31-03-2026, 07:50 AM
Part - 9
ఈ మంత్ శాలరీ ముందు ఏమైనా ఇవ్వగలరా సార్.. ఏరా అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్లాల.
అవును కొన్ని ఎక్స్ట్రా టెస్టులు రాశారు. అవి చేయించాలి . సరే నేను అరేంజ్ చేస్తాను. థాంక్యూ సార్. అమ్మ విశిష్ట.. చెప్పండి సార్..
అన్నయ్య అని పిలవచ్చు కదరా అంటే వద్దు సార్ బంధాలు మనుషుల్ని ఎప్పుడూ మోసం చేస్తాయి. నాకు ఇలా ఉంటేనే బాగుంది.
తప్పుగా అనుకోవద్దు. చచ్చా.. నిన్ను తప్పుగా అనుకోవడమేంటిరా.. ఒక్క పది నిమిషాలు వెయిట్ చెయ్ నేను ప్రాసెస్ కంప్లీట్ చేసి నీకు శాలరీ అరేంజ్ చేస్తాను.
సరే అని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. టెన్ మినిట్స్ లో మేనేజర్ వచ్చే శాలరీ ఇచ్చి ఎక్స్ట్రా అమౌంట్ కావాలంటే చెప్పరా..
నేను ఇస్తాను. నెక్స్ట్ మంత్ చూసుకుందాంలే. ఊరికినే కాదు. అవసరం అయితే నేను అడిగే ఫస్ట్ పర్సన్ మీరే సార్ థాంక్యు అని బయటికి వస్తుంది.
వెళుతున్న విశిష్టాని చూస్తూ ఈ రోజుల్లో ఇంత ఆత్మ అభిమానం ఉంటే బతకలేరు. ఎలా నెట్టుకొస్తావో ఏంటో అనుకుంటూ చూస్తూ ఉంటాడు.
ఇంటికి వెళ్ళిన విశిష్ట లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళుతుంది. అది సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్. ఒక పక్కగా చిన్న కిచెన్, ఒక బెడ్ రూమ్ వాష్ రూమ్ మాత్రమే ఉంటాయి .
విశిష్ట ఫాదర్ చనిపోయిన తర్వాత విశిష్ట మదర్ అయినా భానుమతి డీప్ షాక్లోకి వెళ్లిపోతారు. ఎంతసేపు ఆమె భర్త బ్రతికున్నారు అన్న ఊహలోనే ఉండిపోతారు.
ఏమండీ ఏవండీ అని కలవరిస్తూ బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే విశిష్ట కాలేజీ కి వెళ్లే ముందు భానుమతికి జాగ్రత్తలు చెప్పి బయటే లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది.
విశిష్ట రాగానే భానుమతి వచ్చావా.. రా భోజనం చేద్దువు గానీ. నువ్వు తిన్నావా అమ్మ. మీ నాన్నగారు ఇంకా రాలేదు రా..
నేను ఎదురు చూస్తున్నాను. వచ్చాక ఇద్దరం కలిసి తింటాము. అయ్యో చెప్పడం మర్చిపోయానమ్మా. నాన్నగారు ఫోన్ చేశారు.
పొలానికి సంబంధించి ఎరువులు కావాలంట. సిటీకి వెళ్తున్నాను. ఈ రాత్రికి రావడం అవదు. అమ్మ నువ్వు జాగ్రత్త అని చెప్పారు.
అవునా.. సరేలే పొలం కన్నా ముఖ్యమైనది ఏముంటుంది. అక్కడ భోంచేసారో లేదో ఒకసారి ఫోన్ చెయ్ తల్లి.
చేశానమ్మ భోజనం చేసారు. పడుకున్నారు. ఈసారి ఫోన్ చేసినప్పుడు నాకు ఇవ్వు. వచ్చేటప్పుడు బంగారపు కొట్టుకు వెళ్లి నగలు తెమ్మని చెప్పాలి.
సరే అమ్మ అని తల్లి వైపు వచ్చే ఏడుపు ఆపుకుంటూ చూస్తోంది. ఇద్దరూ భోజనం చేసి పడుకుంటారు.
ఉదయం విశిష్ట లేచేటప్పటికీ భానుమతి లేచి ముగ్గు పెట్టి తులసి కోటకి పూజ చేసి వంట చేస్తూ ఉంటారు. ఎప్పుడు లేచావమ్మా అన్ని పనులు అయిపోతున్నాయి.
మీ నాన్నగారు వస్తారేమో అని రాత్రంతా నిద్ర పట్టలేదు విశి. అందుకే తొందరగానే లేచాను. నీకు కాలేజ్ టైం అవుతుంది కదా...
స్నానం చేసి రా... టిఫిన్ చల్లారిపోతుంది . ఇప్పుడే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను. స్నానం చేసి దేవుడి ముందు నిలబడి కుంకం పెట్టుకుని..
భగవంతుడా సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు. అమ్మ ఎప్పుడూ నాతో ఉండేలాగా చూడు. నాకు ఈ ప్రపంచంలో మిగిలిన బంధం ఏదైనా ఉంది అంటే అది అమ్మ మాత్రమే.
దండం పెట్టుకొని తల్లి దగ్గరికి వెళుతుంది. రా కూర్చో నేను తినిపిస్తాను అని కొసరి కొసరి తినిపిస్తారు. చాలా మా అన్న సరే ఏం చాలు.
ఇప్పుడు తిని మళ్లీ సాయంత్రం కాలేజీ అయ్యే వరకు తినడం లేదు. అన్ని కాలేజీలు అయిదింటికి అయిపోతే.. మీ కాలేజ్ వాళ్ళు మాత్రం లేటుగా పంపిస్తున్నారు.
నువ్వు తొమ్మిదింటి దాకా రావడం లేదు. స్పెషల్ క్లాసులు అమ్మ. ఫైనల్ ఇయర్ కదా అందుకని.. ఏం క్లాసులో ఏమో.. వచ్చేటప్పటికి తోటకూర కాడలాగా వాడిపోతున్నావు.
పెళ్లి కావలసిన దానివి నీకెందుకే ఈ చదువులు. ఇంకొకసారి పెళ్లి అన్నావంటే ఊరుకోను. నేను బాగా చదువుకుని నాన్నగారి పేరు నిలబెట్టాలి.
ఇదంతా మీ నాన్నగారు చేస్తున్న గారాబమే. రాని ఇంటికి.. ముందు మీ నాన్నగారితో చెప్పిస్తే అప్పుడు నువ్వు లైన్లోకి వస్తావు.
సరే అమ్మ నేను కాలేజ్ కి వెళుతున్నాను. నువ్వు అసలు బయటికి రావద్దు. నాన్నగారు గాని, నేను గాని వచ్చాకే లాక్ తీస్తాము.
అప్పుడు దాకా లోపలే ఉండు. ఒకటికి 100 జాగ్రత్తలు చెప్పి బయట లాక్ చేసుకుని బాధగా ఫ్లాట్ వైపు చూస్తూ ఇంకా ఎన్నిరోజులు అమ్మ మనకి బాధ అనుకుంటూ ఆ కాలేజీకి బయలుదేరుతుంది.
కాలేజీకి వెళ్లిన విశి డల్ గా ఉంటే... భవ్య ఏమైంది అలాగ ఉన్నావు. అమ్మ గురించా.. నాకు ఈ ప్రపంచంలో ఉన్న బంధం అమ్మ మాత్రమే.
కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళగానే అమ్మతో ఆరోజు జరిగినవన్నీ చెప్పుకుని ఒళ్లో పడుకోవాలిని ఉంది. కానీ అమ్మనే ఒక చంటి బిడ్డ లాగా చూసుకోవాల్సి వస్తుంది. అలసిపోతున్నాను భవ్య.
