Poll: అమలిన శృంగార కథలు
You do not have permission to vote in this poll.
కావాలి
100.00%
1 100.00%
వద్దు
0%
0 0%
Total 1 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అమలిన శృంగార కథలు - సుభద్రార్జునీయం
#23
అమృత - రామదుర్గం మధుసూధన రావు

[Image: image-2026-03-31-165937768.png]

 
అబ్బా.. ఇంకెంత దూరం..
ఇలా అనుకోవడం ఇప్పటికి ఇరవై సార్లు.
చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి మధ్యలో మెలికలు తిరిగిన తారు రోడ్డుపై బస్సు వెళుతోంది. కిటికీ నుంచి చెట్లు చేమలు కొండలు గుట్టలు అలా కదలిపోతున్నాయి. అయినా కదులుతోంది బస్సే కదా.. వాటె సిల్లీ డౌట్. చిన్నగా నవ్వుకున్నాను. ఎన్నో ఏళ్ళ తరువాత అమృతను చూడబోతున్నాను. భావనే చాలా అద్భుతం అనిపిస్తోంది. తనను చూసి దాదాపు అయిదేళ్ళు దాటుతోంది. రెండు నెలల కిందట డిగ్రీ స్నేహితులందరూ అపురూపంగా అలమ్నయ్(పూర్వం విద్యార్ధుల సమావేశం) చేసుకున్నాం. ఉద్యోగరీత్యా ఢిల్లీలో వున్నా కేవలం  కార్యక్రమం కోసమే నాలుగు రోజులు సెలవు పెట్టుకుని మరీ వచ్చాను. దాదాపు అందరూ కలుసుకున్నాము. అమృత తప్ప. కార్యక్రమం జరుగుతున్నంత సేపూ తన గురించి ఎంక్వయిరీ చేస్తూనే వున్నాను. బిజీగా వున్నందున రాలేకపోయిందని వెంకట్ చివర్లో చల్లగా చెప్పాడు.
"ఆహా ఇక్కడ మనకేమో పనీపాట లేదాయే.. "నా గొంతులో కోపం, వెటకారం కలగలసి ధ్వనించాయి.
" అది కాదురా మాధవ్ రెండ్రోజుల ముందే అమృత ఇన్ ఫార్మ్ చేసింది. నువ్వు డిసప్పాయింట్ అవుతావేమోనని మేమే చెప్పలేదు. " వెంకట్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు.
" అది కాదురా నెల నుంచే ప్లాన్ చేసుకున్నామా. వస్తుందని అనుకున్నా, సర్లే ఏం చేద్దాం " నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. అమృత అడ్రస్ అడగాలనిపించినా ఎందుకో అడగలేక పోయా, రెండు రోజుల కిందట వున్నట్టుండి అమృత నుంచి ఉత్తరం .
ఎందుకు రాలేకపోయానో క్లుప్తంగా వివరిస్తూ మన వాళ్ళని చాలా మిస్ చేసుకున్నా రకంగా దురదృష్టవంతురాలిని సారీ అంటూ రాసింది. నీలి రంగు కాగితంపై ముత్యాల్లాంటి అక్షరాలు చూడగానే గత స్మృతులు తరంగంలా గుండెను మెత్తగా తాకాయి. లెటర్ వెనుక ఫ్రం అడ్రస్ చూసాక మనసు నిలవలేదు. ఎలాగైనా సరే అమృతను చూడాలని నిర్ణయించుకున్నాను. తనకు చెప్పకుండా వెళ్ళి సర్ ప్రైజ్ చేయాలన్న కుతూహలం కూడా తోడయ్యింది. ఫలితం .. ఇదిగో ప్రయాణం. బస్సు కుదుపుతో ఆగింది. నా ఆలోచనలకూ బ్రేక్ పడింది. బ్యాగు సర్దుకుని కిందకు దిగాను. మారుమూల పల్లెలో వుంటోందని తెలిసింది కానీ మరీ ఇలా అడవి మధ్యలో వుంటుందనుకోలేదు. ఎవరినైనా అడిగితే తప్ప ఊరు చేరుకోవడం కష్టమే. ఇంతలో మనిషి నా వైపే వస్తున్నాడు. మాసిన గడ్డం, భుజం పై తువాలు, నన్ను ఎగాదిగా చూసి " మాధవ సారూ అంటే మీరేనా " అడిగాడు. ఆశ్చర్యం వేసింది. ఇంత అడవిలో నా కోసం దూత.
" నా పేరు నర్సిమ్మ. మిమ్మల్ని తోడ్కొని రమ్మని అమృతమ్మ పంపింది సార్. తెల్లారు నుంచి ఈడనే వున్నా పదండి " నా బ్యాగు అందుకున్నాడు. వద్దని వారించినా వినేలా లేదు.
నేను వస్తున్నట్టు అమృతకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పి వుంటారు? ఎంత బుర్ర బద్ధలు కొట్టుకున్నా అర్ధం కాలేదు. హూ.  సర్ ప్రైజ్ ఇద్దామనుకుంటే తను ఏకంగా షాకే ఇచ్చిందే అనుకుంటూ అతన్ని అనుసరించా.
