Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#69
Part - 33

   శాంభవి కారు దిగి ఆ ఇంటిని చూస్తూ ఉంటుంది. రుద్ర మాత్రం శాంభవి ఫీలింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మిగిలిన ముగ్గురు అన్నలు తన పక్కకి వచ్చిన ఏమైంది శాంభవి అలా చూస్తున్నావు అంటే....

ఏమి లేదు సార్ ఈ ఇంటిని చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది.  అది ఏంటి అన్నది నాకు తెలియడం లేదు కానీ...  నేను ఎప్పుడో ఇక్కడికి వచ్చాను అని అనిపిస్తుంది.

ఎంత ఆలోచించినా నేను ఎప్పుడూ మా ఊరు దాటి బయటికి రాలేదు. కానీ ఇది ఎలా సంభవం అని వాళ్ళ వంక చూస్తూ అడుగుతుంది.

దానికి ఆ నలుగురు శాంభవి వంక చూస్తూ నీకు తెలియకుండానే నీ మనసు గుర్తిస్తున్నట్టుంది.  ఇది నీ పుట్టిల్లు అని...  కానీ ఇది బయటకు మేము చెప్పలేము అని అనుకొని..

ఒక్కొక్కసారి మనకు అలాగే అనిపిస్తూ ఉంటుంది పద లోపలికి వెళ్దాం అని అంటారు.  శాంభవి మాటలన్నీ దేవేంద్ర గారు వింటారు.

ఆయనకి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. భార్యని తలుచుకుంటూ మన కూతురు  కి తనకే తెలియకుండా ఇదే తన ఇల్లే అని గుర్తించింది.

ఇదేనేమో రక్తసంబంధం  అనుకొని ఎవరూ చూడకుండా కన్నీళ్లు తుడుచుకుంటాడు. కానీ అది రుద్ర కళ్ళల్లో పడుతుంది.

రుద్ర దేవేంద్ర గారి దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి చిన్నమామ అని పిలిస్తే.. నేనేమీ బాధపడటం లేదు రుద్ర..

ఇన్నాళ్ళకి నా కూతురు మన ఇంటికి వచ్చింది కానీ... అది వేరే వాళ్ళ బిడ్డగా ఇంట్లోకి అడుగుపెడుతుంది.  అదే కొంచెం కష్టంగా ఉంది అని...  పద లోపలికి వెళ్దాం అని తీసుకుని వెళ్తారు.

శాంభవి గుమ్మం దగ్గరకి రాగానే ఆగు అన్న మాట వినిపిస్తుంది. కంగారుగా ఆ మాట వినిపించిన వైపు చూస్తుంది.

అక్కడ రాఘవేంద్ర గారు కనిపిస్తారు.  శాంభవి భయంగా అయిన వైపు చూస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులందరు అయోమయంగా చూస్తూ ఉంటే....

అమ్మ చారు అని పిలుస్తారు.  అర్ధమైంది నాన్నగారు అని చెప్పి గబగబా లోపలికి వెళ్లి దిష్టి తీయడానికి అని ఎర్ర నీళ్లు తీసుకుని వస్తోంది.

అది చూడగానే అందరూ ఊపిరి తీసుకుంటారు.  శాంభవి కూడా హమ్మయ్య అని అనుకుంటుంది. చారులత,  మాధురి కలిపి దిష్టి తీస్తారు.

కుడికాలు ముందు పెట్టి లోపలికి రా తల్లి బుగ్గ మీద చెయ్యి వేసి చెబుతారు.  దానికి సరే అని తల ఊపి లోపలికి కుడికాలు పెట్టి వస్తుంది.

ఆమాత్రం దానికే కుటుంబ సభ్యులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.  వాళ్ళ ఆనందం చూసిన రామచంద్రయ్య గారి మాత్రం ఎందుకు వీళ్ళు అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటారు.

