Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#57
Part - 26

మనం కూడా వెళితే మన శత్రువులకు డౌట్ వస్తుంది అని రుద్ర అంటాడు. ఇప్పుడేం చేద్దాం అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా...

రుద్ర ఫోన్ రింగ్ అవుతుంది. చూడగానే అమ్మ అని స్క్రోల్ అవుతూ ఉంటుంది. అమ్మ ఎందుకు ఈ టైం లో ఫోన్ చేస్తుంది అని డౌట్ గా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అనగానే..

  ఒరేయ్ రేపు మేము కూడా చార్మినార్ వెళ్తున్నాము. అరేంజ్మెంట్స్ చేయండి రా అని చెప్పి రుద్ర చెప్పేది కూడా వినకుండా ఫోన్ పెట్టేస్తుంది.

మనం నలుగురం ఇక్కడే ఉన్నాం కదా అప్పుడే న్యూస్ ఎలాగా స్ప్రెడ్ అయిందని డౌట్ గా ధీరజ్ వంక చూస్తాడు.

   నీళ్లు నములుతూ అంటే బావ.. శాంభవి మనతో టైం స్పెండ్ చేస్తుంది కదా! మన వాళ్ళు కూడా వింటారు అని గ్రూప్ కాల్ పెట్టాను అని చెబుతాడు.

నీ చెల్లి ది అసలే పెద్ద బిబిసి నోరు. ఈపాటికి అందరికీ మా నాన్న వస్తున్నారు, మా నాన్న వస్తున్నారు అని ఎగురుకుంటూ  చెబుతూ ఉంటది.

ఈ విషయం ఆ ఇన్ ఫార్మర్ కూడా తెలిసిందంటే మయూరి కి పాస్ చేస్తాడు.

ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలంటే మీ తర్వాతే రా ఎవరైనా అని విసుగ్గా అంటాడు.  బావ నువ్వు మరి మమ్మల్ని అలా తీసి పడేయకు అని గోముగా అంటాడు.

ఒరేయ్ నువ్వు ఆడపిల్లవు కాదు రా! మరి అలా మెలికలు తిరగకు అంటే.. నేను ఆడపిల్లనైతే నీకు పర్వాలేదా బావ అని నవ్వుతాడు.

రేయ్ నువ్వు ఆగరా అని రుద్ర కుర్చీలోంచి లెగుస్తాడు. నేను ఆగను బావ.. ఆగితే నీ చేతిలో నేను అయిపోతాను అని బయటికి పరుగు అందుకుంటాడు.

అద్వైత్   ఇప్పుడు ఏం చేద్దాం బావ అంటే...  ముందు మనోళ్ళయినా కన్విన్స్ చేయాలి. లేదా ఫుల్ సెక్యూరిటీ నైనా అరేంజ్ చేయాలి.

రుద్ర ఇంటికి ఫోన్ చేస్తాడు. చెప్పు రుద్ర అరేంజ్మెంట్స్ అయిపోయినాయి అంటే... అమ్మ ప్లీజ్ ముందు నేను చెప్పేది విను

మన ఆఫీసులోనే మయూరి ఇన్ఫార్మర్ ఉన్నాడు. మేము తెలుసుకునే వరకు మీరు శాంభవి తో  క్లోజ్ అవ్వకండి అంటే...

ఒరేయ్ అదంతా మీ ప్రాబ్లం రా.  ఇన్ని రోజులు దూరంగా ఉన్నాము. ఇంకా ఉండాలంటే మా వల్ల కాదు అంటే..

ప్లీజ్ అమ్మ అర్థం చేసుకోండి అని కొంచెం వాయిస్ పెంచుతాడు. ఏంట్రా  వాయిస్ పెంచుతున్నావు అంటే మరి పెంచక ఏం చేయమంటావు.
నేను ఒక ఐడియా చెబుతాను అంటుంది. ఏంటి చెప్పమ్మా అంటే మేము రేపు సాయంత్రం కదా వెళ్ళేది.
ఈలోపు అందరు ఫోన్ లు ట్రాక్ చేయండి.

