27-03-2026, 08:29 AM
Part - 28
అందరి ఆత్రం తీర్చడానికి సూర్యుడు తను వెలుగు రేఖలతో గుడ్ మార్నింగ్ చెబుతాడు. రేపల్లె నుంచి వాళ్ళ వెహికల్స్ లో హైదరాబాద్ బయలుదేరుతారు.
భాను గారు శాంభవి కి ఫోన్ చేసి మేము డైరెక్ట్ గా మీ ఆఫీస్ దగ్గరకు వచ్చేస్తాము తల్లి అని చెబుతారు. సరే నాన్న నేను వెయిట్ చేస్తాను అని చెప్పి వాళ్లు మావయ్యతో సాయంత్రం డ్రైవర్ అవసరం లేదు.
నాన్న వాళ్ళు వస్తున్నారు డైరెక్టుగా కాలేజ్ క్ అని చెబుతుంది. మేము కూడా వస్తున్నాము మీ ఆఫీస్ నుంచి అటే డైరెక్ట్ గా చార్మినార్ వెళ్ళిపోదాము లేకపోతే టైం సరిపోదు అని చెప్తాడు.
సరే మావయ్య అని చెప్పి ముగ్గురు ఆఫీస్ కి వెళ్ళిపోతారు. నివాస్ నువ్వు కూడా వస్తావా అంటే.. నాన్న మీరు వెళ్ళేది లేడీస్ షాపింగ్ కి.
మీరు వెళ్లడమే ఎక్కువ అంటే.. మళ్ళీ నన్ను కూడా రమ్మంటున్నారా నన్ను వదిలేయండి. నాకు ఆఫీసులో చాలా వర్క్ ఉంది అని ఆఫీస్ కి వెళ్ళిపోతాడు.
విష్ణు సావిత్రితో వీడేంటి బాబు.. అస్తమానం ఆఫీస్ ఆఫీస్ అంటాడు. శాంభవికి దగ్గరగా ఉంటేనే కదా నేను బావ తో పెళ్లి సంబంధం మాట్లాడగలను.
వీడు అంటి ముట్టినట్టుగా ఉంటే శాంభవిని ఎలా ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏంటో వీడి తింగర వేషాలు అంటారు. దానికి సావిత్రి నవ్వుతూ వాళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉంటే ఎలాగైనా భగవంతుడు ముడి వేస్తాడు. రాసిపెట్టి లేకపోతే మనం ఏ ప్రయత్నాలు చేసినా అవ్వదు
ఎవరు ఎలా ఉంటున్నారో అలాగే ఉండనివ్వండి. మీరు కూడా ఆఫీసుకు తొందరగా వెళ్తే సాయంత్రం తొందరగా వచ్చేయొచ్చు కదా అని చెబుతుంది.
అంటే ఇండైరెక్ట్ గా నన్ను బయట పొమ్మని చెబుతున్నావా అని ఆఫీస్ కి బయలుదేరుతారు.
కౌసల్య, చారులత కూడా సాయంత్రం మీ ఆఫీస్ అయ్యే టైపు మేము అక్కడికి వచ్చేస్తాము. మీ అరేంజ్మెంట్స్ మీరు చేయండి రా అని చెప్తారు.
మీరు ఎవరు ఏం చెప్పినా వినరు కదా మీరు ఏది అనుకుంటే అదే మేం చేయాలి కదా అని ఎవరి కొడుకుల వాళ్ళ అమ్మలతో దెబ్బలాడుతారు.
పోనీ అలాగే అనుకోండి రా వెళ్ళండి తొందరగా ఆఫీస్ కి అని బయటకి గెంటేస్తారు. ఆఫీసుకు వెళ్లిన ఈ నలుగురు అబ్బాయిలు అసలు మన మాటంటేనే లెక్క చేయడం లేదు.
శాంభవితో షాపింగ్ అంటే ఎక్కడ భూమ్మీద ఆగడం లేదు. శాంభవి వీళ్లకు దగ్గరకు వచ్చి అత్తమ్మ పెద్దమ్మ అని పిలిస్తే మనల్ని మనం ఉన్నామా లేదా అని కూడా పట్టించుకోరేమో వీళ్ళు అని అనుకుంటారు.
