Today, 06:58 AM
Part - 37
అందరి సంతోషాలు మధ్యన ఆ రోజంతా తొందరగా గడిచిపోతుంది ఇంకా శివ గారు వాళ్ళు బయలుదేరుతాము అనగానే... రుద్ర రాఘవేంద్ర కి సైగ చేస్తాడు.
రాఘవేంద్ర, రామచంద్రయ్య గారితో మీతో ఒక్క విషయం మాట్లాడాలి అని ఆపుతాడు. చెప్పండి అనగానే...
మీకు అభ్యంతరం లేకపోతే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా శాంభవిని ఇక్కడ ఉంచుతారా అని అడుగుతారు .
ఎందుకు అని అడగగానే ఆడపిల్లలు లేని ఇల్లు కళగానే ఉండదు. శాంభవి వచ్చిన తర్వాత మా ఇల్లు కొంచెం కళకళలాడుతూ ఉంది.
మీకు అభ్యంతరం లేకపోతేనే... విష్ణు కి కూడా ఉంటుంది కదా..మేనకోడల్ని ఇంట్లో ఉంచుకోవాలి అని.. మా పిల్లలు ఎవరో ఒకరు పెళ్లిళ్లు అయితే వచ్చే అమ్మాయి లో అన్ని చూసుకోవచ్చు అనుకుంటే...
వీళ్ళేమో అప్పుడే పెళ్లిళ్లు చేసుకోము అని పోస్ట్పోన్ చేస్తున్నారు. ఏమంటారు రామచంద్రయ్య గారు అని అడుగుతారు.
దానికి రామచంద్రయ్య గారు మొహమాటం పడుతూ.. ఇప్పటికే మీకు చాలా పని పెట్టేసాను. అమ్మాయిని ఇక్కడ అంటే... మీరు ఇబ్బంది పడిపోతారు.
దానికి రాఘవేంద్ర గారు నవ్వుతూ మేమేమైనా అమ్మాయిని ఎత్తుకొని ఆడించాలా లేకపోతే కూర్చోబెట్టి చదివించాలా... తనతో మాట్లాడుతూ ఏదో తెలియని ప్రశాంతత వస్తుంది.
కొన్ని రోజులైనా సంతోషంగా ఉన్నట్టు ఉంటుందని ఇంత ఇదిగా అడుగుతున్నాము అని ఇబ్బంది పెడతారు. ఇక ఆయన మాట కాదనలేక సరే.
కాకపోతే అమ్మాయితో పాటు అమ్మాయి ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళ బాధ్యత కూడా మాదే అని చెబుతారు.
దానికి ఎందుకండి అంత మొహమాట పడతారు. వాళ్ళిద్దరూ కూడా ఇక్కడే ఉంటారు. ఆఫీస్ నుంచి వస్తూ ఇటు వచ్చేయమంటే సరిపోతుంది కదా అని కోడలిని పిలిచి వాళ్ళిద్దరికీ కావాల్సినవి కూడా చూడమని చెబుతారు.
అలాగే మావయ్య గారు అని సంతోషంతో వెళ్లి శాంభవి ని హద్దుకుంటుంది. ఏమైంది ఆంటీ అనగానే ఈరోజు నుంచి నువ్వు ఇక్కడే ఉంటున్నావ్ తెలుసా....
ఆ మాట వినగానే చాలా సంతోషంగా అనిపించింది నీకు ఏమేమి ఇష్టమో లిస్ట్ ఇచ్చేసేయ్. నేనే వండుతాను అని చాలా సంతోషంగా చెబుతారు.
అన్ని నువ్వే చేసేస్తే నేనేం చేయాలి వదిన. సరే అయితే నేనైతే షాపింగ్ చేస్తాను. తనకు ఫుల్లుగా అన్ని మ్యాచింగ్ సెట్స్ రెడీ చేస్తాను అని చెబుతుంది.
హైదరాబాదులో మనకు తెలియని షాప్ ఏ లేదు. జీన్స్ దగ్గర్నుంచి సారీస్, స్కట్స్ అన్ని కొనేద్దామని చెబుతోంది.
