Thread Rating:
  • 7 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మరణ శాసనం
#87
Part - 30

ఆరోజు రాత్రి

గాఢ నిద్రలో ఉన్న భాను మంచినీళ్ల కోసం నిద్ర లేచింది..

చుట్టూ చీకటి ఏమీ కనిపించడం లేదు..

తన మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద ఫోన్ కోసం చేయి పెట్టింది..

కానీ అక్కడ టేబులు లేదు. ఫోను దొరకలేదు..

ఎక్కడ ఉందో చూద్దామంటే చీకటిగా ఉండడంతో తనకు ఏమీ కనిపించటం లేదు..

మెల్లగా మంచం మీద నుండి లేచి,కిందికి దిగింది.

తన కాళ్ళకి మట్టి మెత్తగా తగిలింది..

తన గదిలోకి అంత మట్టి ఎక్కడ నుండి వచ్చింది అని ఆశ్చర్యపోయింది...

ఇంతలో ఏదో విచిత్రమైన శబ్దం వచ్చింది..

ఆ శబ్దం ఏంటో అర్థం కాలేదు భానుకి....

మెల్లగా పైకి లేచింది...

ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్ళింది..

కాళ్ళకి కరుకైన రాళ్ళు తగులుతున్నాయి..

అలా నడుస్తూ ముందుకు వెళుతోంది..

దారి మొత్తం ఎక్కడి నుంచో వస్తున్న వెలుగు వల్ల, మసకమసకగా కనిపిస్తుంది..

అసలు ఇది తన ఇల్లేనా అనే సందేహం వచ్చింది..

ఇంతలో ఎక్కడి నుంచో ఒక కుక్కపిల్ల బాధతో మూలుగుతూ ఉన్నట్లు వినిపించసాగింది...

వెంటనే ఆ వినిపించిన వైపుగా వెళ్లగా....

తన చూసిన చోట కుక్క రూపంలో ఉన్న సింభిక గాయాలతో రక్తసిక్తమై నేల మీద పడి ఉంది..

భాను ఏడుస్తూ దాని దగ్గరకు వెళ్ళి, చేతిలోకి తీసుకుని "ఏమైంది..?"అని అడగగా..

"మనం ఓడిపోయాము.." అంటూ అది చనిపోయింది...

భాను ఏడుస్తూ కొద్దిగా ముందుకి వెళ్ళగా..
ఒక్కొక్కటిగా శవాలు నేలపై పడి ఉన్నాయి...

ఆ శవాలు రుద్ర, మంజునాథ రావు, గోవింద రావు లవి......

ఆ శవాలను చూడగానే భాను ఒక్కసారిగా
ఆ శవాలపై పడి బోరున ఏడవసాగింది..

ఆ శవాల మధ్య ఆదిత్యని వెతక సాగింది...

కానీ ఆదిత్య కనిపించలేదు..

ఆదిత్య కోసం చుట్టూ చూస్తున్న భానుకి ఒకచోట కనిపించిన దృశ్యాన్ని చూసి మతిపోయింది..

అక్కడికి కొద్ది దూరంలో ఆదిత్య చుట్టూ నిలబడి
3 రాకాసులు ఉన్నాయి..

కొద్దిసేపటికీ అవి ఆదిత్య నుంచి పక్కకు రాగానే,
నేల పై తీవ్రమైన గాయాలతో పడి ఉన్న ఆదిత్య కనిపించాడు..

దూరం నుంచి భాను ని చూసిన ఆదిత్య "ఇక్కడి నుంచి వెళ్ళిపో..!!" అని గట్టిగా అరుస్తూ ప్రాణాలు వదిలేశాడు..

ఆదిత్య ఆ మాట అన్న వెంటనే ఆ మూడు రాకాసులు ఆదిత్య ని వదిలేసి వేగంగా భాను వైపు రావడం మొదలుపెట్టాయి.

వేగంగా ఆమె దగ్గరకు వచ్చి,ఆ మూడు రాకాసులు ఒక్కసారిగా భాను పై పడ్డాయి...

ఒక్కసారిగా భాను గట్టిగా అరవసాగింది..

ఇంతలో.....

