03-04-2026, 09:55 AM
Part - 50
అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. భోజనం అయిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోండి అని బలవంతంగా గదిలోనికి పంపించారు.
ఎలాగైనా పెళ్లి కాయం చేసుకోవాలని వచ్చిన వీళ్ళకి రేపల్లెలో మర్యాదలు చూసి..ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు.
ఏదైతే అది అయ్యింది. వెళ్లి మాట్లాడాలి అని డిసైడ్ అయ్యి.. కాసేపు పడుకుని లేచి బయటకి వచ్చి మాటల్లో పడతారు.
జితేంద్ర రామచంద్రయ్య గారితో మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి అంటే.. మా రుద్రాకి శాంభవిని అడగడానికి వచ్చాము అని చెప్పి వాళ్ళ సమాధానం కోసం చూస్తూఉంటారు.
మీరు మా పైన నమ్మకంతో ఇంత దూరం వచ్చి అడిగినందుకు చాలా కృతజ్ఞతలు అండి. కానీ మా అమ్మాయిని అంత దూరం పంపించలేము.
ఎంత దూరం అండి హైదరాబాద్ ఏ కదా అంటే...ఈ నాలుగు నెలల నుంచి చాలా కష్టంగా ఉంది. పెళ్లి అయ్యి అంత దూరం అంటే మా వల్ల కాదండి. అసలు ఇల్లరికం వచ్చే సంబంధం చూడాలి అనుకుంటున్నాము.
ఆ మాటలకి ఏం మాట్లాడాలో తెలియక శకుంతల గారితో మీరు పెద్దవారు. అనుభవం ఉన్నవాళ్లు. ఇల్లరికం అంటే రేపు అన్నా రోజున అదే గౌరవం శాంభవి భర్తకి ఉంటుందా..
ఒకవేళ లేకపోతే శాంభవి బాధపడుతుంది కదా.. అప్పుడు మీరందరూ బాధపడాలి కదా.. శాంభవిని మా కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటాము.
ఈ ఇంట్లో ఎలా పెరిగిందో.. ఎలా స్వేచ్ఛగా తిరిగిందో.. అక్కడ కూడా అలాగే ఉంటుంది. మమ్మల్ని నమ్మండి దేవేంద్ర శకుంతల చేతులు పట్టుకుని చెబుతారు.
దేవేంద్ర అడిగిన విధానానికి శకుంతల గారు కూడా ఆలోచిస్తూ...మీరన్నది నిజమే కానీ బాబు.అమ్మాయిని అంత దూరం పంపడం అంటే మాకు చాలా కష్టం.
అందులోనూ శాంభవికి వరసైనవాడు ఉన్నాడు. అంత దూరం పంపేటప్పుడు విష్ణు కొడుకుకే చేసుకుంటాము కదా అని అంటారు.
ఆ మాటకే అందరి గుండెలో రాళ్లు పడతాయి. ఓరి దేవుడా వీళ్ళు ఇప్పుడు విష్ణు గారి అబ్బాయికి చేస్తే.. మన అమ్మాయి ఎలా మన ఇంటికి వస్తుందని ఆలోచిస్తూ...
ఒకసారి విష్ణు గారితో ఫోన్లో మాట్లాడండి. ఆయన ఏమంటారు చూడండి. దాన్ని బట్టి ముందుకు వెళదాము అని కొంచెం ధైర్యం కూడా తీసుకొని చెబుతారు.
ఆ మాటలకే ఆవిడ కళ్ళుర్పుతో భాను వైపు తిరుగుతారు. భాను సరే నానమ్మ అనే విష్ణు కి ఫోన్ చేస్తాడు. ఈ టైంలో బావగారు ఫోన్ చేస్తున్నారు ఏంటి అని లిఫ్ట్ చేసి చెప్పండి బావగారు అనగానే...
శాంభవి కి ఒక సంబంధం వచ్చింది కానీ... నివాస్ కైతే బాగుంటుంది అని మాకు ఉంది. దీని మీద నీ అభిప్రాయము ఏంటి విష్ణు అని అడుగుతాడు.
దానికి ఏం చెప్పాలో తెలియక అది బావా అని నాన్చుతుంటే.. ఇప్పుడు నువ్వు సూటిగా చెప్పు.ఇందులో ఇబ్బంది ఏమీ లేదు.
నేను ఆల్రెడీ నివాస్ తో మాట్లాడాను. శాంభవిని పెళ్లి చేసుకో. కానీ వాడు మేమిద్దరం చిన్నప్పటినుంచి కలిసిమెలిసి పెరిగాము ఎలా చేసుకుంటాను...అని వాళ్ళ మధ్యన జరిగిందంతా చెబుతాడు. అది విని నిట్టూర్చి సరే అయితే అని ఫోన్ పెట్టేస్తారు.
భాను మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే... ఏమన్నాడు విష్ణు అని అడుగుతారు. జరిగిందంతా చెబుతాడు. ఆ మాటలకి వచ్చిన నలుగురు హమ్మయ్య అనుకుంటారు.
శాంభవి చేత చిన్న పని కూడా చేయించము. మీ దగ్గర ఎంత అపురూపమైన గాజు బొమ్మగా పెరిగిందో... మేము అంతకన్నా అపురూపంగా చూసుకుంటాము అని మాట ఇస్తారు.
ఆ మాటలకు సంతోషపడుతూనే... శాంభవి మీద మీకు అంతా ఇంట్రస్ట్ ఎందుకు అని అడుగుతారు.
మా రుద్ర కి మొదటి చూపులోనే నచ్చింది. ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటే శాంభవినే చేసుకుంటాను అని మొండిపట్టు పడ్డాడు.
మాకు ఉన్నది ఒక్కడే కొడుకు. తరతరాలు తిన్న తరగని ఆస్తి ఉంది. మీరు ఇల్లరికమే కావాలి అన్నారు అని తెలిసిన సరే...
వాడు ఇక్కడ మీకు ఒక చాపర్ అరేంజ్ చేస్తాను అని చెప్పాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వచ్చి చూసుకునేటట్టు.. లేదంటే శాంభవి అయినా ఇక్కడికి వచ్చేటట్టుగా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు అని చెబుతారు. రుద్రా కేరింగ్ కి పెద్ద వాళ్ళందరికీ తృప్తిగా అనిపిస్తుంది.
ఒకసారి మా సిద్ధాంతికి కూడా చూపించి అప్పుడు మాట్లాడుకుందాము అని చెబుతారు. అందుకు ఆలస్యం ఎందుకండీ... ఇప్పుడే పిలిపించండి అని చారులత కంగారు పెట్టేస్తుంది.
ఎందుకండీ అంత కంగారు అంటే... మా అబ్బాయి మమ్మల్ని కూర్చోనివ్వడం లేదు. నుంచోనివ్వడం లేదు. వెంటనే వాడికి ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే... వాడే వచ్చేస్తాడు అందుకని అని నవ్వుతారు.
ఆ మాటలకు నవ్వుతూ లలిత్ వైపు చూస్తారు. వెంటనే వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తాను అన్ని కార్లు రెడీ చేపిస్తాడు.
సంతోష్ అదేంటి ఆయన రారా అని అడిగితే.. ఆయన దేవి ఉపాసకులు అండి. అన్ని చోట్లకి అన్నివేళలా రారు.
మా శాంభవి పుట్టిన తర్వాత జాతకం చూసి లలితా దేవి హోమం చేయమని చెప్పింది ఆయనే అని చెబుతారు. అవునా సరే పదండి అని అక్కడికి వెళ్తారు.
అందరూ అక్కడికి వెళ్లి సిద్ధాంతి గారి కోసం చూస్తూ ఉంటారు. ఆయన శిష్యుడు వచ్చి లోపలికి రండి అని తీసుకువెళ్లి కూర్చోబెడతారు.
శాంభవి, రుద్ర జాతకాలు పరిశీలించి చూసి ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని తెరిచి రామచంద్రయ్య గారి వైపు తిరిగి..