అది మాత్రం నిజమే బావ మా అమ్మ కూడా మొహమాట పడకుండా బయటికి గెంటేసింది అని ధీరజ్ చెప్తాడు.
మాధురి అత్తయ్య కూడా వస్తుందా అంటే... నీకు అందులో ఏమైనా డౌట్ ఉందా!
రాత్రి చారత్త, కౌసల్య అమ్మ ఫోన్ చేసి మరీ చెప్పారు రెడీ అయిపో పికప్ చేసుకుంటాను అని...
వీళ్ళ ముందు ఎంత కాస్ట్లీ సారీస్, ఆర్నమెంట్స్ పెట్టిన ఇంత ఆనంద పడలేదేమో.. మనకి మాత్రం పిచ్చ టెన్షన్ లేపుతున్నారు అంటూ...
ధీరజ్ మన ఆఫీసులో వాళ్ళు ఫోన్స్ అన్ని ట్రాప్ చేసావా ఎవరు అని తెలిసిందా అంటే... ఆ తెలిసింది బావ అని లిస్ట్ ఇస్తాడు.
అందులో ఉన్న ఇద్దరు పేర్లు చూసి వీళ్ళకి మన ఆఫీసులో మంచి పొజిషన్లోనే ఉన్నారు కదా! ఆయన ఈ కక్కుర్తి ఏంటో..
మనకి విషయం తెలిసింది అన్నట్టు కాకుండా ఇద్దరినీ చెరో ఒక బ్రాంచ్ కి వర్క్ మీద పంపించేయండి. అలాగే అందరు ఫోన్స్ మాత్రం ట్రాప్ చేసి ఉంచండి.
ఆఫీస్ విషయాలు గానీ, శాంభవి విషయాలు గానీ బయటికి వెళితే మాత్రం ఈసారి వెరైటీగా పనిష్మెంట్ ఇద్దాం.
ఆ పని చూడు ధీరజ్ అని చెబుతాడు. సరే బావ అని చెప్పి ఎంప్లాయిస్ ఇద్దరినీ చెరో ఒక బ్రాంచ్ కి షిఫ్ట్ చేసేస్తాడు.
దేవేంద్ర క్యాబిల్లోనికి వచ్చి శాంభవి వాళ్ళ టీం కి వర్క్ నేర్పిస్తూ ఉంటారు. వర్క్ విషయంలో మాత్రం శాంభవి ఫోకస్ ఎప్పుడు సీరియస్ గానే ఉంటుంది.
ఎటు డిస్టర్బ్ అవ్వదు. లంచ్ బ్రేక్ దాకా అసలు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వర్క్ చేస్తూనే ఉంటుంది. లంచ్ చేసిన తర్వాత ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది.
ఆఫీస్ టైం అయ్యేటప్పటికి కౌసల్య, చారులత, మాధురి అక్కడికి వస్తారు. డైరెక్ట్ గా రుద్ర క్యాబిన్ కెళ్ళి ఏరా ఇంతసేపు వర్క్ చేపిస్తున్నారు. వదిలేయచ్చు కదా అంటే...
అమ్మ మీరు షాపింగ్ కి వెళ్ళాలి అని చెప్పి ఆఫీస్ అవర్స్ తగ్గించగలమా కాసేపు వెయిట్ చేయండి అని విసుగ్గా చెబుతాడు.
ఎందుకురా అంత కోపం ఇప్పుడు మేము ఏమన్నామని అంటే.. నిన్నటి నుంచి మీరు ఎక్కడ నడుస్తున్నారు. నేల మీద నడవడం మర్చిపోయారు. గాల్లో, ఊహల్లో ఉంటున్నారు.
అనుకోకుండా కలిసి వెళ్తున్నట్టుగా బిల్డ్అప్ ఇస్తున్నారు. నిజంగా రేపు అన్న రోజు శాంభవి మిమ్మల్ని రిలేషన్తో పిలిచి షాపింగ్ కి వెళితే.. ఇంక మమ్మల్ని పట్టించుకుంటారా మీరు అని అడుగుతాడు.