" భాను..!!?ఏమైంది..?? పైకి లే...!" అన్న మాటలు వినిపించసాగాయి..

కళ్ళు తెరిచి చూడగా తన చుట్టూ మంజునాథ రావు,గోవింద రావు,రుద్ర ఉన్నారు.. ఆదిత్య తన పక్కనే కూర్చున్నాడు..

ఆదిత్య ని చూడగానే తనకి వచ్చింది కల అని అర్థమై.. గట్టిగా ఏడుస్తూ అతన్ని కౌగిలించుకుంది..

భాను కి ఏమైందో తెలియక, ఆదిత్య కంగారు పడుతూ...
" ఏమైంది భాను..?? ఎందుకు ఏడుస్తున్నావ్..??" అని అడిగాడు..

కొద్దిసేపటి వరకు భాను ఏడుపు ఆపలేదు..

తను తేరుకునే వరకు అందరూ వేచి చూశారు..

కొద్దిసేపటికి భాను కుదుట పడింది..

ఆదిత్య తనతో మంచి నీళ్ళు తాగించి,
"ఏమైంది భాను..?? ఏదైనా పీడ కల వచ్చిందా.?"
అని అడిగాడు..

అవునన్నట్లుగా తలూపింది..

"అసలేం జరిగిందో చెప్పమ్మ..??" అని అడిగారు గోవింద రావు..

తనకు వచ్చిన కల గురించి పూర్తిగా వివరించింది..

తనకు వచ్చిన కల పూర్తిగా విన్న తర్వాత మంజునాథ రావు మాట్లాడుతూ.."ఎప్పుడు ఇదే ఆలోచనలతో ఉంటుంది కదా...! అందుకనే ఇలాంటి కల వచ్చింది..!! ఆంజనేయస్వామి దండకం చదువుకొని పడుకో తల్లి..!!"అంటూ భానుని సముదాయించి అందరూ ఆ గది నుండి బయటికి వచ్చారు...

సమయం రాత్రి 1:30 అయ్యింది..

భాను పడుకుంది.. కానీ తనకి వచ్చిన కల గురించి విన్న తరువాత మిగిలిన వాళ్ళు ఎవరు పడుకోలేదు..నలుగురు కలిసి ఇంటి ముందు ఉన్న ఆవరణలో దీని గురించే మాట్లాడడానికి కూర్చున్నారు... వాళ్లతో పాటు సింభిక కూడా ఉంది

"దీని గురించి నువ్వేమంటావ్ రుద్ర..!??"అని అడిగారు గోవింద రావు..

" భాను కి వచ్చిన కల ప్రకారం, ఇది మనకి రాబోయే ఒక ప్రమాదంకి సూచనగా అనిపిస్తుంది.మనం త్వరగా ఆదిత్యని పంచవక్రి నుండి కాపాడాలి.."అన్నాడు రుద్ర..

"ప్రస్తుతం మనకి సమస్యకు మూలం ఏంటో తెలిసింది కానీ, పరిష్కార మార్గం మాత్రం ఇప్పటివరకు దొరకలేదు.." అన్నారు మంజునాథ రావు...

ఆదిత్య మౌనంగా ఉండడం చూసిన రుద్ర
"ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది ఆదిత్య..?"అని అడిగాడు.

"ఇంతకు ముందు నీరసంగా ఉండేది.కానీ ఇప్పుడు బానే ఉంది.." అని అన్నాడు..

"ఆదిత్య నిన్నో విషయం అడుగుతాను చెప్పు..!"అన్నాడు రుద్ర.

" ఆ అడుగు..!!"

"ఈరోజు ఉదయం మా కోసం నువ్వు వచ్చిన తరువాత మమ్మల్ని ఎలా కాపాడావో నీకు గుర్తుందా..??"అని అడిగాడు రుద్ర.

"సింభిక ను కాపాడినప్పుడు అవి నన్ను బంధించడం గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నేను ఇక్కడ వరకు ఎలా వచ్చానో. నాకు గుర్తులేదు..! నేనే నిన్ను అడుగుదామని అనుకుంటున్నాను..!"అని అన్నాడు.ఆదిత్య.

