్వైత్ మాత్రం ఎగిరి గంతులు వేస్తారు. తొందరలోనే మన చెల్లి మన ఇంటికి వచ్చేస్తుంది.
ఇక రోజు సంతోషాలే. మన బృందావనానికి అసలైన కళవొస్తుంది అని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. రుద్ర మాత్రం జరిగేదంతా చూస్తూ ఉంటాడు.
ఏమైంది బావ అంత సైలెంటుగా ఉన్నావు అంటే.. మయూరి ఆక్టివిటీస్ ఏమీ ఈ మధ్యన లేవు. అందుకే ఆలోచిస్తున్నాను. పెళ్లి విషయం ఎలాగో తెలిసిపోతుంది. ఈలోపే వాళ్ళకి ఏదో ఒక చెక్ పెట్టాలి.
నిషా, ఆశ... ఆనంద్, విహారిలను కలుస్తారు. చెప్పండి బేబీస్ ఏమిటి ఇలా గెస్ట్ హౌస్ కి వచ్చారు అంటే...
మనం ఒకసారి వెళ్లి మీ తాత గారిని కలుద్దాం అని చెబుతారు. ఎందుకు అని నొసలు ముడివేసి ఒకేసారి అడుగుతారు.
ఎందుకు మీకు అంత కంగారు. ఒకసారి కలిసి మన ఇద్దరం రుద్రా కి శత్రువులమే కాబట్టి ఇలా పెళ్లి చేసుకుందామని చెబుదాము.
పెద్దలంగీకారంతో పెళ్లి జరిగితే ఇంకా బలం పెరుగుతుంది కదా.. ఓ... మై బేబీస్ ఏం ఆలోచిస్తున్నారు మీరు? మా స్టేటస్ కి, మరి రేంజ్కి మీరు సరిపోతారు అనుకుంటున్నారా..
శత్రుత్వం కోసం ఇలా తక్కువ లోకి వచ్చాము అంటే..మా తాతగారు ఇంక మమ్మల్ని అక్కడే షూట్ చేసేస్తారు. మిమ్మల్ని ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి పరిచయం చేస్తాము.
తర్వాత మనం సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ముందు వెళ్లి మీవాళ్ళకి కనపడదాం. తర్వాత మెల్లిగా మా తాత గారి దగ్గర మాట్లాడదాం.
ఏమంటారు అనగానే.. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. ఎప్పుడు వెళదామని అడుగుతారు. లేడికి లేచిందే పరుగు అంటే ఎలాగా..
తాతగారు ఏం చేస్తున్నారు.. ఏంటో కనుక్కొని అప్పుడు ఏ విషయం మీకు కాల్ చేస్తాను కదా అని చెప్తారు. ఓకే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు.
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఆనంద్ ఫోన్ చేసి మాట్లాడతాడు. ఓకే అని ఫోన్ పెట్టేసి నిషా కి కాల్ చేసి ఎల్లుండి వెళదాం రెడీగా ఉండండి అని చెబుతాడు. ఓకే అని ఫోన్ పెట్టేస్తుంది.
వీళ్ళని నమ్మొచ్చు అంటావా అని ఆశ అడుగుతుంది. అందుకే కదా ఈరోజు ఒక రాయి వేసాను. పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు కదా...
ఎల్లుండి మనం చూసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఆలోచిద్దాం. ఏం చేయాలో అన్నది అంటుంది. అది కరెక్టేలే అని చెప్పి సైలెంట్ అవుతుంది.
శాంభవి భాను గారికి ఫోన్ చేసి మీరు ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు అని అడుగుతుంది. ఏమైంది బంగారం అంటే..
నన్ను ఇంత దూరం మీరు పంపించేస్తారా అని అలకగా అడుగుతుంది. ఆ మాటలకే నవ్వుతూ నా చిట్టి తల్లిని దూరంగా ఎందుకు పంపిస్తాను...
మరి అతను ఇల్లరికం వస్తున్నాడా అని ఆశగా అడుగుతుంది. ఇల్లరికం రావడం అంత మంచిది కాదు తల్లి.
నన్ను దూరంగా పంపను అని దూరంగా పంపిస్తున్నారు కదా అని ఏడుపు గొంతుతో అడుగుతుంది ఈ మాటలన్నీ వింటున్న రుద్ర కి మాత్రం బుర్ర హీటెక్కిపోతూ ఉంటుంది. రేపల్లెకి, హైదరాబాద్ ఎంత దూరం తల్లి.
నేను ఏదో విధంగా సంబంధం తప్పిద్దామనే సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన మీ ఇద్దరికే పెళ్లి కచ్చితంగా జరుగుతుంది. ఇది అమ్మ నిర్ణయం అని చెప్పారు అని చెబుతారు.
