31-03-2026, 07:55 AM
Part - 40
రుద్ర ఆలా ఆర్డర్ వేయగానే శాంభవికి పిచ్చ కోపం వస్తుంది. తన పుట్టి బుద్ది ఎరిగిన తర్వాత ఇప్పటివరకు ఎవరు తనమీద అలా ఆర్డర్ వేసింది లేదు. బ్రతిమాలతు, బుజ్జిగించి చెప్పిన వాళ్లే.
రుద్రవైపు కోపంగా చూస్తూ మీరు ఆర్డర్ వేస్తే నేను చెయ్యాలా అంటుంది. చెయ్యవా అని ఆటిట్యూడ్ గా అడుగుతాడు.
ఎందుకు చేయాలి. నువ్వేమైనా నా ఫ్యామిలీ మెంబర్ వా లేక నాకు కాబోయే మొగుడువా నీ మాట వినడానికి అని రుసరుసలాడుతుంది.
శాంభవి మాటలకి నవ్వుతూ కరెక్ట్ గా చెప్పావు బేబీ. నీకు కాబోయే మొగుడిని అంటాడు. ఏంటి అని గట్టిగా అరుస్తుంది.
ఎందుకు ప్రతిదానికి ఒక భయంకరమైన ఎక్స్ప్రెషన్ లేదో అరవడం చేస్తావు. నీకు అర్థం అయ్యే భాషలోనే కదా చెప్పాను అని విసుగ్గా అంటాడు.
నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ నువ్వు అన్నదే నాకు అర్థం కాలేదు. నువ్వు నాకు మొగుడు ఏంటి.. అసలు నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు..
నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని వెటకారంగా అడుగుతుంది. నా ఫేస్ కి ఏమి తక్కువ ఎంత మంది లైన్లో ఉన్నారో తెలుసా అని ముక్కు మీద వేలుతో టాప్ చేస్తూ అడుగుతాడు.
ఇదిగో దూరంగా ఉండి మాట్లాడు ఏదైనా సరే. నన్ను టచ్ చేసావంటే మాత్రం అస్సలు మర్యాదగా ఉండదు. వెంటనే మా నాన్నకి ఫోన్ చేసి చెబుతాను అనే ఫోన్ పుచ్చుకుంటుంది.
అనుకున్నాను . ఏది నీ సొంతంగా డీల్ చేయలేవు లేవు కదా.. మాట్లాడితే మా నాన్న అన్నయ్యలు అంటావు. నువ్వు సొంతంగా నన్ను డీల్ చెయ్ అప్పుడు ఒప్పుకుంటాను.
ఏమని ఒప్పుకుంటావు అని అనుమానంగా అడుగుతుంది. నువ్వు అనుకున్నదే అని కన్ను గీటుతాడు. నువ్వు మాట్లాడే విధానం నాకు అస్సలు నచ్చలేదు.
అవునా నచ్చలేదా.. సరే అయితే ఎలా మాట్లాడితే నచ్చుతుంది. నాన్న, నాన్న తోటకెళ్దామా.. అన్నయ్య సైకిల్ ఎక్కి ఊరంతా బలాదూర్ తిరుగుదామా.. అని మాటలు నచ్చుతాయా ఏంటి అనే వేళాకోళం చేస్తాడు.
ఆ వేళాకోళానికి పళ్ళు నూరుతూ ఇప్పుడు నేను అవి అన్నానా అని అడుగుతుంది. నీ మైండ్లో రన్ అయ్యవి అవే కదా.. అందుకే అవి చెప్పాను అంటాడు.
మరి నాన్నతో తోటకి వెళ్లడం కాకుండా సరదాగా ఎంజాయ్ చేయడం కాకుండా ఇంకా ఏమీ ఉంటాయి.. మీలాగా మేము సిటీ కల్చర్ లో లేము కదా..