ప్రెసెంట్ అయితే  జామర్ ఆన్ చేసి ఫోన్లు పని చేయకుండా చేయండి. మీరు ఇప్పుడు మొదలుపెడితే ఎంతో కొంతమంది అయినా ఫోన్లు ట్రాక్ చేయొచ్చు కదా అని చెబుతోంది.

అమ్మ ఆల్రెడీ మేము ట్రాక్ చేసే దాంట్లోనే ఉన్నాము. నీ బ్రెయిన్ బలే షార్ప్ గా ఉంటదమ్మా అంటే..  మరి ఏమనుకుంటున్నావ్ ఇక్కడ  ఉన్నది రాఘవేంద్ర డాటర్ ని అని గర్వంగా చెబుతోంది.

అమ్మ మీ అమ్మాయిలకి ఎంతసేపు నాన్న భజన తప్ప ఇంకేమీ కనిపించదా! వేరే వాళ్ళు మనుషులు కాదా అని ప్రెస్టేట్  అవుతాడు.

ఎందుకురా అంత కోపం. రేపు నీకు కూతురు పుడితే నీ కూతురు కూడా అదే జపం చేస్తుంది. ముందు చెప్పిన పని చేయండి అని ఫోన్ పెట్టేస్తారు.

చారులత గారికి మొట్టమొదటిసారి వాళ్ళ అమ్మగారి మీద చాలా కోపం వస్తుంది.  నువ్వు చేసిన తింగరి పని వల్లే కదా నా మేనకోడలికి మేము ఇంత దూరంగా ఉండవలసి వచ్చింది.

ఏమి సాధించావు అమ్మ నువ్వు.  అందరికీ దూరమవడం తప్ప అని బాధపడతారు. నీ మీద కోప్పడాలో,  నిన్ను చూసి బాధపడాలో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ..

రేపు చార్మినార్ వెళ్ళినప్పుడు ధరణి,,జయంతి గారితో ఎలాగైనా మాట కలపాలి క్లోజ్ అవ్వాలి అని ఆలోచిస్తారు.

తులసి గారు వచ్చి ఏమైంది చారు అంతలా ఆలోచిస్తున్నావు అంటే.. రేపు చార్మినార్ వెళ్లే ప్రోగ్రాం ఉంది అత్తయ్య.

   ఎలాగా ధరణి, జయంతి గారితో మాట కలపాలని ఆలోచిస్తున్నాను అంటే... దీనికి అంత ఆలోచించవలసిందేముంది.

  ఆడవాళ్లు ఒకచోట కలిస్తే పరిచయం లేకపోయినా మాటలు కలిసిపోతాయి. రేపు ఏ గాజుల దగ్గర మాటలు మొదలుపెట్టండి.  ఆటోమేటిగ్గా కలిసిపోతారు అని చెబుతుంది.

మీరు సూపర్ అత్తయ్య అని బుగ్గ మీద కిస్ చేస్తుంది.
నేను వదినకి కాల్ చేస్తాను అని చెప్పి, కౌసల్య కి ఫోన్ చేసి.. రేపు వెళ్లే ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ ఉంటుంది.

శాంభవి తన టీం తో కలిసి వర్క్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తోంది. శాంభవి రుద్ర వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో అంతా విన్న దేవేంద్ర కూడా  రేపు వర్క్ వీళ్లకు తక్కువ ఇవ్వాలని డిసైడ్ అవుతాడు.

మెల్లిగా సార్ అని పిలుస్తుంది. చెప్పు శాంభవి అంటే...  మా వర్క్ అయిపోయింది కదా!  రేపటి వర్క్ ఈరోజు ఏమైనా చెబుతారా అని అడుగుతుంది.

ఏమీ తెలియనట్టుగానే అంత కంగారు ఏముంది.  రేపు నేర్చుకోవచ్చు కదా అని దేవేంద్ర అడుగుతారు.

  అంటే రేపు వర్క్ తొందరగా అయిపోతే మేము వెళ్ళిపోవచ్చు కదా అని అంటుంది. అంత అర్జెంట్ పనులు ఏమున్నాయి శాంభవి అంటే..

రేపు మా పేరెంట్స్ వస్తున్నారు సార్.  అందుకని అని కుదిరితే ఈరోజు కొంచెం ఫాస్ట్ గా ఫినిష్ చేద్దామని అని చెబుతుంది.

అంత అవసరం లేదులే..  రేపు వీకెండ్ కదా కొంచెం తక్కువ వర్క్ నేర్పిస్తాను అని చెప్పి,, ఓకే బాయ్  చెప్పి డౌట్స్ ఏమన్నా ఉంటే క్రాస్ చెక్ చేసుకోండి. రేపు క్లియర్ చేస్తాను అని బయటకు వచ్చేస్తారు.

దేవేంద్ర కూడా రేపు నేను కూడా చార్మినార్ వెళ్లేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి నా కూతురికి నచ్చినవన్నీ నేనే కొనాలి అనుకుంటూ క్యాబిల్లోకి వెళ్లి రుద్రకి కాల్ చేస్తాడు.

చెప్పు చిన్న మామ అంటే.. ఒరేయ్ రేపు నేను కూడా చార్మినార్ వెళ్తాను అని చెబుతారు.  మామ మీ అందరికీ ఏమన్నా పిచ్చా... అమ్మ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది.

   ఇప్పుడు మీరు అలాగే చెబుతున్నారు సెక్యూరిటీ ఎంత కష్టమవుతుందో అర్థం అవుతుందా మీకు అని కోపంగా ఉంటాడు.

దానికి దేవేంద్ర నా కూతురుతో ఫస్ట్ టైం షాపింగ్ కి వెళుతున్నాను రా!  ఆ మాత్రం అరేంజ్ చేయలేరా మీరు. ఒకరికి నలుగురు ఉన్నారు అని గట్టిగా అంటారు.

    సెక్యూరిటీ గురించి కన్నా మయూరితోనే ఎక్కువ ప్రాబ్లం చిన్న మామ.  ఆల్రెడీ మన ఆఫీసులో ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నారని మాకు డౌటుగా ఉంది అని చెబుతాడు.

ఆ డౌట్ నీకెందుకు వచ్చింది అని దేవేంద్ర అడిగితే..  పొద్దున ఇంటి దగ్గర జరిగిన విషయం అద్వైత్  చెప్పాడు.

   అప్పుడే నాకు డౌట్ మొదలయ్యింది. నేను అందరి ఫోన్లు ట్రాక్ చేపిస్తున్నాను.

మాక్సిమం ఈవినింగ్ లోపు మనకు తెలిసిపోవచ్చు లేదు అంటే రేపు మార్నింగ్ కి తెలుస్తుంది. కానీ ఈలోపే మయూరీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కదా అందుకని నేను టెన్షన్ పడేది అని చెబుతాడు.

ఇప్పుడు ఏం చేద్దాం అని దేవేంద్ర అడుగుతారు. మీరు టెన్షన్ పడకండి చిన్న మామ.  నేను అరేంజ్ చేస్తాను కదా! నిన్ను నీ కూతుర్ని కలిపి షాపింగ్ పంపుతాను సరేనా కొంచెం నవ్వండి అని  ఫోన్ పెట్టేస్తాడు.

ఫోన్ పెట్టేసాక దేవేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. మయూరి ఇప్పటిదాకా నువ్వు ఏం చేసినా భరించాను.

ఆడదానివాని వదిలేసినప్పుడల్లా నువ్వు రెచ్చపోతున్నావు.నా కూతురు జోలికి వస్తే మాత్రం నిన్ను ఎవరు రక్షించలేరు. ఈసారి నా కోపానికి నువ్వు బలి అవ్వాల్సిందే అని కళ్ళు మూసుకుంటారు.