అయ్యో ఆంటీ నేను జీన్స్ వేయను. ఓన్లీ చుడీదార్స్ లేకపోతే ఆఫ్ సారీస్ అని చెబుతోంది. వాటిలోనే డిజైన్స్ తెచ్చేసుకుందాము.
మనము ఇంటి ఆడపడుచులము. అస్సలు ఎక్కడ తగ్గకూడదు. తగ్గేదేలే అని చెబుతారు. వీళ్ళందరూ ఇలా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే చూస్తున్న మగవాళ్ళకి చాలా సంతోషంగా అనిపిస్తుంది.
ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపు అందరూ శాంభవికి దగ్గర అవ్వాలి అని ఫిక్స్ అయిపోతారు. విష్ణు కి ఇష్టం లేకపోయినా.. పెద్దాయన మాటిచ్చారు అని చెప్పి ఏమీ మాట్లాడరు. ఇంటికెళ్లక నివాస్ కి గట్టిగా చెప్పాలి. బావగారు తో కూడా మాట్లాడాలి అనుకుంటారు.
అందరూ మధ్యాహ్నం భోంచేసిన తర్వాత శాంభవి ని అక్కడే ఉంచేసి వీళ్లు విష్ణు గారి ఇంటికి వెళ్లిపోతారు. రుద్ర హమ్మయ్య ఇప్పుడు టైం దొరికింది నా పిల్ల కి లైన్ వేసుకోవాలి. లైన్లో పెట్టాలి.
చాలా పనులు ఉన్నాయి నువ్వు వందల కోట్లు ప్రాజెక్ట్ ప్రాఫిట్ వచ్చినా సరే ఈ టెన్షన్,సంతోషం ముందు అన్ని చిన్నవిగానే కనపడుతున్నాయి.
ఆ నిషా,ఆశ వద్దు అన్న సరే మీద పడిపోతారు. దీనికి ఏమో ఎలాగా చెప్పినా అర్థం కాదు. ఎందుకు శివయ్య నన్ను ఎంత ఇరగటం లో పడేసావు అని పైకి చూస్తూ ఉంటాడు.
బావమరుదులు ముగ్గురు పక్కనే వచ్చి కూర్చుని ఏంటి బావ మా చెల్లిని ఎలా లైన్లో పెట్టాలో తెలియక భగవంతుడికి రికమండేషన్ లెటర్ పెడుతున్నావా అని వెటకారాలు ఆడతారు.
నా రికమండేషన్ సంగతి పక్కన పెట్టండి ముందు మీ రికమండేషన్ సంగతి చూసుకోండి. ముగ్గురికి ముగ్గురు ఉన్నారు.
అన్నయ్య అని పిలిపించుకోలేకపోతున్నారు.మళ్ళీ నాకు సెటైర్లు వేస్తున్నారు అని తిరిగి కౌంటర్ వేస్తాడు. దానికి ధీరజ్,, అన్నయ్య అని ఏముందిలే బావ.
ఈరోజు కాకపోతే రేపైనా మా చెల్లి పిలుస్తుంది. కాకపోతే మేమెరబుల్స్ మీకు కావాలి కదా... ఎలాగైనా పెళ్లి చేసేసుకుంటావు కానీ....
పెళ్ళికి ముందు మీకు ఏవో చిలిపి కోరికలు ఉంటాయి కదా.. వాటి సంగతి చెబుతున్నము అంతే కదా విహాన్ అని వాళ్ళిద్దరు వైపు చూసి కన్ను కొడతాడు.
అంతే అంతే అని ఇద్దరు నవ్వుతారు. నా తిప్పలు నేను పడతాను గాని ముందు వెళ్లి మీ చెల్లిని ఆ లేడీస్ ఇద్దరు దగ్గర నుంచి బయటికి లాక్కు రండి.
లేకపోతే ఒకళ్ళు వంటలు, ఇంకొకళ్ళు షాపింగ్ అని దాని బుర్రని హీట్ ఎక్కించేస్తారు. అసలే ఆ బుర్రలో గుజ్జు తక్కువ.
