31-03-2026, 07:58 AM
Part - 42
ఎట్టి పరిస్థితుల్లోను మీ లవ్ లో పడను. అలాంటప్పుడు మీ ఫ్యూచర్ వైఫ్ని ఎందుకు అవుతాను. మనకి పాప ఎలా పుడుతుంది అని లాజిక్ గా అడిగాను అనుకొని సంబరపడిపోతుంది.
రుద్ర శాంభవి వైపు చూసి గుడ్ క్యూస్షన్ పాప. నిన్ను నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి సమాధానం చెప్పు అని అంటాడు.
అడుగు అన్నట్టు సైగ చేస్తుంది.ఈ పొగరుకేమీ తక్కువ లేదు అనుకుని.. నువ్వు నా లవ్ లో పడవు అన్న ధీమా ఏమిటి అని అడుగుతాడు.
నా మీద నాకున్న నమ్మకం అని చెబుతోంది. ఇంట్రెస్టింగ్ అని..అలాగే నా మీద నాకు నమ్మకం ఉంది నిన్ను లవ్లో పడేస్తాను అని.
అంతెందుకు పొద్దున నీకు ఏమని చెప్పాను ... ఏమని చెప్పారు అని బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తుంది.
తల మీద ఒకటి కొట్టి నీ అంతట నువ్వే కారు ఎక్కాలి ఎవరిని మనతో రానివ్వకూడదు అది నీ బాధ్యత అని చెప్పాను కదా అంటాడు.
అవును కదా.. అందుకే కదా అలాగే వచ్చాను. ఒక సైడ్ కి స్మైల్ ఇస్తూ అది ఎవరు చెప్పారు.. ఎవరు చేశారు అని అడుగుతాడు.
మీరు చెప్పారు నేను చేశాను అంటుంది. కదా... దీన్ని బట్టి నీకు ఏమి అర్థమైంది.
ఏం అర్థం అవ్వాలి అని తిరిగి ప్రశ్నిస్తుంది...
పైకి చూస్తూ ఒరేయ్ రుద్ర నీకెన్ని కష్టాలు వచ్చాయిరా... ఇంత బల్బులేని పిల్లని లవ్ చేసి లైఫ్ లోకి తెచ్చుకుంటున్నావు. అనుభవించు అని శాంభవి వైపు చూసి...
నేను చెప్పే వాడిని నువ్వు ఫాలో అయ్యే దానివని దాని అర్థం అంటే.... ఫ్యూచర్లో నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అని దాని పూర్తి అర్థం పాప అని సాగదీస్తూ చెబుతాడు.
అలా ఏమీ జరగదు. ఏ విషయంలో అయినా నీకు జరుగుతుందేమో గాని...నా విషయంలో జరగదు. నేను చెప్పిందే జరుగుతుంది అని పంతంగా ఉంటుంది.
నీకు సంబంధించిన జరిగినాయి మీ ఊర్లో పాప. ఇక్కడికి వచ్చాక అంతా నా కంట్రోల్లోనే ఉంటుంది. అది నీ మట్టి బుర్రకు అర్థం కావడం లేదు.కానీ ఎప్పటినుంచో నువ్వు ఫాలో అయిపోతున్నావు.
నేనా అని తన వైపుకు వేలు చూపించుకుంటుంది.. ఎస్ అని కళ్ళు అరుపుతాడు. హౌ అని అడుగుతుంది.
ఒక ఎగ్జాంపుల్ చెప్పనా అంటాడు. చెప్పు అంటుంది.
నువ్వు వచ్చిన కొత్తలో ఎక్కడున్నావు అని అడుగుతాడు. మా విష్ణు మామ ఇంట్లో అని చెబుతోంది.
మరి మీ విష్ణు మామ ఉండగా నువ్వు ప్రతి నెల చేసే హోమం ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. రుద్రవైపు అనుమానంగా చూస్తూ దేవేంద్ర సార్ వాళ్ళ ఇంట్లో అని చెబుతుంది.
హోమం అయిపోయిన తర్వాత మీ విష్ణు మామ ఇంటికి ఎందుకు వెళ్లలేదు అని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తాడు. సార్ మా తాతగారు వాళ్ళని బ్రతిమాలారు అని ఇక్కడ ఉన్నాను అని...
అది కూడా నీ ప్లాన ఏమిటి అని అనుమానంగా అడుగుతుంది. అంత అనుమానం అక్కర్లేదు పాప అదే కన్ఫామ్ అని ఒక స్మైల్ ఇస్తాడు.
ఎందుకు చేసావు అని కోపంగా అడుగుతుంది చెప్పాను కదా నా ఫ్యూచర్ వైఫ్ అని. మరి నా వైఫ్ ని నా ఎదురుగుండా పెట్టుకోవాలి కదా అంటాడు.