మయూరి తన ఆఫీసులో బిజీగా ఉన్నప్పుడు ఒకటే ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి . ఎంత వాటర్ తాగుతున్న కంట్రోల్ అవ్వడం లేదు.

ఏంటి ఇంత దారుణంగా ఎక్కిళ్ళు వస్తున్నాయి .నన్ను అంతగా తలుచుకునే ప్రియమైన వాళ్ళు ఎవరు ఉన్నారు. నా ప్రియమైన శత్రువు తలుచుకుంటున్నాడా ఏంటి అని దేవేంద్రని తలుచుకుంటుంది.

కళ్ళు మూసుకుని కుర్చీలో తల వెనకేవాల్సి పాత విషయాలను గుర్తు చేసుకుంటుంది. చాలా డిస్టర్బ్ గా అనిపించి ఇక వర్క్ ఆపేసి ఇంటికి వెళ్ళిపోతుంది.

ఇంటికి వచ్చిన మయూరిని చూసి లక్ష్మీ గారు ఏంటి ఈ టైంలో ఇంటికి వచ్చావు అంటే.. ఏ రాకూడదా అని అడుగుతుంది.

  నిన్న ఆపగలుగేవాళ్లు ఇక్కడ ఎవరు ఉన్నాము ఇంత సడన్గా వస్తే ఎవరు కొంప కూల్చడానికా  అని డౌట్ వచ్చింది అంతే అని చెప్పి లోపలకి వెళ్ళిపోతారు.
ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన కూతుర్ని అడగవలసిన ఇదేనా అనుకుంటూ.. రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసేసుకుంటుంది.

ఆ రూమ్ కి అటాచ్డ్ గా ఇంకొక చిన్న రూమ్ ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ చేయగానే ఆ రూమ్ మొత్తం వయసులో ఉన్న దేవేంద్ర ఫొటోస్ ఉంటాయి.

ఆ ఫొటోస్ తడుముతు.. ఎందుకు దేవేంద్ర నా ప్రేమ నీకు అర్ధం కాలేదు. నాలాగా ప్రేమిచే వాళ్ళు నీకు దొరుకుతారా చెప్పు అని ఫొటోస్ తడుముతు కిస్ చేస్తుంది.

నీకు ఎప్పటికైనా  నా ప్రేమ అర్ధం అవుతుంది. అప్పుడు నువ్వే నా దగ్గరికి వస్తావు. అప్పటివరకు నేను వెయిట్ చేస్తూనే ఉంటాను.

నీ కోసం ఏమైనా చేస్తాను అని ఒక ఉన్మాది లాగా బెహేవ్ చేస్తూ నీలెవెత్తు రూపం లో దేవేంద్ర మైనపు బొమ్మని కౌగిలించుకుంటుంది.
తలుపు గట్టిగా కొడుతున్న శబ్దం వినిపించి చిరాగ్గా  తలుపుతీస్తుంది. ఎదురుగా లక్ష్మీ గారు కాఫీ కప్పుతో ఉంటారు.

రామ్మ అని పక్కకు తప్పుకుంటుంది. కూతురు మొహం చూసి ఏమైంది మయూరి అలా ఉన్నావు అంటే...

ఎందుకమ్మా నా ప్రేమను దేవేంద్ర అర్థం చేసుకోవడం లేదు అని బేలగా అడుగుతుంది. కూతురి ని అలా చూసిన లక్ష్మి గారికి మనసు చివుక్కుమంటుంది.

ఇలా కూర్చో మయూరి అని సోఫాలో కూర్చోబెట్టి,పక్కన కూర్చొని... నువ్వు దేవేంద్ర ని కోరుకున్నావు. కానీ దేవేంద్ర మనసు వేరేవాళ్లుని కోరుకుంది.
మరి నాది ప్రేమ కాదా అని అడుగుతుంది.

లక్ష్మీ గారి సమాధానం ఏమిటి??
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - Yesterday, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - Yesterday, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - Today, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - Today, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - Today, 07:00 AM



Users browsing this thread: 2 Guest(s)