ఆ వేడికి ఆవిరి అయిపోయిందే అనుకో ఇక మనం ఏం చెప్పినా అర్థం అవ్వదు అని అంటాడు. ఖాళీగా ఉంటే అప్పుడు మనం ఫిల్ చేసుకోవచ్చు ఏమో బావ అని అద్వైత్ అమాయకంగా అడుగుతాడు.
ఏమి ఫీల్ చేస్తావురా అని డౌట్ గా మిగిలిన ముగ్గురు అడుగుతారు. అదే మనకు ఎలా కావాలంటే అలాగా ఫీల్ చేసుకోవచ్చు కదా అని చెబుతున్నాను.
ఒరేయ్ నువ్వు దానికి అన్నయ్య అనిపించుకున్నారు రా.. అని రెండు చేతులతో రుద్ర దండం పెడతాడు. పో బావ నువ్వు అలా పొగుడుతుంటే నాకు సిగ్గేస్తుంది అని మెలికలు తిరుగుతాడు.
ఎక్కువ సిగ్గుపడకరోయ్ ఆ మెలికలు మేము చూడలేక చచ్చిపోతున్నాము అని. తీసుకెళ్లి తాత గారి దగ్గర కూర్చోబెట్టు.
శాంభవితో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని ఎదురు చూస్తున్నారు అని చెప్పి పంపిస్తాడు. అద్వైత్ కౌసల్య దగ్గరికి వెళ్లి ఏంటి మీ ముగ్గురు లేడీస్ మీటింగ్..
నాకు చెప్పొచ్చు కదా అని వాళ్ళ పక్కన కూర్చుంటాడు. ఆడవాళ్ళు విషయాలు నీకెందుకురా పోరా ఇక్కడి నుంచి అని ఇద్దరు ఒక్కసారి అంటారు.
ఎందుకలా మీద పడిపోతున్నారు. నేను ఏదో క్యాజువల్ గా అడిగితే.. అలా నా మీద సీరియస్ అయిపోతున్నారు. చూడు శాంభవి అస్సలు వీళ్ళిద్దరి మాట వినకు.
నీకు ఏం కావాల్సిన నాకు ఆర్డర్ వేయి. నీకు చిటికలో నేను తెచ్చి పెడతాను అని చెబుతాడు. దానికి శాంభవి నవ్వుతూ చూస్తుంది.
అబ్బో వీడికి అన్నీ తెలిసినట్టు. మీవే మీకు షాపింగ్ చేసుకోవడం రాదు. ఇంకా శాంభవికి తెస్తారా.. వెళ్లి చంప పిన్నిసులు తెచ్చి పెట్టండిరా...మంచి డిజైన్స్ వి కావాలి అని చెబుతుంది.
వాట్ వాట్ ఏంటది అని నోరు తిరక్క మళ్ళీ అడుగుతాడు. అర్థమైందా ఆడవాళ్ళకి కావాల్సినవన్నీ మీకు తెలియదు. చెబితే తెలుస్తుంది అంట పోరా అని చారులత గారు వెటకారంగా అంటారు.
అత్త ఇది టూ మచ్. మా చెల్లి ముందు నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు. ఇలాగే చేసేవనుకో నీ కూతుళ్లు వచ్చినప్పుడు కూడా నీ కొడుకుని ఇలాగే అవమానిస్తాం ఖబర్దార్ అనగానే..
చారు ఒక ఐబ్రో పైకి లేపి చూస్తుంది. ఏంటి అత్తయ్య అలా చూస్తున్నావ్ అంటే.. నువ్వు ఏదేదో ప్రగల్భాలు పలుకుతున్నావు కదా అందుకే చూస్తున్నాను.
మీరు ముగ్గురు కలిసి నా కొడుకు ఒక్కడికే సమాధానం చెప్పలేకపోతున్నారు గాని... రేపు వచ్చే నా కూతుర్లు ముందు అంటారట.
అది మేము నమ్మాలి. జోక్ వేసిన ఇప్పుడు నవ్వే మూడు లేదు కానీ.. తర్వాత వెయ్యి అని చెప్పి మళ్ళీ మాటల్లో పడిపోతారు.
సరే మీరు మాట్లాడుకోండి కానీ.. శాంభవి నిన్ను తాతయ్య గారి పిలుస్తున్నారు రా అని చెప్పి తీసుకెళ్లిపోతాడు.
ఒరేయ్ నేను తీసుకెళ్తానులే నాన్నగారి దగ్గరికి అని చెప్పి చారులత కూడా బయలుదేరుతుంది.
కౌసల్య సాయంత్రానికని టీ స్నాక్స్ ప్రిపేర్ చేయించడానికి కిచెన్ లోకి వెళ్తారు. శాంభవిని రాఘవేంద్ర గారి గది దగ్గరికి తీసుకెళ్లి తాతగారు అని పిలుస్తాడు.
రా అద్వైత్ అనగానే శాంభవి వచ్చింది అంటే.. అంత సేపు బయట నుంచో పెట్టావ్ ఏంటి అమ్మాయిని లోపలకి తీసుకురా అని చెబుతారు.
శాంభవి వెళ్లి రాఘవేంద్ర గారి పక్కన కూర్చుంటుంది. శాంభవి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుని బంగారు తల్లివి అమ్మ నువ్వు అని మురిసిపోతూ ఉంటారు.
శాంభవి నవ్వుతు చూస్తూ ఉంటే మీకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అనుకుంటూ కదా తాతయ్య అని సారీ తాతగారు అంటుంది.
నువ్వు తాతయ్య అని పిలువు పర్వాలేదు. ఆ పిలుపే బాగుంది అని చెబుతారు. అందరు మిమ్మల్ని మర్యాదగా పిలుస్తూ ఉంటే నేను తాతయ్య అని ఎలా పిలవగలను అని అంటుంది.
వాళ్ళు పిలవాలి తప్పదు. మగ పిల్లలు కదా... క్రమశిక్షణ లేదు అనుకో ఇంకా కోతుల్లాగా తయారవుతారు. ఈ ఇంటిమహాలక్ష్మి వి నువ్వు.
ఎవరిని ఎలా పిలిచినా సరే అందరికీ సమ్మతమే తల్లి అని బుగ్గల పట్టుకుని లాగుతారు. రాఘవేంద్ర గారి చిన్న పిల్లోడి లాగా మారిపోయి శాంభవి ముందు చాలా సరదాగా ఉంటారు.
మెల్లిగా అక్కడికి దేవేంద్ర, జితేంద్ర, సంతోష్, రమణ కూడా చేరుతారు. అందరూ వాళ్ళ వయసును మర్చిపోయి శాంభవి తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
వీళ్ళని ఇలా చూసిన కుర్ర బ్యాచ్ మాత్రం చూసావా బావ ఎప్పుడైనా మనతో ఇలా ఉన్నారా... రూల్స్ మాట్లాడేవారు మనవరాలు వచ్చేటప్పటికి అన్ని రూల్స్ ని వీళ్ళే బ్రేక్ చేసేస్తున్నారు.
దీన్ని మనం ఎలాగైనా ఖండించాలి అని ధీరజ్ మంగమ్మ శబదం చేస్తాడు. ధీరజ్ డిప్ప మీద ఒకటి పీకి ముందు పద.
మనం కూడా వెళ్లి జాయిన్ అవుదామని రుద్ర ముందుకు నడుస్తాడు. మరదలు దగ్గరికి వెళ్ళడానికి ఎంత ఆత్రం. ఒక్కడే వెళితే అందరూ ఏడిపిస్తారని.. తోకలలాగా మనల్ని తగిలించుకొని వెళ్తున్నాడు.
లేకపోతే ఎప్పుడో మన ముగ్గురిని బయటికి గెంటేసేవాడు అని గుసగుసగా వాళ్ళిద్దరూ చెవుల్లో చెబుతూ ఉంటాడు. ఏంట్రా మీ ముగ్గురు గుసగుసలు వస్తున్నారా లేదా అని అడుగుతాడు.
వస్తున్నాము. రాక చస్తామా అయినా నీ గురించి కాదులే మా చెల్లి తో టైం స్పెండ్ చేయాలని వస్తున్నాము అని చెప్పి రుద్రని ఒక చూపు చూసి గదిలోకి వెళతారు .
ఇప్పుడు రుద్ర రియాక్షన్ ఏమిటి...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)