Poll: అమలిన శృంగార కథలు
You do not have permission to vote in this poll.
కావాలి
100.00%
1 100.00%
వద్దు
0%
0 0%
Total 1 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అమలిన శృంగార కథలు - సుభద్రార్జునీయం
#25
"...ఇక నా వైవాహిక జీవితమంటావా.. ఏడడుగులు పెళ్ళిలో నడిచామే గానీ తరువాత అడుగులు కలవలేకపోయాయి. తప్పెవరిదని వాదించడం కన్నా ఎవరంతట వారుండడమే మేలనుకున్నాం. తనూ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఇది నా ప్లాష్ బాక్ "అమృత ఆగింది. కాసేపు నిశ్శబ్ధం.
మరీ విషయం కనీసం నాకు తెలపాలనిపించలేదా. క్షణం నా వైపు చూసి మెల్లగా నవ్వేసింది.  
" ఏంటి మాధవ్ చెబితే ఏమవుతుంది. ప్రాబ్లమే కాదనుకున్నప్పుడు క్యాజువల్ గా తీసుకోవడమే మంచిదేకదా. అప్పుడు మీరందరు భాధ్యతల్లో మునిగి తేలుతున్నారు. నిజం చెప్పాలంటే అసలు నువ్వెక్కడున్నావో తెలుసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. అయినా ఇదో ముగిసిన సంఘటన. మొదట్లో ఒంటరితనం కాస్త బాధనిపించింది. అప్పుడప్పుడు మన వాళ్ళు కొందరైనా గుర్తొచ్చేవారనుకో."
" లిస్ట్ లో నా పేరు వుందా."
"హా..హ్హా.."
"అనుకున్నా ఇంకా అడగలేదేంటా అని. తమర్ని ఎలా మర్చిపోతాం సార్. అంది.. " ఓకే ఇప్పుడు నవ్వు  ..హాపీ కదా..  క్వైట్ హాపీ.. ఐయాం  లీవింగ్ ఇన్ మై ఓన్ వరల్డ్." అమృత అలా అనడంతో కాస్త మనసు కుదుటపడింది. "మాధవ్ వాతావరణం ఎంతో ప్లజంట్ గా వుంది. అనవసర కబుర్లు ఎందుకు. నీ పాట విని ఎన్నేళ్ళయింది. అప్పట్లో నీ పాటకు వీరాభిమానిని. అందులోనూ కిశోర్ "ముసాఫిర్ హూమే యారో" నీ గొంతులో మ్యాజికల్ గా పలికేది. ఒక్కసారి పాడవా ప్లీజ్. అమృత అడగుతుంటే కాదనలేకపోయా.. గొంతు సవరించుకున్నా. పాట కాగానే అమృత చిన్నపిల్లాలా వావ్ అంటూ అరిచింది.
సిల్సిలా   కభీ కభీ , చిత్ చోర్ లో జబ్ దీప్ జలే బాలూ మెలోడీలు మధు మాస వేళలో , పూచే పూల లోన పాటలు పట్టుబట్టి పాడించుకుంది. డిగ్రీ రోజుల్లో రోజూ పాటల సెషన్ నడిపే వాళ్ళం. నేను, రాజూ, మాధురీ పాడుతుంటే అమృత రమేష్ లు అద్భుతంగా పాటను వివరించేవారు. అదో అందమైన అనుభవం. వెన్నెల రాత్రిలో పాటలతో జ్ఞాపకాలపై కప్పుకున్న పరదాలు నెమ్మదిగా తొలుగుతున్నాయి. చివరిగా కరుణశ్రీ పుష్ప విలాపం పాడగానే అమృత చప్పున నా చేతులు పట్టుకుంది.
అద్భుతంగా పాడావు. మనసుకు ఎంత రిలీఫ్ గా వుందో తెలుసా. అంటూంటే తన కళ్ళల్లో ఊరిన చెమ్మ వెలుగులో ముత్యం లా మెరిసింది. చూస్తుండగానే రాత్రి పదిగంటలు అయింది.
" ఓకే మాధవ్ జీ వెన్నెల రాత్రిని సుమధుర సంగీత విభావరిగా మార్చినందుకు ధన్యవాదములు. " నాటకీయంగా నమస్కరించి ఫక్కున నవ్వేసింది.
*************
పడుకున్నానన్న మాటే గానీ ఓపట్టాన నిద్రపట్టడంలేదు. తల విదిలించి లేచి బయటకు వచ్చి కాసేపు వసారాలో పచార్లు చేసా. పక్క గదిలో అమృత ప్రశాంతంగా నిద్ర పోతోంది. కిటికీలోంచి కనిపిస్తున్న మనోహర దృశ్యాన్ని అప్రయత్నంగా చూస్తుండి పోయాను. తెలీకుండానే గది గుమ్మం దాకా అడుగులు పడ్డాయి. చూస్తున్న కొద్దీ కొత్త అందం ఏదో అమృతలో కనిపిస్తోంది. ఒక్కసారి చూస్తే గుర్తుండి పోయే రూపం తనది. అన్నిటికీ మించి పెదాలపై ఎప్పుడూ చెదరని చిరునవ్వు. కిటికీలోంచి వెన్నెల కిరణాలు తనపై పడుతుంటే పోత పోసిన శృంగార శిల్పం లా వుంది... పరవశంతో  కూడిన మైకం కమ్ముకొస్తుంటే మనసు వశం తప్పుతోంది. అలా ఎంతసేపున్నానో నాకే తెలీదు. అమృత మరో వైపు తిరిగింది.....................................
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అమలిన శృంగార కథలు - శ్రీనివాస్..ద సోల్జర్ - by k3vv3 - 31-03-2026, 10:01 PM



Users browsing this thread: 1 Guest(s)