Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#56
Part - 25

  శాంభవి వాళ్ళ వంక చూసి అంటే నాన్న ఫోన్ చేశారు ఎక్కడ ఉన్నానో చూసుకోలేదు అని ఇబ్బందిగా చెబుతుంది.

రుద్ర వెటకారంగా నువ్వు ఎప్పుడు చూసుకుని మాట్లాడావులే అని అంటారు.  అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చి.

నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు కదా సార్. ఎందుకు మీరు అస్తమాను నామీద కోపం చూపిస్తున్నారు అని మళ్లీ ఉక్రోషంగా మాట్లాడుతుంది.  మిగిలి ముగ్గురు వీళ్ళు ఇద్దరి వంక అలాగే చూస్తూ ఉంటారు.

  ధీరజ్ విహన్ తో మనోడే నా ఇలా ఒక ఆడపిల్లతో మాట్లాడుతున్నాడు అంటే..  మరదలు అనే హక్కుతో అనుకుంటా అని చిన్నగా అంటాడు.

అంతే అయ్యుంటుంది అని..  బావ మాకు చాలా ఆకలిగా ఉంది ముందు లంచ్ చేద్దామా అని ధీరజ్  ఆపుతాడు. శాంభవి ఇబ్బంది పడుతుంటే విహాన్ పక్కన కూర్చుని నువ్వు మా చెల్లి తో సమానము.  కూర్చో అని చెప్పి విహాన్ ఒక పక్కన అద్వైత్ మరో పక్కన కూర్చుంటారు.

సైలెంట్ గా ధీరజ్  ఫోటో తీస్తాడు   రుద్రా ముగ్గురు వంకే చూస్తూ ఉంటాడు.  ధీరజ్ రుద్ర తో ఏంటి బావ నువ్వు కూర్చోవాల్సిన ప్లేస్ లో మీ బావలు కూర్చున్నారని చూస్తున్నావా అంటే... ఒక్క లుక్కు వేస్తాడు.

అర్థమైంది లే నేను సైలెంట్ అవుతున్నాను అని కామ్ గా కూర్చుంటాడు. ప్యూన్ వచ్చి సర్వ్ చేయబోతుంటే శాంభవి ఆపి నేను సర్వ్ చేస్తాను అని చెప్పి ప్యూన్ చేతుల నుంచి తీసుకుంటుంది..

పర్వాలేదు నువ్వు కూర్చో శాంభవి ప్యూన్ సర్వ్ చేస్తాడు అని  ధీరజ్  అంటాడు.  పర్వాలేదు సార్ నాకు ఇష్టమే ఇలాగ అని చెప్పి ముందు  కర్రీస్ వేసి రైస్ పెడుతుంది.

శాంభవి కి భోజనంలో నెయ్యి అలవాటు ఉందని ఫస్ట్ రోజే అర్థమయ్యి నెయ్యి కూడా పెట్టి లంచ్ పంపిస్తారు.  సైలెంట్ గా భోంచేస్తున్న శాంభవి తో మాట కలుపుతారు.

తన ఫ్యామిలీ విషయాలైతే  యాక్టీవ్ గా ఉంటుందని వాళ్ళ అన్నయ్యలు గురించి అడగడం స్టార్ట్ చేస్తారు .
అంతే ఏం చెబుతుందో తెలియకుండా  అన్నయ్యలు గురించి చెబుతూనే ఉంటుంది.

ముగ్గురు అన్నయ్యలు తను ఎంత పాంపర్ చేస్తారో చెబుతూ ఉంటుంది. వాళ్ల జేజి నుంచి ముగ్గురు ఎలా సేవ్ చేస్తారో చెబుతుంది.

అవన్నీ వింటున్న విహాన్,  అద్వైత్ కి తను ఏం మిస్ అయ్యారో అర్థం అవుతుంది. శాంభవి వాళ్ళతోనే ఉండుంటే మేము ఇంత అల్లరి చేసే వాళ్ళం కదా అనుకుంటారు.

