28-03-2026, 08:28 AM
Part - 4
సూర్య, శ్రీకర్ కి నెలల గ్యాపే ఉంటుంది. అందుకే ఇద్దరు ఒకే క్లాస్ చదువుతూ ఉంటారు. డైలీ పిల్లలందరినీ కూడా కాలేజ్ బస్సులోనే పంపి వెనకాల సెక్యూరిటీ మాత్రం వెళుతూ ఉంటుంది.
కాలేజ్ లో ఎక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఐడెంటిటీ చెప్పనివ్వరు. అందరి పిల్లలతో ఈక్వల్ గానే ఉండేలాగా విక్రమ్ అరేంజ్ చేస్తాడు.
వైభవ్ అల్లరినీ ఇంటి వరకు సూర్య రానివ్వడు. కాలేజ్లోనే మొత్తం హ్యాండిల్ చేసి అక్కడే వైభవ్ కి చిన్న పనిష్మెంట్లు ఇచ్చి ఇంటికి తీసుకొస్తూఉంటాడు.
కాలేజ్లో యూనిఫామ్ ఉండడం వలన రాజ్ కొంతవరకు సేఫ్ జోన్ లో ఉంటాడు. నర్సరీకి యూనిఫామ్ ఎందుకు... యూనిఫాం లేని కాలేజ్లో జాయిన్ చేస్తాను అని నివి ఎంత గొడవ చేస్తున్నా సరే కుదరదంటే కుదరదు అని రాజ్ ఈసారి పంతం నెగ్గించుకుని మరి యూనిఫామ్ ఉన్న కాలేజ్లోనే జాయిన్ చేస్తాడు.
పిల్లలందరూ కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి పెద్ద వాళ్ళందరూ కూర్చుని సీరియస్ డిస్కషన్ లో ఉంటారు. సూర్య లలిత దగ్గరికి వెళ్లి ఏమైంది నానమ్మ.. చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నారు.
వచ్చారా కన్నా.. ముందు ఫ్రెష్ అయ్యి అండి. తర్వాత మాట్లాడుకుందాం. పిల్లలందరినీ సర్వెంట్స్ తీసికువెళ్లి ఫ్రెష్ చేసి తీసుకొస్తారు.
పిల్లలందరు స్నాక్స్ తిన్న తర్వాత సూర్య ఇప్పుడు చెప్పండి నానమ్మ అని వస్తాడు. పక్కనే కూర్చోబెట్టుకుని ఏమి లేదు నాన్న... జేజమ్మకి ఆరోగ్యం బాగుండడం లేదు కదా..
అందరం అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్లి వ్రతం చేసుకుందాం అంటున్నారు. ఈ టైంలో జేజమ్మని కదపడం కరెక్ట్ అవునా.. కాదా.. అర్థం కాక ఆలోచిస్తున్నాము.
ఎందుకు దీనికి ఇంత ఆలోచిస్తున్నారు. జేజమ్మ చెప్పారు అంటే అది కరెక్ట్ గానే ఉంటుంది. మనం కంఫర్ట్ గా ఉండేటట్టుగా అందరం ఓకే క్యారీవాన్ లో వెళదాము. అందులో జేజమ్మకి కన్వీనెంట్గా సెట్ చేద్దాము.
సూర్య చెప్పిన దానికి కళ్యాణ్ మీసం మేలేస్తూ చెప్పానా.. నా మనవడు అచ్చు విక్కీ ఆలోచించినట్టే ఆలోచిస్తాడని... నాన్న ఆల్రెడీ చెప్పారా..
నువ్వు ఏది చెప్పావో సేమ్ అదే మీ నాన్న చెప్పారు. లేదు తాతయ్య నాన్న ఏది చెప్పారో అదే నేను చెప్పాను. రెండింటికి పెద్ద తేడా ఏముందిరా.. మీనింగ్ ఒకటే కదా..
అర్థము ఒకటే అయినా.. వెళ్ళే దారి వేరు కదా.. నాన్న బాటలో నేను నడిస్తే.. నేను నేర్చుకుంటాను. అదే నా బాటలో నాన్న నడుస్తున్నారు అంటే నాలో తెలియని గర్వం వస్తుంది.
సూర్య ఆలోచించే విధానానికి అందరికీ ముచ్చటేస్తుంది. మరో తరానికి సరైన మార్గదర్శి వచ్చాడు అని అందరూ సంతోషపడతారు.
మరి ఎప్పుడు ప్రయాణం అని నివి అడిగితే.. ఈ వీకెండ్ ప్లాన్ చేశాను. కాలేజ్లో కూడా 2 డేస్ పర్మిషన్ తీసుకున్నాను అని విక్రమ్ చెబుతాడు.
ఆల్రెడీ అడ్వాన్స్డ్ గా ఉన్నావ్ అన్నయ్య అని వినయ్ వస్తే... అందరూ మనలాగా స్లో నా ఏంటి అని పూజిత సెటైర్ వేస్తుంది.
వైభవ్ వెంటనే నీ సబ్బు స్లో నా ఏంటి బంటి. ఒరేయ్ నువ్వు కాలేజ్లో ఏడిపిస్తున్నావు అంటే పోనీలే అని ఊరుకున్నాను.
అదే నా మీద సెటైర్లు వేశావు అనుకో తీసుకువెళ్లి మిలిటరీ కాలేజ్లో జాయిన్ చేస్తాను. అప్పుడు నీకు ఉంటది. ప్లీజ్ నాన్న అంత పని మాత్రం చేయకండి.
మిలట్రీ కాలేజ్లో కలరింగ్ ఉండదు. ఈ వయసు నుంచి నీకు కలరింగ్ తో పని ఏంటి రా.. వయసుతో పనేముంది నాన్న అనుభవించి ఆనందించే మనసు ఉండాలి కానీ..
చంద్రిక వైపు చూస్తూ ఈ బుడ్డది చూడు... ఈ ఏజ్ నుంచే ఎంత కలర్ ఫుల్ గా రెడీ అవుతుందో... ఇలాంటి కలర్ ఫుల్ గర్ల్స్ నా చుట్టూ ఉంటే ఆ ఆనందమే వేరు కదా అని చేతులు రెండు పైకి పెట్టుకుని చెబుతూ ఉంటాడు.
కొడుకు చెబుతున్న విధానానికి వినయ్ గుండె పట్టుకుంటే పూజిత వీపు మీద ఒక్కటేస్తుంది. అమ్మ ఎందుకు కొట్టావు అని వీపు రుద్దుకుంటూ అడుగుతాడు.
ఏరా ఈ వయసు నుంచి నీకు కలర్స్.. గర్ల్స్ కావాలా... ముందు నీ చదువు చూడు. అన్ని గుడ్డు సున్నాలు వస్తున్నాయి.
అన్నయ్య, శ్రీకర్, సౌమ్య చూడు ఎలా చదువుతున్నారు. అందరూ చదివేస్తే.. ఎంజాయ్ చేసేది ఎవరు ఉంటారు అమ్మ. ఉత్తి టేస్ట్ లెస్ అయిపోయావు..
చూడు పెద్దమ్మ నన్ను అమ్మ కొడుతుంది అని అవని దగ్గరికి వెళ్లి గారాలుపోతూ ఉంటాడు. పోనీలే పూజిత చిన్నపిల్లోడు కదా.. తెలుసుకుంటాడు.
అక్క నువ్వు ఇలా గారం చేయబట్టే వాడు అసలు చదవడం లేదు. ఏదైనా అంటే నాది ఇంకా చిన్న క్లాసే.. ఇప్పుడు కాకపోతే ఇంక ఎప్పుడు ఆడుకుంటాను. ఎంజాయ్ చేస్తాను అంటున్నాడు.
సూర్య చూడు ఆటలకి ఆటలు ఆడతాడు. చదువులో ఎప్పుడు ఫస్ట్ ఉంటాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్ రాకపోయినా పర్వాలేదు. ఒక 80% అయినా ఉంటే బెటర్ కదా తర్వాత ఎలాగోలాగా ముందుకి తోయొచ్చు.
లేకపోతే వీళ్ళ నాన్న లాగా ఇదిగో అలాగే వెనకబడిపోయి ఉంటాడు. ఏది జరిగిన వచ్చి నా దగ్గర ఆగకపోతే నీకు మనశ్శాంతి ఉండదే ...
పిల్లలు ఏ అల్లరి చేసినా అది నా వల్లే... ఎవరికీ హెల్త్ బాగోకపోయినా అది నా వల్లే... ఆఖరికి వీడు చదవకపోయినా నా వల్లేనా...
దీనిని నేను ఖండిస్తున్నాను. రాజ్.. నువ్వు ఖండించిన ఖండించకపోయినా పెళ్ళాల మాట వినడం ఉత్తమం. లేదు అంటే అనవసరంగా ఆయాసం వస్తుంది. తర్వాత నీరసం వస్తుంది. అవసరమా..
బావ నీకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా.. వస్తది బావమరిది.. రాకపోయినా మన పెళ్ళాలు రప్పిస్తారు. అక్కడ చూడు విద్య, అవని ట్రిపులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని ఏమేమి కావాలా అని ఆలోచిస్తున్నారు.
ఇక్కడ నీ పెళ్ళం, నా పెళ్ళం చూడు జర్నీ దగ్గర నుంచి మళ్లీ రిటర్న్ ఇంటికి వచ్చేదాకా ఎప్పుడు ఏమి చీరలు కట్టాలా... పిల్లలకి ఎలాంటి డ్రెస్సులు వెయ్యాలా అని ఆలోచిస్తున్నారు.
ఇలాంటి అప్పుడు మనిద్దరం చేయవలసింది ఒక్కటే.. ఏమిటి బావ.. మౌనవ్రతం. అది ఆడవాళ్లు అనుకుంట చేసేది.
కొన్ని కొన్ని వ్రతాలు మగవాళ్ళ కోసం కూడా కనిపెట్టారు. చేసాము అనుకో మనకి మనశాంతి. వాళ్లకి... హ..వాళ్లకి చెప్పు బావ వాళ్లకి అశాంతి అంటాడు.
బావ నువ్వు మరీ ఇంటెలిజెంట్ అయిపోయావని బుగ్గలు పట్టుకుని లాగుతాడు. లలిత విక్రమ్ ని పిలిచి శ్రీ వాళ్లకి కూడా చెప్పు. మొత్తం అందరం కలిసి వెళ్ళదాము.
ఆల్రెడీ ఇన్ఫామ్ చేశానమ్మ. ఫ్యామిలీ మొత్తం వస్తున్నారు.
అన్నవరం వెళ్లే రోజు రానే వచ్చింది పిల్లలందరూ రెడీ అయ్యి బయటకు వచ్చేటప్పటికి రెండు క్యారీవాన్స్ రెడీగా ఉంటాయి.
వైభవ్ విక్రమ్ దగ్గరేకి పరిగెత్తుకుని వెళ్లి పెదనాన్న ఎందుకు రెండు అంటే.. మీ పిల్లల బ్యాచ్ కి ఒకటి.పెద్ద వాళ్ళకి ఒకటి.
థాంక్యూ పెదనాన్న.. ఎందుకురా.. అందరం కలిసి ఒకే దాంట్లో వెళతాము. నేను చేసే అల్లరికి మా అమ్మ ఇక్కడి నుంచి కారాలు నూరుతూ ఉంటుంది.
సైలెంట్ గా ఎలా కూర్చోవాలా అని టెన్షన్ పడ్డాను. బట్ నువ్వు సో స్వీట్ పెదనాన్న. ఐ లవ్ యు. సౌమ్య, చంద్రిక రెడీ అయి వస్తారు.
సౌమ్య నీటుగా టెడ్డీబేర్ పుచ్చుకుని బస్సు ఎక్కుతుంది. చంద్రిక ఒక టెడ్డీబేర్, మంకీబ్యాగ్, మాచింగ్ ఆక్సిరేస్ అన్ని పెట్టుకుని బస్ ఎక్కుతూ ఉంటుంది.
వైభవ్ చంద్రికనే చూస్తూ ఉంటే... విక్రమ్ రేయ్ వైభవ్ అంటే.. చెప్పు పెదనాన్న. చందుని ఏడిపించావు అని నాకు తెలిసిందనుకో వెంటనే నీ బస్సు మార్పించేస్తాను.