అవునా.. నీ ఫ్యూచర్ వైఫ్ ను అయితే..నీ ఇంట్లో పెట్టుకోవాలి కానీ మీ మామ ఇంట్లో ఎందుకు ఉంచినట్టు అని సాగదీస్తుంది.
ఏ మాటక ఆ మాట చెప్పుకోవాలి కానీ నువ్వు పెద్ద కోషన్ బ్యాంక్ కదా అని అంటాడు టాపిక్ డైవర్ట్ చేయకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంటుంది.
ఆ మాటలికి సిగ్గుపడుతూ... పెళ్ళి అవ్వకుండా మన ఇంటికి వెళ్లితే బాగోదు కదా... అందుకే మామ ఇంట్లో ఉంచాను.
నీ కోసం నేను కూడ అక్కడే ఉంటాను. నువ్వు నన్ను మిస్ అవ్వకుండా చూసుకుంటాను సరేనా పాప అనగానే... అయ్యే నీ మొఖానికి సిగ్గు కూడానా...
చూడలేక చస్తున్నాను. ముందు ఆ సిగ్గు పడటం మానేయ్ బాబు అని తల కొట్టుకుంటుంది. మీ ఆయన సిగ్గుపడుతుంటే బాగోలేదా..పొగరుగా ఉంటేనే బాగుంటుందా..అలాగే పాపా అంటాడు.
ఇదిగో పాపా పాపా అనొద్దని ఎన్నిసార్లు చెబుతున్నారు నీకు. ఆ పిలుపు వింటుంటేనే నాకే ఏదోలా ఉంది అని అరుస్తుంది.
నాకు మాత్రం చాలా బాగుంది. చిన్నప్పటినుంచి నువ్వు నా దగ్గరే పెరిగి ఉంటే ఇంకా ఎలా పిలిచేవాడినో అని అంటాడు.
నీ దగ్గర నేనెందుకు పెరుగుతాను నేను ఏమన్నా నీ మేనమామ కూతుర్నా.. ఏమిటి ? ఏమో అవునేమో అంటాడు. అలా ఎలా అవుతుంది?
నేను ఉంది రేపల్లె. నువ్వు ఉన్నది హైదరాబాదు. ఇప్పుడు దాకా మా నాన్న ఎవరో నీకు తెలియదు. అలాంటప్పుడు నీ మేనమామ కూతుర్ని నేను ఎలా అవుతాను అని టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకు వెళుతుంది.
మీ ఆడవాళ్ళ దగ్గర ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటది అది ఏంటో తెలుసా అంటాడు. ఏం క్వాలిటీ అని అడుగుతుంది. గుడ్ క్యూస్షన్ పాపా...
టాపిక్ లో మెయిన్ పాయింట్ వదిలేసి తోక పట్టుకుని వెళుతూ ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ తోకతోనే గొడవకి దిగుతారు. అది మీ ఆడవాళ్ళకే కదా సాధ్యం అంటాడు.
అంటే మీరేమో మెయిన్ పాయింట్ తో ముందుకు వెళుతూ ఉంటే...మేమేమో తోక పట్టుకుని గొడవలకు దిగుతామనా నీ ఉద్దేశం అని అడుగుతుంది. ఎగ్జాక్ట్లీ పాప అని ముక్కు మీద వేలుతో టాప్ చేస్తాడు.
మీకు ఎన్ని సార్లు చెప్పాను నన్ను టచ్ చేయవద్దు అని నాకు ఇలా బయట వాళ్ళు టచ్ చేస్తే అస్సలు నచ్చదు అని ఆ వేలిని ఇసురుకొడుతుంది.
నిజమే బయట వాళ్ళు టచ్ చేస్తే బాగోదు కానీ.. నీ కాబోయే మొగుడు టచ్ చేస్తే కూడా ఫీల్ అవ్వలేకపోతున్నాను.
అసలు నీలో రసగ్రంధులు ఉన్నాయా అని డౌట్ గా చూస్తాడు. ఏయ్ ఏంటా చూపు.. నాలో ఏ గ్రంధులు ఉంటే నీకెందుకు..లేకపోతే నీకెందుకు..
అవన్నీ ఎవరి దగ్గర చూపించాలో వాళ్లకే చూపిస్తాను గానీ ఇలా బయట వాళ్లకి కాదు అని అంటుంది. అయ్యో పాప ఎన్నిసార్లు చెప్పినా అదే మాట.
నువ్వు చూపించాల్సిందే నాకు. అవి బయటకు తీసుకు రావడానికి కదా నా తిప్పలు అన్ని. నాకు ఒక డౌటు నీకు కాలేజీలో ఎవరైనా సైట్ కొట్టారా..పోనీ ఎట్ లిస్ట్ క్రష్ ఫీలింగ్, లెటర్ ఇవ్వడం అలాంటివి అని అడుగుతాడు.