ధీరజ్  కి కూడా అలాగే అనిపిస్తుంది. శాంభవి వాళ్లతో మాట్లాడుతునే భోజనం కంప్లీట్ చేస్తుంది.  కానీ విహాన్, అద్వైత శాంభవి  చెప్పేది వింటూ అన్నాన్ని కేలుకుతూ ఉంటారు.

వాళ్లను చూసి అదేంటి సార్ మీరు భోజనం చేయడం లేదు అంటే..  అదేంలేదు నువ్వు చెబుతూ ఉంటే మాకు మా చెల్లి కూడా మాతో ఉంటే మేమే ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అని అనిపించింది అని చెప్పి భోంచేస్తారు.

మీ చెల్లి ఇప్పుడు మీతో లేదా అంటే.. ప్రస్తుతానికి దూరంగా ఉంది కానీ త్వరలో వచ్చేస్తది అని చెబుతారు. స్టడీస్ కోసం అవుట్ ఆఫ్ వెళ్ళారా అని అడుగుతుంది .ఒక రకంగా అలాంటిదే అని చెబుతారు.

చెల్లి దూరంగా ఉంటే చాలా పెయిన్ కాద సార్. మా అన్నయ్యలు కూడా అలాగే సఫర్ అవుతున్నారు. అసలు నేను ఇంత దూరం రావడానికి కారణమే మా అమ్మలు ఇద్దరు  అని కోపంగా ఉంటుంది.

ధీరజ్  అయోమయంగా ఇద్దరమ్మాలేంటి నువ్వు సెలెక్ట్ అయితే కదా వచ్చావు అని అడుగుతాడు. ధీరజ్  వంక  చూస్తూ నేను పాటిస్పేట్ చేస్తే సెలెక్ట్ అవుతాను సార్ .

రుద్ర శాంభవి ని  చూస్తూ ఓరిని దీని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని అనుకుంటాడు.
ధీరజ్ ఉత్సాహంగా మీ అమ్మలు ఇద్దరు ఏం చేశారు అని అడిగితే...
సెలెక్ట్ అవ్వవు అని రెచ్చగొట్టారు సార్.ఓకే సెలెక్ట్ అయితే సరిపోతుంది కదా అని పార్టిసిపేట్ చేశాను.

సెలెక్ట్ అయ్యాను అని గొప్పగా చెబితే... యావరేజ్ స్టూడెంట్ కూడా సెలక్ట్ అయ్యారు నువ్వు సెలెక్టె అవ్వడం గొప్ప అని తీసి పడేసారు అని ఉక్రోషంగా చెబుతోంది.

శాభవి చెప్పే విధానానికి అందరికీ నవ్వు వస్తూ ఉంటుంది నవ్వితే ఫీల్ అవుతుంది అని అందరూ చాలా కష్టంగా నవ్వు ఆపుకుంటారు.

తర్వాత ఏం జరిగిందని ఉత్సాహంగా అడుగుతారు. దానికి బాధగా అందరినీ చూస్తూ  నువ్వు ఇంటర్నషిప్ చేసి సక్సెస్ అవుతే అప్పుడు నువ్వు, మీ నాన్నలు గొప్ప లేకపోతే అందరూ జీరోనే అని రెచ్చగొట్టారు.

మా నాన్నలకు మాట రాకూడదు సార్. అందుకే ఇష్టం లేకపోయినా ఇంత దూరం వచ్చాను అని చెబుతుంది.
మీ నాన్నలు అంటే నీకు అంత ఇష్టమా అని అడిగితే..