భవ్య బాధగా విశిష్ట చేతిని పట్టుకుంటుంది. వెంటనే విశిష్ట సర్దుకుని.. ఐయామ్ ఓకే. ఎందుకో కొంచెం రిలాక్స్ కావాలి. నా అన్న మనిషితో నా బాధ చెప్పుకోవాలి అనిపిస్తుంది.
గౌతమ్ కి కాల్ చేయకపోయావా . గౌతమ్ తో ఎందుకో ఇలాంటివి నేను మాట్లాడలేను. ఎంతసేపు ప్రొఫెషనల్ గా మాట్లాడుతాడు తప్ప మిగిలిన విషయాలు గురించి మాట్లాడడు.
అలాంటప్పుడు నేను ఏమి చెప్పగలను. అర్థం చేసుకో విశి గౌతమ్ ఓన్లీ నీ టాలెంట్ ని యూస్ చేసుకుంటున్నాడు. బయట అయితే ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి అని నిన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తున్నాడు.
లేదు.. గౌతమ్ ఒక బిజినెస్ మ్యాన్ అందుకే ప్రొఫెషనల్ గా ఉంటున్నాడు. మిగిలిన టైం ఖాళీ ఉండదు కదా.. నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా వాడుకుంటారు విశి.
ఎలా చెబితే నీకు అర్థం అవుతుందో నాకు తెలియడం లేదు అని మనసులో అనుకుంటుంది
ప్లీజ్ భగవంతుడా దీనికి సూట్ అయ్యే అసలు హీరోని తొందరగా తీసుకువచ్చి దాని జీవితంలోనికి ఎంటర్ చెయ్.
నీ గుడికి వచ్చి 108 కొబ్బరికాయలు కొడతాను.
నిద్రలో ఉన్న సూర్యకి ఒకటే పొలమారుతూ ఉంటుంది. లేచి మంచినీళ్లు తాగి కాసేపటికి స్థిమితపడతాడు. చైను పట్టుకుని ఏమైంది క్యూటి..
నా గురించి ఆలోచిస్తున్నావా.. ఎప్పుడులేనిది ఈరోజు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను. చాలా అనేసిగా అనిపిస్తుంది.
వెంటనే ఇండియా వచ్చేయాలి అనిపిస్తుంది. ఈ దూరం తగ్గి దగ్గరతనం కావాలి. మన మధ్యన ఉన్న బంధం ఏమిటో తెలుసుకోవాలి అని ఇంక పడుకోకుండా ఉంగరం చూస్తూనే ఉంటాడు.
ఆ రాత్రి కరిగి తెల్లారుతుంది. శ్రీకర్ సూర్య దగ్గరికి వచ్చి ఏంటి బావ.. రాత్రంతా పడుకోకుండా నీ క్యూటీతో మాట్లాడుతూనే ఉన్నావా...
సూర్య మౌనంగా ఉంటాడు. ఏమైంది బావ.. ఏమో తెలియదు. క్యూటి ఇబ్బందుల్లో ఉంది. సంథింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనిపిస్తుంది.
మనం వెంటనే ఇండియా వెళ్ళిపోవాలి. ఇంకా పది రోజులు ఉంది కదా బావ. లేదు ఇమీడియట్ గా వర్క్ ఫినిష్ చేసి బయలుదేరదాం. నేనింకా ఇక్కడ ఉండలేకపోతున్నాను.
సరే మాక్సిమం కంప్లీట్ చేద్దామని చెప్పి.. ఆరోజు తొందరగా ఆఫీసుకు వెళ్లిపోతారు. సూర్య ఎంప్లాయిస్ ని పరుగులు పెట్టిస్తాడు.
వాళ్లు కోరుకున్నట్టుగానే పది రోజులు వర్క్ ని ఐదు రోజుల్లో ఫినిష్ చేసి ఇండియా ఫ్లైట్ ఎక్కుతారు.
ఫ్లైట్ ఎక్కిన సూర్య మనసు మాత్రం ఒక పక్కన సంతోషంగా... మరోపక్కన గందరగోళంగా ఉంటుంది. ఎందుకు నా మనసు నన్ను పదే పదే హెచ్చరిస్తుంది.