ఆ మాట వినగానే శాంభవి సైలెంట్ అయిపోతుంది. ఏరా బంగారు తల్లి మీ నాన్న చేసింది తప్పు అంటావా అంటే..
తప్పని నేను అనడం లేదు కానీ..రోజు మిమ్మల్ని చూడాలి కదా.. అలా చూడకుండా ఉంటే చాలా బెంగగా అనిపిస్తుంది అని ఇప్పటినుండే ఏడుపు అందుకుంటుంది.
అది చూసిన రుద్ర తల కొట్టుకుంటూ శాంభవి దగ్గరికి వచ్చి వీడియో కాల్ ఆన్ చేస్తాడు. వెంటనే భాను గారు లిఫ్ట్ చేసి చిట్టితల్లి కళ్ళు తుడుచుకో.
నువ్వలా ఏడుస్తూ ఉంటే.. మాకు కాళ్లు చేతులు ఆడవు అని కంగారు పడతారు. కళ్ళు తుడుచుకొని నేను ఏమి ఏడవడం లేదు అని ముక్కు ఎగబిల్చుతూ ఉంటుంది.
వెంటనే రుద్ర ఫోన్ తన వైపుకు తిప్పుకొని నమస్తే మావయ్య గారు అంటాడు. నమస్తే బాబు బాగున్నావా.. అని ఇప్పటినుండి అల్లుడు మర్యాదలు మొదలుపెడతారు.
అయ్యో మావయ్య గారు లలిత్ వాళ్ళు మీకు ఎలాగో.. నేను అంతే. ఇంకేంటి సంగతులు అని ఇద్దరు మాటలో పడతారు.
పక్కనే ఉన్న శాంభవి మాత్రం ఉడుక్కుంటూ నేనొకదాన్ని ఉన్నానన్న విషయం ఇద్దరూ మర్చిపోయారు అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది.
వెళుతున్న శాంభవిని చూసి నవ్వుకుంటూ శాంభవి బాగానే ఉంది మావయ్య గారు. తనకంటి నుండి కన్నీరు రాకుండా చూసుకునే బాధ్యత నాది సరేనా అని చెబుతాడు.
అర్థమయింది అల్లుడుగారు ఉంటాను అని ఫోన్ పెట్టేసి రుద్ర గురించి ఎటువంటి టెన్షన్ లేకుండా సంతోషంగా ఉంటారు.
శాంభవిని వెతుక్కుంటూ వెళతాడు. గార్డెన్లో కూర్చుని ఉంటుంది. పక్కనే కూర్చుని ఏమిటి తెగ ఆలోచిస్తున్నావు అంటే.. ఏమీ లేదు అని పక్కకి తిరుగుతుంది.
నేను ఇటు మాట్లాడుతుంటే.. నువ్వు అటు తిరిగేవనుకో నాకు చాలా కోపం వస్తుంది అంటాడు. చూశారా ఇప్పుడు దాకా నా మీద ఎవరూ కోప్పడలేదు.
మీతో పెళ్ళి కుదిరింది అనగానే..మీరు నా పైన కోపం చూపిస్తున్నారు. అందుకే నేను ఇక్కడ ఉండను అనేది అంటుంది. ఇప్పుడు నేనెక్కడ కోపం చూపించానే..
నీకు నువ్వే ఊహించేసుకుంటున్నావు అంటే...లేదు.... లేదు... ఇప్పుడేగా అన్నారు కోపం వస్తుందని. ఇప్పుడు దాకా ఆ మాట ఎవరు అనలేదు తెలుసా అని మల్లి టాప్ ఇప్పబోతుంది.
వెంటనే రెండు చేతులతో దండం పెట్టి అమ్మ శాంభవి మాటవరసకి కూడా నీ దగ్గర ఆ మాట వాడను సరేనా..
రుద్ర చేసిన విధానానికి శాంభవి వెంటనే నవ్వుతుంది. ఆ నవ్వు చూసి ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండు అని బుగ్గలు రెండు పట్టుకుని లాగుతాడు. వెంటనే దూరం జరుగుతుంది.
ఏమైంది అని అడిగితే పెళ్ళికి ముందు ఇలా టచ్ చేయడం తప్పు అంటుంది. నేనేమీ రాంగ్ టచ్ చేయలేదు కదా బుగ్గలే కదా పట్టుకున్నాను అంటే..
అయినా సరే టచ్ చేయకూడదు అంటుంది. ఒక్కసారి ఇక్కడ తనకి పరిచయమైన లేడీస్ ని గుర్తు చేసుకుంటాడు.
ఆశ, నిషా సందు దొరికితే ఎలా మీద పడిపోతారు గుర్తు చేసుకుని నవ్వుకుంటాడు. ఎందుకు నవ్వుకుంటున్నారు అంటే..