************
" వేచి వున్నందుకు ధన్యవాదాలు..! "
చిర పరిచిత గొంతు. పుస్తకం లో మునిగి పోయిన నేను చటుక్కున తలెత్తా.
అమృత .. నవ్వుతూ వచ్చి కూర్చుంది. తనను చూడగానే ఒక్కసారిగా ఉద్వేగం గుండెల్లోంచి గొంతులోకి వచ్చినట్టయింది. బహుశ నా జీవితం లో ఎగ్జయిటెడ్ క్షణాల జాబితాలో ఇది ముందు వుంటుందేమో. కాటన్ చీరలో పొందికగా కనిపిస్తోంది. తను ఏం మారలేదు. కళ్ళజోడు వెనుక కళ్ళల్లో మెరుపు, చిలిపి నవ్వు, కోటేరు లాంటి ముక్కు, నవ్వినప్పుడు బుగ్గలపై సొట్టలు... కాకపోతే ముక్కు పుడక కొత్తగా కనిపిస్తోంది. " ప్రయాణం బాగా సాగిందా" ఆప్యాయంగా అడిగింది.
" మామూలుగా కాదులే , ఒళ్ళంతా హూనం. "
అందుకే నిన్ను డిస్టబ్ చేయకూడదని బయటికెళ్ళా. బాగానే నిద్ర పోయినట్టున్నావుగా.
"అంత లేదు. సగం మెలుకువ గానే వుంది. జస్ట్ రెస్ట్ అంతే." " మరి గురక పెట్టావని నర్సిమ్మ అన్నాడే. " నవ్వును పెదాలతో బిగపట్టింది. " అవునా నిజంగానా, " ఆశ్చర్యంగా అడిగా.
" అర్రే .... మరీ అంతలా ఆశ్చర్యపోకు జస్ట్ అలా అన్నా అంతే. మాధవ్ సారీ! రిసీవ్ చేసుకోలేకపోయాను. అర్జెంట్ మీటింగ్ వుంటే వెళ్ళాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే. అవునూ ఊరికి దూరంగా ఇల్లేంటి?"  " ఊరికే " మళ్ళీ నవ్వు..
" సాధ్యమైనంత వరకు అన్ని కాలుష్యాలకు దూరంగా వుండాలని " అమృత బదులిచ్చింది.
 " ఎలా వున్నావ్? " నా గొంతులో ఆతృత.
అమృత చిన్నగా నవ్వేసింది
చొరవగా నా చేతిలో పుస్తకం తీసుకుని చూసింది. పెదాలపై చిన్న నవ్వు మెరిసి మాయమయ్యింది.
" ఓహో చలం మైదానమా. బాగుంది, ఇన్ని పుస్తకాలున్నా మళ్ళీ ఇదేనా మంచి పుస్తకం ఎన్ని సార్లయితే ఏముంది" అనాలనుకున్నా అంతలోనే తనే అందుకుంది.  "అవును అయిదేళ్ళ నుంచీ ఒక్క పుస్తకమే చదువుతున్నావా? లేదా చదవడం మానేసావా. " మాట పూర్తి కాకముందే గలగలా నవ్వు. తనేం మారలేదనడానికి ఇంకేం రుజువులు అక్కర్లేదనిపించింది. చొరవ నవ్వులో స్వచ్చత తను మాత్రమే అందంగా పలికే అరే .. ఓహో అలాగా! అనే ఊత పదాలు అన్నీ సేం టూ సేం. కాకపోతే రంగు మాత్రం కాసింత తగ్గినట్టుంది.
" నీ లైబ్రరీ వండర్ ఫుల్ ఇన్ని పుస్తకాలే.. !"
" థాంక్స్! కానీ అన్నీ చదివేసానని అనుకోకేం, ప్రయాణం ముగిసేలోగా చదివేయాలని మాత్రం వుంది."
"మనం ఆశా జీవులం కదా! " అంది అమృత తమాషాగా భుజాలెగరేస్తూ " అవును ఇల్లు ఎలా వుంది? తోట చూసావా పద పద " నెక్స్ట్..
ఇద్దరం బయటకి వచ్చాం. చుట్టూ కొండలు, మధ్యాహ్నం ఎర్రగా ఎండ కాస్తున్నా చెట్లు ఉండడంతో వేడి తెలియడం లేదు. కాంపౌండ్ ఆనుకుని వరుసగా కొబ్బరి చెట్లు సరిహద్దు కాపలా కాస్తున్న సైనికుల్లా వున్నాయి.
గులాబి, చామంతి, మందారం, పారిజాతం, నిద్ర గన్నేరు... రకరకాల పూల తీగలు చెట్లు కంటికింపుగా కనిపిస్తున్నాయి. మరో పక్క పచ్చగా పరుచుకున్న ఆకు కూరలు, అక్కడక్కడ గుమ్మడి తీగలు, మధ్యలో నడవడానికి వీలుగా దారి.
పచ్చని తోట మధ్య ఇళ్ళు ఆశ్రమం లా వుంది. అమృత తోట ఎలా పెంచిందో వివరిస్తుంటే బుద్ధిగా వెనకాలే నడుస్తున్నా. " అవును నేనేం బోరు కొట్టించడం లేదు కదా." వున్నట్టుండి అమృత వెను తిరిగింది. " అబ్బే భలే దానివే ఇట్స్ ఇంట్రస్టింగ్ " తడబడుతూ బదులిచ్చా.
గంట తరువాత..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అమలిన శృంగార కథలు - శ్రీనివాస్..ద సోల్జర్ - by k3vv3 - 31-03-2026, 09:57 PM



Users browsing this thread: