Yesterday, 10:47 AM
Part - 36
చారులత మాటలకి అనసూయ గారు బాధగా చూస్తూ అంటే ఏంటి చారు నేను నా మనవరాలుకి హాని తలపెడతానని చెబుతున్నావా అంటే..
మరి ఇదంతా నువ్వు చేసింది కాదా అమ్మ. మన ఇంట్లో అల్లారుముద్దుగా పెరగవలసిన ఆడపిల్ల..వేరే వాళ్ళ ఇంటి దీపమై వెలుగుతుంది.
ఒక్కగాన ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి..అసలు ఈరోజు మన ఇల్లు కళాకాంతులు లేకుండా పోవడానికి కారణం ఎవరు నువ్వు కాదా అని కోపంగా అడుగుతుంది.
దానికి అనసూయ గారి బాధగా మంచం మీద కూర్చుని నిజమే.. ఆ రోజు మయూరి, నాగేంద్ర మాయలో పడి నా కొడుకు జీవితాన్ని నేనే నాశనం చేశాను.
అందుకు శిక్ష ఇన్ని సంవత్సరాలుగా అనుభవిస్తూనే ఉన్నాను. నాలోని మార్పు మీకు ఎవరికీ కనిపించడం లేదా అని బాధపడతారు.
నువ్వు మారాను అని అంటున్నావు కానీ అమ్మ...దేవేంద్ర అన్నయ్య జీవితాన్ని వెనక్కి తీసుకురాగలవా.. పోయిన అన్నయ్య సంతోషం మల్ల వస్తుందా చెప్పు అని అడుగుతుంది.
కొన్ని తప్పులు కి క్షమాపణ ఉండదమ్మా. నువ్వు తల్లివి కాబట్టి మేము ఇలాగైనా మాట్లాడుతున్నాము. అదే బయట మనిషివి అయ్యుంటే గనక ఈపాటికి నీ పరిస్థితి ఏంటో అన్నది నువ్వే అర్థం చేసుకో.
నీతో ఇలా మాట్లాడే ఒక రోజు వస్తదని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు అమ్మ. ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు మారితే మంచిది. లేదు అప్పటిలాగానే ముసుగు వేసుకొని శాంభవికి ఏదైనా హాని తలపెట్టావంటే మాత్రం నా చేతులతో నేనే చంపేస్తాను నిన్ను అని కోపంగా వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోతున్న కూతురు వైపు బాధగా చూస్తూ ఒకప్పుడు నేను ఏది చెప్పితే అదే వినేదానివి. కానీ ఈరోజు నా పిల్లల అసహ్యాన్ని చూడాల్సి వస్తుంది. ఇదంతా నా చేతులారా నేను చేసుకుందే కదా అని బాధపడుతుంది.
వీళ్ళందరూ పడుకున్న తర్వాత రుద్రా కుర్ర బ్యాచ్ అందరిని మీటింగ్ రూమ్ లోకి పిలుస్తాడు. ఈ టైం లో బావ ఎందుకు పిలిచాడా అని మిగిలిన ముగ్గురు కూడా వెళ్లి ఏమైంది బావ అని అడిగితే...
కూర్చోండి అని ఇప్పుడు నుండి శాంభవి కే కాదు రేపల్లెలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కూడా టైట్ సెక్యూరిటీని పెట్టాలి అని చెబుతాడు.
దేనికి అని అయోమయంగా అడిగితే మయూరి అని చెబుతాడు. అంటే అని ధీరజ్ అడిగితే... మయూరీకి ఇక్కడ హోమం జరిగిన విషయం తెలిసిపోయింది.
తనకు అనుమానం కూడా మొదలైంది శాంభవినే చిన్న మామ కూతురు ఏమో అని. మయూరి గురించి మనకు తెలిసిందే కదా....
తన పంతం నెగ్గించుకోవడానికి ఎంత దూరమైనా వెళుతుంది. శాంభవిని వాళ్ల ఫ్యామిలీని అడ్డుపెట్టుకుని తన అనుకున్న పని సాధించడానికి కూడా వెనకడుగు వేయదు అని ఆలోచిస్తూ చెబుతాడు.
ఇప్పుడు ఏం చేయాలి బావ అని ధీరజ్ అడుగుతాడు. శాంభవి ఈరోజు నుంచి ఈ ఇంట్లోనే ఉండేటట్టు చేయాలి.. ఇక్కడ నుండే ఆఫీస్ కి వెళ్ళాలి.
మనమే ఎవరో ఒకళ్ళమో శాంభవి తో ఉండాలి కానీ ఒక్కదాన్నే ఎక్కడికి పంపకూడదు అని చెబుతాడు. దానికి ఏం చేయాలి అని నలుగురు ఆలోచిస్తారు.
వెంటనే రుద్ర కి ఒక ఆలోచన వచ్చి అది మిగిలిన ముగ్గురికి చెబుతాడు. ఇదేదో బాగానే ఉంది ఇంప్లిమెంట్ చేద్దామని అందరూ ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పు కొని రూమ్ కి వెళ్లి పడుకుంటారు.