ఏమీ లేదులే కానీ నీకు హనీమూన్ కి ఎక్కడికి వెళ్లాలని ఉంది అని అడుగుతాడు. బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తుంటే...
ప్లీజ్ రేపల్లె అని మాత్రం చెప్పకే అంటాడు. చెబితే ఏమవుతుంది అంటే..వెళ్ళేది హనీమూన్ కి. ఫెస్టివల్ కి కాదు కదా..
మనిద్దరం మాత్రమే ఉండే ప్లేస్ సెలెక్ట్ చేయాలి బంగారం అని చెబుతాడు. ఆ మాటలకి ఇబ్బందిగా చూస్తూ నాకేమీ తెలియదు అంటుంది.
దీనికి ఎందుకు అంత ఇబ్బంది పడతావు. నీకు ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే నచ్చుతుందో చెప్పు. దానికి తగ్గట్టుగా ప్లేస్ నేను సెలెక్ట్ చేస్తాను అని చెబుతాడు.
అది ఇప్పుడే డిస్కస్ చేసుకోవాలా అంటే..మరి లేకపోతే షష్టిపూర్తి తర్వాత డిస్కస్ చేస్తావా అంటాడు. వాళ్ళిద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే అది చూసిన పెద్ద వాళ్లకి మాత్రం చాలా తృప్తిగా అనిపిస్తుంది. కౌసల్య అక్కడనుండే ఇద్దరికీ దిష్టి తీస్తుంది.
కౌసల్య వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్లి లోపలికి రావచ్చా అత్తయ్య గారు అని అడుగుతుంది. రా కౌసల్య.. రాకరాక వచ్చినట్టు ఉన్నావు ఏమైనా మాట్లాడాలా అంటే...
హ్మ్... మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను అంటుంది. రుద్రా శాంభవికి పెళ్ళి కుదురుచ్చారా అని అడుగుతుంది.
అవును అత్తయ్య గారు.. అది కూడా మన ఊర్లోనే జరుగుతుంది అని చెబుతోంది. ఎంత మంచి విషయం చెప్పావు.
రేపే గుడికి వెళ్లి ఇద్దరి పేరు మీద అర్చన చేపించాలి అని సంతోషంగా చెబుతారు. వద్దు అత్తయ్య గారు ఇప్పుడు మీరు ఏమీ చేయవద్దు.
మీరు బయటికి వెళ్లితే ఆ విషయం ఎలాగోలాగా మయూరీకి తెలుస్తుంది. మళ్ళీ అది మీరే చెప్పారు అనుకుని ఇంకా మీ మీద కోపం పెంచుకుంటారు.
ఇప్పుడు ఇవన్నీ అవసరమా.. మన ఊరు వెళ్ళాక అక్కడ అమ్మవారికి మీకు కావాల్సిన అన్ని రకాలుగా పూజలు, శాంతులు చేయిపించండి అని చెబుతోంది.
అదే నిజమేలే అనే సైలెంట్ అవుతారు. ఏమిటో పరిస్థితులు ఇలా వచ్చాయి. ఇది మీ చేతుల మీద జరగవలసిన మన ఇంటి మొదటి శుభకార్యం కానీ.. ఇంకేమి మాట్లాడలేక అక్కడనుండి వెళ్ళిపోతుంది.
వెళుతున్న కోడలినే బాధగా చూస్తూ భగవంతుడా నేను చేసిన తప్పుకి ఎన్ని రోజులకి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది అని బాధపడతారు.
దేవేంద్ర రాఘవేంద్ర గారి దగ్గరికి వచ్చి రేపు నేను గుడికి వెళదాం అనుకుంటున్నాను అని చెబుతాడు. ఏ గుడికి అని అనుమానంగా అడిగితే.. మీరు అనుకునే గుడికి అని చెబుతాడు.
ఇప్పుడు అవసరమా అంటే... అవసరమే. శాంభవి గురించి చెప్పాలి. వాళ్లను కూడా పెళ్లికి రమ్మనాలి అంటే... మనల్ని క్షమిస్తారా అని బాధగా అడుగుతారు.
క్షమించిన, క్షమించకపోయినా చెప్పడం నా ధర్మం. రేపు అన్న రోజున తెలిసిన తర్వాత..శాంభవి కళ్యాణానికి కూడా పిలవలేదు అని ఇంకా బాధపడతారు.
సరే నీ ఇష్టం అని ఆరోజు జరిగిన విషయం గుర్తుకు రాగానే బాధగా కళ్ళు మూసుకుంటారు. బాధపడకండి నాన్నగారు..జరిగిన ఏ విషయము కూడా తిరిగి రాదు కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
గుడిలో ఏం జరగబోతుంది
కథ కొనసాగుతుంది.....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)