చి చి అలాంటివి ఎవరైనా చేస్తారా అని అంటుంది. అందుకే అన్నాను నీలో రసగ్రంధులు లేవని. అది అర్థమయ్యే ఎవరు నీకు లవ్ లెటర్ ఇవ్వడం లేదు ప్రొపోజ్ చేయలేదు అని అంటాడు.
అలా నువ్వు అనుకున్నట్టుగా ఏమీ లేదు. మా కాలేజీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని గర్వంగా చెబుతుంది.
ఓ అవునా... మీ ఫ్రెండ్ ఉన్నది కదా తన పేరు ఏంటి అని అడుగుతాడు. మిత్ర అంటుంది. హ.. మిత్రని అడుగు ఎవరైనా ప్రపోజ్ చేశారో లేదో అప్పుడు చెప్పు పాప అంటాడు.
ఇంటికి వెళ్ళగానే అడుగుతాను నువ్వు చూస్తూ ఉండు నీకు నేను జవాబు చెబుతాను అంటుంది ఐ యాం వెయిటింగ్ పాప అంటాడు.
ఇంకా ఎంత చెప్పినా వినడు అని సైలెంట్ అయిపోయి విండోలో నుంచి బయటకు చూస్తుంది. ఇంతలో కార్ సడెన్ బ్రేక్ తో ఆగుతుంది.
ముందుకి పడి డాష్ బోర్డుకి కొట్టుకుపోతున్న శాంభవి తలకి,డాష్ బోర్డుకి మధ్యలో చెయ్యి అడ్డుపెట్టి పొద్దున్నే చెప్పాను కదా.. సీట్ బెల్ట్ పెట్టుకోమని పెట్టుకోకపోతే ఎలా పాపా అని స్మూత్ గా చెబుతూ ఎదురుగుండా ఎవరు ఉన్నారో చూస్తాడు.
ఎదురుగుండా ఆశా, నిషా నిలబడి ఉంటారు. ఉఫ్.. మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు వీళ్ళ నసా ఒకటి అనుకుంటూ...విండో గ్లాస్ దించి ఏంటి మీ గోల అని అడుగుతాడు.
ఇద్దరు అక్కడి నుంచుని ఏంటి రుద్ర మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా అని అనుమానంగా అడుగుతారు. ఓ ఈ న్యూస్ అప్పుడే మీ దాకా వచ్చిందా అని అడుగుతూనే...
శాంభవి చేయ మీద వేసి ఆ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. శాంభవి ఏదో మాట్లాడదాం అనుకునే లోపు రుద్ర సీరియస్ గా ఒక చూపు చూస్తాడు. వెంటనే శాంభవి సైలెంట్ అయిపోతుంది.
మనసులో మాత్రం ఇప్పటిదాకా చాలా సరదాగా మాట్లాడాడు. ఇప్పుడు ఏంటి ఎంత సీరియస్ గా ఉన్నాడు.
ఏమై ఉంటుంది అని వాళ్ళ వంక చూస్తూ ఉంటుంది.
మేటర్ తెలిసింది కదా ఇంత వెళతారా అంటాడు. క్లియర్ గా కనిపించని శాంభవిని తలవంచుకుని చూస్తూ ఉంటే... ఎందుకు అలా చూస్తున్నారు నా వైఫ్ కి దిష్టి తగులుతుంది అంటాడు.
ఆ మాటకి శాంభవి పళ్ళు నూరుతూ ఉంటే.. ఆశ,నిషా ఈర్షతో రగిలిపోతూ ఉంటారు. మా చూపు మరీ అంత దిష్టి చూపేమి కాదులే రుద్ర.
మాకన్నా ఎందులో ఎక్కువో మాకు తెలియాలి కదా అని అడుగుతారు. దానికి మీరు చూడవలసిన పనేముంది నేను చెబుతాను వినండి.
ఫస్ట్ గుణంలో మీ కన్నా ఎక్కువ. పద్ధతిలో మీ కన్నా ఎక్కువ. చదువులో మీ కన్నా ఎక్కువ . అందంలో అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు.మా అత్త పోలికే అనుకో..
ఇది అది అని చెప్పలేను గాని నా పెళ్ళాం సూపర్ కే సూపర్ సరేనా అని చెప్పి ఒక్కసారిగా కారు స్పీడ్ అందుకుంటాడు. ఆ. స్పీడ్ కి ఇద్దరు పక్కకి తూలి పడతారు.
కారు ముందుకి దూకగానే రుద్ర చేతులో నుంచి చేయి లాక్కుని అసలు ఏంటి నీ దౌర్జన్యం. నా చేతిని అంత చొరవగా పట్టుకుంటావు అయినా నేను మీ అత్త పోలిక.
మా అమ్మ ని అసలు సరిగ్గా చూసావా అని గట్టిగా అరుస్తుంది.
దానికి రుద్ర సమాధానం ఏమిటి...
కథ కొనసాగుతుంది....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)