02-04-2026, 08:15 AM
Part - 48
శాంభవికి బృందావనంతో అనుబంధం పెరుగుతూ ఉంటుంది.రోజులు మెల్లిగా ముందుకు సాగుతూఉన్నాయి.
ప్రతిరోజు రేపల్లె కి ఫోన్ చేసి మాట్లాడుతునే ఉంటుంది. రుద్రతో కూడా చనువు పెరుగుతుంది.
ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ ఉంటే మీతో మాట్లాడాలి రుద్ర సార్ అని అంటుంది. చెప్పు అంటే ఏదైనా ఒక లోన్లీ ప్లేస్ కి వెళదామని అడుగుతుంది.
ఏమిటి ఇంత సడన్ గా అని ఆశ్చర్యంగా అడుగుతూ ఒక ప్లేస్ కి తీసుకువెళ్లి ఆపి ఐస్ క్రీమ్ తీసుకువచ్చి చేతికిచ్చి ఇప్పుడు చెప్పు అని అంటాడు.
మీరు నిజంగా నన్ను లవ్ చేస్తున్నారా అని సూటిగా అడుగుతుంది. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావ్... తెలియడం లేదా అని అడుగుతాడు.
ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. నాకు జవాబు మాత్రమే కావాలి. ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు డౌట్. జవాబు చెప్పండి సార్ అని కొంచెం అసహనంగా ఉంటుంది.
శాంభవి ఫేస్ ని తన వైపుకు తిప్పుకొని నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నా ప్రేమ నీకు కనపడటం లేదా అని అడుగుతాడు.
ప్రేమ వరకేనా పెళ్లి కూడా చేసుకుంటారా అని అడుగుతుంది. ప్రేమించేది ఎందుకే..పెళ్లి చేసుకోవడానికి కాదా... అవేం డౌట్లు నీకు అని తల మీద ఒకటి మొట్టుతాడు.
చేతితో తలని రుద్దుకుంటూ ప్లీజ్ సార్ అడిగినదానికి చెప్పండి. నా ప్రాజెక్ట్ ఇంకా అయిపోవస్తుంది. అది మీకు గుర్తుందా అని అడుగుతుంది...
ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడు నీ డౌటే నాకు అర్థం కావడం లేదు అంటాడు. నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఇల్లరికం రావాలి అని చేతులు కట్టుకుని చెబుతుంది.
ఏమిటి అని గట్టిగా అరుస్తాడు. నేను నిజమే చెబుతున్నాను. నేను మా నాన్నలని వదిలి ఎక్కడికి రాను.
నన్ను పెళ్లి చేసుకుంటే మీరు ఇల్లరికం రావాలి. అది మీకు ఇష్టమైతే మీ పెద్దవాళ్లని వెళ్లి మా పెద్దవాళ్లతో మాట్లాడమనండి అని చెబుతుంది.
ఇదెక్కడ గోలే... పెళ్లయితే అమ్మాయి అత్తారింటికి రావాలి గాని.. నేను ఇల్లరికం వస్తే చాలా చండాలంగా ఉంటుంది.
ఏమి చండాలంగా ఉండదు. మా ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు.అల్లుడు హోదా ఇస్తారు. ఇంతకన్నా ఇంకేం కావాలి.
శాంభవి చెప్పే విధానానికి రుద్ర కళ్ళు తేలేసి చూస్తాడు. తల్లి అన్న మాటలు గుర్తుకొస్తాయి. మావయ్య కోసం ఒప్పుకోరా అని తల్లి బ్రతిమాలుతున్న విషయం గుర్తొచ్చి తల విదుల్చుతాడు.
శాంభవి గెడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకొని... చూడు శాంభవి నేను ఎవరితో కూడా ఇంత సహనంగా మాట్లాడింది లేదు. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నీతోనే నేను మాట్లాడుతుంది.
నీ మాటలను బట్టి నాకు అర్థం అవుతుంది. నేనంటే నీకు ఇష్టమని. ఇక్కడ అందర్నీ వదిలేసి నేను రేపల్లె ఎలా రాగలరు చెప్పు అని అనునయంగా అడుగుతూ ఉంటాడు.
నేను మాత్రం వదిలేసి ఇక్కడికి రావాలా.. అది అసలే కుదరదు అని ఖరాఖండిగా చెబుతుంది. శాంభవి మాటలకి ఎలా నచ్చచెప్పాలా అని ఆలోచిస్తూఉంటాడు.
శాంభవి వైపు తిరిగి మీ అమ్మలైన, మా అమ్మలైన పెళ్లయ్యాక భర్తతో కలిసి అత్తారింటికి వెళ్ళితేనే కదా వాళ్ళకి గౌరవం ఉంది.
అదే మీ నాన్నలు గాని, మా నాన్నగాని అత్తారింటికి వచ్చి ఉంటే... ఈ గౌరవం ఉండి ఉండేదా... మీ విష్ణు మామయ్య మీ నాన్నకి ఇంత గౌరవం ఇస్తారా చెప్పు అని బుజ్జగిస్తూ అడుగుతాడు.
వాళ్లందరి సంగతి నాకు తెలియదు. మా నాన్నలు, మా అన్నయ్యలు మాత్రం అదే గౌరవం ఇస్తారు. ఇందులో మీరు భయపడాల్సిన అవసరమే లేదు నాది హామీ అని భరోసా ఇస్తుంది.
సరే నేను ఇల్లరికం వస్తాను. మరి మీ అన్నయ్యలు చేసుకునే అమ్మాయిలు కూడా అదే కండిషన్ పెట్టి..ఇల్లరికం రమ్మంటే....
ఆ అమ్మాయిల మీద ఉన్న ప్రేమతో మీ అన్నయ్యలు ఇల్లరికం వెళ్లిపోతే... అప్పుడు మీ ఇంటి పరువు ఏమి కావాలి అని అడుగుతాడు.
అలా ఎలా కుదురుతుంది...మా అన్నయ్యలు అలాగ వెళ్లరు అని ఉక్రోషంగా చెబుతుంది. ఏ.... నేను రాగాలేనిది... మీ అన్నయ్యలు వెళితే తప్పేముంది.
అలాంటి పరిస్థితి వస్తే నేను ఎంకరేజ్ చేస్తాను కదా అని చెబుతాడు. దానికి నేను ఒప్పుకోను అని గట్టిగా అరుస్తుంది. ఎందుకు ఒప్పుకోవు పాప...
అలా మా అన్నయ్యలు ఇల్లరికం వెళితే మా ఇంటి పరువు ఏంకాను... అందరూ మమ్మల్ని చూసి నవ్వరా అని అడుగుతుంది.
కదా... నేను ఇల్లరికం వచ్చినా..ఇక్కడ మమ్మల్ని చూసి కూడా నవ్వుతారు కదా... పైగా నేను ఒక్కడినే కొడుకుని. ముగ్గురు అబ్బాయిలు ఉన్న మీ ఇంటి నుంచి వెళ్ళితే నవ్వునప్పుడు..
మరి నన్ను చూసి నవ్వరా... అందులోనూ గజపతిల వంశానికి ఉన్న ఈ తరం వారసుడ్ని. అర్థం చేసుకో పాప అని గడ్డం పట్టుకుని అడుగుతాడు.
అయితే దీనికి ఒకటే సొల్యూషన్ ఉంది అని ఆలోచిస్తూ చెబుతుంది. ఏమిటది అని అనుమానంగా అడుగుతాడు.
మీరు ఇంకొక అమ్మాయిని చూసుకోండి అని సింపుల్ గా చెప్పేస్తుంది.
ఆ మాటకి తల కొట్టుకుంటూ నిన్ను ప్రేమించి.. ఇంకొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటానే తింగరిదానా...
ఇన్ని రోజులు నువ్వు మీ ఇంటికి దూరంగానే ఉన్నావు అలాగే పెళ్లయ్యాక కూడా అనుకో. లేదు... లేదు.. ఇప్పుడంటే ప్రాజెక్టు గురించి అని దూరంగా వచ్చాను కానీ...
అయిన వెంటనే వెళ్ళిపోతాను కదా... అప్పుడు మా నాన్నల దగ్గరే కదా ఉండేది. దానికి దీనికి సంబంధం లేదు కదా అంటుంది.
ఇంక లాభం లేదు సెంటిమెంట్ గా లాక్ చేయాలి అనుకుని వేలుతో శాంభవి గుండెవైపు చూపిస్తూ ఇక్కడ నన్ను పెట్టుకుని వేరే వాళ్లతో తాళి కట్టించుకో గలవా అని అడుగుతాడు.
ఆ మాటలకి దిక్కులు చూస్తూ... జీరబోయిన గొంతుతో అక్కడ మీరు లేరు అని చెబుతుంది. ఆ మాట నా వైపు తిరిగి చెప్పవే....
ఎటు చూస్తూ చెప్పినా అదే నిజం. నేను మా నాన్నను విడిచి ఉండలేను. ఇక రుద్రాకి విసుగొచ్చి శాంభవిని ఒళ్ళోకి లాక్కుంటాడు.
ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అడుగుతుంది. ష్... అని నోటి మీద వేలు పెట్టి నీ మనసులో నేను లేకపోతే ఇలా చేసిన వెంటనే లాగిపెట్టి ఒక్కటి పీకేదానివి.
పెళ్లికి ఎవరైనా అల్లుడికి గిఫ్ట్స్ ఇస్తారు కదా...నేను రిటర్న్ గిఫ్ట్ కింద మా మామగారికి ఇస్తాను అని చెబుతాడు. ఏమిస్తారు అని అనుమానం గా అడిగితే..
అక్కడ ఒక చాపర్...ఇక్కడొక చాపర్ అరేంజ్ చేసి ఉంచుతాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తాను సరేనా అని చెబుతాడు.
