Poll: అమలిన శృంగార కథలు
You do not have permission to vote in this poll.
కావాలి
100.00%
1 100.00%
వద్దు
0%
0 0%
Total 1 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అమలిన శృంగార కథలు - సుభద్రార్జునీయం
#24
" మాధవ్ ఏమాత్రం సిగ్గు లేకుండా, సారీ సిగ్గు పడకుండా తినేయ్." ముసి ముసిగా నవ్వుతూ అంది. "అమ్మూ... స్టాప్ రోటీన్ జోక్స్. .." వెంటనే నాలుక కరుచుకున్నా. అమ్మూ అనేసా.. ఏమనుకుంటుందో..   అప్పట్లో నేనొక్కడ్నే.. అమృతను అమ్ము అని పిలిచేవాణ్ణి. ఆరాధనకు అదో ట్యాగ్ గా భావించే వాణ్ణి . విచిత్రం ఏమిటంటే.. ఎవర్నీ విషయం లోనూ ఎంటర్ టైన్ చేయని అమృత నేను అలా పిలిచినా కాదనక పోవడం. అది ఇప్పటికీ వండరే.
కానీ అమృత ఇదేం గమనించినట్టు లేదు.
" సరే సరే ఇక మాటల్లేవ్ ..ఓన్లీ యాక్షన్. సరేనా లాగించు మరి." వంటకాలు చూడగానే ఆకలి ఆవురావురంది. గుమ్మడి కాయ సాంబార్, చింత పచ్చడి, ఆవకాయ, ఆలూ వేపుడు, అప్పడాలు, వడియాలూ వేడి వేడి అన్నం పచ్చని అరటి ఆకులో ఆహ్వానిస్తున్నాయి. అన్నీ నాకూ ఇష్టమైనవే. అసలు మెనూ చూస్తుంటే చాలా ప్లాన్ డ్ గా చేసినట్టుంది. క్షణం లో నా డైటింగ్ కెలోరీ లెక్కలు ఏవీ గుర్తుకు రాలేదు. అమృత కొసరి కొసరి వడ్డిస్తుంటే చాలా కాలం తర్వాత తృప్తిగా భోంచేసాను.
" అడగడమే మరిచా.. మరి నువ్వు..."
" ఆహా సారు గారికి ఇప్పుడు గుర్తొచ్చామా.. " నవ్వేసింది. " ఓకేసారి చెప్పను గానీ నేనే సర్వ్ చేస్తా. " " వద్దులే బాబూ, తమరు అలా వసారాలో తీరిగ్గా కూర్చుంటే పది నిముషాల్లో వస్తా." " అవునులే అమ్మాయిలు తాము తింటున్నప్పుడు ఎవరూ చూడకూడదనుకుంటారట. " ఆటపట్టించాను. " ఎక్స్ క్యూజ్ మీ తమరు అలా దయచేస్తారా.." అమృత గట్టిగా అనేసరికి నవ్వుతూ బయటికి నడిచా
*******
రాత్రి 8.00 గంటలు
ఆకాశం అద్భుతంగా వుంది. పిండారబోసినట్లు తళ తళ మెరుస్తూ వెన్నెల గాలికి కదిలే ఆకులపై వెండి కిరణాలు తళుక్కుమంటున్నాయి. పువ్వుల పరిమళాలు మోసుకొస్తున్నాయి. గాలులు శరీరాన్ని అలా నిమురుతుంటే ఏదో తెలియని పారవశ్యం మామిడి చెట్టు కింద చిన్న చప్టా పై ప్రశాంతంగా కూర్చున్నా. నిశ్శబ్ధంగా ప్రవహిస్తోంది. ఇంట్లోంచి ఘంటసాల పాట మనసున మనసై.. గాలి అలలపై తేలాడుతూ చిన్నగా మనసును తాకుతోంది. డాక్టర్ చక్రవర్తి లోని పాట. డిగ్రీ రోజుల్లో పాటను ఎన్ని సార్లు పాడుకున్నానో. ఫ్రెండ్స్ కలిస్తే చాలు. పాట పాడమని పట్టుబట్టేవారు. రోజుల్లో నేనో చిన్న సైజు ఎస్. పీ. ని కానీ గ్రూపులో పాటే నన్ను ప్రత్యేకం గా నిలబెట్టింది. చుట్టూ తోట మధ్యలో ఇల్లు చూస్తుంటే వెన్నలంతా మేసి ఏరు నెమరేస్తోంది ఏటి కడుపున దాగి తోట నిదురోతోంది అన్న నండూరి వ్యాక్యాలు గుర్తొస్తున్నాయి. అదృష్టమంటే అమృతదే! ప్రతిరోజూ ఇలా ప్రకృతిని మనసారా ఆస్వాదించే చ్హాన్స్ ఎందరికి వస్తుంది? డిల్లీ జనారణ్యం లో ఇరుకిరుకుగా బతికేస్తున్న నాకు వాతావరణం అపురూప దృశ్య కావ్యంలా కనిపిస్తోంది. అమృతను చూడాలన్న నా ఆలోచనకు నేనే థాంక్స్ చెప్పుకున్నా. ఒకవేళ ఆలోచనే రాకుంటే ఇంత చక్కటి ప్రాంతం చూసేవాణ్ణి కాదేమో. ఇంతలో అమృత వచ్చి కూర్చుంది. ఉడికించిన పల్లీల ప్లేటు ముందుంచింది. కొన్ని క్షణాలు గడిచాయి.