రుద్ర పడుకున్నాడు అన్నమాట గాని మూసిన కనురెప్పల వెనకాల శాంభవి రూపమే కనపడుతూ ఉంటుంది. ఆ లంగా వోణిలో ముద్దుముద్దుగా తిరుగుతూ ఉంటే నిద్ర రాక కొట్టుకుంటూ ఉంటాడు.
అబ్బా రాక్షసి చంపుతున్నావు కదా..చిన్నప్పటినుండి ఇక్కడే ఉండి ఉంటే మన అచ్చక బుచ్చుకలు ఎన్ని అయ్యుండేదో కదా..
నిన్ను నేను ఏడిపించడం నువ్వు అది మీ అన్నలకి మామలకి కంప్లైంట్ చేయడం.. వాళ్లు నన్ను అడగడం ఎంత సరదాగా ఉండేది ఈ ఆటంతా??.
ఎవరి స్వార్థానికో మన లైఫ్ లో ఉండాల్సిన మెమొరబుల్ డేస్ అన్ని మిస్ అయిపోయాయి. అయినా ప్రాబ్లం ఏమీ లేదు.
రేపటి నుంచి అయినా సరే ఆ మెమోరీస్ అన్ని కలెక్ట్ చేద్దాం సరేనా అని తనకి తానే చెప్పుకుంటూ ఎప్పటికో నిద్దట్లోకి జారుకుంటాడు.
పడుకున్న విష్ణుకు మాత్రం నిద్ర రాకుండా ఉంటుంది. శాంభవి పక్కన నివాస్ నే ఊహించుకుంటూ ఉంటే రుద్ర నిలబడడం నచ్చడం లేదు.
నివాస్ కి గట్టిగా చెప్పాలి. శాంభవి తో క్లోజ్ గా ఉండమని. శాంభవిని నా ఇంటి కోడలుగా తెచ్చుకుని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.
శివ గారు, భాను గారు ఎప్పటిలాగానే కూతురిని మధ్యలో వేసుకుని పడుకుంటారు. రాత్రి అలసిపోయి ఉండడం వల్ల శాంభవి కొంచెం లేటుగానే నిద్ర లేస్తుంది.
మెల్లిగా కళ్ళు తెరిచి తన ఎక్కడ ఉందో చూసుకొని గబగబా లేచి కూర్చుంటుంది. అయ్యో నేను సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా...
అమ్మా అయినా లేపాలి కదా అనుకుని గబగబా ఫ్రెష్ అయ్యి నీట్ గా చుడీదార్ వేసుకుని కిందికి వస్తుంది.
లేడీస్ బ్యాచ్ అంతా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.
శాంభవి మెల్లిగా వాళ్ళ అమ్మ వెనకాల వెళ్లి నిలబడి నన్ను లేపచ్చు కదా మెల్లిగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏమైంది అని ధరణి అడిగితే...
ఇదేమైనా మన ఇల్లు అనుకుంటున్నావా నేను ఎంత లేటుగా లేచాను చూసావా అసలు అని గొణుకుతూ ఉంటుంది.
ఆ మాటలు విన్న కౌసల్య ఇది నీ ఇల్లే తల్లి అని అంటుంది. దానికి జయంతి, ధరణి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే.. అదే ఇంట్లో హోమం నీ చేతుల మీదుగా జరిగింది కదా అంటే నువ్వు ఇంటి ఆడపిల్లలనే కదా అర్థం.
నీ ఇంట్లో నువ్వు ఇలా మొహమాట పడాల్సిన పని లేదు అని చెబుతున్నాము అంతే. నువ్వు మమ్మల్ని మేడం, సార్ అని పిలిచినా అమ్మ నాన్న అన్నయ్యలు అన్న పిలిచినట్టే అనిపిస్తుంది.
కాబట్టి మేము ఎవరిము అలాగా ఫీల్ అవ్వము సరేనా అని చంప పైన చేయి వేసి లాలనగా చెబుతారు. దానికి శాంభవి సరే అన్నట్టుగా తల ఊపుతుంది.
చారులత శాంభవి వైపు తిరిగి ఇప్పుడు దాకా నేను ఒక్కదాన్నే ఆడపడుచును అయ్యి డామినేషన్ తక్కువ అయిపోయింది.
ఇప్పుడు నువ్వు కూడా ఆడపడుచువే కాబట్టి మన డామినేషన్ పెరగాలి. వీళ్ళందర్నీ ఒక ఆట ఆడుకోవాలి కానీ అలా సైలెంట్ గా ఉండకూడదు శాంభవి అని చెబుతోంది.
దానికి సులోచన గారు నవ్వుతూ ఏంటి ఇది సైలెంటా... అలా అనుకున్నా వాళ్లే పెద్ద అమాయకులు అని చెబుతారు. నానమ్మ అని గారంగా పిలుస్తుంది.
ఆ మాటలకి ధరణి జయంతి కూడా నవ్వుతూ ఉంటే ఎందుకు మీరు అలాగా నవ్వుతున్నారు అని చారులత అడుగుతుంది.