మళ్ళీ మీ అమ్మ దగ్గరే కూర్చోబెడతాను. ప్లీజ్ పెద్దనాన్న ఆ పని మాత్రం చేయకు. దాన్ని నేను ఏమీ ఏడిపించను. కాకపోతే ఇంత లాంగ్ జర్నీలో ఒక్కసారి కూడా అంటే కష్టం కదా...
కష్టమైన సరే.. చందు బాధ్యత పూర్తిగా నీదే. చందు ఏడవకుండా చూసుకో అర్థమయిందా. సరే పెదనాన్న ఈసారి కి నీకు మాట ఇచ్చి దాన్ని ఏమీ అనను.
పిల్లలందరూ ఒక బస్సులో ఎక్కుతారు. సర్వ్ చేయడానికి ఇద్దరు సర్వెంట్స్, సెక్యూరిటీ కూడా ఆ బస్సులో ఉంటారు.
మరొక బస్సులో మిగిలిన ఫ్యామిలీ మొత్తం ఎక్కుతారు.
హైదరాబాదు నుంచి అన్నవరం ప్రయాణం మొదలవుతుంది. మధ్య మధ్యలో ఆపుతూ పిల్లలకి కావాల్సిన చూసుకుంటూ మెల్లిగా అన్నవరం చేరుకుంటారు.
అన్నవరం లో బస్సు ఆగగానే సూర్య, శ్రీకర్ ముందు దిగుతారు. సూర్య దిగి ఒక బ్రైడ్స్ స్మైల్ తో చుట్టూ చూస్తూ ఉంటాడు.
శ్రీకర్ ఏమైంది బావ మంచి హ్యాపీ స్మైల్ ఇస్తున్నావు. ఏమో తెలియదు . ఇక్కడ దిగగానే చాలా ప్లసెంట్ గా అనిపించింది. ఏదో నాకు తెలియని ఒక ఫీల్ కలుగుతుంది.
మన సిటీ అంతా పొల్యూషన్ కదా.. ఇక్కడంతా నేచర్ ఎక్కువ ఉంది కదా.. మే బి..
రాజ్ కంగారుగా వచ్చి ఏరా చందు ఏది. వైభవ్తో ఉంది మావయ్య. వైభవ్తోనా.. అమ్మో వీడు నా కూతురిని ఏం చేశాడో అని స్పీడ్ గా బస్సు దగ్గరికి వెళతాడు.
సౌమ్య మెల్లిగా బస్సు దిగుతుంది.
వెనకాలే చందుని పట్టుకుని వైభవ్ మెల్లిగా దిగుతాడు.
చందు ఫ్రెష్ ఫ్లవర్ లాగా ఉంటే... వైభవ్ వాడిపోయిన కాడలాగా ఉంటాడు.
రాజు స్పీడ్ గా వెళ్లి అమ్మ చందు ఎలా ఉన్నావు
నాకేం నాన్న.. ఐ ఎమ్ ఆల్ రైట్ అని హెయిర్ ని వెనక్కి వేసుకుంటూ చెబుతుంది.
ఏదో తేడా కొడుతుందే అని వైభవ్ వైపు చూస్తాడు. వైభవ్ మాత్రం అలసిపోయి కనపడితే.. అదేంట్రా నువ్వు ఇలాగ అయిపోయావు.
ఏమీ తినలేదా.. కోపంగా చూస్తూ నీ కూతురు నన్ను తింది ఇంక నేనేం తింటాను. ఇదే ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు.
ఎప్పుడు నువ్వే కదా చందు ని ఏడిపిస్తావు. ఈసారి బస్సులో రివర్స్ జరిగిందా అని ఒక హ్యాపీ స్మైల్ తో అడుగుతాడు.
ఏంటి మావయ్య.. నీ కూతురు నాతో ఆడుకుంది అంటే నీకు మంచి సంతోషంగా ఉన్నట్టుంది. అది కాదురా.. ఏం జరిగిందా అని అడుగుతున్నాను ఏమైందో చెప్పమ్మా.
పెదనాన్నకి మాట ఇచ్చాను. దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని.. అందుకే ఇది ఎంత టార్చర్ పెట్టినా సరే ఓపికగా ఉన్నాను. కానీ అన్నవరంలో..
సత్యనారాయణ స్వామి దర్శనానికి అందరూ ఆహ్వానితులే ???
కథ కొనసాగుతుంది..

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)