ఆయన ఆలోచన పసిగట్టిన రుద్ర మా తాతగారు వంశంలో ఆడపిల్ల కోసమే చూస్తున్నారు. అందుకే మీ మనవరాల్ని చూడగానే తన సొంత మనవరాలే వచ్చినట్టుగా సంతోష పడుతున్నారు.

మేమందరం అబ్బాయిలం అయిపోయాం కదా..  ఆయన చిన్న చిన్న కోరికలు ఏమీ తీరలేదు అని చెబుతాడు. అవునా అని ఆయన మనసు తేలిక పడుతుంది.

రుద్ర మాత్రం హమ్మయ్య మీ అనుమానం తీరింది అని అనుకుంటాడు.  ధీరజ్ కి సైగ చేస్తాడు. ఏమైంది బావ అని దగ్గరకు వస్తే అమ్మ వాళ్ళు కొంచెం ఎమోషనల్ కంట్రోల్ చేసుకోమని చెప్పు.

ఇప్పటికే ఆ పెద్దాయనకి అనుమానం వచ్చింది.  ఏదో విధంగా సర్ది చెప్పాను కానీ.. ఏదైనా తేడా వచ్చింది అనుకో ఇక ముందుకు వెళ్లడం చాలా కష్టం.

వీళ్ళ కన్నా ముందు మయూరి కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది అంటే....  శాంభవికి చాలా ప్రమాదం అని చెబుతాడు.

అది నిజమేలే అని చెప్పి సైలెంట్ గా చారు పక్కకెళ్ళి అత్త ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి లోపలికి తీసుకెళ్లి జరిగింది చెబుతాడు.

సరే రా... మేము జాగ్రత్తగానే ఉంటామని చెప్పి బయటకు వచ్చి లేడీస్ తో కబుర్లు చెబుతూ ఉంటారు. ఆఫీసు నుంచి వచ్చారు అని చెప్పేసి స్నాక్స్  కౌసల్య తీసుకువచ్చి ఇస్తుంది.

అవి చూడగానే శాంభవి మెరిసే కళ్ళతో చూస్తూ ఆంటీ ఇవి నాకు ఇష్టము మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది.

అందరూ ఏంటా అని చూస్తే అవి మిరపకాయ బజ్జి అండ్ బెల్లం జిలేబి . అవి దేవేంద్ర కి కూడా చాలా ఇష్టం.  తండ్రి అలవాట్లే వచ్చాయని అందరూ మనసులో హ్యాపీగా ఫీల్ అయిపోతా ఉంటారు.

  కౌసల్య నీకు ఇష్టమని మాకు తెలియదు అమ్మ. మామూలుగా చేశాను. నీకు ఇష్టం కదా మాకు చాలా సంతోషంగా ఉంది తిను తల్లి అని....

నేను తినిపించిన అని అడుగుతారు. దానికి అద్వైత్, విహాన్ తల కొట్టుకుంటూ  రుద్రవంక చూస్తారు.

శాంభవి మొహమాటంగా మీకెందుకండి ఇబ్బంది. నేను తింటాను అని చెబుతుంది.  కౌసల్య నాకు ఆడపిల్లలు లేరు తల్లి....

నిన్ను చూస్తుంటే నాకు కూతురు ఉంటే బాగుండును కదా అనిపించింది. అందుకే తినిపిస్తాను అన్నాను నీకు ఇష్టం లేకపోతే వద్దులే అని వెనక్కి తీసుకుంటారు.

కౌసల్య గారిని బాధ పెట్టడం ఇష్టం లేక తినిపించండి ఆంటీ అని చెబుతోంది.  అంతే ఆవిడ ఫేస్ వెలిగిపోతుంది.  చారు, మాధురి ఈ ఛాన్స్ మనం మిస్ అయిపోయాయమే అన్నట్టుగా చూస్తూ ఉంటారు.

వాళ్ల వంక చూసిన ధీరజ్ బావ వీళ్ళిద్దరూ ఎందుకు అలా చూస్తున్నారు అంటే... ఈ ఛాన్స్ నేను మిస్ అయిపోయామని వాళ్ళిద్దరూ ఇన్నర్ ఫీలింగ్ అని చెప్తాడు.

పాపం కదా శాంభవి అని అంటాడు. ఎందుకురా అంటే అక్కడ వాళ్ళు తినిపించి... ఇక్కడికి వచ్చాక కూడా ఇలాంటి ప్రేమతో తను తినే దానికన్నా ఎక్కువగా తినిపించి నాస్లిమ్ గా ఉండే నా చెల్లెలుని లావుగా తయారు చేస్తారేమో అని అంటాడు.

రుద్ర ధీరజ్ వంక చూస్తా ఉంటే ఫ్యూచర్లో నీకు కష్టమని చెప్తున్నాను బావ అంటే... తింటున్న శాంభవి వంక చూస్తాడు.

చాలు  ఆంటీ అని చెబుతున్న సరే కౌసల్య గారు వినిపించుకోకుండా ఇది తినుమ్మ...కొంచెం తినాలి అని చెప్పి ఆవిడ పెట్టాలనుకుంత తినిపించేస్తూ ఉంటారు.

ధరణి, జయంతి మాత్రం వాళ్ళని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు.  ఏంటి ఆడపిల్ల లేకపోతే వీళ్ళు ఇంత అతి ప్రేమ చూపిస్తున్నారు.

నిజంగా ఇంట్లో ఆడపిల్ల ఉండి ఉంటే మనకంటే ఎక్కువ గారాబంగా చూసేటట్టు ఉన్నారు కదా అని ఒకరికొకరు  అనుకుంటారు.

శాంభవి తినటం అయిపోయిన తర్వాత లెగిసి నుంచుంటుంది. ఏమైంది తల్లి అంటే అదే ఆంటీ కొంచెం హెవీగా ఉంది.

జస్ట్ అలా వాక్ చేద్దాం అని చెబుతోంది. చారులత చొరవగా శాంభవి దగ్గరికి వచ్చి పదా నీకు ఇల్లంతా చూపిస్తాను అని చెప్పి చేయ్యిపట్టుకుంటుంది.

ఇదంతా కూడా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆనందంగా చూస్తూ ఉంటారు. ముందుగా పూజగది దగ్గరికి తీసుకువెళ్లి ఇది నిత్యం మేము పూజ చేసే గది అని చెప్పి దేవుడి గదిలో నుంచి కుంకం తీసుకువచ్చి పెడుతుంది.

అలా ఇల్లంతా చూపిస్తూ ఉంటుంది కానీ శాంభవి చూపులు మాత్రం ఒక ఫోటో దగ్గర ఆగిపోతాయి.. ఈ ఫోటో ఎవరిది అండి అని అడుగుతుంది.

ఆ ఫోటో వంక అందరూ చూసి చాలా బాధపడతారు. దేవేంద్ర మనసు చాలా బాధగా మారిపోతుంది.  చారు ఒక నిట్టూర్పు విడిచి తను మా చిన్న వదిన. దేవేంద్ర అన్నయ్య భార్య అని చెబుతుంది.

ఆ ఫోటో దగ్గరకి వెళ్లి చేతితో తడుముతు ఎందుకో శాంభవి కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. సడన్గా ఉలుకబడి వెనక్కి తిరుగుతుంది.

శాంభవి ఏమైంది   అని శివ గారు, భాను గారు వస్తారు. ఏమో నాన్న నన్ను ఎవరో చిట్టితల్లి  అని పిలుస్తున్నట్టు అనిపించింది అని చెబుతుంది.

అంతే ఆ మాటకి దేవేంద్ర గారు ఉలిక్కిపడతారు. శాంభవి వంక, భార్య ఫోటో వంక చూస్తూ నీ ప్రేమ మన కూతురి మనసును తాకింది.

నువ్వు నాతో కూతురే పుడుతుంది అని ఖచ్చితంగా చెప్పావు. అందుకే కడుపుతో ఉన్నప్పుడు కూడా చిట్టి తల్లి చిట్టి తల్లి అని కబుర్లు చెప్పావు.