అంటే నేను మా నాన్న చూడాలి అనుకున్న.. మా నాన్నలు నన్ను చూడాలి అనుకున్న బోడి ఇంకొకడు పర్మిషన్ కావాలా అని అడుగుతుంది.
కొంచెం కూడా సొల్యూషన్ వైపు అడుగు వేయవే. పోనీ నన్ను కాదని ఇల్లరికం వచ్చేవాడినే పెళ్లి చేసుకున్నావే అనుకో...
వాడు ముందు మంచిగా ఉండి తర్వాత ఆస్తికోసం నిన్ను టార్చర్ పెట్టి వాళ్ళందరినీ ఇంట్లో నుంచి బయటికి గెంటేసాడు అనుకో.. అప్పుడు పరిస్థితి ఏమిటి అని అడుగుతాడు.
అలా ఎందుకు జరుగుతుంది జరగదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అని అడుగుతాడు. సెలెక్ట్ చేసేది మా నాన్నలు కదా..అందుకే అని గర్వంగా చెబుతుంది.
ఆ మాటలకి తల కొట్టుకుంటాడు. ఈ నాన్నల పిచ్చి ఏమిటిరా దేవుడా అని పైకి చూస్తాడు. రుద్ర చూసినట్టుగానే పైకి చూసి అక్కడ ఏముంది అని అడుగుతుంది. నా ఫ్యూచర్ కనపడుతుంది అని చెబుతాడు.
హో... అలా చూస్తే ఫ్యూచర్ కనపడుతుందా అని అమాయకంగా అడుగుతుంది. నిన్ను అని చెయ్యెత్తి.. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెయ్యి మెల్లిగా తల మీద పెట్టి లేదు బంగారం...
ఇంత బాగా అర్థం చేసుకునే పెళ్ళాం నాకు మాత్రమే వస్తుందన్న సంతోషం అంతే అని...
మన పెళ్లి మాత్రం జరిగేది పక్క. నువ్వు ఇక్కడికి రావడం ఇంకా పక్క.. అది మైండ్ లో పెట్టుకో ఇంతకుమించి బ్రతిమాలడం నావల్ల కాదు.
అలా ఎలా కుదురుతుంది నేను ఒప్పుకోను అంటుంది. చూడు పాప.. మన పెళ్లి వల్ల అందరూ సంతోషంగా ఉంటారు.
ఇలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం అని మీ నాన్నలు కూడా పొంగిపోతారు. ఇంక మీ అమ్మలు అయితేనా అని చెబుతూ ఉండగానే..
మా అమ్మలకు అసలు ఏమీ తెలీదు. ఉత్తి తింగర బ్యాచ్ అంటుంది. ఒకసారి పైనుంచి కిందకి చూసి నీకంటే తింగర బ్యాచ్చా అని అడుగుతాడు.
నాకు కోపం వస్తుంది నేను చాలా తెలివైన దాన్ని అని చెబుతోంది. అవునవును నీ తెలివి చూసి నాకు చాలా ముచ్చట వేస్తుంది. చెప్పగానే ఎంత బాగా అర్థం చేసుకుంటావో కాదా అని బుగ్గలు లాగుతాడు.
నీ ప్రాజెక్ట్ అవ్వగానే మన పెళ్లి జరిగిపోతుంది. రేపే వెళ్లి పెళ్లి విషయాలు మాట్లాడుతున్నారు అని చెబుతాడు. నేను ఒప్పుకోవద్ద అంటే...నువ్వు ఆల్రెడీ ఒప్పేసుకున్నావు.
పద ఇంకా ఇంటికి వెళదామని కార్ స్టార్ట్ చేస్తాడు ఇంక ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటుంది.
నివాస్ కోసం ఎదురు చూస్తున్న విష్ణు గారు సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. సావిత్రి అక్కడికి వచ్చి ఏమైందండీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటే...
శాంభవి తో నివాస్ పెళ్లి విషయం ఆలోచిస్తున్నాను. నివాస్ ఒప్పుకుంటాడా లేదో అర్థం కావడం లేదు. శాంభవి నా కోడలైతే బాగుండునని ఉంది అని తన మనసులో మాట బయటకు చెబుతారు.
మనం అనుకుంటే సరిపోదు కదా... వాడు మనసులో ఏముందో తెలియాలి కదా అని మాట్లాడుకుంటూ ఉండగానే...
నివాస్ వస్తాడు. హాయ్ నాన్న అనుకుంటూ వచ్చి కూర్చుని... ఏమైంది ఇద్దరు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు.
నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాము అని చెబుతారు. నా పెళ్ళి గురించా అని అయోమయంగా చూస్తూ ఉంటే... శాంభవితో నీకు పెళ్లి చేస్తే బాగుంటుంది అని మాకు ఉంది. శాంభవి మీద నీ అభిప్రాయం ఏమిటి కన్నా అని అడుగుతారు.
నివాస్ ఏమని చెబుతాడు...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)