పబ్బులు, డిస్కోలు అంటూ తిరుగుతూ మందు, సిగరెట్ తాగడానికి అంటుంది. అమ్మని ఎంత మాట అన్నావే... నేను మందు, సిగరెట్ తాగుతాను అంటావా...నీకు ఇలా కాదే.. ట్రీట్మెంట్ సెపరేట్గా చేయాలి అంటాడు.
ఏయ్ మాటక ముందు ఏవే, ఏంటే అని మాట్లాడుతావ్ ఏంటి. మాటలు జాగ్రత్తగా రాని అని వేలు చూపిస్తూ మాట్లాడుతుంది.
నాకే వేలు చూపిస్తూ మాట్లాడతావా అని ఆ వేలుని గట్టిగా పట్టుకుంటాడు. అబ్బా వదలరా బాబు నా వేలు నొప్పిపేడుతుంది. ఎవరు నన్ను ఇంత గట్టిగా పట్టుకోలేదు అని అరుస్తుంది.
ఓ నువ్వు చిన్నపిల్లవు కదా అందుకే అందరూ నిన్ను చాలా స్మూత్ గా డీల్ చేసి ఉంటారు అని వెటకారాన్ని ఒక రేంజ్ లో చూపిస్తూ అడుగుతాడు.
ఆ మాటలకి రుద్రవైపు గుర్రుగా చూస్తూ నేనేమీ చిన్న పిల్లని కాదు. నేను క్యాంపస్ సెలక్షన్ లో సెలెక్ట్ అయ్యి ఇంటెన్షిప్ కి మీ ఆఫీస్ కి వచ్చాను అంటే నేను ఎంత టాలెంటో చూసుకో అని గొప్పగా చెబుతుంది.
ఆ మాటలకు పైనుంచి కిందకి ఎగాదిగా చూసి కాలేజ్ ఎవరిది మేడం అని అడుగుతాడు. మాదే అంటుంది. మరి మీ కాలేజీలో నువ్వు సెలెక్ట్ అవ్వకపోతే పక్కింటోళ్లు సెలెక్ట్ అవుతారా అనే అడుగుతాడు.
అంటే ఏంటి నీ ఉద్దేశం అని అనుమానంగా అడుగుతుంది. ఉద్దేశమూ లేదు వంకాయ లేదు. కాలేజ్ మీది కాబట్టి బ్యాక్ డోర్ నుంచి మా ఆఫీసులకు ఎంటర్ అయ్యావు అని చెప్పాడు.
ఇదిగో మాటలు మర్యాదగా రానివ్వు. నేను చేస్తే చేస్తానని ఒప్పుకుంటాను. రాకపోతే రాలేదు అని ఒప్పుకుంటాను. అంతేగానీ బ్యాక్ డోర్ నుంచి రావాల్సిన అవసరం నాకు లేదు.
అవునా అయితే ఒక చిన్న బెట్ వేసుకుందామా అని అడుగుతాడు. ఏం బెట్ అని అనుమానంగా చూస్తుంది.
నువ్వు మరీ అంత అనుమానంగా చూడకు. నీకు అంత సీన్ లేదులే.. నువ్వు ఇంకా చిన్న పిల్లవే అంటాడు.
ఇదిగో మాటకు ముందు ఒకసారి, మాట తర్వాత ఒకసారి చిన్న పిల్ల అనుకు. ఆ మాట వింటుంటే నాకు చాలా చిరాగ్గా ఉంది అంటుంది.
ఓ అవునా సరే అయితే నా బెట్ట విను ఇప్పటినుంచి కరెక్ట్ గా ఒక నెల రోజుల్లో నిన్ను నా లవ్ లో పడేస్తాను. నేనే నీకు మొగుడిని అవుతాను.
ఈ ఒప్పందం మనిద్దరి మధ్యనే ఉండాలి. లేదు కాదు అని ఎవరికైనా చెప్పిన, సలహా తీసుకున్నావు అంటే నువ్వు చిన్నపిల్లవని అర్థం.