ఓరిని మీ అలకంత దాని కోసమా.. ఇన్నాళ్లు మిమ్మల్ని పట్టించుకోలేద ఏంటి అని చారూలత అడుగుతుంది.
అంటే ఇన్నాళ్లు పట్టించుకున్నారు కాబట్టి ఇప్పటినుంచి శాంభవిని మాత్రమే పట్టించుకుంటాను అని చెబుతున్నావా అమ్మ అని అడుగుతాడు.
నీకు ఎలా కావాల్సితే ఆలా అర్థం చేసుకోరా.. మమ్మల్ని మాత్రం ఇప్పుడు డిస్టర్బ్ చేయకు. మంచి మూడ్ లో ఉన్నాము.
ఇంకా ఎంత టైం ఆఫీస్ టైం అవ్వడానికి అని మళ్ళీ అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్, విహాన్,అద్వైత్ రుద్ర ఫేస్ ఫీలింగ్స్ చూసి నవ్వుకుంటారు.
ధీరజ్ విహాన్ తో వీడి అలక అత్తయ్య శాంభవి ని ఎక్కువగా పట్టించుకుంటుందని లేక వీడు శాంభవితో కలిసి వెళ్ళలేకపోతున్నందుకా అని అడుగుతాడు.
నీకు ఆ డౌట్ వచ్చింది కదా వెళ్లి వాడినే అడుగు అంటే.. ఎందుకు పై ఫ్లోర్ తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకు తోసేస్తాడు.
నాకు అవసరమా అని సైలెంట్ గా కూర్చుని ఆ సినిమా చూస్తే సరిపోతుంది కదా అని సైలెంట్ గా సోఫాలో కూర్చుంటాడు.
సీసీలో నుంచి ఎంట్రెన్స్ వైపు చూస్తున్నా రుద్ర బ్రకటి ముడి వేస్తాడు. ఏమైంది రుద్రా అని విహాన్ వస్తే సీసీ వైపు చూపిస్తాడు.
అక్కడ శాంభవి ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. శకుంతల గారు తప్ప అందరూ వస్తారు.
రుద్ర వాళ్ళ అమ్మ వంక చూస్తూ అదిగో శాంభవి ఫ్యామిలీ మొత్తం వచ్చింది. ఆ ఫ్యామిలీతో శాంభవి కి చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉంది.
అది చూసి మీరు గాని, మావయ్య గాని ఎమోషనల్ అయితే మాత్రం మర్యాదగా ఉండదు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అని చెప్పి సీసీ లో చూస్తూ ఉంటాడు.
దేవేంద్ర కూడా బయటికి వెళ్లడానికి అని ఆఫీసు నుంచి బయటికి వస్తాడు. శాంభవి ఇంకా ఆఫీస్ టైం అయిపోయిందని చెప్పి గబగబా ప్యాక్ చేసుకుంటూ మిత్ర, గౌతంల వంక చూస్తూ తొందరగా రండి.
నాన్న వాళ్ళు వచ్చారు అని స్పీడ్ గా బయటకు వెళ్ళిపోతుంది. దేవేంద్ర కార్ డోర్ ఓపెన్ చేయగానే నాన్న అన్న పిలుపు వినిపిస్తుంది.
ఆయన ఆనందంగా వెనక్కి తిరిగి చూస్తారు. శాంభవి పరిగెత్తుకుంటూ దేవేంద్ర వైపుగా వస్తుంది. దేవేంద్ర అన్ని విషయాలు మర్చిపోయి శాంభవి తన కోసమే వస్తుందని ఎంత ఆనందంగా ఎదురు చూస్తూ ముందుకు అడుగు వేస్తారు.
శాంభవి దేవేంద్ర ని తప్పుకొని పరుగున వెళ్లి వెనక ఉన్న శివ గారిని హత్తుకుంటుంది. అది చూడగానే దేవేంద్రకి గుండెలో ఎవరో గుణపంతో గుచ్చినంత బాధ కలుగుతుంది.