అసలు మా శాంభవి ఎంత అల్లరి చేస్తుందో తెలుసా కాలేజీలో తక్కువ ఊరు మీద ఎక్కువ ఉంటది. ఎన్ని గొడవలు ఇంటి మీదకు తీసుకొస్తాదో తెలుసా... బామ్మ గారికి తెలియకుండా మేనేజ్ చేయడానికి ఇంట్లో మగాళ్ళకి తల ప్రాణం తోకకు వస్తది.
పొరపాటున విషయం బామ్మ గారి దగ్గరికి వెళ్లిందో అనుకో శాంభవి ముందు కోప్పడినట్టు నటిస్తారు గాని కంప్లైంట్ తీసుకొచ్చిన వాళ్ళ మీద గట్టిగా అరుస్తారు. అందుకే శాంభవికి భయం అన్నది తెలియకుండా అయిపోయింది అని చెబుతారు.
ఎందుకమ్మా మీరందరూ నా మీద అలా కంప్లైంట్లు చెబుతారు మా నాన్నలే బెస్ట్ అని చెప్పి వెళ్లి శివ గారి దగ్గర కూర్చుంటుంది.
ఏమైంది బంగారం అని అడిగితే..చూడండి నాన్న, అమ్మలు ఇద్దరూ కలిసి నా మీద ఎన్ని కంప్లైంట్లు చెబుతున్నారు అని అలకగా చెబుతుంది.
ఆ మాటలు వింటున్న దేవేంద్ర గారు నవ్వుతూ అయితే ఇప్పుడు మా శాంభవి అలిగింది అన్నమాట. ఎన్ని కంప్లైంట్ లు ఇచ్చారు నీ మీద అడుగుతారు.
శాంభవి కూడా దేవేంద్ర గారితో ఫ్రీగా మాట్లాడుతూ ఇప్పుడు దాకా ఇస్తూనే ఉన్నారు ఇంకా నేను అక్కడ ఉంటే ఇంకా అది కంటిన్యూ చేస్తానే ఉంటారని నవ్వుతుంది.
నీ నవ్వు చూస్తే చాలా తల్లి ఎంత టెన్షన్ ఉన్నా సరే అలా గాలిలోకి వెళ్ళిపోతుంది. పున్నమి జాబిల్లి లాగా స్వచ్ఛంగా ఉంటుంది బంగారం అని నుదుటన ముద్దు పెట్టుకోవాలి అని అనిపించిన కష్టంగా ఆపుకునే చెంప పైన చేయి వేస్తారు.
అనసూయ గారు కొంచెం దూరంగా కూర్చుని ఇవన్నీ చూస్తూనే ఉంటారు. చొరవగా కిచెన్ లోకి వెళ్లి వాళ్ళతోనో మాట్లాడలేకపోతున్నారు.
ఇక్కడ కొడుకుల దగ్గర కూర్చుని వీళ్లతోనూ మాట్లాడలేకపోతున్నారు. నా జీవితం ఇంకా ఇంతే అనుకుని వీళ్ళతో కాసేపు ఇలాగే ఉంటే...వాళ్లందరికీ అనుమానం వస్తుందని గదిలోకి వెళ్ళిపోతారు.
సులోచనగారు కౌసల్యతో మీ అత్తగారు ఎక్కడా కనిపించడం లేదు. కాసేపు అయినా కూర్చుని మాట్లాడదాము అనుకుంటే ఎప్పుడూ గదిలోనే ఉంటున్నారు.
ఏదైనా హెల్త్ బాగోలేదా అని అడుగుతారు. దానికి కౌసల్య కొంచెం అలాంటిదే నండి చెబుతుంది. మీకు అభ్యంతరం లేకపోతే నేను గదిలోకి వెళ్లి మాట్లాడవచ్చా అని అడుగుతారు.
దానికి చారులత మీరు ఎందుకండి అంత ఇబ్బంది పడుతున్నారు. పదండి నేను తీసుకువెళతాను అని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకువెళ్లి... నీతో పెద్దమ్మ గారు మాట్లాడతారు అంట అని చెప్పి నాకు కొంచెం పని ఉంది అని వాళ్ళ అమ్మకి జాగ్రత్త అని సైగ చేసి వెళ్ళిపోతుంది.
సులోచన అనసూయ తో మీ ఆరోగ్యం ఎలా ఉందండి కొంచెం బాగోలేదు అంట కదా అని అడుగుతుంది. దానికి అనసూయ నవ్వుతూ ఇప్పుడు కొంచెం పరవాలేదు అని మాటల్లో పెట్టి చిన్నప్పటినుండి శాంభవి విషయాలు అన్ని అడుగుతూ ఉంటారు.
ఇంకా మనవరాలు విషయం వచ్చేటప్పటికి ఆవిడ ప్రతిదీ చెబుతూ నవ్వుతూ ఉంటే...ఆ ఆనందం అంతా నాది కదా..
నేను ఒకరికి చెబుతూ ఉండాల్సింది నేను వినాల్సి వస్తుంది అని ఒక నిమిషం బాధగా అనిపించిన కృష్ణుడు లీలలు విన్నట్టుగా శాంభవి చిన్నప్పుడు విషయాలన్నీ వింటూ ఉంటారు.
బృందావనం సంతోషాలు ఎటువైపు...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)