ఆ మాటలకి శాంభవి ఉక్రోషంగా నేను ఎవరితోనో చెప్పను. అలాగే నీతో లవ్ లోనో పడను. నెల రోజుల తర్వాత నువ్వే ఓడిపోయి నా ముందు నుంచుంటావు అంటుంది.
ఆ మాటలకి నేను ఓడిపోవడమా... ఇప్పటివరకు నా లైఫ్ లో ఓటమి అన్నదే చూడలేదు. ఫస్ట్ టైం నువ్వు చూపిస్తాను అంటున్నావు.
చూద్దాం ఎవరు గెలుస్తారో అని కారు సడన్ బ్రేక్ వేస్తాడు. ఆ సడన్ బ్రేక్ కి ముందుకి తులిపడి గుద్దుకో పోతుంది. డాష్ బోర్డుకిని, శాంభవి తలకి మధ్యలో రుద్ర చెయ్యి అడ్డు పెడతాడు.
ఇప్పుడు అర్థమైందా నువ్వు చిన్నపిల్లవే అని. కార్ ఎక్కిన తర్వాత సీట్ బెల్టు పెట్టుకోవడం కూడా తెలియదు. ఆ అని అరుస్తూ నేను చిన్న పిల్లని కాదు అని గట్టిగా అంటుంది.
శాంభవి ఫ్రస్టేషన్కి చిన్నగా నవ్వుకుంటూ నువ్వు చిన్నపిల్లవు కాదు సరేనా అంటాడు. వెంటనే శాంభవి నవ్వుతూ చూసావా నువ్వే ఒప్పుకున్నావు అంటుంది.
దానికి ఇదే చిన్నపిల్ల చేష్టలు అంటే.. అని కారు దిగుతూ చెప్పాను కదా నువ్వు నాతో గాని, చినమామతో గాని రావాలి.
ఇంకా ఎవరితో కూడా కుదరదు. అవేమీ కాకుండా ఎవరితో అయినా వచ్చావు అంటే నువ్వు బెట్ లో ఓడిపోయినట్టే అని చెప్పి కారు దిగుతాడు.
శాంభవి కోపంగా కారు దిగి వీడి పెత్తనం ఏమిటి నామీద. అయినా సరే నన్ను నేను ప్రూఫ్ చేసుకోవాలి.. వీడిచేతే శాంభవి నువ్వు గ్రేట్ అని అనిపించుకోవాలి అని మిత్ర వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది.
క్యాబిన్ లోకి వెళ్ళిన రుద్ర కార్లో జరిగిన డిస్కషన్ గుర్తుకు వచ్చి శాంభవి ఎక్స్ప్రెషన్స్ తలుచుకుని నవ్వుకుంటూ ఉంటాడు.
బావమరదలు ముగ్గురు రుద్ర చుట్టూ చేరి సైలెంట్ గా చూస్తూ ఉంటారు. రుద్ర నవ్వుకుంటూ వాళ్లను చూసి ఏంట్రా నా మొఖంలో ఏమైనా కోతులాడుతున్నాయో అలా చూస్తున్నారు అని అడుగుతాడు.
దానికి విహాన్ అదేమీ లేదు బావ..నువ్వు వచ్చినప్పుడు నుంచి ఒకటే... నీలో నువ్వే నవ్వేసుకుంటున్నవి ఏంటా సంగతి అని చూస్తున్నాము అంతే...
సంగతి ఏంటో మాకు చెబితే మేము నవ్వుతాము కదా అని అడుగుతాడు. ఏముంటది ఏమీ లేదు కానీ..
మీ వర్క్ మీరు చేసుకోండి అని సీరియస్గా చెబుతాడు. వర్క్ ఎప్పుడైనా చేసుకోవచ్చుగానీ...నీ ఫేస్ లో అప్పుడప్పుడు కనపడే నవ్వు ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. విషయం ఏంటో చెప్పు బావ అని గెడ్డం దగ్గర చేయి పెట్టి అడుగుతాడు.
