26-03-2026, 07:27 PM
Part - 1
అవని బాబు ని చూసి మురిసిపోతూఉంటుంది. అవని సంతోషాన్ని భర్త, తండ్రి చూస్తూ ఉంటారు. థాంక్స్ అల్లుడు గారు అంటే... ఇట్స్ ఓకే మామగారు..
అందరూ అవని దగ్గరికి వచ్చి ఎలా ఉందిరా అని అడిగితే.. బాగుంది అని తలుపుతుంది. బాబు అందరి చేతుల్లోకి మారుతూ ఉంటాడు.
సురభి వచ్చి అందరూ బయటకు వెళ్ళండి. అవనినీ చెక్ చేయాలి. సరే అని అందరూ వెళ్ళిపోతారు. సురభి చెక్ చేసి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి.. అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి విక్రమ్ తో ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాను.
నార్మల్ డెలివరీ కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగే ఒక నర్స్ ని అపాయింట్ చేస్తాను. నేను డైలీ వచ్చి చెక్ చేస్తాను. ఓకే అంటీ..
టేక్ రెస్ట్ అవ్ని అని సురభి వెళ్ళిపోతుంది. అవని డల్ గా కనిపిస్తే.. ఏమైందిరా.. ఏదైనా ఇబ్బందిగా ఉందా. నాన్న ఇంటికి తీసుకువెళ్తాను అంటున్నారు.
ఓ.. దానికా తమరి ఫేసు డల్ అయింది. నాకు మిమ్మల్ని విడిచి వెళ్లడం ఇష్టం లేదు. అలా అని నాన్నకి దూరంగా ఉండాలి అనిపించడం లేదు. ఏం చేయాలి అని బిక్క మొహం వేస్తుంది.
ఇద్దరూ ఒకే చోటు ఉండాలంటే కష్టం కదరా... ప్లీజ్ మీరే అరేంజ్ చేయండి నాకు ఇద్దరు కావాలి. భార్య ముఖం చూసి నవ్వుతూ సరే నేను చూసుకుంటాను..
సాయంత్రం డిశ్చార్జ్ చేసే టైం కి అవని టెన్షన్ గా చూస్తూ ఉంటే ధనుంజయ్ దగ్గరకు వచ్చి ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు. నేను నీ దగ్గరే ఉంటాను.
సంతోషంగా భర్త వైపు చూస్తుంది. ఏంటి మేడం ఇప్పుడే హ్యాపీయేనా.. చాలా థాంక్స్ శ్రీవారు. అయ్యో మా భార్యమణి ఇచ్చిన గిఫ్ట్ ముందు మేము ఇచ్చేది చాలా చిన్న చిన్నవి.
బాబుని తీసుకుని అందరూ ఇంటికి చేరుకుంటారు. బాబుతో సహా అవని, విక్రమ్ ని గుమ్మం దగ్గరే ఆపి దిష్టి తీస్తారు.
లోపలికి వస్తూ ఉంటే వినయ్ ఆగండి ఆగండి అంటూ వస్తాడు. ఏమైందిరా.. అరే మన యువరాజు వస్తూ ఉంటే అంత సింపుల్ గా వెల్కమ్ చెప్పడమా... మరి ఇంకా ఎలా చెప్పాలి...
నివి అని పిలిస్తే పసుపు ని ముద్దగా చేసి బాబు పాదాలకి రాసి దానితో షీట్ మీద ప్రింట్ వేయిపిస్తారు. ఆ షీట్ ని నీట్ గా ఫ్రేమ్ చేయిపిస్తాను.
భరత్ వచ్చి పర్వాలేదు రా.. నీలో కూడా గుజ్జు ఉంది. పూజిత వచ్చి.. నన్ను పెళ్లి చేసుకున్నాక పెరిగిందిలే అన్నయ్య అంటుంది. ఏది జరిగిన మీ పెళ్ళాం ఎకౌంట్లో వేసుకోకపోతే మనశ్శాంతి ఉండదే..
పోనీ మీ అకౌంట్లోనే వేసుకోండి. ఏమని.. నేను ఎంత అదృష్టవంతుడిని.. నాకు ఇంత తెలివైన పెళ్ళాం వచ్చిందా... ఇది కూడా నీ అకౌంటే కదా...
అవని రాతల్లి... కాసేపు రెస్ట్ తీసుకుందాగాని.. బాబు ని చూసుకోవడానికి చాలామంది ఉన్నారు. ఇప్పుడు నీకు సరైన రెస్టు కావాలి రా...
యువరాజు గారు మాత్రం కిందకి రాకుండా అందరి చేతుల్లోనే తిరుగుతూ పడుకుంటూ ఉంటాడు. నివి డల్ గా ఉండడం చూసి రాజ్ ఏమైంది నా పెళ్ళానికి.. అంత డల్ గా ఉంది.
పాప పుడుతుంది అనుకున్నానండి. ఎవరైతే ఏమయింది.. అబ్బా బాబు అయితే ఏముంటాయి అండి బట్టలు.
చొక్కా, ప్యాంటు, షర్టు, షార్ట్ ఇందుకు మించి వేయడానికి ఏముంటుంది.
అదే పాప అయితే గంటకో మోడల్ వేయచ్చు. రకరకాల ఫ్రాక్స్ డిజైన్ చేయొచ్చు. ఆ పట్టుపరికిణిలు కుట్టించాలి. ఎన్ని ప్లాన్ చేసుకున్నాను.
రాజ్... పెళ్ళాం చెప్పేదానికి నోరు వదిలేసి చూస్తూ నీ కోరికలు తీరడానికి పాప కావాలనుకున్నావా.. మాయమ్మే...
తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే చాలు అనుకోవడం మానేసి పర్టికులర్ గా పాపే కావాలనుకున్నావా అని రాజ్ ఫ్యూచర్ ఊహించుకుంటాడు.
జడుసుకుని తన వీపు మీద తానే చరుచుకుంటాడు. వినయ్ పక్కన కూర్చుని ఏంటి బావ ఫ్యూచర్ కనపడిందా..
నిజంగా బామ్మర్ది. నాకు మాత్రం కొడుకే పుట్టాలి అని గట్టిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసి నీకు పాపే... బావ. ఒరేయ్ నేను మీకు ఏ ద్రోహం చేసానురా... మీ కుటుంబం మొత్తం నామీద ఇలా పగబట్టేశారు..
అయ్యో బావ. నీ మీద పగ పట్టలేదు. నువ్వంటే మా అందరికీ రెస్పెక్ట్. మాకు ఉన్న ఒక్కగానిఒక్క బావగారివి. అవును అవును.. మీ రెస్పెక్ట్ తట్టుకోలేకపోతున్నాను.
పార్ధు వచ్చి ఏంటి బావ బావమరుదుల సరసం.. ఈయనొక్కరు చాలు నా జీవితాన్ని రహదారి చేయడానికి..
ఏంటో నా కొడుకు తెగ పొగుడుతున్నాడు. ఏం గుర్తొచ్చింది రా. రాజ్ తల పట్టుకుంటాడు.
ఏమీ లేదు మావయ్య. బావకి ఆడపిల్లలే కావాలంట. అది కూడా అచ్చు మా నివిలాగానే... ఒరేయ్ అని ఏడుపు మొహంతో చూస్తాడు.
నా కోరిక కూడా అదే వినయ్. నా కొడుకు అటు పెళ్ళాం ఇటు కూతురుతో షాపింగ్ చేస్తూ సాండ్విచ్ మధ్యలో వెజిటేబుల్ లాగా కుతుకుతా ఉడుకుతూ ఉంటే.. ఊహించుకుంటేనే ఎంత అద్భుతంగా ఉంది. చూస్తే ఉంటే ఇంకా ఎంత బాగుంటుందో..
భరత్ మాత్రం రాజ్ వంక జాలిగా చూస్తాడు.. ఏంటి బ్రో నన్ను చూస్తే జాలి వేస్తుందా.. కొన్ని కొన్ని నోటితో చెప్పలేము అనుభవించాల్సిందే ...
బాబు ఏడుపు మొదలు పెట్టడంతో... డిస్కషన్ ఆపి బాబుని ఊరుకోబేట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. లలిత వచ్చి బాబు ని ఇవ్వండి. ఆకలికి ఏడుస్తున్నాడు అవని దగ్గరికి తీసుకు వెళుతుంది.
అవని ధనుంజయ్ ని పిలుస్తుంది. చెప్పమ్మా. శిల్పని పిలిపించండి. ఆల్రెడీ చెప్పాను బాబుని ఉయ్యాల్లో వేసే రోజున వస్తానంది.
ఆ సుముహూర్తం కూడా రానే వచ్చింది. 21 రోజున శుద్ధి స్నానం చేయించి ఉయ్యాల్లో వేస్తారు. ఆ రోజే బాబుకి నామకరణ చేయాలి అని బాబు జాతకాన్ని చూడమని బ్రాహ్మణులకి చెబుతారు.
బాబు జాతకం చూసినా పూజారి... ఇందిరాగారితో అమ్మ మీ మనవడు మహా జాతకుడు. ఆ సూర్యుడు లాగా వెలుగుతాడు. మీ వంశ కీర్తిప్రతిష్టలను మరో మెట్టు పైకెక్కిస్తాడు.
అపర చాణిక్య నీతి ఉంటుంది. తండ్రికి మించిన తనయుడు. నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళతాడు. తన ప్రేమ కోసం యుద్ధమే చేస్తాడు.
అది విని అందరూ చాలా సంతోషపడతారు. వినయ్ వెంటనే మా యువరాజు గారికి కూడా లవ్ స్టోరీ ఉంటుందన్నమాట.. పరవాలేదు రా నువ్వు మా పేరు ప్రతిష్టలు నిలబెడుతున్నావన్నమాట..
బాబు పేరు ఏమి పెడదాం అని అందరూ ఆలోచిస్తూ ఉంటే... విక్రమ్ వెంటనే నేను చెబుతాను అని పళ్లెంలో పేరు రాస్తాడు.
అందరూ ఏమి రాసాడా అని తొంగి తొంగి చూస్తారు.
బియ్యంలో ఉన్న పేరు చూడగానే అందరూ వావ్ సూపర్ ఉంది.
నానమ్మ.. ముందుగా నువ్వే పిలువు అని విక్రమ్ అంటే... లేదురా ఫస్ట్ తల్లిదండ్రులే.. తర్వాతే ఎవరైనా..ముందు మీరిద్దరూ చెవిలో చెప్పండి.
అవని, విక్రమ్ బాబు చెవిలో చెబుతారు. వినయ్, నివి వచ్చి అన్నయ్య మీరు చెప్పడం అయిపోయింది కదా.. ఇంక మేము గట్టిగా అరిచి చెబుతున్నాము.
మీరు అందరూ వినడానికి సిద్ధంగా ఉండండి.
?? సూర్య దేవాన్ష్ జై సింహ ??
అందరూ బాబుని ఆశీర్వదిస్తారు. ఇందిరా గారు నవ్వుతూ ఇక మిగిలిన జంటలు కూడా శుభవార్తలు చెబితే ఇల్లు ఇంకా కళకళలాడుతుంది.
వినయ్ పక్కన కూర్చుని ఏంటి గ్రానీ మునిమానవళ్ళ ని అందరినీ వేసుకుని ఒక ఫోటో దిగాలని ఉందా... ఉండదా మరి ఫ్యూచర్లో వాళ్ళకి నేను తెలియాలి కదా..
శిల్ప, ఉదయ్, బిందు, సునీల్ నలుగురు వస్తారు.
అవని శిల్పని చూసి రా శిల్ప.. ఎలా ఉన్నావ్. బాగున్నాను అక్క. తేలికగా ఉందా.. బాగానే ఉంది. నువ్వు ఎలా ఉన్నావు.
అంతా బాగానే ఉందా.. చాలా సంతోషంగా ఉన్నాను.
ఏమి సంతోషంగా ఉన్నావు. చూడు ఎలా చిక్కిపోయావో.. నాకు తెలిసిన శిల్పా ఇలా లేదు.
ఆ శిల్ప చచ్చిపోయి చాలా రోజులైంది అక్క..శిల్పా అని బాధగా అంటుంది. ఇది బాధపడే సమయం కాదు. సంతోష పడే సమయం.
ఆ శిల్ప చచ్చిపోయి కొత్త శిల్ప పుట్టింది. ఈ శిల్పకి జీవితం తెలుసు. మనుషుల విలువ తెలుసు. అంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పు.
నీలో ఈ మార్పు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. నాన్నకి చెప్పాను. మీరు ఇక్కడికి వచ్చేసేయండి. అందరం కలిసి ఉందాం.
లేదు.. మాకు అక్కడే బాగుంది. అక్కడ నుంచి ఎక్కడికి రాము. అక్కడ ఫెసిలిటీస్ ఏమీ లేవు కదా.. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ మధ్యన ఉన్నాను కానీ నా మనసు స్వచ్చంగా లేదు.
ఏ ఫెసిలిటీస్ లేని చోటే నా మనసు స్వచ్ఛంగా ఉంది. ఆ వాతావరణం బాగుంది. నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ప్లీజ్ అక్క.. ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయొద్దు.
మనం కలుస్తూ ఉందాం కానీ ఇక్కడ మాత్రం మేము ఉండము. ఉదయ్ నిర్ణయం కూడా అదే.. మరి మీ అత్తయ్య వాళ్ళు అంటే అందరికీ ఆ నిర్ణయమే నచ్చింది.
ధనుంజయ్ కూతుర్లు ఇద్దరు దగ్గరికి వచ్చి పక్కన కూర్చుని శిల్ప నిర్ణయం నాకు ముందే చెప్పింది.
అందుకే అక్కడ కావాల్సినవన్నీ అరేంజ్ చేశాను. ల్యాండ్ కొన్నాను. ఇల్లు కూడా అక్కడ సపరేట్గా కట్టిస్తున్నాను.
ఎందుకు నాన్న మాకు ఆ గుడిసె బాగుంది. నీలో మార్పు రావాలి అని మాత్రమే అక్కడ ఉంచాను కానీ నా పిల్లల కష్టపడుతూ ఉంటే ఇంత సంపాదించి ఏమీ ఉపయోగం.
ముగ్గురిని అలా చూసినా సత్యవతి, శేషగిరి కళ్ళు చెమర్చుతాయి. విక్రమ్ వైపు చూసి నమస్కారం చేస్తారు. విక్రమ్ ఆ చేతులను పట్టుకుని మీరు పెద్ద వాళ్లు.. ఆశీర్వదించాలి గాని ఇలా చేయకూడదు.
నువ్వు వయస్సులో చిన్నవాడివి కావచ్చు కానీ గుణంలో, సంస్కారంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నావు. ఇప్పుడు నీ కొడుకు కూడా అంతకన్నా గొప్ప స్థానంలోనికి వెళతాడు. ఈ ఆశీర్వాదం మాకు చాలు.
సూర్య దేవాన్ష్ జై సింహ రాక...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)