"ఆదిత్య నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి...
నీకే తెలియకుండా నీలో ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఉంది.అది వేరే ఎవరిదో కాదు.మహా తాంత్రికుడైన మంచ్రేకరుడుది.. ఆయన శక్తే ఈరోజు మనల్ని కాపాడింది.. ఎందుకంటే ఆయన పుట్టిన అంశంలోనే, నువ్వు పుట్టావు..కాబట్టి
ఈ పరిస్థితుల్లో ఈ సమస్యకి పరిష్కారం నువ్వే వెతకగలవని నాకనిపిస్తోంది. ఎందుకంటే అది నిన్ను వెంబడించడానికి కారణం కూడా అదే..!!"అని రుద్ర చెప్పడంతో ఆదిత్య షాక్ అయ్యాడు..

"కాబట్టి ఈరోజు ఉదయం నువ్వు మమ్మల్ని కాపాడడానికి ప్రయత్నించినట్టు, మళ్లీ ఒకసారి ఇప్పుడు ప్రయత్నించి చూడు.." ఏదైనా మార్గం కనిపిస్తుంది అని అన్నాడు రుద్ర.

"అది ప్రయత్నించడం నావల్ల కాదేమోనని నాకనిపిస్తుంది.. అవి నన్ను బంధించినప్పుడు నేనొక తెలియని మైకంలోకి వెళ్ళిపోయాను..ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలియటం లేదు..!!"అన్నాడు ఆదిత్య..

"ఒకసారి ప్రయత్నించి చూడు...!!" అన్నారు గోవింద రావు..

సరే అంటూ అక్కడే నేలపై పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకున్నాడు..

ఒక పదినిమిషాల తర్వాత కళ్ళు తెరిచాడు .

"లేదు.. నాకు ఏమీ తెలియడం లేదు" అన్నాడు..

"మరొక్కసారి ప్రయత్నించి చూడు" అన్నాడు రుద్ర.

మరలా ప్రయత్నించి చూశాడు..

కానీ ఫలితం లేకుండా పోయింది...

తిరిగి మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు..

అలా ఒక గంట గడిచిపోయింది..

ఇదంతా చూస్తున్న సింభిక సహనం కోల్పోయింది...

కోపంతో ఆదిత్య వైపు వస్తూ...
" నీవల్ల కాలేదంటే అది నీ ప్రయత్న లోపం వల్లే, నీలాంటి చేతకాని వాడిని ఇప్పటివరకు నేను చూడలేదు.. పొద్దున
నీ శక్తియుక్తులు చూసి నువ్వేమో గొప్పవాడివి అనుకున్నాను.. నిన్ను కాపాడాలనుకోవడం కోసం అందరం ప్రమాదంలో చిక్కుకున్నాము . అసలు నువ్వు చస్తే గానీ
ఈ సమస్య పరిష్కారం కాదు.."అంటూ కోపంతో
గాల్లో చేతులు ఊపుతూ నేల మీద చరిచాడు..

ఆదిత్య కూర్చున్నచోట ఒక సుడిగాలి పుట్టి,అతన్ని గాల్లోకి ఎత్తి దూరంగా విసిరి కొట్టింది..

దాని దెబ్బకి దూరంగా ఎగిరి ఒక చెట్టుకు గుద్దుకొని నేలపై పడ్డాడు..

ఆ పరిణామాన్ని చూసి అందరూ బిత్తరపోయారు..

రుద్ర మిగిలినవారు సింభిక ని ఆపడానికి వేగంగా వస్తుండగా... వాళ్లపై మరొక శక్తి ప్రయోగించింది..

ఆ శక్తి ప్రభావం వల్ల నేలలో నడుము లోతు వరకు కూరుకుపోయారు..

పైకి రావడానికి ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్ళ వల్ల కావడం లేదు..

రుద్ర కోపంతో " ఆపు సింభిక...!! నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా..!! నువ్వు వెంటనే ఇక్కడ నుంచి.." అని మాట పూర్తవకుండానే రుద్ర నోరు మూసుకుపోయింది.
ఎందుకంటే..!!రుద్ర వెళ్ళిపొమ్మని చెప్తే, తనకు కచ్చితంగా వెళ్ళిపోవాలి..

వాళ్లు అలా బంధించబడి ఉండగానే..ఆదిత్య పైకి విచిత్రమైన శక్తులు ప్రయోగిస్తూ గాయపరచసాగింది..

ఆ శక్తి దాటికి తట్టుకోలేక ఆదిత్య సృహ కోల్పోయాడు..

ఇక చివరిగా అక్కడ దగ్గరలో ఉన్న ఒక పెద్ద బండరాయిని తన శక్తితో గాల్లోకి లేపి, ఆదిత్య మీదకు విసిరింది...

సంఘటన చూస్తున్న ముగ్గురికి నోట మాట రాలేదు...
ఏం చేయలేని అచేతన స్థితిలో ఉండిపోయారు..

ఆ బండరాయి వేగంగా ఆదిత్య ని ఢీకొట్టి, పేలిపోయి, పెద్ద దూళి చెలరేగింది..

అసలు అక్కడ ఏం జరుగుతుందో అని ముగ్గురు ఆశ్చర్యంతో, కదలకుండా కళ్లప్పగించి చూస్తూ ఉన్నారు..

ఉన్నట్టుండి అక్కడ పెద్ద గాలి వీచింది..

ఆ గాలి వల్ల ధూళి మొత్తం చెదిరిపోయింది..

ధూళి మొత్తం చెదిరి పోయిన తరువాత ఆదిత్య బెదరకుండా స్థిరంగా నుంచుని ఉన్నాడు..

సింభిక కోపంతో మరింతగా రెచ్చిపోయి,మరింత పెద్ద పెద్ద బండరాళ్లను తన శక్తితో అక్కడికి రప్పించింది..

వాటన్నిటిని ఒకేసారి రుద్ర వైపు విసిరింది..

అవి వేగంగా ఆదిత్య మీదికి దూసుకు వెళుతూ, అతని సమీపంలోకి రాగానే ఆదిత్య తన అరచేయి చాపి వాటి వైపు చూపించాడు..

వెంటనే వాటి వేగం కోల్పోయి, చలనం లేకుండా నేలపై పడిపోయాయి..

సింభిక మరోసారి ఆదిత్య పైకి శక్తులను ప్రయోగించబోతుండగా... ఆదిత్య వెంటనే తన చేతిని నేలపై పడిన బండరాళ్ళ వైపు చూపించి వాటిని గాలిలోకి పైకి లేపి, సింభిక వైపు చూపించాడు..

అవన్నీ వేగంగా సింభికని చుట్టుముట్టి,ఒక పంజరంలా మారిపోయింది.

సింభిక ఆ పంజరంలో బంధించబడింది..

ఆదిత్య తన చేతిని ఆ పంజరం వైపు చూపించి తన వైపు రమ్మన్నట్టుగా చేయి ఊపాడు.. ఆ పంజరం మెల్లగా ఎగురుకుంటూ వచ్చి, ఆదిత్య ముందు నేలపై దిగింది..

ఆదిత్య నేలలో బంధించబడి ఉన్న వాళ్ళ వైపు చేయి చూపించగానే,కూరుకుపోయిన గోతిలో నుండి ముగ్గురు పైకి లేచారు..

వాళ్లు కూడా సింభిక దగ్గరకు వచ్చి నుంచున్నారు..

సింభిక వైపు ఆదిత్య కోపంగా చూస్తూ..
"గతంలో నాకు సహాయ పడ్డావు అనే ఒకే ఒక్క విషయం వల్ల, ఈరోజు నిన్ను ప్రాణాలతో చంపకుండా వదిలేసాను.. అయినా నా మీద దాడి చేయడానికి నీకు ఎంత ధైర్యం..!!?"అంటూ గంభీరమైన స్వరంతో కొప్పడుతు అడిగాడు..

ఆ మాటలకి సింభిక తలవంచుకుని...
"క్షమించండి నాయక..!! తమరి పై దాడి చేయాలనే ఉద్దేశంతో కాదు.. మీరు ఆదిత్య లో ఉన్నారని నాకు తెలుసు.. తమరి శక్తి గురించి నాకు తెలుసు.. మిమ్మల్ని రప్పించాలని ఉద్దేశంతోనే మీ పై దాడి చేశాను.. నన్ను క్షమించండి.."అని అనగానే....

ఆ మాటలకి ఆదిత్య చిన్నగా నవ్వుతూ,
తన చుట్టూ ఉన్న పంజరాన్ని మాయం చేశాడు..

సింభిక పక్కన ఉన్న మిగిలిన వారి వైపు చూస్తూ
"నా పేరు మంచ్రేకరుడు.. ప్రత్యంగిరా మాత ఉపాసకుడిని. పంచవక్రి ని బంధించిన వాడిని నేనే.."నేను చెప్పగానే ముగ్గురు చేతులెత్తి నమస్కరించారు..

"గురుదేవా..! తమరి గురించి నేను చాలా విన్నాను.. మీతో మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది.. ఇది మీ మరో జన్మ కావడం మాకు సంతోషంగా ఉంది.. దయచేసి మిమ్మల్ని, అదే ఆదిత్యని కాపాడే మార్గం ఉంటే చెప్పండి.."అని వినయపూర్వకంగా అడిగాడు..రుద్ర..

" ఇది నా మరో జన్మ కాదు.నా అంశలో పుట్టిన ఆదిత్య శరీరంలో నేను ఉన్నాను.అంతే... నా మీద ఉన్న కోపంతో...,ఇప్పుడు అది ఆదిత్య ని నాశనం చేయాలని చూస్తుంది.. కాబట్టి మీకు ఒక మార్గం ఉపదేశిస్తాను.ఆ ప్రకారం చేయండి.."అని అన్నాడు ఆదిత్య శరీరంలో ఉన్న మంచ్రేకరుడు.

ఆయన చెప్తుంది శ్రద్ధగా వినసాగారు...

"ఇప్పుడున్న పరిస్థితుల్లో పంచవక్రి ని బంధించే శక్తి నా వద్ద లేదు..."

"దానికి వేరే దారేమి లేదా..గురుదేవా ..??"

"ఉంది.. దానిని అడ్డుకోవడం కోసం ఇప్పుడు మనం ఒక యాగం చేయాలి."

"అలాగే స్వామి రేపే చేద్దాం...!!"అన్నాడు రుద్ర.

" ఇక్కడ కాదు...దానికి ఒక ప్రదేశం ఉంది..నేను పంచవక్రిని బంధించిన ప్రదేశానికి కొద్ది దూరంలో మాత ప్రత్యంగిరా దేవి ఆలయం ఉంది.ఆ దేవాలయాన్ని శక్తివంతమైన తాంత్రికులు నిర్మించారని ప్రతీతి.. అక్కడ జరిపితేనే మాత అనుగ్రహం కలుగుతుంది.. అప్పుడే దానిని బంధించే శక్తి మనకు వస్తుంది.."

"ఇంతకీ ఏ యాగం చేయాలో తమరు చెప్పలేదు..??"అని అడిగారు గోవింద రావు..

" నికుంబల యాగం.."అని మంచ్రేకరుడు చెప్పగానే మంజునాథ రావు, గోవింద రావు, రుద్ర ఆశ్చర్యపోయారు..
ఎందుకంటే ఆ యాగం చేయడం చాలా కష్టతరమైనది.. క్లిష్టతరమైనది...

యాగం చేసేటప్పుడు  ఎటువంటి తప్పులు,దోషాలు జరిగినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. అమ్మవారు ఉగ్ర స్వరూపిని..నారసింహిని..

అందుకనే ముగ్గురు ఆ యాగం గురించి చెప్పేసరికి భయపడ్డారు...

కానీ అదే సరైన మార్గమని వాళ్ళకి అనిపించింది.

"అలాగే గురువుగారు.. తమరు చెప్పినట్టే చేస్తాము..
ఏ సమయంలో చేయాలో సెలవియ్యండి..?" అని అడిగాడు.రుద్ర...

"ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి గడియలు బాగున్నాయి. ఆ సమయంలో యాగం మొదలు పెట్టండి.. యాగం నిర్విగ్నంగా పూర్తి అయిన తరువాత అమ్మవారి దయవల్ల ఆదిత్య పంచవక్రి భారి నుంచి బయటపడతాడు..!!" అని చెప్పగానే ముగ్గురు సంతోషించారు...

"ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి.. ఈ యాగాన్ని
ఏ విధంగానైనా నాశనం చేయడానికి పంచవక్రి శతవిధాలా ప్రయత్నిస్తుంది.. కాబట్టి జాగ్రత్తగా ఉండండి...!! ఇక రుద్ర.. నువ్వు యాగ పరిరక్షణ బాధ్యతలు తీసుకో..!!" అని చెబుతూ ఉండగానే ఆదిత్య కుప్పకూలిపోయాడు...

మంచ్రేకరుడు ఆదిత్య శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు అని వాళ్ళకి అర్థం అయింది..

ఆదిత్య ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి అతని గదిలో పడుకోబెట్టారు...

ఆ మరుసటి రోజు ఉదయం....

ఆదిత్య తో సహా అందరూ ఉదయాన్నే నిద్ర లేచారు.. ముందురోజు రాత్రి జరిగిందంతా ఆదిత్యకి భానుకి చెప్పారు..

ఆదిత్య సమస్య కి పరిష్కారం దొరికినందుకు భాను చాలా ఆనందించింది..

రేపటి యాగానికి ఏమేమి కావాలో నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నారు..

"అవున్రా రావు..!! యాగం చేయడానికి మనం ఇద్దరం మాత్రమే ఉన్నాం..!! ఇంకొకళ్ళు ఉంటే బాగుండేది కదా..?"అన్నారు మంజునాథ రావు.

"మనం ఇద్దరం ఏంట్రా..?? రుద్ర ఉన్నాడు కదా..?"అన్నారు గోవింద రావు..

" రుద్ర కి యాగ పరిరక్షణ బాధ్యతలు అప్పచెప్పారు కదా..!! మరీ అతనెలా యాగం లో కూర్చుంటాడు..??"అని మంజునాథ రావు అడిగేసరికి ఆలోచనలో పడ్డాడు గోవింద రావు..

" నిజమేరా..! నువ్వు అడిగే దాకా నేను కూడా
ఈ విషయం గురించి ఆలోచించలేదు..! మరిప్పుడు ఏం చేద్దాం...!!"నేను గోవింద రావు ఆలోచించసాగారు..

" అంటే నన్ను మర్చిపోయారా చిన్నాన్న..??"అన్న మాట వెనకనుంచి వినిపించగానే, వెంటనే తల ఎత్తి చూశారు గోవింద రావు..

ఎదురుగుండా గాయాలకు కట్టిన కట్లతో సత్యనారాయణ రావు నవ్వుతూ నుంచున్నాడు.

అతన్ని హాస్పిటల్ నుంచి తీసుకువచ్చింది సత్యం..

సత్యనారాయణ రావు చూడగానే అందరూ ఆనందంతో ఆయనను చుట్టుముట్టారు...

కుశల ప్రశ్నలు అన్ని పూర్తయిన తర్వాత...

" దేని గురించో మాట్లాడుకుంటున్నట్టున్నారు..?"
అన్నాడు సత్యనారాయణ రావు..

"ఇంక ఎవరు గురించి రా... మన ఆదిత్య గురించి..!!"అన్నారు గోవింద రావు...

"కొంచెం వివరంగా చెప్పండి చిన్నాన్న...!?" అన్నాడు సత్యనారాయణ రావు...

తను హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఇక్కడ జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పారు గోవింద రావు..

"ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది చిన్నాన్న..!
మొత్తానికి ఆదిత్య ని కాపాడే మార్గం దొరికింది..!!"అన్నాడు సత్యనారాయణ రావు

"అయితే ఇక మొత్తానికి ముగ్గురం సరిపోయాం.."
అన్నారు మంజునాథ రావు..

"అయితే రేపే యాగం మొదలు......!!!"అన్నాడు రుద్ర.....


అందరూ యాగానికి సిద్ధమయ్యారు.....


రేపు అసలు ఆట మొదలవుతుంది.....



ఇంకా ఉంది.....!!
[+] 9 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
మరణ శాసనం - by SivaSai - 01-03-2026, 09:31 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 02-03-2026, 10:52 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 02-03-2026, 12:24 PM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:50 AM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:52 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 03-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 03-03-2026, 08:33 AM
RE: మరణ శాసనం - by sri012015 - 03-03-2026, 11:32 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:16 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 04-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 04-03-2026, 10:06 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:45 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 05-03-2026, 09:10 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 05-03-2026, 09:35 AM
RE: మరణ శాసనం - by sri012015 - 05-03-2026, 12:59 PM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:03 AM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 06-03-2026, 07:47 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 06-03-2026, 08:52 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:22 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 07-03-2026, 09:04 AM
RE: మరణ శాసనం - by SivaSai - 08-03-2026, 09:02 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 08-03-2026, 10:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 08-03-2026, 01:25 PM
RE: మరణ శాసనం - by SivaSai - 09-03-2026, 07:40 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 09-03-2026, 09:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 09-03-2026, 11:56 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:10 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:11 AM
RE: మరణ శాసనం - by masalakiss - 10-03-2026, 08:48 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 08:57 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 11:20 PM
RE: మరణ శాసనం - by masalakiss - 11-03-2026, 08:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 10:04 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 10-03-2026, 10:45 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 01:04 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 11-03-2026, 02:20 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 11-03-2026, 08:51 PM
RE: మరణ శాసనం - by SivaSai - 12-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 12-03-2026, 07:33 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 12-03-2026, 08:47 AM
RE: మరణ శాసనం - by SivaSai - 13-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by masalakiss - 13-03-2026, 07:55 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 13-03-2026, 08:07 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 13-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 14-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 14-03-2026, 08:29 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 09:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - 15-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 15-03-2026, 06:55 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 15-03-2026, 09:49 AM
RE: మరణ శాసనం - by SivaSai - 16-03-2026, 03:53 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 16-03-2026, 06:24 AM
RE: మరణ శాసనం - by SivaSai - 17-03-2026, 07:49 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 17-03-2026, 08:34 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 17-03-2026, 05:09 PM
RE: మరణ శాసనం - by SivaSai - 18-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 18-03-2026, 08:32 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 18-03-2026, 02:34 PM
RE: మరణ శాసనం - by SivaSai - 18-03-2026, 05:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - 19-03-2026, 12:56 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 19-03-2026, 02:09 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 19-03-2026, 03:01 PM
RE: మరణ శాసనం - by Reddy 211993 - 20-03-2026, 11:29 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 20-03-2026, 11:38 AM
RE: మరణ శాసనం - by SivaSai - 20-03-2026, 11:57 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 20-03-2026, 12:16 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 21-03-2026, 04:57 AM
RE: మరణ శాసనం - by SivaSai - 21-03-2026, 07:30 AM
RE: మరణ శాసనం - by SivaSai - 21-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 21-03-2026, 09:37 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 21-03-2026, 10:09 AM
RE: మరణ శాసనం - by SivaSai - 22-03-2026, 06:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 22-03-2026, 09:07 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 22-03-2026, 09:23 AM
RE: మరణ శాసనం - by SivaSai - 23-03-2026, 07:31 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 23-03-2026, 08:18 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 23-03-2026, 10:19 AM
RE: మరణ శాసనం - by SivaSai - 24-03-2026, 07:20 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 24-03-2026, 09:12 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 24-03-2026, 03:09 PM
RE: మరణ శాసనం - by SivaSai - 25-03-2026, 10:49 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 25-03-2026, 01:31 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 25-03-2026, 01:33 PM
RE: మరణ శాసనం - by SivaSai - 26-03-2026, 07:09 AM
RE: మరణ శాసనం - by Ajayk - 26-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by SivaSai - 26-03-2026, 08:17 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 26-03-2026, 08:56 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 26-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by Ajayk - 26-03-2026, 08:36 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 26-03-2026, 09:16 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 26-03-2026, 12:07 PM



Users browsing this thread: 1 Guest(s)