Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#58
Part - 27

నాది ప్రేమ కాదా అమ్మ అని మయూరి అడుగుతుంది.
దానికి లక్ష్మి గారు మయూరి కళ్ళల్లోకి చూస్తూ  నీది ప్రేమే కానీ...దేవేంద్ర మనస్సు నీ ప్రేమ కి స్పందించలేదు.

మరొకరిని చూసి స్పందించింది. ఇప్పుడు మా మధ్యన తన లేదు కదా అమ్మ అంటే.. లేకుండా పోవడానికి కారణం ఎవరు మయూరి??

ఇద్దరి మనుషుల మధ్యకి ఒక బంధం ఏర్పడక ముందు తప్పయినా కొంచెం వెళ్లడానికి ప్రయత్నించవచ్చు కానీ ఆ బంధం బలోపేతం అయిన తర్వాత వెళ్లడం మాత్రం మహా పాపం మయూరి.

నువ్వు మీ నాన్న చేసింది మాత్రం మహా ఘోరం. ఎలా దేవేంద్ర నిన్ను తన జీవితంలోనికి రానిస్తాడు అనుకుంటున్నావు.

నువ్వే దేవేంద్ర ని మర్చిపోలేక అతని వెంట తిరుగుతున్నావు. మరి దేవేంద్ర తన భార్యతో కొన్ని రోజులు  దాంపత్య జీవితం సాగించాడు.

మరి తనే ఎలా మర్చిపోతాడు అని అడుగుతుంది. అయినా మయూరి అర్థం చేసుకోకుండా నా ప్రేమ ఒప్పుకోవాలి కదా అని అడుగుతుంది.

అంత ఓపికగా చెప్పిన లక్ష్మీ గారు కూడా విసుగు వచ్చి నీది ప్రేమ కాదు. ఉన్మాది తత్వం. అందుకే ఇంతమంది నాశనాన్ని కోరుకుని అయినా సాధించాలి అనుకుంటున్నావు.

నీ జీవితంతో పాటు ఆశ, నిషా జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు అది అర్థం అవుతుందా నీకు అని గట్టిగానే అడుగుతారు.

ఒక్కటి మాత్రం గుర్తించుకో మయూరి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమందిని నాశనం చేసిన దేవేంద్ర నీకు దక్కడు.

నువ్వు ఇప్పటివరకు ఎన్ని తప్పులు చేసినా ఆడపిల్లవి అని జితేంద్ర, దేవేంద్ర కనికరం చూపించారు ఏమో గాని ఈ జనరేషన్ లో ఉన్న ఆ ముగ్గురు  వారసులు అస్సలు క్షమించరు.

అంటే ఏంటమ్మా అని కోపంగా అడుగుతుంది. నీకు అర్థమైందని నాకు తెలుసు  మయూరి.

  నిన్ను అడ్డుపెట్టుకొని మీ నాన్న  వాళ్ల ఆస్తిని సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. సొంత చెల్లి సంసారం నాశనం అవుతున్న పట్టించుకోలేదు.

ఇప్పుడు కూతురు జీవితాన్ని కూడా అలాగే చేశారు. మీరు ఎన్ని చేసిన మీ ప్రయత్నాలు వృధా ప్రయాస ఇప్పటికైనా మేలుకొని మనుషుల్లాగా మారండి అని విసుక్కుని వెళ్ళిపోతారు.

మయూరి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ఆలోచిస్తూ, ఒక్కసారిగా తల విదిల్చిచి అమ్మ నా మైండ్ ని పొల్యూట్ చేస్తుంది.

ఎప్పటికైనా దేవేంద్ర నా ప్రేమని నమ్మి నా దగ్గరికి వస్తాడు అమ్మ అన్నీ అలాగే చెబుతుంది అనుకుంటూ మళ్ళీ దేవేంద్ర ఫొటోస్ చూస్తూ ఉంటుంది.

ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం అంటే ఇదేనేమో...

బృందావనం..

అనసూయ గారు అందర్నీ అబ్సర్వ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు లేని కొత్త కళతో అందరూ ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి.

ఆవిడకి అర్థం అవుతుంది దేవేంద్ర కూతురు దొరికింది అని..

ఈ సంతోషాన్నా నేను ఇన్ని రోజులు దూరం చేసాను నా కుటుంబానికి అన్ని బాధపడతారు.

దేవేంద్ర కూతురిని నేను చూడాలి అని బలంగా అనుకుంటూ కోడలు వంక చూస్తారు. కౌసల్య దగ్గర ఏమైనా ఫొటోస్ ఉన్నాయేమో కనుక్కోవాలి.

అందరి డిన్నర్ అయ్యేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు.
ఎవరు రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కౌసల్య అని పిలుస్తారు చెప్పండి అత్తయ్య అని దగ్గరకు వస్తుంది.

నేను ఒక విషయం అడుగుతాను నిజం చెబుతావా అని అడుగుతారు.  దేని గురించి అత్తయ్య అని అనుమానంగా చూస్తుంది.

దేవేంద్ర కూతురు కనిపించింది కదా అని ఆశగా అడుగుతారు. మీకెందుకు అత్తయ్య ఆ విషయాలు అన్నీ అని ఇబ్బందిగా చెబుతుంది.

ప్లీజ్ కౌసల్య దయచేసి నాకు నిజం మాత్రమే చెప్పు అని బ్రతిమాలితారు. ఆవిడ బాధ చూడలేక అవును అత్తాయ్య కనిపించింది.

ఎలా ఉంటుంది కౌసల్య అని అత్రంగా గా అడుగుతారు.
కుందనపు బొమ్మ లాగా ఉంటుంది. తను పెరిగిన వాతావరణం కూడా చాలా మంచిది అత్తయ్య.

బాగా విలువలు నేర్పించారు అని  వాళ్ళ అత్తయ్య గారి వంక చూస్తుంది. అమ్మాయివి ఏమైనా ఫొటోస్ ఉన్నాయా ఉంటే ఒకసారి చూపించు కౌసల్య చూడాలని ఉంది అని అడుగుతారు.

నా దగ్గర తన ఫొటోస్ ఏమీ లేవు అత్తయ్య అంటే ప్లీజ్ కౌసల్య ఒక్క ఫోటో చూపించూ... నిజమే చెబుతున్నాను అత్తయ్య నా దగ్గర లేవు.

మీతో ఈ విషయాలు మాట్లాడాలని తెలిస్తే నాపై మావయ్య గారికి కోపం వస్తుంది ఇంకా దయచేసి అడగకండి అని ఆవిడ రూమ్ లోకి వెళ్ళిపోతుంది.

రూమ్ లోనికి వెళ్ళిన తర్వాత ఏవండీ అని భర్తని పిలుస్తుంది చెప్పు కౌసల్య అంటే అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు అండి శాంభవి ని చూడాలని అంటే...

అమ్మకి ఎలా తెలిసింది అని అడుగుతారు. తనకి, వాళ్ళ అత్తయ్య గారికి  మధ్య జరిగిన విషయం అంతా చెబుతుంది.

అంతా విన్న జితేంద్ర గారు భార్య వంక చూస్తూ.. ఇంక అమ్మకు శాంభవి గురించి ఏమీ తెలియని వ్వకు.  పేరు కూడా  చెప్పకు.

అత్తయ్య గారు మారారు కదండీ అంటే..  శాంభవి, దేవేంద్ర విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేము.

ఇప్పటికే వాడు జీవితంలో చాలా విలువైన కాలాన్ని కోల్పోయాడు. ఇప్పుడు అమ్మని నమ్మి ఎలాంటి ప్రమాదాన్ని తీసుకురాలేము అర్థమైందా అనగానే  అర్థమయింది అని తల ఊపుతుంది.