అదే తనకి తెలియకుండానే ఆ పిలుపు తనకి వినిపిస్తుంది. నీ ప్రేమ స్వచ్ఛమైనది కాబట్టే.... మన కూతురు ఇక్కడికి వచ్చింది.

భవిష్యత్తులో ఇక్కడే ఉండిపోయేటట్టుగా చూస్తాను అని భార్య ఫోటో వంక చూస్తూ మనసులో అనుకుంటారు.  అందరూ శాంభవి వైపు చూస్తూ ఉంటే... రాఘవేంద్ర, రుద్ర మాత్రం దేవేంద్ర వైపు చూస్తూ ఉంటారు.

అక్కడ వాతావరణన్ని తేలికపరచడానికి  ధీరజ్ తాతగారు రేపు హోమానికి ఏమైన కావాలా... అన్ని ఏర్పాట్లు అయిపోయిన ఇంకా ఏమన్నా అవసరం ఉందా అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు.

అన్ని అయిపోయినాయి నాన్న... శ్రీశైలం నుంచి గురువుగారు కూడా వస్తున్నారు అని చెబితే....


రామచంద్రయ్య గారు కంగారుగా అంత పెద్దాయన ఎందుకండి ఇబ్బంది పెట్టడం. ఇక్కడ మనకు దొరుకుతారు కదా అంటే...

మాకు తరతరాలుగా మా వంశానికి, ఆశ్రమానికి సంబంధం ఉంది.  అందుకే మా ఇంటిలో ఏది జరిగినా ఆశ్రమం నుంచి గురువులే వచ్చి చేస్తారు.

ఇందులో ఇబ్బంది ఏమీ లేదు అని చెబుతారు. అందరూ సరే అని అంటారు. దేవేంద్ర మాత్రం కూతురు ఎటువైపు వెళుతుంటే అటువైపు చూపులు వెళ్ళిపోతూ ఉంటాయి.

అందరిలో ఉన్న సరే ఎవరి మాటలు తన చెవులకి వినపడవు.  ఒక్క శాంభవి నవ్వు,మాటలు తప్ప. డిన్నర్ అయిన తర్వాత వాళ్ళందరికీ గదులు చూపిస్తారు.

ఎవరి రూమ్ లో వాళ్ళు వెళ్లి పడుకుంటే శాంభవి దగ్గర మాత్రం శివప్రసాద్, భానుప్రసాద్ కూర్చొని కబుర్లు చెబుతూ జో కొడుతూ పడుకోబెడతారు.

  ఇదంతా గుమ్మం బయట నిలబడి చూస్తున్న దేవేంద్ర నా కూతురు దగ్గర నేను ఎప్పుడూ ఇలా ఉంటాను అని బాధగా అనుకుంటూ తన గదిలోకి వెళ్లి భార్య ఫోటో వైపు చూస్తూ ఉంటారు.

ఆ ఫోటో లో అతని భార్య మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది.  నా ఒక్క రోజు ఆలస్యం నువ్వు నాకు దూరం అవ్వడం.

ఆ దూరం 22 ఏళ్లు చూపించింది.  ఏలాగైనా సరే శాంభవి రుద్ర కి  పెళ్లి చేసి మన కూతురు  ని ఇంటికి తెచ్చేసుకోవాలి.

మయూరీకి తెలిసేలోపే వీళ్ళిద్దరి పెళ్లి జరిగి పోవాలి అని గట్టిగా అనుకుంటాడు. ఇంతలో తలుపు కొట్టిన శబ్దం వస్తుంది  ఈ టైం లో ఎవరైనా ఉంటారు అనే వెళ్లి తలుపు తీస్తాడు.

వచ్చింది ఎవ్వరు??
కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - Yesterday, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - Yesterday, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - Today, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - Today, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - Today, 07:00 AM



Users browsing this thread: 2 Guest(s)