నా కూతురు నా కళ్ళు ఎదుటి వేరే ఒకళ్ళుని నాన్న అని పిలుస్తుంది. నేను ఆ పిలుపుకి నోచుకోలేకపోయాను అని బాధగా కళ్ళు మూసుకుంటారు.
అదంతా సీసీ లో చూస్తున్న అందరికీ చాలా బాధగా ఉంటుంది. చారులత అయితే కౌసల్యని పట్టుకుని ఏడ్చేస్తోంది.
ఎందుకు వదిన అన్నయ్యకి ఇంత బాధ. తన కళ్ళ ముందే తన కూతురు తన గుర్తుపట్టకుండా వేరే వాళ్ళ నాన్న అని పిలుస్తుంటే ఎంత కష్టమో కదా అన్నయ్య ఎలా భరిస్తున్నాడు అని ఏడుస్తుంది.
దానికి రుద్రా గట్టిగా కళ్ళు మూసుకుని అమ్మ మీకు చెప్పింది ఇదే.. ప్రతిదీ ఎమోషనల్ అవ్వద్దు అని శాంభవి కి నిజ నిజాలు తెలియదు కదా మీరే ఇలా అయిపోతే ఇక చిన్న మామ పరిస్థితి ఏంటి..
నిజంగా ఫస్ట్ టైం అమ్మమ్మ మీద చాలా కోపం వస్తుంది నాకు. ఎవరి మాటలకో విలువిచ్చి కొడుకు జీవితాన్ని పణంగా పెట్టింది .
ఏమి సాధించింది ఇటు కొడుకు జీవితం నాశనం అవ్వడమే కాక ఇటు అందరూ ఉన్న ఒంటరిగా మిగిలిపోయింది.
కింద ఏమి జరుగుతుందని మళ్లీ సిసి లో చూస్తారు. దేవేంద్ర గట్టిగా కార్ డోర్ పట్టుకుని నిర్లిప్తంగా శాంభవి వైపు చూస్తారు.
శివ గారు శాంభవిని హత్తుకొని మా అమ్మ,బంగారం, తల్లి అంటూ ముద్దు చేస్తూ ముద్దులు పెడుతూ ఉంటారు.
దేవేంద్ర వెంటనే శాంభవి దగ్గరికి వెళ్లి చేయి పట్టుకుని వెనక్కి లాగి నువ్వు నా కూతురివి తల్లి అని చెప్పాలని గట్టిగా అనిపిస్తుంది కానీ...
వాస్తవం గుర్తుకు వచ్చి వాళ్ళని అలాగే చూస్తూ ఉంటారు. చాలా అందమైన ఫ్యామిలీ. ఉమ్మడి కుటుంబం.. అందరికీ శాంభవి అంటే ప్రాణం అని తెలుస్తుంది.
రేపు అన్న రోజున నిజం తెలిస్తే వీళ్ళు తట్టుకోగలరా అని ఆలోచిస్తూ ఉంటారు. శాంభవి శివ గారి చెయ్యి పట్టుకుని ఊపుతూ కబుర్లు చెబుతూ ఉంటుంది.
తనని ఎవరో చూస్తున్నట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ దేవేంద్ర గారు కనిపిస్తారు.
హలో సార్ గుడ్ ఈవెనింగ్ అని చెబుతుంది. గుడ్ ఈవెనింగ్ అమ్మ అంటే... మా పేరెంట్స్ అని అందరిని పరిచయం చేస్తుంది.
వాళ్ళ అన్నయ్యలని కూడా పరిచయం చేస్తుంది..అందరికీ నమస్తే అని చెబుతారు.
మీరు బయటకు ఎక్కడికో వెళుతున్నట్టు ఉన్నారు సార్. సారీ ఆపినందుకు అంటే.. అలా ఏమీ లేదు చార్మినార్ దగ్గర పని ఉండి వెళుతున్నాము అని చెబుతాడు..
అవునా సార్ మేము కూడా అటే వెళ్తున్నాము. మీరు మాతో జాయిన్ అవుతారా అని చొరవ గా అడుగుతుంది.
దానికి దేవేంద్ర సమాధానం ఏమిటి??

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)