రేపు చార్మినార్ వెళ్లే ప్రోగ్రాం ఉన్నట్టుంది కదా జాగ్రత్త. చుట్టూ ఉన్న మనుషులను కూడా అబ్సర్వ్ చేస్తూ ఉండండి.

మా జాగ్రత్తలో మేమున్నం సెక్యూరిటీని అరేంజ్ చేసాము. బట్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి.
ఇంక పడుకో చాలా లేట్ అయింది అని  నడుము వాలుచుతారు.

రుద్ర చారులత గారితో గొడవ పడుతూ ఉంటాడు అమ్మ మీకు ఇంత దురద ఏంటి? శాంభవి ఎవరో తెలుసాకా  అసలు వదలము అంటున్నారు.

మీరు వెళితే అందరికీ రిస్క్ అని తెలుసు కదా అమ్మ అని అంటాడు. ఒరేయ్ మేము ఏదో క్యాజువల్ గా వెళ్లినట్టు వెళ్తాము రా!  మేము శాంభవి ఫ్యామిలీకి దగ్గర అవ్వడానికి మా ప్రయత్నాలు ఏం చేస్తున్నాం.

మా లేడీస్ మధ్యన బాండింగ్ పెరిగితేనే కదా రేపు అన్న రోజున ఏమన్నా చేయడానికి ఉంటుంది. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు రిస్కుందని మానేస్తే ఎలా రా అని అంటారు.

చారులత వంక  చూస్తూ ఈ ఐడియా మాత్రం నీది కాదు నీకు ఎవరు ఇచ్చారు అని డౌట్గా తులసి గారి వంక చూస్తాడు.

ఏంట్రా నువ్వు నా వైపు చూస్తున్నావు నాకేమీ తెలియదు అంటే.. నిన్ను నేను ఏమీ అడగలేదు కదా!

అయినా నువ్వు అలా మాట్లాడేవా అంటే కచ్చితంగా ఈ బుడబుక్కల ఐడియా నీదే కదా అని గుర్రుగా చూస్తాడు.

ఒరేయ్ నా అనుభవంతో చెబుతున్నాను ఆడవాళ్లు కలిశారు అంటే ఎలాంటి సమస్యకైనా సొల్యూషన్ దొరుకుతుంది.
వాళ్లు జుట్టు జుట్టు పట్టుకున్నారంటే సొల్యూషన్ దొరికే చోట కూడా క్రిటికల్ గా మారిపోతుంది.

అవునా అని వెటకారంగా అంటూ చూద్దాం ఈ ఆడవాళ్ళందరూ కలిసి ఈ సమస్యకి ఎలాంటి సొల్యూషన్ చెబుతారో  గుడ్ నైట్ అని చెప్పి రూమ్ కి వెళ్ళి మంచం మీద పడుకుని శాభవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

పొద్దున్నే శాంభవి తో జరిగిన గొడవ గుర్తొచ్చి నవ్వొస్తుంది.
నా మరదలు పిల్ల అందమైనదే కాదు, గొడవ కూడా బాగానే పడుతుంది.
పరవాలేదు పెళ్లయిన తర్వాత మనకి అంత బోరింగ్ ఉండదు.

రేపు ఫుల్ ఫ్యామిలీని చూడాలి. వాళ్లతో శాంభవికున్న బాండింగ్ డైరెక్ట్ గా చూడాలి .

  శాంభవి తో  ఎలా షాపింగ్ చేయాలి అని లేడీస్, కూతురికి ఏమేమి కొనాలా అని దేవేంద్ర.

వీళ్ళందరూ సెక్యూరిటీ ఎలా అని అబ్బాయిల ఆలోచన.
తన ఫ్యామిలీ కోసం ఎదురుచూపులతో శాంభవి
ఇలా ఎవరి ఆలోచనలతో వాళ్ళు నిద్రకు ఉపక్రమిస్తారు.

మయూరి శాంభవి ని కనిపెట్టగలుగుతుందా??
కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - Yesterday, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - Yesterday, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - Today, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - Today, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - Today, 07:00 AM



Users browsing this thread: 2 Guest(s)