మా చెల్లి ఏమైనా స్వీట్ మెమోరీస్ ఇచ్చిందా బావ అని ధీరజ్ గారంగా అడుగుతాడు. వాళ్లను పైనుంచి కిందికి చూసి మీ చెల్లికి అంత సీన్ ఉందా అని రివర్స్ క్యూస్షన్ వేస్తాడు.
నీ నవ్వు కి అర్ధం ఏమిటి బావ. చెప్పు బావ. ఈ టెన్షన్ మేము తట్టుకోలేము అంటూ డ్రామాటిగ్గా గుండె పట్టుకుంటాడు.
ఒరేయ్ కుంచెం ఎక్కువ అవ్వలేదా అనగానే.... అందుకే చెప్పమంటున్నాను బావ చెప్పవా ప్లీజ్ అని ముగ్గురు మూడు పక్కల పట్టుకుంటారు.
హే.. ఆపండి రా బాబు చెబుతాను కుంచెం దూరం జరగండి అని... వాళ్ళ ముగ్గురి వంక చూస్తూ...
మీ చెల్లికి,. అని సాగతీస్తాడు. హ మా చెల్లికి అని ముగ్గురు టెన్షన్ గా అరవగా... అబ్బా అరవకండి రా అని ఒక వేలు తో చెవి లో తిప్పుతాడు.
నువ్వు లాగ్ చేయకు బావ. టెన్షన్ తో సచ్చిపోతున్నాము. చెప్పిన సచ్చిపోతారు... పరవాలేదు తెలిసాక సచ్చిపోతే ఆ ఫీల్ వేరుబ్బ.. చెప్పు బావ
సరిలే ఇంక వెయిట్ చేయిపించను. మీ చెల్లిని వన్ మంత్ లో లవ్ లో పడేస్తాను అని చెప్పాను అని కూల్ గా చెబుతాడు.
ఏమిటి అని గట్టిగ అరుస్తారు. అబ్బా ఏమిట్రా ఆ. అరుపులు.. మీ చెల్లి కూడ ఇలానే అరిచింది. అందరూ ఓకే కాలేజ్ నుంచి వచ్చినట్టు ఉన్నారు అనగానే..
నువ్వు ఇచ్చే షాక్ అలా ఉంటుంది. మా చెల్లి ఏమన్నది రా బావ అని ధీరజ్ అడుగుతాడు. సేమ్ పాట...మా నాన్నకి చెబుతా. మా అన్నయ్యలకు చెబుతా అని.
మరి ఫోన్ చేసేసిందా...చెప్పేసిందా అని ఆత్రంగా అడుగుతాడు. ఒరేయ్ నీ ఆత్రం తగలెయ్య... అలా చెప్పనిస్తే నేను రుద్రాన్ని ఎందుకు అవుతాను.
మీ చెల్లిని ఎలా లాక్ చేయాలో అలాగే లాక్ చేశాను.రోజు నాతోనే ఆఫీస్ కి వస్తుంది. ఇంటికి వెళుతుంది అని పొగరుగా చెబుతాడు .
హ్మ్.. నువ్వు ఏమైనా చేయగల సమర్థుడువులే బావ. ఇంతకీ నిషా ఆశాల పని ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు.
దానికి ముహూర్తం పెట్టేసాను. ఈ రాత్రి నుంచి వాళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తున్నావ్ బావ అంటే.. చెప్పను చూడండి అని... నాకు వర్క్ ఉంది మీరు ఇంకా దయచేయండి అంటాడు.
నువ్వు ఎప్పుడు చెప్పావని పదండి రా అని ఎవరి కేబిన్లోకి వాళ్ళు వెళ్లిపోతారు.
ఆశా నిషా అని మయూరి గట్టిగా పిలుస్తుంది.
ఆ వస్తున్నామని ఇద్దరూ ఎదురుగుండా వచ్చి ఏమైంది అని అడుగుతారు.
మయూరి ఏమని చెబుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)