"మాధవ్ ఇప్పుడు చెప్పు ఎలా వున్నావ్?"
"అది అడగాల్సింది నేను. ఉదయం నా ప్రశ్నకు బదులివ్వనేలేదు. మీ వారెక్కడ?"
" వాతావరణం చాలా హాయిగా వుంది. మనసుకు ఇష్టమైన మాటలైతే బెటర్ అనుకుంటా " అమృత మాటల్లో ఏదో మార్మికత. అయిదేళ్ళ తర్వాత కలుసుకున్నాం.. " ఎలా వున్నామో తెలుసుకోనక్కర్లేదా? " నిష్టూరంగా అడిగాను. " ఏముంది డిగ్రీ అయ్యాక నా పెళ్ళి . అంతా హడావిడిగా అయిపోయింది. మరుసటేడే ఆయన దుబాయ్ వెళ్ళిపోయారు. అక్కడ సంపాదన బాగా వుంటుందటగా" కారాన్ని వత్తి పలికింది.
"మరి నువ్వు"
" మాధవ్ అందరి ఆలోచనలు ఒకేలా వుండవు కదా. తనకు డబ్బంటే ఇష్టం.. నాకు ఇలాంటి బతుకంటే ఇష్టం. పొంతన కుదరనప్పుడు ఎవరికేది ఇష్టమో అది చేయడమే మంచిది. " నెమ్మదిగా అంది.
"ఆయన ఇండియా వస్తుంటారా."
".. నా కాపురం ఎలా వుంది? ఎంత మంది పిల్లలు? ఏం చేస్తున్నారు? ఇవేగా నువ్వడగాలనుకున్న ప్రశ్నలు. పెళ్ళయిన ఏడాదికి ఆయన , నేను చెరోదారి అయ్యాం. డైవోర్స్ కాలేదు గానీ.. ఎవరి బతుకు వారిదే. తను దుబాయిలో, నేను ఇక్కడ. బీయెడ్ చేశాక ఊళ్ళో టీచర్ గా చేరాను. ఇక్కడ పేదల బతుకులు, అందులోనూ చిన్నారుల జీవితాలు చూసాక నా శక్తి మేరకు ఏదైనా చేస్తే బాగుంటుందనిపించింది. వాత్సల్య పేరిట సేవా సంస్థ ప్రారంభించా. మన క్లాస్ మేట్ రమేష్ యూ.ఎస్ లో వున్నాడు. నీకు తెలుసుగా తను అక్కడి ఎన్నారైలతో నా ప్రోగ్రాం లను స్పాన్సర్ చేయిస్తున్నాడు. టీచర్ గా వున్నప్పుడు పల్లెను చాలా దగ్గరగా పరిశీలించాను. పల్లెల్లో పిల్లల ఎదుగుదల, చదువు ఎంత కష్టమో తెలిసింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్డే మీల్, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఫలితం అంతంత మాత్రమే. పథకాలు మంచివే. డెలివరీ లో ఎన్నో లోపాలు. అదేదో అంటారే.. ఇచ్చే చేతులు పుచ్చుకునే చేతుల మధ్య మరిన్ని చేతులో అని , అలా వుంటుంది వ్యవహారం.
పిల్లలే నా ఉపాధి మార్గం అవుతున్నప్పుడు వారి కోసం ఏదైనా చేయాలనిపించింది. అప్పట్లో నా వంటరితనం కూడా కారణం కావచ్చు. కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తూ ఆర్గనైజేషన్ నిర్వహించాను. కానీ రెండు పడవలపై ప్రయాణం కష్టమనిపించింది. అందుకే పూర్తిగా దీనికే అంకితమయ్యా, నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలనే తాపత్రయం లేదు కాబట్టి స్వచ్చందంగానే నడిపిస్తున్నా. దేశం , సమాజం ఉద్దరిస్తున్నానన్న భారీ డైలాగులు కొట్టలేనుగానీ, చేతనైన సాయం చేస్తానన్న తృప్తి మాత్రం వుంది. అన్నిటికీ మించి ఊరి వాళ్ళు నన్ను నమ్మారు. ఇదిగో ఆశ్రమం పిల్లలూ ఇవే నా ప్రపంచం. అమృత మాటల్లో తన ఆలోచనల్లో సీనియారిటీ సీరియస్ నెస్ బాగా నచ్చింది. మునుపటికన్నా తనపై అభిమానం పెరుగుతున్న ఫీలింగ్. అంతేకాదు, నేను వస్తున్నట్టు అమృతకు ఎలా తెలిసిందో కూడా అర్ధమయింది. రమేష్ తో ఎఫ్.బీ లో చాట్ చేస్తూ చెప్పాను. బహుశా తను ఇన్ ఫార్మ్ చేసి వుంటాడేమో.  
అమృత మాటలు కొనసాగిస్తూ..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అమలిన శృంగార కథలు - శ్రీనివాస్..ద సోల్జర్ - by k3vv3 - 31-03-2026, 10:00 PM



Users browsing this thread: