25-03-2026, 10:38 AM
Part - 24
రేపల్లె...
శాంభవి లేని ఇల్లు పెద్దవాళ్లందరికీ కళావిహానంగా కనిపిస్తుంది. లేచామా,తిన్నామా,పడుకున్నామా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి.
కూతురి మీద బెంగతో ఎప్పుడు శుక్రవారం వస్తుందా.. హైదరాబాద్ వెళ్లాలా అని శివ గారు, భాను గారు ఎదురు చూస్తూ ఉంటారు.
శకుంతల గారికి కూడా పొద్దుటే పూజ దగ్గర శాంభవి పాడే పాట లేక పూజ కూడా పూర్తయిన అనుభూతి రాదు. సులోచన గారికి సెటైర్లు వేసే వాళ్ళు, టెన్షన్ పెట్టే వాళ్ళు లేక ఏమి తోయడం లేదు.
ధరణి, జయంతి వీళ్ళని ఎంత డైవర్ట్ చేస్తున్నా సరే చివరికి శాంభవి టాపిక్ దగ్గరకు వచ్చే ఆగుతారు.
ఈ వీకెండ్ ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ వెళ్లాలని ఫిక్స్ అయిపోతారు.
హైదరాబాద్..
శాంభవి బ్యాచ్ ఆఫీస్ కి వచ్చి వాళ్ళకి చేయవలసిన వర్క్ చేస్తూ ఉంటారు ఇందులో దేవేంద్ర గారి కూడా వచ్చే జాయిన్ అవుతారు.
ఎలా ఉంది ఎస్టర్డే వర్క్ అర్థమయిందా అని.. అందరిని పేరుపేరునా అడుగుతారు.
అంత బాగుంది సార్ అని చెప్పి నెక్స్ట్ వర్క్ నేర్చుకోవడానికి స్టార్ట్ అవుతారు.
జితేంద్ర గారు అన్ని టీమ్స్ ని చెక్ చేసుకుంటూ వచ్చి శాంభవి టీమ్ ఉన్న ఛాంబర్ లోకి వస్తారు.
నేను మీ వర్క్ అబ్జర్వ్ చేస్తాను అని చెప్పి అక్కడే కూర్చుని శాంభవి ని చూస్తూ ఉంటారు.
అందరూ వర్క్ బిజీ లో పడి జితేంద్ర గారిని అబ్సర్వ్ చేయరు. కానీ గౌతమ్ కి డౌట్ వస్తుంది ఎందుకు వీళ్ళందరూ మా టీమ్ మీద స్పెషల్ గా ఫోకస్ పెడుతున్నారు.
ఈ విషయం ఒకసారి లలిత సార్ తో మాట్లాడాలి అనుకుని సైలెంట్ అవుతాడు.
శాంభవి ని రుద్రకి దగ్గర చేయాలి అంటే శాంభవినే ముందుకే కదపాలి. వాడికి అసలే కోపం ఎక్కువ వాడి ముందుకు రాడు.
శాంభవితోనే అడుగు ముందుకు వేపిస్తే సరి అనుకుని శాంభవి చేతికి ఒక ఫైల్ ఇచ్చి ఇది రుద్రకి ఇచ్చి చెక్ చేయమను అలాగే సైన్ చేయించుకుని రా అమ్మ.
సైన్ అయ్యేదాకా అక్కడే ఉండు అని పంపిస్తారు. ప్యూన్ వచ్చి శాంభవిని రుద్రా ఛాంబర్ దగ్గరకి తీసుకు వెళ్తాడు.
ఇదంతా సీసీ లో చూస్తున్న రుద్ర ఏంటి శాంభవి ఇలా వస్తుంది. చూద్దాం ఏం చేస్తుందో అనుకుని శాంభవి వైపే ఫోకస్ పెడతాడు.
జితేంద్ర మిగిలిన ముగ్గురికి మెసేజ్ చేస్తారు. ఎవరు డిస్టర్బ్ చెయ్యొద్దు. శాంభవి వెళుతుంది రూమ్ లోకి అని.
శాంభవి డోర్ దగ్గరికి వెళ్లి ఎక్స్క్యూజ్మీ సార్ అని అడుగుతుంది. ప్లీజ్ కమింగ్ అని గంభీరంగా చెబుతాడు.
శాంభవి లోపలికి రాగానే రుద్ర గుండే చాలా గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. ఏంటిది అస్తమానం ఇలా కొట్టేసుకుంటుంది.
దీన్ని చూసా అని డౌట్ గా శాంభవివంక చూసి అలాగే కళ్ళు అప్పచెప్పేస్తాడు .
శాంభవి ఎక్స్క్యూజ్మీ సార్ అని మళ్ళీ పిలుస్తుంది. దానికి రుద్రా తేరుకుని చెప్పండి మిస్ అనగానే... జితేంద్ర సార్ ఫైలు మీకు ఇచ్చి, చెక్ చేయమన్నారు.
అలాగే సైన్ చేసి వెంటనే నాకు ఇమ్మన్నారు అని చెప్పి నిలబడుతుంది.
ఓకే అని ఫైల్ తీసుకుని జితేంద్ర ఫోన్ చేస్తాడు. అవతల నుంచి జితేంద్ర చెప్పు అనగానే... ఏంటిది మామ అని అడుగుతాడు.
మీ ఇద్దరికీ ప్రైవసీ ఇద్దామని ప్లాన్ చేశాను. టైం యూట్లెస్ చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
అబ్బా ఇప్పుడు దీనితో ఎలా మాట కలపాలి. చూస్తే స్టాట్యూ లాగా నిలబడింది అనుకొని కూర్చోండి మిస్ అని..
మీ పేరు అని అడుగుతాడు.
శాంభవి అని చెబుతుంది. ఫైల్ చెక్ చేస్తున్నట్టుగా ఉంటూ,
ఎక్కడ నుంచి వచ్చారు అని అడుగుతాడు.
రేపల్లె అని చెప్తుంది. ఓ విలేజా అని అంటే... విలేజ్ అయితే ఏంటి సబ్జెక్టు ఉంది కదా అని కొంచెం రోషంగా చెబుతుంది.
ఇప్పుడు నేను ఏమన్నాను మిస్ శాంభవి,, విలేజా అని మాత్రమే కదా అడిగాను అని రెచ్చగొడతాడు.
నేను అదే అంటున్నాను సార్. విలేజా అని రాగం తీయాల్సిన పని ఏముంది నార్మల్గా అడగొచ్చు కదా!
అక్కడ చదివిన వాళ్ళకి సబ్జెక్టు ఉండదా అని మళ్ళీ కోపంగా ఉంటుంది.
నేను ఏమన్నానని మిస్ మీరు అన్ని చదువుతున్నారు అని మళ్ళీ అంటాడు.
అంటే నేను మీకు దెబ్బలాడే దానిలాగా కనిపిస్తున్నానా!
మరి మీరు చేసేది ఏంటి అని రుద్ర అడుగుతాడు. దీన్ని దెబ్బలాట అనరు. సమాధానం చెప్పడం అంటారు అని చెబుతుంది.
మరి దెబ్బలాడుతాం అంటే ఇంకెలా ఉంటది అని అడుగుతాడు. ఇంతకు పదింతలు నోరేసుకొని పడిపోవడమా అని మళ్ళీ డౌట్ గా అడుగుతాడు.
అంటే ఇప్పుడు నేను నోరేసుకు పడిపోతున్నానని అంటున్నారా...
లేదు మిస్ మీరు చాలా స్మూత్ గా మాట్లాడుతున్నారని చెబుతున్నా అని వెటకారంగా అంటాడు. అంత వెటకారం వద్దులే సార్ నాకు సైన్ చేసి ఇస్తే నేను వెళ్తాను అని కోపంగా ఉంటుంది.
ఆ కోపానికి బుగ్గలు కందిపోయి, ముక్కు చిలక ముక్కలాగా ఎర్రగా అయిపోతుంది. అలా చూసినా రుద్రకి గుండె స్కిప్ అయ్యి, అబ్బా ఇది కోపంలో భలే క్యూట్ గా ఉంది.
చూస్తే నాకే ఆ బుగ్గలు కొరకాలనిపిస్తుంది. అమ్మో ఇది చాలా డేంజర్ గానే ఉంది అనుకుంటూ... కాసేపు టీజ్ చేయాలనిపించి.. సైన్ చేయకపోతే అని అడుగుతాడు.
నేను డైరెక్ట్ గా వెళ్లి జితేంద్ర సార్ కి చెప్తాను రుద్రా సార్ సైన్ చేయడం లేదు అని అంటుంది. దానికి రుద్ర నవ్వుతూ నేను వర్క్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటాను అని మా పెద్ద మామకి బాగా తెలుసు.
నువ్వే సైన్ చేసేదాకా ఆగలేదు అని చెబుతాను. అప్పుడు ఎవరి మాట నమ్ముతారు అని కళ్ళు ఎగరేస్తాడు. అయితే తొందరగా సైన్ చేసి ఇవ్వండి సార్ కింద వర్క్ జరుగుతుంది అని చెబుతుంది.
నువ్వు సైన్ చేయమనగానే ఎలా చేస్తాను. ఫైల్ స్టడీ చేయాలి కదా! కూర్చో అని చెప్పి అలా కూర్చోబెట్టేస్తాడు.
ఇలాగ కూర్చోవాలంటే నాకు చాలా బోరింగ్ గా ఉంది సార్ అనే సాగదీస్తుంది. అవునా అయితే నీ సిస్టం ని పైకి తెప్పిస్తాను ఉండని కిందకి ఫోన్ చేసి ప్యూన్ తో సిస్టం పైకి తెప్పిస్తాడు.
ఇక్కడ వర్క్ చేసుకో. ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. నా వర్క్ అయ్యేదాకా డిస్టర్బ్ చేయకు అని ఫైల్ లో తల దూరుస్తాడు.
శాంభవి కూడా వర్క్ చేసుకుంటూ బిజీ అయిపోతుంది. లంచ్ బ్రేక్ కూడా చూసుకోదు.
ధీరజ్ విహాన్ తో రుద్ర ఏంటి లంచ్ బ్రేక్ అయినా మనకి ఏమి కాల్ చేయలేదు. మరదలుతో అంత బిజీ అయిపోయాడు అంటావా అని చూస్తాడు.
వాడికి అంత సీన్ లేదు. నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే శాంభవితో కూడా ఫుల్ గా వర్క్ చేపిస్తూ ఉంటాడు. కావాలంటే చెక్ చెయ్ అని చెప్తాడు .
సరే అది చూద్దాం పదండి అని విహాన్, అద్వైత్ ని తీసుకుని వెళ్లి రుద్ర డోర్ నాక్ చేస్తాడు. కమెన్ అని గంభీరంగా చెబుతాడు. లోపలికి వచ్చి ముగ్గురూ నోరు వదిలిపెట్టి చూస్తారు.
రుద్ర తన వర్క్ లో బిజీగా ఉంటే.. శాంభవి తన వర్క్ లో బిజీగా ఉంటుంది.
ఎటువంటి సౌండ్ రావడం లేదు అని రుద్ర తల పైకెత్తి చూస్తాడు. ముగ్గురు అలాగే వీళ్ళని చూస్తా ఉంటే ఏమైంది అని అడుగుతాడు.
లంచ్ బ్రేక్ బావ అని ధీరజ్ అంటాడు. అప్పుడే లంచ్ బ్రేక్ అయ్యిందా అంటే... చిన్నగా మరదలు పక్కన ఉంటే టైం కూడా తెలియట్లేదు వీడికి అని విహాన్ తో అంటాడు. చెప్పాను కదా ఆడు వర్క్ లో పడ్డాడు మరదలు ఉందని కాదు అని నవ్వుతాడు.
శాంభవి రుద్రవంక చూస్తోంది. రుద్ర ధీరజ్ తో లంచ్ అరేంజ్ చెయ్ అని చెప్తాడు. ఓకే సార్ నేను లంచ్ చేసి వస్తాను. కింద నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారని లెగుస్తుంది.
దానికి ధీరజ్ వెంటనే పర్వాలేదు. ఈరోజుకి నువ్వు ఇక్కడ చేసేయి. మీ ఫ్రెండ్స్ కి మెసేజ్ చేస్తాను. వాళ్ళు చేసేస్తారు అంటే... మీతో నా అని ఇబ్బందిగా ఫేస్ పెడుతుంది.
శాంభవి ఫేస్ చూసి రుద్రం మేము ఏమన్నా గ్రహాంతరవాసులుమా ఫేస్ అంత చిరాగ్గా పెట్టావు అని అడుగుతాడు.
దానికి శాంభవి చిన్నబుచ్చుకొని నేను కొత్త వాళ్లతో కలిసి ఎప్పుడు బోంచేయలేదు సార్ అనే చెబుతుంది.
ఇప్పటినుండి అలవాటు చేసుకో. కొత్త కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటావు.అప్పుడు భోజనం చేయవలసి వస్తుంది.
నేను మీతో కలిసి చెయ్యను, నాకు తెలిసిన వాళ్ళు,మా ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే చేస్తానని చెబితే చలా చండాలంగా ఉంటుంది అని ధీరజ్ వంక చూస్తాడు.
అరేంజ్ చేసేసాను బావ అని.. విహాన్ తో వీడేందుకు అంత సీరియస్ గా చెప్తాడు అని అంటే... వాడి సంగతి మనకు తెలిసిందే కదా అని సైలెంట్ అవుతాడు.
శాంభవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎవరా అని చూస్తే అది భాను గారి దగ్గర నుంచి. అంతే ఫోన్ చూడగానే శాంభవి మొఖం థౌసండ్ వాలా బల్బులాగా వెలిగిపోతుంది.
ఎక్కడ ఉన్నదో చూసుకోకుండా ఫోన్ ఎత్తి చెప్పండి నాన్న అని గట్టిగా మాట్లాడుతుంది.
బంగారం ఏం చేస్తున్నావ్ రా అంటే భోంచేస్తున్నాను నాన్న అని. నాన్న ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని మళ్లీ మొదలు పెడుతుంది.
వీళ్ళు నలుగురు భోజనం మానేసి మరి శాంభవి వంక చూస్తా ఉంటారు. అసలు ఏం చెబుతుందా అని..
ఆఫీసుకు వచ్చినప్పుడు నుంచి లంచ్ బ్రేక్ దాకా జరిగిందంతా పూసగుచ్చినట్టు చెబుతూ ఉంటుంది.
అదంతా విన్న భాను గారు బంగారం ఈ శుక్రవారం మేమందరం వస్తున్నాము అని చెబుతారు.
నిజంగా నా నాన్న అని సంతోషంగా అరుస్తూ నాన్న నన్ను చార్మినార్ తీసుకెళ్తారా అని అడుగుతుంది.
ఎందుకు తల్లి అని అడగగానే... అక్కడ గాజులు చాలా బాగుంటాయి నాన్న. వెళదాము ప్లీజ్ నాన్న అని గారంగా అడుగుతుంది.
నువ్వు అడిగితే మేము కాదంటామా అలాగే వెళదాము అని ఫోన్ పెట్టేస్తారు.
ఫోన్ పెట్టేసాక గానీ శాంభవి ఎక్కడ ఉంది అన్నది గుర్తుకు రాదు. వెంటనే భయంతో బిక్క మొహం వేసుకుని ఆ నలుగురు వంక చూస్తుంది.
ఆ నలుగురు శాంభవినే చూస్తూ ఉంటారు.
ఇప్పుడు శాంభవి సమాధానం ఏమిటి??
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)