ఏం జరుగుతుంది.. ఇంట్లో ఎవరికైనా ఇబ్బందా అని ఆలోచిస్తాడు. లేదు అక్కడ అంతా బానే ఉన్నారు.
అందరికీ ఫుల్ సెక్యూరిటీ ఉంది.
నాన్న హ్యాండిల్ చేస్తున్నారు. ఇంకా ఎవరి గురించి ఆలోచించాలి. క్యూటి నా... క్యూటి ఎలా ఉన్నావు? నీ రూపం ఎలా ఉంటుందో తెలియదు. నేను ఎలా పట్టుకోవాలి.
నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నీ దరికి చేరుకుంటాను. ఒక్కసారి నువ్వు క్షేమంగా ఉన్నావు అని తెలిస్తే చాలు. నా మనసు కుదుటపడుతుంది.
విశిష్ట కాలేజ్ అయిన తర్వాత రెస్టారెంట్ వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళుతుంది. కూతురు కోసమే ఎదురుచూస్తున్న బానుమతి వచ్చావా.. ఇంకా మీ నాన్నగారు రాలేదు.
మనిద్దరి దగ్గర ఉంది ఒకే ఫోన్ కదమ్మా.. నాకు చేశారు.. ఆ ఎరువులు స్టాక్ అయిపోయినాయి అంట. అక్కడే వెయిట్ చేస్తేనే దొరుకుతాయి అంట.
అందుకనే ఉండిపోయారు. అవునా.. అమ్మ నాకు కొంచెం వర్క్ ఉంది. డిస్టర్బ్ చెయ్యొద్దు అని గౌతమ్ ఇచ్చిన ప్రాజెక్టు చూస్తూ ఉంటుంది.
భానుమతి గారు అన్నం కలిపి తీసుకు వస్తారు. నోరు తెరువు. అమ్మ వర్క్ లో ఉన్నాను. నీ పని నువ్వు చేసుకో. నేను తినిపిస్తాను.
ఒక పని చెయ్ నాకు తినిపిస్తూ నువ్వు తినేయ్. ఇద్దరి భోజనం ఒకేసారి అయిపోతుంది.. సరే అని కూతురికి తినిపిస్తూ భానుమతి కూడా తినేస్తోంది.
భోజనం అయిన తర్వాత వంటిల్లు క్లీన్ చేసి చేతులు తుడుచుకుంటూ వస్తారు. ఏరా పడుకోవా.. కొద్దిగా వర్క్ ఉంది అమ్మ.
నువ్వు పడుకో పొద్దున్నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు కదా.. అలసిపోయి ఉంటావు. సరే అని భానుమతి గదిలోకి వెళ్లి భర్త ఫోటోను చూస్తూ ఇంకా ఎన్ని రోజులకి వస్తారండి.
ఇప్పటికే ఎరువులు కోసం వెళ్లి చాలా రోజులైంది.
అమ్మాయి, నేను ఉంటున్నాము. ఆడవాళ్ళు ఇద్దరే ఉంటే ఎంత ఇబ్బందో తెలుసా...
తొందరగా వచ్చేయండి అని భర్తతో కబుర్లు చెబుతూ మాత్రలు వేసుకోవడం వల్ల మత్తుగా నిద్రపోతుంది.
తల్లి పడుకోవడం చూసి ఒక నిట్టూర్పు విడిచి మళ్ళీ ప్రాజెక్ట్ చూస్తూ ఉంటుంది.
సాటిస్ఫాక్షన్ గా వర్క్ చేసాను అనుకున్నాక టైం చూస్తుంది. అమ్మో అప్పుడే టైం ఒంటిగంట దాటిందా... అన్ని సర్ది వర్క్ మొత్తం గౌతమ్ కి ఫార్వర్డ్ చేసి పడుకుంటుంది.
సూర్య ప్రయాణం...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)