చాలా సార్ అని చెబుతూంది. మా నాన్నలకి కూడ నేను అంటే ప్రాణం. నేను ఎవరీ డే వేసుకునే డ్రెస్సెస్ దగ్గర్నుంచి అన్ని మా నాన్న సెలెక్ట్ చేస్తారు.
ఏ రోజు ఏం చేసుకోవాలన్నది కూడా మా నాన్నలే సెలెక్ట్ చేస్తారని చాలా గొప్పగా చెబుతోంది.
ఇవన్నీ వింటున్న నలుగురికి, ఫోన్లో వింటున్న ఫ్యామిలీ మెంబర్స్ కి,ఆ ఫ్యామిలీతో శాంభవి కి ఉన్న అటాచ్మెంట్ ఎలాంటిదో అర్థమవుతుంది.
ఇంకా ఎవరు ఉంటారు మీ ఫ్యామిలీలో అని అడుగుతారు.  నానమ్మ, తాతయ్య.మా తాతయ్య రాము నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ తెలుసా అని చెబుతోంది. 

  నేను చేసే పనులకి మా జేజి దగ్గర ఎక్కువగా బుక్ అయ్యేది మా నాన్నమ్మ అని నవ్వుతుంది.

అది ఎలా అంటే..  మా జేజి చాలా స్ట్రిక్ట్. మా నానమ్మ కి చాలా భయం.  నేను ఇంట్లో ఉండేది తక్కువ.
ఉంటే కాలేజ్ లేకపోతే నాన్నతో పొలం లో ఉంటాను. సడన్గా జేజి  అడుగుతూ ఉండేది బంగారం ఎక్కడ ఉంది అని..
మా నానమ్మకి తెలియదు కదా నేను ఎక్కడ ఉంటానో అని ఆవిడ టెన్షన్ తో మా అమ్మల వంక చూసేది. మా అమ్మలు కవర్ చేస్తూ ఉండేవారు.
లేకపోతే నానితో చెప్పించేదాన్ని అని చెప్తుంది. మధ్యలో ఈ నాని ఎవరు అంటే.. నా ఫ్రెండ్ అని చెబుతోంది.

   అబ్బాయి ఫ్రెండ్ అనేటప్పటికి రుద్ర  కి కొంచెం జలసి వస్తుంది.
నువ్వు కాలేజీలో ఉంటే తన కూడా కాలేజీలోనే ఉంటాడు కదా అని ధీరజ్  అడుగుతాడు అయ్యో సార్ తన కాలేజ్ ఫ్రెండ్ కాదు.

తన ఇంకా స్కూలే అని  చెప్తుంది. అప్పుడు రుద్ర కొంచెం శాంతిస్తాడు. ధీరజ్ రుద్ర  పేస్ చూస్తాడు.

మా బావకి జెలసి మామూలుగా లేదు కదా అనుకుని నవ్వుకుంటాడు.
రేపు వీకెండ్ కదా సార్. మా ఫ్యామిలీ మొత్తం వస్తుంది నాకోసం అని చెప్తుంది.
మీరు వచ్చి ఇంకా వన్ వీక్ కూడా అవలేదు కదా! అప్పుడే వస్తున్నారా అంటే.. సార్ 4 డేస్ అయిపోయింది.

ఇప్పుడు దాకా నేను ఎప్పుడూ మా ఫ్యామిలీ ని విడిచి ఉండలేదు .  ఇదే ఫస్ట్ టైం నేను దూరంగా ఉండటం. దేవేంద్ర సార్ ని అడిగి రేపు వర్క్ కూడా ఈరోజు మాక్సిమం ఫినిష్ అయిపోయేటట్టు చూసుకోవాలి అని చెబుతుంది.

విహన్,  శాంభవితో నిన్ను మా సిస్టర్ లాగా అనుకుంటున్నాం కదా అన్నయ్య అని పిలవచ్చు కదా అని అడుగుతాడు.
దానికి శాంభవి ఇబ్బందిగా చూస్తూ.. సారీ సార్ తప్పుగా అనుకోవద్దు.నేను మా అన్నయ్యల ని తప్ప ఎవరిని పిలవను.
ఆ పిలుపు మనస్ఫూర్తిగా రావాలి కానీ...పెదాలతో పిలవకూడదు అని తలదించుకుంటుంది.
శాంభవి పిలవను అన్నందుకు కొంచెం బాధగా ఉన్నా, ఎలాగైనా తనతో కొంచెం టైం స్పెండ్ చేసాము అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు.
రుద్ర శాంభవి తో ఇక నువ్వు మీ టీం తో వెళ్లి వర్క్ చేసుకో అని చెప్పి పంపించేస్తాడు .
థాంక్యూ సార్ అని చెప్పి శాంభవి వెళ్లిపోతుంది. ఏంటి బావలు ఫీలయ్యారా అని రుద్ర అడుగుతాడు.
ధీరజ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న ఫోన్ కట్ చేసి సైలెంట్ అవుతాడు.
కొంచెం బాధగానే ఉంది రుద్ర. శాంభవి మన ఇంట్లో ఉండి ఉంటే మన ఇల్లు కూడా అంతే సందడిగా ఉండేది కదా!