అమ్మాయి పెళ్లి ఈ అబ్బాయి తోనే జరుగుతుంది. ఎటువంటి ఆటంకాలు లేవు. నిర్భయంగా మీరు పెళ్లి చేయవచ్చు.
అమ్మాయి ఇక్కడ ఎంత సంతోషంగా ఉందో అక్కడ అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఉంటుంది. దేవేంద్ర వైపు తిరిగి నీ సంతోషాలు కూడా నీ దగ్గరికి వస్తున్నాయి. కానీ జాగ్రత్తగా కాచుకో అని చెబుతారు.
సిద్ధాంతి గారు ఏమి చెబుతున్నారో అన్నది రామచంద్రయ్య గారికి అర్థం కాదు కానీ.. దేవేంద్ర కి పూర్తిగా అర్థమయ్యి తప్పకుండా స్వామి అని చెబుతారు.
ఈ దేవీ నవరాత్రుల్లోనే అమ్మాయి పెళ్లి జరిగిపోతుంది. అది కూడా ఇక్కడ కాదు అని చెబుతారు. దానికి రామచంద్రయ్య గారి కంగారుపడుతూ..
మా ఇంటికి ఉన్న ఒకే ఒక ఆడపిల్ల. ఇక్కడ కాకుండా ఎక్కడ స్వామి అంటే.. ఆయన నవ్వుతూ భూపతుల వంశానికి సంబంధించిన ఒక గ్రామం ఉంది.
అక్కడ ఉన్న అమ్మవారి ఆలయంలోనే వీళ్ళ పెళ్లి జరుగుతుంది. ఇది అమ్మ నిర్ణయం అని చెబుతారు. దానికి అందరూ నమస్కారం చేసి బయటికి వస్తారు.
దేవేంద్ర వాళ్లకి మాత్రం సంతోషంతో ఎక్కడో తేలుతూ ఉంటారు. పెళ్లి ఇక్కడ జరగదు అని తెలిసి రామచంద్రయ్య గారి ఫ్యామిలీ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు.
వాళ్లు బాధ అర్థమైన దేవేంద్ర గారు చేతులు పట్టుకుని మీరు బాధపడకూడదు. ఎక్కడ జరిగిన మన అమ్మాయి సంతోషంగా ఉండటమే కదా మనకు కావాల్సింది. భూపతిల ఇల్లు అంటే శాంభవికి పుట్టినిల్లె.
ఆ మాటలకి కొంచెం శాంతించిన..ఏమోనండి మన ఇంట్లో జరిగితే ఆ తృప్తి వేరు కదా కానీ..అమ్మ నిర్ణయం అలా ఉన్నప్పుడు మనం ఆచరించాలి కదా అని నచ్చచెబుతారు.
ఇంక మౌనంగా ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే శకుంతల గారు ఏమైందిరా అని అడిగితే.. జరిగిందంతా చెబుతారు. అమ్మ నిర్ణయం ఎందుకు అలా ఉందో మనకి తెలియదు కదా.. ఏదైతే ఏమిటి శాంభవి సంతోషంగా ఉండడమే మనకు కావలసింది.
బయలుదేరుతున్న చారులతకి పసుపు కుంకములతో సారె పెట్టి... ముహూర్తం చూసి కబురు పంపిస్తాము అని చెబుతారు.
ముహూర్తం కూడా మేమే చూపిస్తామండి. మీరు అసలు దేనికి టెన్షన్ పడొద్దు అని జితేంద్ర ఉత్సాహంగా చెబుతాడు.
మేనల్లుడు పెళ్లి అంటే ఇంత సంతోషమా అని అడుగుతారు. అంతే కదండీ మేనల్లుడు పెళ్లి అవుతే..మా ఇంటికి కూతురు వస్తుంది. ఆడపిల్లలు లేని ఇల్లు మావి అందుకే ఇంత ఆనందం.
ఆ సంతోషాలతో వీళ్ళ తిరిగి హైదరాబాదు బయలుదేరుతారు.
పెళ్లి గురించి విన్న శాంభవి ఏమీ ఆలోచిస్తుంది..

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)