మమ్మల్ని అన్నయ్య అని పిలవడానికి తను ఒప్పుకోలేక పోతుంది. ఇక బాబాయ్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో అన్నది అర్థం కావడం లేదు అని తల పట్టుకుంటాడు.

ధీరజ్ అక్కడ వాతావరణం తేలిక చేయడానికి భావ గ్రూపులో ఒక ఫోటో పెట్టాను చూడు.  ఎంత క్యూట్ గా ఉన్నారో ముగ్గురు అని అంటాడు.

ఏంటి ఆ ఫోటో అని ముగ్గురు ఓపెన్ చేసి చూస్తారు. అది విహాన్,శాంభవి, అద్వైత్ లది.
ఫోటో చాలా బాగా వస్తుంది ఎప్పుడు తీసావు అంటే.. మీరు ముగ్గురు ఫుల్ కాన్సన్ట్రేషన్ గా ఉన్నారులే అప్పుడు తీశాను. బాగుంది కదా అనగానే..

అవును చాలా బాగుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ఫోటో లాగానే ఎప్పుడో శాంభవి మనల్ని అన్నయ్య అని పిలుస్తుంది అని ధీరజ్ అనగానే...
అద్వైత్ కి ఇంట్లో జరిగిన విషయం గుర్తొచ్చి రుద్ర  నానమ్మ గుడికి వెళ్ళినప్పుడు మయూరి కలిసింది. శాంభవి మన ఆఫీసులో దీపం వెలిగించిన విషయం తనకి తెలిపింది అని చెబుతాడు.

  మన ఆఫీసులో జరిగిన విషయాలు తెలుస్తున్నాయి అంటే మన ఆఫీసులోనే ఎవరో ఇన్ ఫార్మర్ ఉన్నారు. ముందు అది కనిపెట్టాలి అని..

సెక్యూరిటీ నుంచి హైర్ ఆఫీసర్స్ దాకా అందరి ఫోన్లు  ట్రాక్ చేయండి. రేపు శాంభవి ఫ్యామిలీతో చార్మినార్ వెళ్లే ప్రోగ్రాం లో ఉంది.

ఆ ఫ్యామిలీకి తెలియకుండా ఫుల్ సెక్యూరిటీని పెట్టండి. మనం కూడా రేపు చార్మినార్ వెళదామా అని అద్వైత్ అంటాడు.

మనమా ఎందుకు?  రేపు ధీరజ్ వీకెండ్ పార్టీ అడిగాడు అని రుద్రా అంటాడు. బావ మనకు ఇప్పుడు పార్టీ అవసరమా!
ఈ విషయం తెలిస్తే మన ఫ్యామిలీ కూడా చార్మినార్ రెడీ అయిపోతారు.
వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అయినా మనం వెళ్లాల్సిందే కదా అని ధీరజ్ అంటాడు

దానికి రుద్ర సమాధానం ఏమిటి?
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
బృందావనం - by SivaSai - 16-03-2026, 08:11 PM
RE: బృందావనం - by Sachin@10 - 16-03-2026, 09:53 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 07:58 AM
RE: బృందావనం - by Sachin@10 - 17-03-2026, 08:40 AM
RE: బృందావనం - by ash.enigma - 17-03-2026, 05:13 PM
RE: బృందావనం - by SivaSai - 17-03-2026, 09:08 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 07:15 AM
RE: బృందావనం - by Sachin@10 - 18-03-2026, 08:39 AM
RE: బృందావనం - by ash.enigma - 18-03-2026, 02:46 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:50 PM
RE: బృందావనం - by SivaSai - 18-03-2026, 05:55 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:58 PM
RE: బృందావనం - by SivaSai - 19-03-2026, 12:59 PM
RE: బృందావనం - by Sachin@10 - 19-03-2026, 01:56 PM
RE: బృందావనం - by ash.enigma - 19-03-2026, 03:15 PM
RE: బృందావనం - by Ajayk - 19-03-2026, 03:30 PM
RE: బృందావనం - by ash.enigma - 20-03-2026, 11:39 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:45 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:47 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:48 AM
RE: బృందావనం - by SivaSai - 20-03-2026, 11:49 AM
RE: బృందావనం - by Sachin@10 - 20-03-2026, 12:05 PM
RE: బృందావనం - by Ajayk - 20-03-2026, 05:10 PM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 04:58 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:46 AM
RE: బృందావనం - by SivaSai - 21-03-2026, 07:50 AM
RE: బృందావనం - by Sachin@10 - 21-03-2026, 09:21 AM
RE: బృందావనం - by ash.enigma - 21-03-2026, 09:57 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:15 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:19 AM
RE: బృందావనం - by SivaSai - 22-03-2026, 06:23 AM
RE: బృందావనం - by Sachin@10 - 22-03-2026, 09:14 AM
RE: బృందావనం - by ash.enigma - 22-03-2026, 11:07 AM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:12 PM
RE: బృందావనం - by Ajayk - 22-03-2026, 07:13 PM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:41 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:42 AM
RE: బృందావనం - by SivaSai - 23-03-2026, 07:43 AM
RE: బృందావనం - by Ajayk - 23-03-2026, 08:03 AM
RE: బృందావనం - by ash.enigma - 23-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 23-03-2026, 10:04 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:22 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:24 AM
RE: బృందావనం - by SivaSai - 24-03-2026, 07:25 AM
RE: బృందావనం - by Sachin@10 - 24-03-2026, 09:02 AM
RE: బృందావనం - by vikas123 - 24-03-2026, 09:20 AM
RE: బృందావనం - by ash.enigma - 24-03-2026, 03:30 PM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:35 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:36 AM
RE: బృందావనం - by SivaSai - 25-03-2026, 10:38 AM
RE: బృందావనం - by Sachin@10 - 25-03-2026, 12:59 PM
RE: బృందావనం - by k3vv3 - 25-03-2026, 01:07 PM
RE: బృందావనం - by ash.enigma - 25-03-2026, 01:57 PM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:11 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:12 AM
RE: బృందావనం - by SivaSai - 26-03-2026, 07:13 AM
RE: బృందావనం - by ash.enigma - 26-03-2026, 08:54 AM
RE: బృందావనం - by Sachin@10 - 26-03-2026, 07:59 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:29 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 27-03-2026, 08:31 AM
RE: బృందావనం - by Sachin@10 - 27-03-2026, 09:15 AM
RE: బృందావనం - by Ajayk - 27-03-2026, 06:21 PM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 12:53 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:30 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:32 AM
RE: బృందావనం - by SivaSai - 28-03-2026, 08:34 AM
RE: బృందావనం - by Sachin@10 - 28-03-2026, 10:27 AM
RE: బృందావనం - by ash.enigma - 28-03-2026, 07:35 PM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:45 AM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:46 AM
RE: బృందావనం - by SivaSai - Yesterday, 10:47 AM
RE: బృందావనం - by Sachin@10 - Yesterday, 12:18 PM
RE: బృందావనం - by ash.enigma - Yesterday, 01:02 PM
RE: బృందావనం - by SivaSai - Today, 06:58 AM
RE: బృందావనం - by SivaSai - Today, 06:59 AM
RE: బృందావనం - by SivaSai - Today, 07:00 AM



Users browsing this thread: 2 Guest(s)